భారత్‌లో కీవే వియస్టా 300 మరియు కీవే సిక్స్టీస్ 300ఐ స్కూటర్లను విడుదల చేసిన బెనెల్లీ

ఇటాలియన్ మోటార్‌సైకిల్ బ్రాండ్ బెనెల్లీ (Benelli) యాజమాన్యంలో ఉన్న హంగేరియ టూవీలర్ బ్రాండ్ కీవే (Keeway) భారత మార్కెట్లో రెండు కొత్త స్కూటర్లను విడుదల చేసింది. కీవే వియస్టా 300 (Vieste 300) మరియు కీవే సిక్స్టీస్ 300ఐ (Sixties 300i) అనే రెండు స్కూటర్లను కంపెనీ భారత్‌లో విడుదల చేసింది. దేశీయ మార్కెట్లో ఈ రెండు స్కూటర్ల ధరలు ఒకేలా ఉంటాయి. ఒక్కో స్కూటర్ ధర రూ. 2.99 లక్షల ఎక్స్-షోరూమ్, ఇండియాగా ఉంది. ఆసక్తిగల కస్టమర్లు రూ. 10,000 టోకెన్ అడ్వాన్స్ చెల్లించి వీటిని ఆన్‌లైన్ లో కానీ లేదా బెనెల్లీ షోరూమ్ లలో కానీ బుక్ చేసుకోవచ్చు.

భారత్‌లో కీవే వియస్టా 300 మరియు కీవే సిక్స్టీస్ 300ఐ స్కూటర్లను విడుదల చేసిన బెనెల్లీ

కీవే గడచిన మే 18వ తేదీన భారతదేశంలో తమ K-Light 250V క్రూయిజర్ బైక్‌ను అలాగే Viesta 300 మరియు Sixties 300i స్కూటర్లను ఆవిష్కరించిన సంగతి తెలిసినదే. కాగా, కంపెనీ వీటిని ఇప్పుడు అధికారికంగా అమ్మకానికి అందుబాటులోకి తెచ్చింది. వీటిలో ముందుగా స్కూటర్లు విడుదలయ్యాయి. మరికొద్ది రోజుల్లోనే కె-లైట్ 250వి క్రూయిజర్ బైక్ విడుదలయ్యే అవకాసం ఉంది. కీవే ఈ రెండు స్కూటర్లపై 2 సంవత్సరాల అపరిమిత కిలోమీటర్ల వారంటీని అందిస్తోంది.

భారత్‌లో కీవే వియస్టా 300 మరియు కీవే సిక్స్టీస్ 300ఐ స్కూటర్లను విడుదల చేసిన బెనెల్లీ

కీవే వియస్టా 300 (Keeway Vieste 300) చూడటానికి మాక్సీ స్టైల్ లా కనిపించే స్కూటర్. మంచి స్పోర్టీ లుక్ ని కలిగి ఉండే ఈ స్కూటర్ ముందు భాగంలో ఎల్ఈడి ప్రొజెక్టర్ ల్యాంప్‌లతో కూడిన స్ప్లిట్ హెడ్‌ల్యాంప్ సెటప్, ఎల్ఈడి టెయిల్‌లైట్లు, యాంగ్యులర్ ఫ్రంట్ ఆప్రాన్, స్ప్లిట్ సీట్, సెమీ-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ డిస్‌ప్లే మరియు కీలెస్ ఇగ్నిషన్ వంటి మరెన్నో ఫీచర్లను కలిగి ఉంటుంది.

