కోమకి వెనిస్ ఎకో (Komaki Venice Eco) ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల.. ధర రూ.79,000 మరియు రేంజ్ 100 కిమీ

ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ కోమకి (Komaki) భారతదేశంలో మరో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసింది. కోమకి వెనిస్ ఎకో (Komaki Venice Eco) పేరుతో కంపెనీ ఓ బడ్జెట్-ఫ్రెండ్లీ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసింది. ఇది ఇప్పటికే భారతీయ మార్కెట్లో అమ్మకానికి ఉన్న కోమకి వెనిస్ యొక్క టోన్-డౌన్ వెర్షన్‌గా ఉంటుంది. అంటే, టాప్-ఎండ్ వేరియంట్‍‌కు దిగువన ఎంట్రీ లెవల్ వేరియంట్‌గా ఉంచబడింది. భారత మార్కెట్లో కోమకి వెనిస్ ఎకే ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ.79,000 (ఎక్స్-షోరూమ్)గా ఉంది.

కోమకి వెనిస్ ఎకో (Komaki Venice Eco) ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల.. ధర రూ.79,000 మరియు రేంజ్ 100 కిమీ

కోమకి వెనిస్ ఎకో ఎలక్ట్రిక్ స్కూటర్ పూర్తి చార్జ్ పై గరిష్టంగా 100 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తుందని కంపెనీ పేర్కొంది. ఇందులో సాంప్రదాయ లిథియం అయాన్ బ్యాటరీకి బదులుగా లిథియం ఫెర్రో ఫాస్ఫేట్ (LIPO4) బ్యాటరీని ఉపయోగించారు. ఫలితంగా, ఇది సాధారణ లిథియం-అయాన్ బ్యాటరీ కంటే తక్కువ కణాలను కలిగి ఉన్నందున వేడిని తగ్గిస్తుంది. కాబట్టి, బ్యాటరీలో మంటలు వ్యాపించడం లేదా పేలిపోవడం వంటివి జరగవని కంపెనీ తెలిపింది. ఈ బ్యాటరీ అగ్ని నిరోధక శక్తిని కలిగి ఉందని కంపెనీ చెబుతోంది.

కోమకి వెనిస్ ఎకో (Komaki Venice Eco) ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల.. ధర రూ.79,000 మరియు రేంజ్ 100 కిమీ

బ్యాటరీ సామర్థ్యం, ఎలక్ట్రిక్ మోటార్ టార్క్ గణాంకాలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు. అయితే, ఇది పూర్తి చార్జ్ పై 100 కిలోమీటర్ల వరకూ రేంజ్‌ను అందిస్తుందని, బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేయడానికి సుమారు 3-4 గంటల సమయం పడుతుందని కంపెనీ తెలిపింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ పూర్తిగా ఛార్జ్ కావడానికి సుమారు 1.8 నుండి 2 యూనిట్ల విద్యుత్ వినియోగం అవుతుందని కంపెనీ తెలిపింది.

కోమకి వెనిస్ ఎకో (Komaki Venice Eco) ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల.. ధర రూ.79,000 మరియు రేంజ్ 100 కిమీ

కోమకి వెనిస్ ఎకో ఎలక్ట్రిక్ స్కూటర్ డిజైన్ విషయానికి వస్తే, ఇది ట్రెడిషనల్ స్కూటర్ మాదిరిగానే కనిపిస్తుంది. అయితే, ఒరిజినల్ కోమకి వెనిస్‌తో పోల్చినప్పుడు కోమకి వెనిస్ ఎకో చాలా సరళమైన రూపాన్ని కలిగి ఉంటుంది. వెనిస్ ఎకో స్టోరేజ్ బాక్స్‌ను కోల్పోతుంది మరియు మెటల్ ఫ్రేమ్‌ను కూడా కోల్పోతుంది. వాటికి బదులుగా ఇందులో బ్యాక్‌రెస్ట్ లు లభిస్తాయి మరియు ఇది ఓవరాల్ గా మంచి రెట్రో స్టైల్‌ ను కలిగి ఉంటుంది.

