భారతదేశంలో మూడు కీవే ద్విచక్ర వాహనాల ఆవిష్కరణ.. ఓ క్రూయిజర్ బైక్ మరియు రెండు స్కూటర్లు

హంగేరియన్ టూవీలర్ బ్రాండ్ కీవే (Keeway) భారతదేశంలో మూడు కొత్త ద్విచక్ర వాహనాలను ఆవిష్కరించింది. వీటిలో ఓ క్రూయిజర్ బైక్ మరియు రెండు స్కూటర్లు ఉన్నాయి. భారత్‌లో ద్విచక్ర వాహన మార్కెట్లో ఉన్న డిమాండ్‌ను క్యాష్ చేసుకునేందుకు ఈ హంగేరియన్ కంపెనీ వియస్టా 300 (Viesta 300) మరియు సిక్స్టీస్ 300ఐ (Sixties 300i) అనే రెండు స్కూటర్లతో పాటుగా కె-లైట్ 250వి (K-Light 250V) అనే ఓ క్రూయిజర్ బైక్‌ను కూడా ఆవిష్కరించింది.

భారతదేశంలో మూడు కీవే ద్విచక్ర వాహనాల ఆవిష్కరణ.. ఓ క్రూయిజర్ బైక్ మరియు రెండు స్కూటర్లు

కీవే తమ K-Light 250V క్రూయిజర్ బైక్‌ను అలాగే Viesta 300 మరియు Sixties 300i స్కూటర్లను వచ్చే వారం భారతదేశంలో విడుదల చేయనుంది. ఈ నేపథ్యంలో, కంపెనీ తమ ద్విచక్ర వాహనాలను అధికారికంగా విడుదల చేయడానికి ముందే వీటిని ప్రదర్శించింది. కాగా, ఇప్పుడు ఈ మూడు మోడళ్ల కోసం బుకింగ్‌ లను కూడా ప్రారంభిస్తున్నట్లు కీవే తెలిపింది. ఆసక్తి గల కస్టమర్లు ఇప్పుడు వీటిని రూ.10,000 టోకెన్ అడ్వాన్స్ చెల్లించి బుక్ చేసుకోవచ్చు.

భారతదేశంలో మూడు కీవే ద్విచక్ర వాహనాల ఆవిష్కరణ.. ఓ క్రూయిజర్ బైక్ మరియు రెండు స్కూటర్లు

కీవే తమ ఎలక్ట్రిక్ టూవీలర్లను సికెడి (కంప్లీట్లీ నాక్డ్ డౌన్) యూనిట్ రూపంలో విడిభాగాలను భారతదేశానికి దిగుమతి చేసుకుని, ఇక్కడే అసెంబ్లింగ్ చేస్తుంది. సమాచారం ప్రకారం, సికెడి రూపంలో భారతదేశంలోకి దిగుమతి అవుతున్న ఈ మూడు వాహనాల ఉత్పత్తి ఇప్పటికే ప్రారంభమైంది. నెలాఖరులోగా వీటి డెలివరీలు కూడా ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

భారతదేశంలో మూడు కీవే ద్విచక్ర వాహనాల ఆవిష్కరణ.. ఓ క్రూయిజర్ బైక్ మరియు రెండు స్కూటర్లు

కీవే కె-లైట్ 250వి (Keeway K-Light 250V)

కీవే కె-లైట్ 250వి ఒక క్రూయిజర్ స్టైల్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్. ఇందులో 249 సిసి ఎయిర్-కూల్డ్ వి-ట్విన్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ 8,500 ఆర్‌పిఎమ్ వద్ద 18.4 బిహెచ్‌పి శక్తిని మరియు 5,500 ఆర్‌పిఎమ్ వద్ద 19 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ గేర్‌బాక్స్ తో జతచేయబడి ఉంటుంది మరియు ఇది బెల్ట్ డ్రైవ్ ద్వారా వెనుక చక్రానికి శక్తిని పంపుతుంది.