భారత్‌లో కీవే వియస్టా 300 మరియు కీవే సిక్స్టీస్ 300ఐ స్కూటర్లను విడుదల చేసిన బెనెల్లీ

ఈ స్కూటర్ లో 278.2 సిసి సింగిల్-సిలిండర్, లిక్విడ్ కూల్డ్, 4-వాల్వ్ ఇంజన్ ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 6,500 ఆర్‌పిఎమ్ వద్ద 18.7 బిహెచ్‌పి శక్తిని మరియు 6,000 ఆర్‌పిఎమ్ వద్ద 22 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది సివిటి (CVT) ఆటోమేటిక్ గేర్‌బాక్స్ తో జతచేయబడి ఉంటుంది మరియు బెల్ట్ డ్రైవ్ ద్వారా ఇంజన్ నుండి వచ్చే శక్తిని వెనుక చక్రాలకు పంపిణీ చేస్తుంది.

భారత్‌లో కీవే వియస్టా 300 మరియు కీవే సిక్స్టీస్ 300ఐ స్కూటర్లను విడుదల చేసిన బెనెల్లీ

కీవే వియస్టా 300 స్కూటర్ లో ముందు చక్రంపై 240 మిమీ డిస్క్, వెనుక చక్రంపై 220 మిమీ డిస్క్ బ్రేక్ ఉంటాయి. ఇవి డ్యూయల్-ఛానల్ ఏబిఎస్ ను సపోర్ట్ చేస్తాయి. రెండు చక్రాలు 13 ఇంచ్ సైజులో ఉంటాయి మరియు ముందు చక్రంపై 110/70 ప్రొఫైల్ టైరు మరియు వెనుక చక్రంపై 130/70 ప్రొఫైల్ టైరు ఉంటుంది. కీవే వియస్టా 300 మొత్తం బరువు 147 కిలోగ్రాములు (కెర్బ్ వెయిట్) గా ఉంటుంది. అలాగే, ముందు వైపున టెలిస్కోపిక్ ఫోర్కులు మరియు వెనుక వైపున హైడ్రాలిక్ షాక్‌లు ఉంటాయి. ఈ మాక్సీ-స్కూటర్‌లో 12-లీటర్ ఇంధన ట్యాంక్ ఉంటుంది.

భారత్‌లో కీవే వియస్టా 300 మరియు కీవే సిక్స్టీస్ 300ఐ స్కూటర్లను విడుదల చేసిన బెనెల్లీ

ఇక కీవే సిక్స్టీస్ 300ఐ (Keeway Sixties 300i) స్కూటర్ విషయానికి వస్తే, ఇది 1960ల నాటి స్టైలింగ్‌తో కూడిన రెట్రో స్కూటర్. ఈ స్కూటర్‌లో చతురస్రాకారపు హెడ్‌ల్యాంప్ యూనిట్‌ ఉంటుంది. అలాగే, ఇందులో స్నాజీ గ్రిల్ మరియు ఫ్రంట్ ఇండికేటర్‌లు ఫ్రంట్ ఆప్రాన్ దిగువ భాగంలో అందగా అమర్చబడి ఉంటాయి. ఇంకా ఇందులో స్ప్లిట్ సీట్లు మరియు 'సిక్స్టీస్' బ్యాడ్జింగ్‌పై రెట్రో స్టైల్ గ్రిల్‌ కూడా ఉంటుంది. డిజైన్ ప్రకారం ఇది పాత స్కూటర్ లాగా కనిపించినప్పటికీ, పవర్‌ట్రెయిన్ విషయంలో అలా కాదు.

భారత్‌లో కీవే వియస్టా 300 మరియు కీవే సిక్స్టీస్ 300ఐ స్కూటర్లను విడుదల చేసిన బెనెల్లీ

కీవే సిక్స్టీస్ 300ఐ యాంత్రికంగా కీవే వియస్టా 300 తో సమానంగానే ఉంటుంది. కీవే సిక్స్టీస్ 300ఐ లో కూడా లిక్విడ్-కూల్డ్ 278.2 సిసి సింగిల్-సిలిండర్ ఇంజన్‌ను ఉపయోగించారు. కాబట్టి, దీని పవర్ టార్క్ గణాంకాలు కూడా ఇంచు మించు ఒకేలా ఉంటాయి. అయితే, మాక్సీ-స్కూటర్‌తో పోలిస్తే ఇది చిన్న 10-లీటర్ ఇంధన ట్యాంక్ మరియు 12-అంగుళాల చిన్న చక్రాలను పొందుతుంది. సిక్స్టీస్ 300ఐ స్కూటర్ గ్రౌండ్ క్లియరెన్స్ 135 మిమీగా ఉంటుంది.

