భారత్‌లో ఒకేసారి ఎలక్ట్రిక్ స్కూటర్, క్రూయిజర్ బైక్ విడుదల చేసిన Komaki: ధర & వివరాలు

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల జోరు విపరీతంగా పెరిగిపోతున్న తరుణంలో చాలా సంస్థలు దేశీయ విఫణిలో ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేయడానికి ఆసక్తి చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో భాగంగానే ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీ సంస్థ 'కొమాకి' (Komaki) తన మొదటి ఎలక్ట్రిక్ క్రూయిజర్ బైక్ అయిన 'కొమాకి రేంజర్' (Komaki Ranger) బైక్ విడుదల చేసింది. ఈ బైక్ ధర దేశీయ మార్కెట్లో రూ. 1.68 లక్షలు (ఎక్స్-షోరూమ్).

భారత్‌లో ఒకేసారి ఎలక్ట్రిక్ స్కూటర్, క్రూయిజర్ బైక్ విడుదల చేసిన Komaki: ధర & వివరాలు

కంపెనీ అందించిన సమాచారం ప్రకారం, కొమాకి యొక్క ఈ ఎలక్ట్రిక్ క్రూయిజర్ బైక్ 2022 నుంచి అధీకృత డీలర్‌షిప్‌లలో అమ్మకానికి అందుబాటులో ఉంటుంది. ఈ కొత్త బైక్ మూడు విభిన్న రంగులలో అందుబాటులో ఉంటుంది. అవి గార్నెట్ రెడ్, డీప్ బ్లూ మరియు జెట్ బ్లాక్ కలర్స్.

భారత్‌లో ఒకేసారి ఎలక్ట్రిక్ స్కూటర్, క్రూయిజర్ బైక్ విడుదల చేసిన Komaki: ధర & వివరాలు

కొమాకి రేంజర్ బైక్ 4000 వాట్స్ ఎలక్ట్రిక్ మోటార్‌తో 4 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్‌ కలిగి ఉంటుంది. ఇప్పటివరకు దేశంలోని ఏ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనంలోనూ అందించన అతిపెద్ద బ్యాటరీ ప్యాక్ ఇదేనని కంపెనీ అధికారికంగా పేర్కొంది. అంతే కాకూండా Komaki రేంజర్ పూర్తిగా ఛార్జ్ చేస్తే దాదాపు 250 కి.మీ పరిధిని అందిస్తుంది. కావున సుదూర ప్రాంతాలకు వెళ్ళడానికి కూడా ఈ బైక్ చాలా అనుకూలంగా ఉంటుంది.

భారత్‌లో ఒకేసారి ఎలక్ట్రిక్ స్కూటర్, క్రూయిజర్ బైక్ విడుదల చేసిన Komaki: ధర & వివరాలు

కొమాకి రేంజర్ క్రూయిజర్ బైక్‌లో క్రూయిజ్ కంట్రోల్ సిస్టమ్, రిపేర్ స్విచ్, రివర్స్ స్విచ్ మరియు బ్లూటూత్ సౌండ్ సిస్టమ్ మరియు అధునాతన బ్రేకింగ్ సిస్టమ్ వంటి ఆధునిక ఫీచర్లు ఉన్నాయి. ఎక్కువ మంది వినియోగదారులకు అందుబాటులో ఉండేలా 'రేంజర్' ఎలక్ట్రిక్ క్రూయిజర్‌ను వినియోగదారులకు అత్యంత సరసమైన ధరలో అందుబాటులో ఉంచామని కోమాకి తెలిపింది.

భారత్‌లో ఒకేసారి ఎలక్ట్రిక్ స్కూటర్, క్రూయిజర్ బైక్ విడుదల చేసిన Komaki: ధర & వివరాలు

కంపెనీ ఈ కొత్త రేంజర్ బైక్ యొక్క డిజైన్ మరియు అభివృద్ధి కోసం ఏకంగా రూ. 7 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టింది. మొత్తానికి ఎట్టకేలకు ఈ బైక్ దేశీయ మార్కెట్లో విడుదలైంది. ఇదే సమయంలో Komaki కంపెనీ కొత్త రేంజర్‌ బైక్ తో పాటు, తన కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ 'వెనిస్‌' (Venice) ను కూడా విడుదల చేసింది.