భారతదేశంలో మూడు కీవే ద్విచక్ర వాహనాల ఆవిష్కరణ.. ఓ క్రూయిజర్ బైక్ మరియు రెండు స్కూటర్లు

ఈ క్రూయిజర్ బైక్ ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్క్ మరియు వెనుక వైపున ట్విన్ షాక్‌లు ఉంటాయి. కీవే కె-లైట్ 250వి బైక్ లో ఇరు వైపులా 16 ఇంచ్ అల్లాయ్ వీల్స్‌ ఉంటాయి. వీటిలో ముందు వైపు 120/80 ప్రొఫైల్ టైరు మరియు వెనుక వైపు 140/70 ప్రొఫైల్ టైరు అమర్చబడి ఉంటాయి. బ్రేకింగ్ విషయానికి వస్తే, ఇరు చక్రాలపై డిస్క్ బ్రేక్ లు ఉండి, ఇవి డ్యూయెల్-ఛానల్ ఏబిఎస్ ను సపోర్ట్ చేస్తాయి. కె-లైట్ 250వి మూడు ఆకర్షణీయమైన రంగులలో అందుబాటులో ఉంటుంది. వీటిలో మ్యాట్ బ్లాక్, మ్యాట్ బ్లూ మరియు మాట్ డార్క్ గ్రే కలర్ ఆప్షన్లు ఉన్నాయి.

భారతదేశంలో మూడు కీవే ద్విచక్ర వాహనాల ఆవిష్కరణ.. ఓ క్రూయిజర్ బైక్ మరియు రెండు స్కూటర్లు

కీవే వియస్టా 300 (Keeway Viesta 300)

కీవే వియస్టా 300 అనేది ఒక మాక్సీ స్టైల్ స్కూటర్. మంచి స్పోర్టీ లుక్ ని కలిగి ఉండే ఈ స్కూటర్ ముందు భాగంలో 2 ఎల్ఈడి ప్రొజెక్టర్ ల్యాంప్‌లతో కూడిన స్ప్లిట్ హెడ్‌ల్యాంప్ సెటప్, ఎల్ఈడి టెయిల్‌లైట్లు, యాంగ్యులర్ ఫ్రంట్ ఆప్రాన్, స్ప్లిట్ సీట్, సెమీ-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ డిస్‌ప్లే మరియు కీలెస్ ఇగ్నిషన్ వంటి మరెన్నో ఫీచర్లు ఉందులో ఉన్నాయి.

భారతదేశంలో మూడు కీవే ద్విచక్ర వాహనాల ఆవిష్కరణ.. ఓ క్రూయిజర్ బైక్ మరియు రెండు స్కూటర్లు

ఇంజన్ విషయానికి వస్తే, ఇందులో 278.2 సిసి సింగిల్-సిలిండర్ ఇంజన్ ఉంటుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 6,500 ఆర్‌పిఎమ్ వద్ద 18.4 బిహెచ్‌పి శక్తిని మరియు 6,000 ఆర్‌పిఎమ్ వద్ద 22 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది సివిటి (CVT) ఆటోమేటిక్ గేర్‌బాక్స్ తో జతచేయబడి ఉంటుంది మరియు బెల్ట్ డ్రైవ్ ద్వారా ఇంజన్ నుండి వచ్చే శక్తిని వెనుక చక్రాలకు పంపిణీ చేస్తుంది.

భారతదేశంలో మూడు కీవే ద్విచక్ర వాహనాల ఆవిష్కరణ.. ఓ క్రూయిజర్ బైక్ మరియు రెండు స్కూటర్లు

మెకానికల్స్ విషయానికి వస్తే, కీవే వియస్టా 300 స్కూటర్ లో రెండు చక్రాలపై డిస్క్ బ్రేక్స్ ఉంటాయి, ఇవి డ్యూయల్-ఛానల్ ఏబిఎస్ ను సపోర్ట్ చేస్తాయి. రెండు చక్రాలు 13 ఇంచ్ సైజులో ఉంటాయి మరియు ముందు చక్రంపై 110/70 ప్రొఫైల్ టైరు మరియు వెనుక చక్రంపై 130/70 ప్రొఫైల్ టైరు ఉంటుంది. కీవే వియస్టా 300 మొత్తం బరువు 147 కిలోగ్రాములు (కెర్బ్ వెయిట్) గా ఉంటుంది.

