Komaki నుంచి రానున్న కొత్త ఎలక్ట్రిక్ టూ వీలర్స్: పూర్తి వివరాలు

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల జోరు విపరీతంగా పెరిగిపోతున్న తరుణంలో చాలా సంస్థలు దేశీయ విఫణిలో ఎలక్ట్రిక్ వాహనాలను చేయడానికి ఆసక్తి చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో భాగంగానే ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీ సంస్థ 'కొమాకి' (Komaki) తన కొత్త హై-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయిన 'కొమాకి వెనిస్‌' (Komaki Venice) ఆవిష్కరించింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

Komaki నుంచి రానున్న కొత్త ఎలక్ట్రిక్ టూ వీలర్స్

'కొమాకి' (Komaki) కంపెనీ యొక్క 'కొమాకి వెనిస్‌' (Komaki Venice) భారతదేశంలో కంపెనీ యొక్క హై-స్పీడ్ స్కూటర్ విభాగంలో విడుదల కానున్న మూడవ ఎలక్ట్రిక్ స్కూటర్ కానుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మొత్తం 9 విభిన్న కలర్ ఆప్సన్ లో అందుబటులో ఉంటుంది.

Komaki నుంచి రానున్న కొత్త ఎలక్ట్రిక్ టూ వీలర్స్

భారతీయ మార్కెట్లో ఈ ఎకో-ఫ్రెండ్లీ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను త్వరలో విడుదల చేయనున్నట్లు కంపెనీ అధికారికంగా తెలిపింది. త్వరలో రానున్న ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ఆధునిక డిజైన్ కలిగి అధునాతన ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది.

Komaki నుంచి రానున్న కొత్త ఎలక్ట్రిక్ టూ వీలర్స్

Komaki యొక్క కొత్త Venice ఎలక్ట్రిక్ స్కూటర్‌ లేటెస్ట్ రెట్రో డిజైన్ పొందుతుంది. ముఖ్యంగా ఈ స్కూటర్ యువ కస్టమర్లను దృష్టిలో ఉంచుకుని విడుదల చేయడానికి సన్నద్ధమవుతోంది. కావున యువ కస్టమర్లకు ఈ బైక్ తప్పకుండా ఆకర్షిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మంచి పరిధిని కూడా అందిస్తుంది. దీని కోసం కంపెనీ ఈ స్కూటర్ ని 72v40ah బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. కావున ఎక్కువ దూరం ప్రయాణించేటప్పుడు స్టోరేజీ సమస్యలు తలెత్తకుండా చూసేందుకు స్కూటర్ పెద్ద సీటు మరియు అదనపు స్టోరేజ్ బాక్స్‌ కూడా అందుబటులో ఉంటుంది.

Komaki నుంచి రానున్న కొత్త ఎలక్ట్రిక్ టూ వీలర్స్

కొమాకి వెనిస్ హై-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ రిపేర్ స్విచ్, రీజెనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్, రివర్స్ స్విచ్ మరియు బ్లూటూత్ కనెక్టివిటీ వంటి ఫీచర్లను కూడా పొందుతుంది. ఈ స్కూటర్ ప్రయాణించడానికి మాత్రమే కాకుండా మంచి రైడింగ్ అనుభూతిని కూడా పొందటానికి చాలా అనుకూలంగా ఉంటుంది.

Komaki నుంచి రానున్న కొత్త ఎలక్ట్రిక్ టూ వీలర్స్

ఇదిలా ఉండగా కొమాకి కంపెనీ వెనిస్‌ ఎలక్ట్రిక్ స్కూటర్ తో పాటు, ఎలక్ట్రిక్ క్రూయిజర్ మోటార్‌సైకిల్ కూడా ఆవిష్కరించింది. ఈ బైక్ 4 kWh బ్యాటరీ 5,000 వాట్ మోటార్‌తో రానున్న దేశంలో మొట్టమొదటి ఎలక్ట్రిక్ క్రూయిజర్ బైక్ కానుంది. ఈ ఎలెక్ట్రిక్ బైక్ ఒక్క సారి ఛార్జ్ చేస్తే, దాదాపు 250 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. ఈ రేంజ్ బైకులతో ఇదే ఎక్కువ సామర్థ్యం అందించే బైక్ అవుతుంది.

