బైక్ లవర్స్‌కి గుడ్ న్యూస్.. KTM నుంచి త్వరలో రానున్న ఎలక్ట్రిక్ బైక్: వివరాలు

ప్రస్తుతం ఆటో మొబైల్ ప్రపంచంలో ఎలక్ట్రిక్ వాహనాల వాడకం చాలా ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో భాగంగా ఆటోమొబైల్ కంపెనీలు కూడా తమ ఉత్పత్తులను ఎలక్ట్రిక్ వాహన విభాగంలోకి తీసుకురావడానికి సన్నాహాలు సిద్ధం చేస్తున్నాయి. ఇందులో ప్రముఖ ఆస్ట్రియన్ బైక్ బ్రాండ్ కెటిఎమ్ కూడా చేరింది. దీని గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

బైక్ లవర్స్‌కి గుడ్ న్యూస్.. KTM నుంచి త్వరలో రానున్న ఎలక్ట్రిక్ బైక్: వివరాలు

నివేదికల ప్రకారం, ఆస్ట్రియన్ బ్రాండ్ అయిన కెటిఎమ్ ఇప్పుడు కెటిఎమ్ ఈ-డ్యూక్ (KTM E-Duke) ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌పై పని చేస్తున్నట్లు తెలిసింది. ఈ కొత్త ఎలక్ట్రిక్ బైక్ 10 కిలోవాట్ మోటార్‌తో పనిచేస్తుందని, అదే విధంగా ఇది 5.5 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంటుందని కూడా ఇప్పటికే తెలిపింది.

బైక్ లవర్స్‌కి గుడ్ న్యూస్.. KTM నుంచి త్వరలో రానున్న ఎలక్ట్రిక్ బైక్: వివరాలు

భారతదేశంలో ప్రస్తుతం అత్యంత శక్తివంతమైన ఎలక్ట్రిక్ బైక్ 'టార్క్ క్రాటోస్ ఆర్' (Tork Kratos R). ఈ బైక్ 9కిలోవాట్ ఎలక్ట్రిక్ మోటారును కలిగి ఉంటుంది. అదే సమయంలో టార్క్ క్రాటోస్ R (4kWh), సింపుల్ వన్ (4.8kWh) మరియు ఓలా ఎస్1 ప్రో (3.97kWh) వంటి వాహనాలతో పోలిస్తే, త్వరలో రానున్న 'కెటిఎమ్ ఈ-డ్యూక్' యొక్క బ్యాటరీ ప్యాక్ అత్యధిక సామర్థ్యాన్ని కలిగి ఉంది. కావున మంచి పనితీరుని అందిస్తుంది.

బైక్ లవర్స్‌కి గుడ్ న్యూస్.. KTM నుంచి త్వరలో రానున్న ఎలక్ట్రిక్ బైక్: వివరాలు

ప్రస్తుతం మార్కెట్లో కెటిఎమ్ ఈ-డ్యూక్ ఎలక్ట్రిక్ బైక్ తప్ప, మిగిలిన బైకులు అందుబటులో ఉన్నాయి. అయితే ఈ కొత్త కెటిఎమ్ ఈ-డ్యూక్ మార్కెట్లో విడుదల కావడానికి ఇంకా కొంత సమయం పెట్టె అవకాశం ఉంటుందని భావిస్తున్నాము. కెటిఎమ్ కంపెనీ త్వరలో రానున్న ఈ కెటిఎమ్ ఈ-డ్యూక్ యొక్క ధరను కూడా ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. ఇది ఆవిష్కరణ సమయంలో లేదా విడుదల సమయంలో వెల్లడవుతుంది.

బైక్ లవర్స్‌కి గుడ్ న్యూస్.. KTM నుంచి త్వరలో రానున్న ఎలక్ట్రిక్ బైక్: వివరాలు

కెటిఎమ్ ఈ-డ్యూక్ బైక్ ప్రస్తుతానికి టెస్టింగ్ దశలో కూడా లేదు. కావున దీనికి సంబంధించి వివరాలు ఇంకా అధికారికంగా తెలియరాలేదు. కానీ ఈ కెటిఎమ్ ఈ-డ్యూక్ బైక్ యొక్క డిజైన్ అద్బుతమగా ఉంటుందని మరియు ఫీచర్స్ కూడా ఆధునికంగా ఉంటాయని భావిస్తున్నారు.