భారత్‌లో కీవే వియస్టా 300 మరియు కీవే సిక్స్టీస్ 300ఐ స్కూటర్లను విడుదల చేసిన బెనెల్లీ

సిక్స్టీస్ 300ఐ లో కూడా ఎల్ఈడి లైటింగ్, ముందు మరియు వెనుక చక్రాలపై డిస్క్ బ్రేక్‌లు, డ్యూయల్-ఛానల్ ఏబిఎస్, మల్టీ-ఫంక్షన్ ఇగ్నిషన్ స్విచ్‌, మూడు కలర్ ఆప్షన్లు (మ్యాట్ లైట్ బ్లూ, మ్యాట్ వైట్ మరియు మ్యాట్ గ్రే) మొదలైన ఫీచర్లు ఉన్నాయి. కీవే సిక్స్టీస్ 300i అనేది విదేశాలలో అమ్మకానికి అందుబాటులో ఉన్న జర్మన్ విక్టోరియా మోటోరాడ్ నిక్కీ 300 స్కూటర్‌ని పోలి ఉంటుంది.

భారత్‌లో కీవే వియస్టా 300 మరియు కీవే సిక్స్టీస్ 300ఐ స్కూటర్లను విడుదల చేసిన బెనెల్లీ

త్వరలో రానున్న కీవే కె-లైట్ 250వి క్రూయిజర్ బైక్

కె-లైట్ 250వి క్రూయిజర్ బైక్ కూడా త్వరలోనే మార్కెట్లో విడుదల కానుంది. ఇందులో 249 సిసి ఎయిర్-కూల్డ్ వి-ట్విన్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ 8,500 ఆర్‌పిఎమ్ వద్ద 18.4 బిహెచ్‌పి శక్తిని మరియు 5,500 ఆర్‌పిఎమ్ వద్ద 19 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ గేర్‌బాక్స్ తో జతచేయబడి ఉంటుంది మరియు ఇది బెల్ట్ డ్రైవ్ ద్వారా వెనుక చక్రానికి శక్తిని పంపుతుంది.

భారత్‌లో కీవే వియస్టా 300 మరియు కీవే సిక్స్టీస్ 300ఐ స్కూటర్లను విడుదల చేసిన బెనెల్లీ

ఈ క్రూయిజర్ బైక్ ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్క్ మరియు వెనుక వైపున ట్విన్ షాక్‌లు ఉంటాయి. కీవే కె-లైట్ 250వి బైక్ లో ఇరు వైపులా 16 ఇంచ్ అల్లాయ్ వీల్స్‌ ఉంటాయి. వీటిలో ముందు వైపు 120/80 ప్రొఫైల్ టైరు మరియు వెనుక వైపు 140/70 ప్రొఫైల్ టైరు అమర్చబడి ఉంటాయి. బ్రేకింగ్ విషయానికి వస్తే, ఇరు చక్రాలపై డిస్క్ బ్రేక్ లు ఉండి, ఇవి డ్యూయెల్-ఛానల్ ఏబిఎస్ ను సపోర్ట్ చేస్తాయి. కంపెనీ తమ టూవీలర్లను సికెడి (కంప్లీట్లీ నాక్డ్ డౌన్) రూట్లో విదేశాల నుండి ఇక్కడి దిగుమతి చేసుకొని భారతదేశంలో అసెంబ్లింగ్ చేస్తుంది.

Most Read Articles

English summary
Keeway vieste 300 and sixties 300i scooters launched in india price features
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X