కైనెటిక్ స్కూటర్లు తిరిగొస్తున్నాయ్.. అయితే ఈసారి ఎలక్ట్రిక్ రూపంలో వస్తున్నాయ్..!

మీకు కైనెటిక్ స్కూటర్లు గుర్తున్నాయా..? భారత టూవీలర్ మార్కెట్లో స్కూటర్ విభాగం ప్రాచుర్యం పొందుతున్న తొలినాళ్లలో వచ్చిన కైనెటిక్ స్కూటర్లు, ఆ తర్వాతి కాలంలో మార్కెట్లో పెరిగిన పోటీ కారణంగా అదృశ్యం అయిపోయాయి. అయితే, ఇప్పుడు అవే కైనెటిక్ స్కూటర్లు తిరిగి సరికొత్తగా భారత మార్కెట్లోకి ప్రవేశించబోతున్నాయి. కైనెటిక్ ఇంజినీరింగ్ లిమిటెడ్ (కెఇఎల్) మరోసారి భారత టూవీలర్ మార్కెట్లోకి పునరాగమనం చేసేందుకు సిద్ధమవుతోంది.

కైనెటిక్ స్కూటర్లు తిరిగొస్తున్నాయ్.. అయితే ఈసారి ఎలక్ట్రిక్ రూపంలో వస్తున్నాయ్..!

అయితే, ఈసారి కంపెనీ పెట్రోల్ స్కూటర్లను కాకుండా ఎలక్ట్రిక్ స్కూటర్‌ లతో రీ-ఎంట్రీ ఇవ్వబోతోంది. కైనెటిక్ తన మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్‌ను భారతీయ ద్విచక్ర వాహన మార్కెట్లో విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. కైనెటిక్ ఇంజినీరింగ్ లిమిటెడ్ ఎలక్ట్రిక్ టూ వీలర్స్ ఉత్పత్తి కోసం ఓ కొత్త కంపెనీని కూడా ఏర్పాటు చేసింది. ఈ కొత్త కంపెనీ కైనెటిక్ ఇంజినీరింగ్ లిమిటెడ్‌కు అనుబంధ కంపెనీగా ఉంటుంది మరియు కంపెనీలో 51 శాతంతో మెజారిటీ వాటాను కలిగి ఉంటుంది. కాగా, కొత్త కంపెనీ పేరును ఇంకా అధికారికంగా వెల్లడించలేదు.

కైనెటిక్ స్కూటర్లు తిరిగొస్తున్నాయ్.. అయితే ఈసారి ఎలక్ట్రిక్ రూపంలో వస్తున్నాయ్..!

భారతీయ ఈవీ మార్కెట్ అభివృద్ధిని మూల్యాంకనం చేస్తూ కంపెనీ నిర్వహించిన బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కంపెనీ ఇప్పటికే యాక్సిల్స్, గేర్‌బాక్స్‌లు, ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల కోసం ఫ్రేమ్‌లు వంటి ఆటో కాంపోనెంట్‌లను తయారు చేస్తున్నందున, ఇది ఆచరణీయమైన నిర్ణయంగా భావిస్తున్నారు. కంపెనీ తన తయారీ నైపుణ్యాన్ని ఉపయోగించుకుని భారతీయ మార్కెట్ లో ఉత్తమమైన ఉత్పత్తులను అభివృద్ధి చేయడానికి మరియు వాటిని మార్కెట్ చేయడానికి ఈ కత్త కంపెనీని ఏర్పాటు చేశారు.

కైనెటిక్ స్కూటర్లు తిరిగొస్తున్నాయ్.. అయితే ఈసారి ఎలక్ట్రిక్ రూపంలో వస్తున్నాయ్..!

ఈ సందర్భంగా కైనెటిక్ ఇంజినీరింగ్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ అజింక్యా ఫిరోడియా మాట్లాడుతూ, "గత ఏడాది కాలంలో భారతదేశంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల అమ్మకాలు 3.56 లక్షల యూనిట్లు మరియు ఎలక్ట్రిక్ త్రీవీలర్ అమ్మకాలు 2.30 లక్షల యూనిట్లు దాటాయని, ఈ వృద్ధి లో తాము కూడా భాగమయ్యేందుకు ప్రముఖ తయారీదారులతో చర్చలు జరుపుతున్నామని, ఎలక్ట్రిక్ మొబిలిటీ యొక్క వృద్ధి బాటలో తాము కూడా భాగం కావాలనే స్పష్టమైన లక్ష్యంతో ఓ కొత్త అనుబంధ సంస్థను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించినందుకు తాము సంతోషిస్తున్నామని" చెప్పారు.

కైనెటిక్ స్కూటర్లు తిరిగొస్తున్నాయ్.. అయితే ఈసారి ఎలక్ట్రిక్ రూపంలో వస్తున్నాయ్..!

ఈ సంవత్సరం ప్రారంభంలో, కైనెటిక్ చైనా కంపెనీ ఐమా టెక్నాలజీ గ్రూప్‌తో భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేసుకొని, భారతదేశంలో ద్విచక్ర వాహన మార్కెట్లోకి తిరిగి ప్రవేశించింది. చైనీస్ కంపెనీ భాగస్వామ్యంతో కైనెటిక్ భారతదేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేయాలని యోచిస్తోంది. కైనెటిక్ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లను భారతదేశంలోనే తయారు చేసి, విక్రయించనుంది.