భారతదేశంలో మూడు కీవే ద్విచక్ర వాహనాల ఆవిష్కరణ.. ఓ క్రూయిజర్ బైక్ మరియు రెండు స్కూటర్లు

కీవే సిక్స్టీస్ 300ఐ (Keeway Sixties 300i)

కీవే సిక్స్టీస్ 300ఐ అనేది 1960ల నాటి స్టైలింగ్‌తో కూడిన రెట్రో స్కూటర్. ఈ స్కూటర్‌లో చతురస్రాకారపు హెడ్‌ల్యాంప్ యూనిట్‌ ఉంటుంది. అలాగే, ఇందులో స్నాజీ గ్రిల్ మరియు ఫ్రంట్ ఇండికేటర్‌లు ఫ్రంట్ ఆప్రాన్ దిగువ భాగంలో అందగా అమర్చబడి ఉంటాయి. కీవే సిక్స్టీస్ 300ఐ యాంత్రికంగా కీవే వియస్టా 300 తో సమానంగా ఉంటుంది. కీవే సిక్స్టీస్ 300ఐ లో కూడా లిక్విడ్-కూల్డ్ 278.2 సిసి సింగిల్-సిలిండర్ ఇంజన్‌ను ఉపయోగించారు.

భారతదేశంలో మూడు కీవే ద్విచక్ర వాహనాల ఆవిష్కరణ.. ఓ క్రూయిజర్ బైక్ మరియు రెండు స్కూటర్లు

ఈ ఇందన్ గరిష్టంగా 6,500 ఆర్‌పిఎమ్ వద్ద 18.4 బిహెచ్‌పి శక్తిని మరియు 6,500 ఆర్‌పిఎమ్ వద్ద 22 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. వియస్టా 300 మాదిరిగానే సిక్స్టీస్ 300ఐ కూడా బెల్ట్‌ డ్రైవ్ తో నడిచే CVT ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ ను కలిగి ఉంటుంది. ఇందులో ఇరు వైపులా 12 ఇంచ్ అల్లాయ్ వీల్స్‌ ఉంటాయి మరియు రెండు చక్రాలపై డిస్క్ బ్రేక్‌లు ఉంటాయి. సిక్స్టీస్ 300ఐ స్కూటర్‌లో 12-లీటర్ ఇంధన ట్యాంక్ ఉంటుంది మరియు దీని గ్రౌండ్ క్లియరెన్స్ 135 మిమీగా ఉంటుంది.

భారతదేశంలో మూడు కీవే ద్విచక్ర వాహనాల ఆవిష్కరణ.. ఓ క్రూయిజర్ బైక్ మరియు రెండు స్కూటర్లు

కీవే బ్రాండ్ గురించి క్లుప్తంగా..

కీవే అనేది హంగేరియన్ ఆటోమొబైల్ కంపెనీ, ఇది 1999లో స్థాపించబడింది. హంగేరియన్ మార్క్ ఇప్పుడు బెనెల్లీ మోటార్‌సైకిల్ మార్క్‌ను కలిగి ఉన్న చైనీస్ సంస్థ QJ గ్రూప్ యాజమాన్యంలో భాగంగా ఉంది. ఈ హంగేరియన్ బ్రాండ్ 125cc నుండి 1,200cc వరకు ఇంజన్ డిస్‌ప్లేస్‌మెంట్ తో కూడిన వివిధ రకాల స్కూటర్‌లు, బైక్‌లు మరియు ATV లను తయారు చేయడంలో ప్రసిద్ధి చెందింది. భారతదేశంలో, కీవే తమ ఉత్పత్తుల మార్కెటింగ్ కోసం బెనెల్లీ తయారీ సౌకర్యం మరియు షోరూమ్‌లను ఉపయోగించుకుంటుంది.

Most Read Articles

English summary
Keeway unveils k light 250v cruiser viesta 300 and sixties 300i scooters in india
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X