భారత మార్కెట్లో Komaki నుంచి రెండు ఎలక్ట్రిక్ స్కూటర్స్ విడుదల.. ధర & వివరాలు

దేశీయ మార్కెట్లో రోజురోజుకి ఎలక్ట్రిక్ వాహనాలకున్న ఆదరణ విపరీతంగా పెరిగిపోతున్న తరుణంలో ప్రముఖ ఎలక్ట్రిక్ టూ వీలర్ కంపెనీ కొమాకి (Komaki) భారతదేశంలో రెండు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను అధికారికంగా విడుదల చేసింది. ఇందులో ఒకటి కొమాకి ఎల్వై (Komaki LY) కాగా, మరొకటి కొమాకి డిటి 3000 (Komaki DT 3000). ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ల గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

భారత మార్కెట్లోని Komaki నుంచి రెండు ఎలక్ట్రిక్ స్కూటర్స్ విడుదల.. ధర & వివరాలు

దేశీయ విఫణిలో విడుదలైన కొత్త కొమాకి ఎల్వై (Komaki LY), కొమాకి డిటి 3000 (Komaki DT 3000) ధరలు వరుసగా రూ. 88,000 మరియు రూ. 1,22,500 (ఎక్స్-షోరూమ్ - ఇండియా). ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లు ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉండి, వినియోగదారులకు తగిన విధంగా ఉంటాయి.

భారత మార్కెట్లోని Komaki నుంచి రెండు ఎలక్ట్రిక్ స్కూటర్స్ విడుదల.. ధర & వివరాలు

కొమాకి డిటి 3000 (Komaki DT 3000) ఎలక్ట్రిక్ స్కూటర్ ఇప్పుడు 3000W BLDC మోటార్‌తో పరిచయం చేయబడింది. ఈ మోటారు 62V 52Ah లిథియం అయాన్ బ్యాటరీ నుండి శక్తిని పొందుతుంది. ఇందులోని శక్తివంతమైన ఎలక్ట్రిక్ మోటారు కారణంగా, ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ గంటకు 80 కి.మీ వరకు వేగవంతం అవుతుంది. అంతే కాకూండా ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే దాదాపు 180 కిమీ నుంచి 220 కిమీ రేంజ్ అందిస్తుంది.

భారత మార్కెట్లోని Komaki నుంచి రెండు ఎలక్ట్రిక్ స్కూటర్స్ విడుదల.. ధర & వివరాలు

ఇందులో ఉపయోగించే రైడింగ్ మోడ్ ని బట్టి రేంజ్ లో వ్యత్యాసం ఉండే అవకాశం ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మొత్తం నాలుగు కలర్ ఆప్సన్స్ తో అందుబటులో ఉంటుంది. అవి మెటల్ గ్రే, ట్రాన్స్‌లూసెంట్ బ్లూ, జెట్ బ్లాక్ మరియు బ్రైట్ రెడ్ కలర్స్. ఇవన్నీ కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటాయి.

భారత మార్కెట్లోని Komaki నుంచి రెండు ఎలక్ట్రిక్ స్కూటర్స్ విడుదల.. ధర & వివరాలు

ఇక కొమాకి ఎల్వై (Komaki LY) ఎలక్ట్రిక్ స్కూటర్ విషయానికి వస్తే, ఈ స్కూటర్ ఒక ఫుల్ ఛార్జ్ పై 90 కిమీల రేంజ్‌ను అందిస్తుంది. అదే సమయంలో ఇందులో చెప్పుకోదగ్గ ఒక ప్రత్యేక విషయం ఏమిటంటే.. యాంటీ స్కిడ్ టెక్నాలజీని ఉపయోగించిన భారతదేశపు మొట్టమొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ ఇదే. ఈ టెక్నాలజీ స్కూటర్ రోడ్డుపై జారిపోకుండా ఉండేలా చేస్తుంది. ఇది వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

