ఒక్క రోజే 80 టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ల డెలివరీ.. మేడ్ ఇన్ ఇండియా ఈవీకి పెరుగుతున్న క్రేజ్!

చెన్నైకి చెందిన ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ కంపెనీ (TVS Motor Company) భారత మార్కెట్లో విక్రయిస్తున్న ఏకైక ఎలక్ట్రిక్ స్కూటర్ ఐక్యూబ్ (iQube) లో కంపెనీ ఇటీవలే కొత్త అప్‌డేటెడ్ 2022 మోడల్ ను విడుదల చేసిన సంగతి తెలిసినదే. ఈ కొత్త మోడల్ రాకతో కంపెనీ ఎలక్ట్రిక్ టూవీలర్ అమ్మకాలు జోరందుకున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ డీలర్‌షిప్ కేంద్రాలలో టీవీఎస్ ఐక్యూబ్ డెలివరీలు ప్రారంభమయ్యాయి. తాజాగా, ఓ టీవీఎస్ డీలర్‌షిప్ ఒకే రోజులో 80 ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్లను కస్టమర్లకు డెలివరీ చేసింది.

ఒక్క రోజే 80 టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ల డెలివరీ.. మేడ్ ఇన్ ఇండియా ఈవీకి పెరుగుతున్న క్రేజ్!

ఈ మెగా డెలివరీ ఈవెంట్ ను కొచ్చిలోని టీవీఎస్ డీలర్‌షిప్ నిర్వహించింది. టీవీఎస్ ఐక్యూబ్ ఈ విభాగంలో బజాజ్ చేతక్ ఈవీ, ఓలా ఎస్1 ప్రో, ఏథర్ 450ఎక్స్ మరియు సింపుల్ వన్ వంటి ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్లతో పోటీ పడుతుంది. కొత్త అప్‌డేట్ కు ముందు టీవీఎస్ ఐక్యూబ్ ఒకే వేరియంట్ మరియు ఒకే కలర్ ఆప్షన్ తో లభించేంది. అయితే, కొత్తగా అప్‌డేట్ చేయబడిన ఈ 2022 మోడల్ ఇప్పుడు మూడు వేరియంట్లు మరియు విభిన్న కలర్ ఆప్షన్లలో లభిస్తోంది.

ఒక్క రోజే 80 టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ల డెలివరీ.. మేడ్ ఇన్ ఇండియా ఈవీకి పెరుగుతున్న క్రేజ్!

కస్టమర్ ఎంచుకునే వేరియంట్ ను బట్టి ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో ఫీచర్లు మరియు రేంజ్ కూడా మారుతూ ఉంటుంది. ఈ కొత్త వేరియంట్లలో ఐక్యూబ్ (iQube), ఐక్యూబ్ ఎస్ (iQube S) మరియు ఐక్యూబ్ ఎస్‌టి (iQube ST) వేరియంట్లు ఉన్నాయి. ఇందులో ఐక్యూబ్ వేరియంట్ ధర రూ. 98,564 కాగా, ఐక్యూబ్ ఎస్ వేరియంట్ ధర రూ. 1,08,690 గా ఉంది (అన్ని ధరలు ఆన్ రోడ్, ఢిల్లీ). కాగా, ఐక్యూబ్ ఎస్‌టి వేరియంట్ ధరను కంపెనీ ఇంకా వెల్లడించలేదు.

ఒక్క రోజే 80 టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ల డెలివరీ.. మేడ్ ఇన్ ఇండియా ఈవీకి పెరుగుతున్న క్రేజ్!

స్టాండర్డ్ మరియు ఎస్ వేరియంట్‌లతో పోలిస్తే, ఎస్‌‌టి వేరియంట్ మరిన్ని ఎక్కువ ఫీచర్లు మరియు లాంగ్ రేంజ్ బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లను కలిగి ఉంటుంది, కాబట్టి ఇది ఖరీదైనదిగా ఉండే అవకాశం ఉంది. వచ్చే ఆగస్ట్ 2022 నెలలో కంపెనీ ఈ కొత్త వేరియంట్ ధరను మరియు ఇతర వివరాలను వెల్లడించే అవకాశం ఉంది. కొత్త 2022 మోడల్ టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ లో అనేక కొత్త మార్పులు చేయబడ్డాయి. ఇందులో బ్యాటరీ ప్యాక్ లను కూడా కంపెనీ అప్‌గ్రేడ్ చేసింది.

ఒక్క రోజే 80 టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ల డెలివరీ.. మేడ్ ఇన్ ఇండియా ఈవీకి పెరుగుతున్న క్రేజ్!

టీవీఎస్ ఐక్యూబ్ స్టాండర్డ్ మరియు ఐక్యూబ్ ఎస్ రెండు వేరియంట్లు కూడా ఒకే రకమైన 3.4 kwh బ్యాటరీ ప్యాక్ ను కలిగి ఉంటాయి. ఇవి రెండూ పూర్తి ఛార్జ్‌ పై గరిష్టంగా 100 కిమీ రేంజ్ ను అందిస్తాయి. కాగా, కొత్త టీవీఎస్ ఐక్యూబ్ ఎస్‌టి వేరియంట్ లో పెద్ద 5.1 kWh బ్యాటరీ ప్యాక్‌ను ఉపయోగించారు. ఫలితంగా, ఇది పూర్తి చార్జ్ పై గరిష్టంగా 140 కిలోమీటర్ల రియల్ టైమ్ రేంజ్ ను అందిస్తుందని కంపెనీ తెలిపింది.