బైక్ లవర్స్‌కి గుడ్ న్యూస్.. KTM నుంచి త్వరలో రానున్న ఎలక్ట్రిక్ బైక్: వివరాలు

కెటిఎమ్ ఈ-డ్యూక్ బైక్ యొక్క డిజైన్ బేస్ 'హస్క్‌వర్నా ఈ-పిలేన్‌' తో భాగస్వామ్యం చేయబడుతుందని భావిస్తున్నారు. ఈ బైక్ గత సంవత్సరం ఆవిష్కరించబడింది, ప్రస్తుతం ఉత్పత్తి దశలో ఉన్నట్లు కంపెనీ తెలిపింది. ఇది కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.

బైక్ లవర్స్‌కి గుడ్ న్యూస్.. KTM నుంచి త్వరలో రానున్న ఎలక్ట్రిక్ బైక్: వివరాలు

హస్క్‌వర్నా ఈ-పిలేన్‌ (Husqvarna E-Pillain) బైక్ సిగ్నేచర్ ట్రెల్లిస్ ఫ్రేమ్, అప్‌సైడ్ డౌన్ ఫోర్క్స్ మరియు ఆఫ్‌సెట్ రియర్ మోనోషాక్‌ వంటి వాటిని పొందుతుంది. ఈ బైక్ మొదట్లో 8 కిలోవాట్ మోడల్‌గా పరిచయం చేయబడింది, అయితే తర్వాత 4 కిలోవాట్ నుండి 10 కిలోవాట్ మోడల్‌లో కూడా ప్రవేశపెట్టబడింది.

బైక్ లవర్స్‌కి గుడ్ న్యూస్.. KTM నుంచి త్వరలో రానున్న ఎలక్ట్రిక్ బైక్: వివరాలు

ఇప్పటికే వెల్లడైన ఒక సమాచారం ప్రకారం, బజాజ్ కంపెనీ మరియు కెటిఎమ్ కంపెనీ రెండూ కూడా ఒక ఎలక్ట్రిక్ ప్లాట్‌ఫారమ్‌ను అభివృద్ధి చేస్తున్నాయని ప్రకటించాయి. అయితే ఈ బైక్ 3 కిలోవాట్ నుండి 10 కిలోవాట్ అవుట్‌పుట్‌తో రానున్న ఆధునిక బైక్ కావచ్చు అని ఊహిస్తున్నారు.

బైక్ లవర్స్‌కి గుడ్ న్యూస్.. KTM నుంచి త్వరలో రానున్న ఎలక్ట్రిక్ బైక్: వివరాలు

కెటిఎమ్ ఈ-డ్యూక్ అభివృద్ధిలో కూడా బజాజ్ కంపెనీ కూడా పాల్గొనే అవకాశం లేదు. రెండు కంపెనీల మధ్య భాగస్వామ్య స్థాయిని బట్టి, భవిష్యత్తులో ఈ-డ్యూక్ భారతదేశంలో ఉత్పత్తి చేయబడే అవకాశం ఉంది, అదే సమయంలో విక్రయాలు కూడా ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి.

బైక్ లవర్స్‌కి గుడ్ న్యూస్.. KTM నుంచి త్వరలో రానున్న ఎలక్ట్రిక్ బైక్: వివరాలు

సాధారణంగా మార్కెట్లో కెటిఎమ్ వాహనాలకు మంచి ఆదరణ ఉంది. ఈ కారణంగానే దేశీయ మార్కెట్లో మంచి అమ్మకాలను పొందుతోంది. అయితే ఇక ఈ కంపెనీ యొక్క బైకులు ఎలక్ట్రిక్ వెర్షన్ లో మార్కెట్లో అడుగుపెడితే, తప్పకుండా మరింత అమ్మకాలను పొందుతుందని భావిస్తున్నాము. ఈ బైక్ గురించి పూర్తి సమాచారం త్వరలోనే అందుబాటులోకి వస్తుంది.

More from DriveSpark

Article Published On: Thursday, February 10, 2022, 11:32 [IST]
English summary
Ktm confirms developing of e duke electric bike specifications details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+