భారత మార్కెట్లోని Komaki నుంచి రెండు ఎలక్ట్రిక్ స్కూటర్స్ విడుదల.. ధర & వివరాలు

కొమాకి కంపెనీ విడుదల చేసిన కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లలో డ్యూయల్ డిస్క్ బ్రేక్‌లు, సెల్ఫ్ డయాగ్నస్టిక్, మొబైల్ ఛార్జింగ్, రిమోట్ లాక్/అన్‌లాక్, యాంటీ-థెఫ్ట్ లాక్, రివర్స్ మోడ్, క్రూయిజ్ కంట్రోల్, బ్లూటూత్ స్పీకర్, డ్యూయల్ స్టోరేజ్ బాక్స్ మరియు ఫ్రంట్ వంటి ఆధునిక ఫీచర్స్ ఉన్నాయి. ఈ ఫీచర్స్ అన్నీ కూడా వినియోగదారులకు తప్పకుండా ఉపయోగపడతాయి.

భారత మార్కెట్లోని Komaki నుంచి రెండు ఎలక్ట్రిక్ స్కూటర్స్ విడుదల.. ధర & వివరాలు

ఇదిలా ఉండగా కొమాకి కంపెనీ ఈ సంవత్సరం ప్రారంభంలో రేంజర్ క్రూయిజర్ ఎలక్ట్రిక్ బైక్ మరియు వెనిస్ ఎలక్ట్రిక్ స్కూటర్‌లను విడుదల చేసింది. కొమాకి రేంజర్ బైక్ 4 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్‌ కలిగి ఉండి, 4000 కిలోవాట్ ఎలక్ట్రిక్ మోటారు ద్వారా శక్తిని పొందుతుంది.

భారత మార్కెట్లోని Komaki నుంచి రెండు ఎలక్ట్రిక్ స్కూటర్స్ విడుదల.. ధర & వివరాలు

భారతీయ మార్కెట్లో ఏ ఎలక్ట్రిక్ టూవీలర్ లోనూ అందించన అతిపెద్ద బ్యాటరీ ప్యాక్ ఈ బైక్ లో ఉపయోగించబడింది. కావున ఈ రేంజర్ బైక్ ఫుల్ ఛార్జింగ్ పై 250 కి.మీ పరిధిని అందిస్తుంది. ఇది నిజంగా చాలా గొప్ప విషయం. ఈ లేటెస్ట్ బైక్‌లో క్రూయిజ్ కంట్రోల్ సిస్టమ్, రిపేర్ స్విచ్, రివర్స్ స్విచ్ మరియు బ్లూటూత్ సౌండ్ సిస్టమ్ మరియు అధునాతన బ్రేకింగ్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

భారత మార్కెట్లోని Komaki నుంచి రెండు ఎలక్ట్రిక్ స్కూటర్స్ విడుదల.. ధర & వివరాలు

భారతీయ మార్కెట్లో ఈ బైక్ అన్ని ఉపకరణాలతో అందుబాటులో ఉంది. ఈ బైక్ ధర రూ. 1.68 లక్షలు (ఎక్స్-షోరూమ్). అదే సమయంలో కొమాకి వెనిస్ రూ. 1.15 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరకు అందుబాటులోకి వచ్చింది. భారతదేశంలో కంపెనీ యొక్క హై-స్పీడ్ స్కూటర్ విభాగంలో ఇది మూడవ ఎలక్ట్రిక్ స్కూటర్.

భారత మార్కెట్లోని Komaki నుంచి రెండు ఎలక్ట్రిక్ స్కూటర్స్ విడుదల.. ధర & వివరాలు

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మొత్తం 9 కలర్ ఆప్సన్స్ తో అందుబాటులో ఉంటుంది. అదే సమయంలో ఇది 3kW మోటార్ మరియు 2.9kW లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. కావున మంచి పనితీరుని మరియు మంచి పరిధిని అందిస్తుంది. మొత్తం మీద కొమాకి కంపెనీ ఎలక్ట్రిక్ టూ వీలర్ విభాగంలో తనకంటూ ఒక స్థానం ఏర్పాటు చేసుకుంటోంది.

More from DriveSpark

Article Published On: Wednesday, May 25, 2022, 8:30 [IST]
English summary
Komaki dt 3000 and ly electric scooter launched price range details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+