Komaki నుంచి రానున్న కొత్త ఎలక్ట్రిక్ టూ వీలర్స్

దేశీయ మార్కెట్లో విడుదల కానున్న ఈ కొత్త క్రూయిజర్ బైక్ అన్ని రకాల భూభాగాల్లో మరియు విభిన్న వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా ఉండే విధంగా రూపొందించబడింది. Komaki రేంజర్ మరియు Komaki వెనిస్ విడుదలతో, ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ తన పోర్ట్‌ఫోలియోలో మొత్తం ఐదు హై-స్పీడ్ మోడళ్లను కలిగి ఉంటుంది.

Komaki నుంచి రానున్న కొత్త ఎలక్ట్రిక్ టూ వీలర్స్

ఈ సందర్భంగా కంపెనీ యొక్క డైరెక్టర్ 'గుంజన్ మల్హోత్రా' మాట్లాడుతూ.. Komaki రేంజర్ మరియు Komaki వెనిస్ రెండూ అత్యుత్తమ శ్రేణి ద్విచక్ర వాహనాలు, ఇవి ఆధునిక సాంకేతికత మరియు పర్యావరణ అనుకూలమైనవి మాత్రమే కాకుండా ఇవి వాహనదారులకు చాలా అనుకూలంగా కూడా ఉంటాయి.

Komaki నుంచి రానున్న కొత్త ఎలక్ట్రిక్ టూ వీలర్స్

ఇదిలా ఉండగా వికలాంగుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కూడా కోమాకి గతేడాది ఆగస్టులో విడుదల చేసింది. కంపెనీ యొక్క ఎలక్ట్రిక్ స్కూటర్ Komaki XGT X5 మెకానికల్ పార్కింగ్‌తో సహా అనేక ఫీచర్లతో వస్తుంది. స్కూటర్ రెండు ట్రిమ్‌లలో అందించబడుతుంది. అవి XGT-X5-(72V24AH) మరియు XGT-X5 GEL. వీటి ధర వరుసగా రూ. 90,500 మరియు రూ. 72,500 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).

Komaki నుంచి రానున్న కొత్త ఎలక్ట్రిక్ టూ వీలర్స్

Komaki XGT X5 రెడ్ మరియు గ్రే అనే రెండు కలర్ ఆప్సన్ లో అందుబటులో ఉంటుంది. Komaki XGT X5 స్కూటర్‌ని ఒక్కసారి ఛార్జ్ చేస్తే దాదాపు 80 నుంచి 90 కి.మీ పరిధిని అందిస్తుంది. ఈ రెండు స్కూటర్లు కూడా VRLA జెల్ బ్యాటరీ మరియు లిథియం-అయాన్ బ్యాటరీ రెండింటి ద్వారా శక్తిని పొందగలవు. బ్రేకులు వేసినప్పుడు బ్యాటరీని ఛార్జ్ చేసే రీజనరేటివ్ బ్రేక్ సిస్టమ్ కూడా ఈ స్కూటర్లలో ఉపయోగించబడింది. మొత్తానికి ఎలక్ట్రిక్ వాహన విభాగంలో ఈ కంపెనీ తనకంటూ ఒక స్థానం ఏర్పాటు చేసుకోవడానికి పాటుపడుతూనే ఉంది.

Komaki నుంచి రానున్న కొత్త ఎలక్ట్రిక్ టూ వీలర్స్

కంపెనీ త్వరలో ఈ రెండు ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను విడుదల చేయనుంది. ఈ స్కూటర్లు దేశీయ మార్కెట్లో విడుదలైన తరువాత మంచి అమ్మకాలను పొందుతుందని మేము ఆశిస్తున్నాము. కావున కంపెనీ విడుదల చేసే ఈ ఎలక్ట్రిక్ బైక్ కోసం చాలామంది వేచి చూస్తున్నారు. మొత్తానికి ఇది దేశీయ మార్కెట్లో ఎలాంటి ఆదరణ పొందుతుంది అనే విషయం త్వరలో తెలుస్తుంది.

More from DriveSpark

Article Published On: Friday, January 14, 2022, 9:50 [IST]
English summary
Komaki venice high speed electric scooter unveiled details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+