కైనెటిక్ స్కూటర్లు తిరిగొస్తున్నాయ్.. అయితే ఈసారి ఎలక్ట్రిక్ రూపంలో వస్తున్నాయ్..!

ఈ విషయంలో చైనీస్ కంపెనీ Aima భారతదేశంలో కైనెటిక్ ఉత్పత్తులను స్థానికీకరించడంలో సహాయపడటమే కాకుండా, కైనెటిక్ కు అవసరమైన పూర్తి సాంకేతిక సహాయాన్ని కూడా అందించనుంది. కైనెటిక్ తమ ఎలక్ట్రిక్ స్కూటర్లను భారతదేశంలోనే స్థానికంగా తయారు చేయడం ద్వారా వాటిని సరసమైన ధరకే అందించాలని చూస్తోంది. ఓ నివేదిక ప్రకారం, కైనెటిక్ నుండి రాబోయే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు సుమారు రూ.50,000 నుండి రూ.1,00,000 మధ్య ధరలో అందుబాటులో ఉండే అవకాశం ఉంది.

కైనెటిక్ స్కూటర్లు తిరిగొస్తున్నాయ్.. అయితే ఈసారి ఎలక్ట్రిక్ రూపంలో వస్తున్నాయ్..!

కమ్యూటర్‌తో పాటు ప్రీమియం మరియు డెలివరీ విభాగాలలో ఇ-స్కూటర్‌లను ప్రవేశపెట్టాలని కైనెటిక్ యోచిస్తోంది. తాము చైనా నుంచి దిగుమతి చేసుకున్న మోడళ్లను రీబ్రాండ్ చేసి భారత్‌లో విక్రయించబోమని, తమ బ్రాండ్‌కు చెందిన అన్ని మోడల్స్ పూర్తిగా ఇండియాలోనే తయారవుతాయని కంపెనీ స్పష్టం చేసింది.

కైనెటిక్ తీసుకురాబోయే అన్ని ఇ-స్కూటర్ మోడల్‌లు కూడా FAME-II క్రింద సబ్సిడీకి అర్హత పొందుతాయని కూడా కంపెనీ తెలిపింది. ఫలితంగా, ఇవి మరింత తక్కువ ధరలకే కస్టమర్లకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. కైనెటిక్ కంపెనీ ప్రతి సంవత్సరం 5 లక్షల ఎలక్ట్రిక్ స్కూటర్లను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. కైనెటిక్ భాగస్వామి అయిన చైనీస్ అనుబంధ సంస్థ ఐమా విషయానికి వస్తే, ఈ కంపెనీ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా 1,000 కంటే ఎక్కువ ఎలక్ట్రిక్ మోడళ్లను విక్రయిస్తోంది. వీటిలో రెండు, మూడు మరియు నాలుగు చక్రాల ఎలక్ట్రిక్ వాహనాలు ఉన్నాయి.

కైనెటిక్ స్కూటర్లు తిరిగొస్తున్నాయ్.. అయితే ఈసారి ఎలక్ట్రిక్ రూపంలో వస్తున్నాయ్..!

Ola S1 ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల..

ఇక ఎలక్ట్రిక్ స్కూటర్లకు సంబంధించిన ఇటీవలి వార్తలను గమనిస్తే, ప్రముఖ దేశీయ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్, ఆగస్ట్ 15వ తేదీన తమ సరికొత్త 2022 మోడల్ ఓలా ఎస్1 ఎలక్ట్రిక్ స్కూటర్ ను మార్కెట్లో విడుదల చేసింది. భారత మార్కెట్లో ఈ కొత్త ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ. 99,999 (ఎక్స్-షోరూమ్)గా ఉంది. ఓలా ఎస్1 ఎలక్ట్రిక్ స్కూటర్ ఈ లైనప్‌ లో బేస్ వేరియంట్ గా ఉంటుంది. ఇది ఓలా ఎస్1 ప్రో కి దిగువన విక్రయించబడుతుంది.

కైనెటిక్ స్కూటర్లు తిరిగొస్తున్నాయ్.. అయితే ఈసారి ఎలక్ట్రిక్ రూపంలో వస్తున్నాయ్..!

కొత్తగా విడుదలైన 2022 ఓలా ఎస్1 ఎలక్ట్రిక్ స్కూటర్ డిజైన్ పరంగా ఎస్1 ప్రో మాదిరిగానే ఉంటుంది. కాకపోతే, ఇది జెట్ బ్లాక్, లిక్విడ్ సిల్వర్, సిరామిక్ వైట్, కోరల్ గ్లామ్ మరియు నియో మింట్ అనే కొత్త కలర్స్ లో లభిస్తుంది. ఈ కొత్త మోడల్ రేంజ్ కూడా పెంచబడింది. ఇప్పుడు ఈ కొత్త మోడల్ ఏఆర్ఏఐ సర్టిఫై చేసిన దాని ప్రకారం, పూర్తి చార్జ్ 131 కిమీ రేంజ్ ను అందిస్తుంది.

గమనిక: ఫోటోలు కేవలం ప్రాతినిధ్య ప్రయోజనం కోసం మాత్రమే!

Most Read Articles

English summary
Kinetic to enter electric two wheeler market plans to launch new electric scooter details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X