ఒక్క రోజే 80 టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ల డెలివరీ.. మేడ్ ఇన్ ఇండియా ఈవీకి పెరుగుతున్న క్రేజ్!

ఈ అప్‌డేట్ కి ముందు విక్రయించిన టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ లో కేవలం 2.2kWh బ్యాటరీ ప్యాక్‌ని మాత్రమే ఉపయోగించేవారు. అయితే, కంపెనీ ఇప్పుడు ఈ కొత్త 2022 మోడల్ ను పెద్ద 3.4kWh మరియు 5.1kWh బ్యాటరీ ప్యాక్ లతో అప్‌గ్రేడ్ చేసింది. పెరిగిన బ్యాటరీ ప్యాక్ కారణంగా ఈ కొత్త వేరియంట్ల రేంజ్ కూడా పెరిగింది. ఇందులోని టాప్-ఎండ్ వేరియంట్ ఇప్పుడు అదనపు 'పవర్' మోడ్‌తో వస్తుంది. ఈ పవర్ మోడ్ సాయంతో రైడర్లు ఐక్యూబ్ ను గరిష్టంగా గంటకు 82 కిలోమీటర్ల టాప్ స్పీడ్ తో నడపవచ్చు.

ఒక్క రోజే 80 టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ల డెలివరీ.. మేడ్ ఇన్ ఇండియా ఈవీకి పెరుగుతున్న క్రేజ్!

టీవీఎస్ ఐక్యూబ్ 2022 మోడల్ ఉపయోగించే బ్యాటరీ ప్యాక్‌లు అన్నీ కూడా IP67 రేటెడ్ మరియు AIS156 సర్టిఫైడ్ చేయబడి, UL2271, ISO 12405 మరియు UN38.3 నిబంధనలకు అనుగుణంగా ఉంటాయి. టీవీఎస్ తమ కొత్త 2022 మోడల్ ఐక్యూబ్ కోసం చార్జర్ ఆప్షన్లను కూడా అప్‌గ్రేడి చేసింది. ఇందులో ఐక్యూబ్ మరియు ఐక్యూబ్ ఎస్ వేరియంట్లు రెండూ కూడా 650W మరియు 950W ఛార్జర్ లను సపోర్ట్ చేస్తాయి. ఇవి 650W ఛార్జర్‌తో చార్జ్ చేసినప్పుడు నాలుగున్నర గంటల వ్యవధిలో 0-100 శాతం ఛార్జ్ అవుతాయి. అదే 950W ఛార్జర్ తో అయితే ఆ సమయాన్ని కేవలం 2 గంటల 50 నిమిషాలకు తగ్గించవచ్చు.

ఒక్క రోజే 80 టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ల డెలివరీ.. మేడ్ ఇన్ ఇండియా ఈవీకి పెరుగుతున్న క్రేజ్!

కాగా, టా-ఎండ్ వేరియంట్ అయిన టీవీఎస్ ఐక్యూబ్ ఎస్‌టి 950W మరియు 1.5kW ఛార్జర్లను సపోర్ట్ చేస్తుంది. ఇది 950W ఛార్జర్‌ తో 4 గంటల 6 నిమిషాల్లో పూర్తిగా ఛార్జ్ అవుతుంది మరియు1.5kW (1500W) ఛార్జర్ కేవలం రెండున్నర గంటలలోనే పూర్తిగా చార్జ్ అవుతుంది. పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, ఐక్యూబ్ లోని ఎలక్ట్రిక్ మోటార్ ఇప్పుడు 5.9 bhp పవర్ 140 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది, ఇది కేవలం 4.2 సెకన్లలో గంటకు 0 నుండి 40 కిమీ వేగాన్ని అందుకుంటుంది. ఇందులో స్టాండర్డ్ మరియు ఎస్ వేరియంట్ల టాప్ స్పీడ్ గంటకు 78 కిమీ గా ఉంటుంది.

ఒక్క రోజే 80 టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ల డెలివరీ.. మేడ్ ఇన్ ఇండియా ఈవీకి పెరుగుతున్న క్రేజ్!

కొత్త 2022 టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఈ బ్రాండ్ యొక్క లేటెస్ట్ కనెక్టింగ్ టెక్నాలజీ టీవీఎస్ స్మార్ట్ ఎక్స్ కనెక్ట్ (TVS SmartXonnet) కనెక్టివిటీ ఫీచర్లను సపోర్ట్ చేస్తుంది. దీనికోసం ఇందులో 5 ఇంచ్ ఫుల్ కలర్ TFT డిస్‌ప్లే ఉంటుంది. ఈ డిస్‌ప్లేను 5-వే జాయ్‌స్టిక్ ద్వారా నావిగేట్ చేయవచ్చు. ఇందులోని టాప్-ఎండ్ వేరియంట్ అయిన ఎస్‌టి అమెజాన్ అలెక్సా వాయిస్ అసిస్టెంట్ ను కూడా సపోర్ట్ చేస్తుంది మరియు ఇందులో పెద్ద 7 ఇంచ్ ఫుల్ కలర్ డిస్‌ప్లే యూనిట్‌ లభిస్తుంది.

Most Read Articles

English summary
Kochi tvs dealer delivered over 80 units of tvs iqube electric scooters in one day
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X