భారత్‌లో ఒకేసారి ఎలక్ట్రిక్ స్కూటర్, క్రూయిజర్ బైక్ విడుదల చేసిన Komaki: ధర & వివరాలు

కొమాకి వెనిస్ స్కూటర్ విషయానికి వస్తే, ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ రూ. 1.15 లక్షల రూపాయల (ఎక్స్-షోరూమ్) ధర వద్ద దేశీయ మార్కెట్లో విడుదలైంది. భారతదేశంలో కంపెనీ యొక్క హై-స్పీడ్ స్కూటర్ విభాగంలో కొమాకి వెనిస్ అనేది మూడవ ఎలక్ట్రిక్ స్కూటర్. ఈ స్కూటర్ మొత్తం 9 కలర్ ఆప్సన్స్ లో అందుబటులో ఉంది.

భారత్‌లో ఒకేసారి ఎలక్ట్రిక్ స్కూటర్, క్రూయిజర్ బైక్ విడుదల చేసిన Komaki: ధర & వివరాలు

'కొమాకి వెనిస్' ఎలక్ట్రిక్ స్కూటర్‌లో లేటెస్ట్ రెట్రో డిజైన్ మరియు కొత్త ఫీచర్లను కలిగి ఉంటుంది. ఇవన్నీ కూడా కొనుగోలుదారులను ఎక్కువగా ఆకర్షించడంలో సహాయపడతాయి. ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ లో ప్రస్తుత తరానికి కావాల్సిన దాదాపు అన్ని ఫీచర్స్ కూడా అందుబాటులో ఉంటాయి.

భారత్‌లో ఒకేసారి ఎలక్ట్రిక్ స్కూటర్, క్రూయిజర్ బైక్ విడుదల చేసిన Komaki: ధర & వివరాలు

'కొమాకి వెనిస్' ఎలక్ట్రిక్ స్కూటర్ 3 కిలోవాట్ మోటార్ మరియు 2.9 కిలోవాట్ లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. ఎక్కువ దూరం ప్రయాణించేటప్పుడు స్టోరేజీ సమస్యలు తలెత్తకుండా చూసేందుకు స్కూటర్ పెద్ద సీటు మరియు అదనపు స్టోరేజ్ బాక్స్‌ను కూడా ఇందులో ఏర్పాటు చేసింది.

భారత్‌లో ఒకేసారి ఎలక్ట్రిక్ స్కూటర్, క్రూయిజర్ బైక్ విడుదల చేసిన Komaki: ధర & వివరాలు

ఈ ఆధునిక స్కూటర్ లో రిపేర్ స్విచ్, రీజెనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్, రివర్స్ స్విచ్ మరియు బ్లూటూత్ కనెక్టివిటీ వంటి ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. అంతే కాకుండా ఈ స్కూటర్‌లో సెల్ఫ్ డయాగ్నసిస్ సిస్టమ్, మొబైల్ ఛార్జింగ్ పాయింట్, సైడ్ స్టాండ్ సెన్సార్, క్రూయిజ్ కంట్రోల్ ఫీచర్, యాంటీ థెఫ్ట్ లాక్ సిస్టమ్ మరియు డ్యూయల్ స్టోరేజ్ బాక్స్ కూడా అందుబటులో ఉన్నాయి.

భారత్‌లో ఒకేసారి ఎలక్ట్రిక్ స్కూటర్, క్రూయిజర్ బైక్ విడుదల చేసిన Komaki: ధర & వివరాలు

భారతీయ మార్కెట్లో కొమాకి కంపెనీ ఇప్పుడు 'కొమాకి రేంజర్' మరియు 'కొమాకి వెనిస్' స్కూటర్ విడుదలతో, ఎలక్ట్రిక్ వాహన విభాగంలో తనకంటూ ఒక సుస్థిరమైన స్థానం ఏర్పాటు చేసుకుంది. ప్రస్తుతం కంపెనీ యొక్క పోర్ట్‌ఫోలియోలో మొత్తం ఐదు హై-స్పీడ్ మోడళ్స్ ఉన్నాయి. మొత్తం మీద దేశవ్యాప్తంగా తన వినియోగదారుల కోసం మొత్తం పదహారు మోడళ్లను కలిగి ఉంటుంది. ఇప్పుడు దేశీయ విఫణిలో విడుదలైన కంపెనీ యొక్క బైక్స్ ఎలాంటి ఆదరణ పొందుతాయి మరియు ఎలాంటి అమ్మకాలను పొందుతాయి అనే మరిన్ని వివరాలు కూడా త్వరలో తెలుస్తాయి.

More from DriveSpark

Article Published On: Tuesday, January 25, 2022, 12:42 [IST]
English summary
Komaki ranger cruiser and venice scooter launched price range features
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+