కోమకి వెనిస్ ఎకో (Komaki Venice Eco) ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల.. ధర రూ.79,000 మరియు రేంజ్ 100 కిమీ

కోమకి వెనిస్ ఎకో గార్నెట్ రెడ్, శాక్రమెంటో గ్రీన్, జెట్ బ్లాక్, మెటాలిక్ బ్లూ, బ్రైట్ ఆరెంజ్ మరియు సిల్వర్ క్రోమ్ కలర్ అనే ఏడు వేర్వేరు రంగులలో లభిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో పెద్ద డిజిటల్ డిస్‌ప్లే యూనిట్ ఉంటుంది. ఇది మీకు మ్యాప్‌లను నావిగేట్ చేయంలో సహాయపడుతుంది. అలాగే, ఇది ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌గా కూడా పని చేస్తుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో అంతర్నిర్మిత మ్యూజిక్ ప్లేయర్ కూడా ఉంటుంది, వెనిస్ ఎకోలో బ్యాక్ స్టోరేజ్ బాక్స్ లేనప్పటికీ, చిన్న వస్తువులను ఉంచడానికి ముందు వైపు స్టోరేజ్ స్పేస్ ఉంటుంది.

కోమకి వెనిస్ ఎకో (Komaki Venice Eco) ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల.. ధర రూ.79,000 మరియు రేంజ్ 100 కిమీ

కొత్త కోమకి వెనిస్ ఎకో దాని స్టాండర్డ్ కోమకి వెనిస్ మాదిరిగా రెండు-సీట్ల డిజైన్‌ను కాకుండా సింగిల్-సీట్ డిజైన్‌ను కలిగి ఉంటుంది. వెనిస్ ఎకో హై-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్, దీనిని నడపడానికి రిజిస్ట్రేషన్ మరియు లైసెన్స్ అవసరం. ఈ సందర్భంగా కోమకి ఎలక్ట్రిక్ డివిజన్ డైరెక్టర్ గుంజన్ మల్హోత్రా మాట్లాడుతూ, "అత్యున్నత నాణ్యత, అధిక పనితీరు, సురక్షితమైన, దృఢమైన డిజైన్, తక్కువ నిర్వహణ మరియు సుదీర్ఘ జీవితం కలిగిన EVల తయారీ ద్వారా ఖ్యాతిని మరియు కస్టమర్ నమ్మకాన్ని పెంపొందించడం ద్వారా కోమకి గ్రీన్ మరియు క్లీన్ మొబిలిటీ డొమైన్‌లో ప్రముఖ ఆటగాళ్లలో ఒకటిగా అవతరించిందని అన్నారు.

కోమకి వెనిస్ ఎకో (Komaki Venice Eco) ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల.. ధర రూ.79,000 మరియు రేంజ్ 100 కిమీ

కోమకి ప్రస్తుతం, భారతదేశంలో 16 రకాల ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు మరియు 2 ఎలక్ట్రిక్ త్రీవీలర్లను విక్రయిస్తోంది. కోమకి అందిస్తున్న ఫ్లాగ్‌షిప్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ రేంజర్ చాలా ప్రత్యేకమైన ఇ-బైక్. ఇదొక క్రూయిజర్ టైప్ మోటార్‌సైకిల్. కొమాకి రేంజర్ (Komaki Ranger) బైక్ 4000 వాట్స్ ఎలక్ట్రిక్ మోటార్‌ మరియు 4 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్‌ సాయంతో పనిచేస్తుంది. ఇది ఇప్పటివరకు దేశంలోని ఏ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనంలోనూ అందించన అతిపెద్ద బ్యాటరీ ప్యాక్. అంతే కాకూండా కోమకి రేంజర్ పూర్తిగా ఛార్జ్ చేస్తే దాదాపు 250 కిలోమీటర్ల రేంజ్ ను అందిస్తుంది.

కోమకి వెనిస్ ఎకో (Komaki Venice Eco) ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల.. ధర రూ.79,000 మరియు రేంజ్ 100 కిమీ

కోమకి రేంజర్ (Komaki Ranger) ఎలక్ట్రిక్ క్రూయిజర్ బైక్‌లో క్రూయిజ్ కంట్రోల్ సిస్టమ్, రిపేర్ స్విచ్, రివర్స్ స్విచ్, బ్లూటూత్ సౌండ్ సిస్టమ్ మరియు అధునాతన బ్రేకింగ్ సిస్టమ్ వంటి ఆధునిక ఫీచర్లు చాలా ఉన్నాయి. ఎక్కువ మంది వినియోగదారులకు అందుబాటులో ఉండేలా 'రేంజర్' ఎలక్ట్రిక్ క్రూయిజర్‌ను వినియోగదారులకు అత్యంత సరసమైన ధరలో అందుబాటులో ఉంచామని కోమాకి తెలిపింది. మార్కెట్లో కోమకి రేంజర్ ఎలక్ట్రిక్ బైక్ ధర రూ.1.85 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంటుంది.

More from DriveSpark

Article Published On: Tuesday, October 4, 2022, 10:46 [IST]
English summary
Komaki venice eco electric scooter launched in india price specs and features
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+