రైడింగ్‌కి సిద్దమైపొండి కొత్త KTM RC 390 వచ్చేసింది.. ధర రూ. 3.14 లక్షలు

భారతీయ మార్కెట్లో అత్యంత ఆదరణ పొందిన 'కెటిఎమ్' (KTM) బ్రాండ్ ఎట్టకేలకు తన కొత్త '2022 కెటిఎమ్ ఆర్‌సి 390' (2022 KTM RC 390) బైక్ విడుదల చేసింది. అయితే కంపెనీ ఈ కొత్త బైక్ ను దేశీయ మార్కెట్లో విడుదల చేయకముందే దీని ధరను అధికారికంగా వెల్లడించింది. ఈ కొత్త బైక్ ధర రూ. 3.14 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). కెటిఎమ్ ఆర్‌సి 390 గురించి మరిన్ని వివరాలు ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.. రండి.

రైడింగ్‌కి సిద్దమైపొండి కొత్త KTM RC 390 వచ్చేసింది.. ధర రూ. 3.14 లక్షలు

ఆస్ట్రియన్ మోటార్‌సైకిల్ తయారీదారు యొక్క కెటిఎమ్ ఆర్‌సి 390 అనేది KTM యొక్క ఐకానిక్ 390 లైనప్‌లోని ఫెయిర్డ్ బైక్. ఇది చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా ఆధునిక ఫీచర్స్ కూడా పొందుతుంది. ఈ బైక్ కంపెనీ యొక్క ఇతర బైక్స్ మాదిరిగానే మహారాష్ట్రలోని బజాజ్ యొక్క చకాన్ ప్లాంట్‌లో తయారు చేయబడింది.

రైడింగ్‌కి సిద్దమైపొండి కొత్త KTM RC 390 వచ్చేసింది.. ధర రూ. 3.14 లక్షలు

KTM RC 390 బైక్ దాని మునుపటి మోడల్స్ కంటే కూడా ఎక్కువ కాస్మొటిక్ అప్డేటెడ్స్ పొందింది. ఇందులో ఇప్పుడు పెద్ద సింగిల్ ఎల్ఈడీ యూనిట్ ని చూడవచ్చు. దీనికోసం ముందు ఉన్న ట్విన్ పాడ్ హెడ్‌ల్యాంప్‌ను తొలగించిన బైక్ ముందు భాగంలో ఈ కొత్త ఎల్ఈడీ యూనిట్ అమర్చడం జరిగింది. ఇది బైక్ యొక్క డిజైన్ ని మరింత ఆధునికంగా చేస్తుంది.

రైడింగ్‌కి సిద్దమైపొండి కొత్త KTM RC 390 వచ్చేసింది.. ధర రూ. 3.14 లక్షలు

కెటిఎమ్ ఆర్‌సి 390 బైక్ పెద్ద 13.7-లీటర్ ఫ్యూయెల్ ట్యాంక్‌ను కూడా పొందుతుంది. కావున దూర ప్రయాణాలకు కూడా అనుకూలంగా ఉంటుంది. ఇందులోని ఫీచర్స్ కూడా ఇప్పుడు మరింత ఆధునికంగా ఉన్నాయి.

రైడింగ్‌కి సిద్దమైపొండి కొత్త KTM RC 390 వచ్చేసింది.. ధర రూ. 3.14 లక్షలు

ఆర్‌సి 390 బైక్ కొత్త TFT రైడర్ డిస్‌ప్లేను కూడా పొందుతుంది. అంతే కాకూండా ఈ డిస్‌ప్లే యాంబియంట్ లైట్ సెన్సార్‌ను కూడా పొందుతుంది. ఇది బయట వాతావరణ పరిస్థులపైన ఆధారపడి ఆ స్క్రీన్ బ్రైట్‌నెస్‌ ఆటోమాటిక్ గా మారుతుంది. ఇది రైడర్ కి చాలా అనుకూలంగా ఉంటుంది. ఇందులోని డిస్ప్లే బ్లూటూత్ కనెక్టివిటీ వంటి లేటెస్ట్ ఫీచర్ కూడా పొందింది.

రైడింగ్‌కి సిద్దమైపొండి కొత్త KTM RC 390 వచ్చేసింది.. ధర రూ. 3.14 లక్షలు

కొత్త కెటిఎమ్ RC 390 ఇప్పుడు బోల్ట్-ఆన్ సబ్‌ఫ్రేమ్‌తో తేలికపాటి ట్రేల్లిస్ ఫ్రేమ్ ఛాసిస్‌ను కలిగి ఉంది. ఫెయిర్డ్ 390 సిరీస్ బైక్ యొక్క మునుపటి మోడల్ తో పోలిస్తే ఇది 1.5 కేజీలు తక్కువ బరువును పొందుతుంది. కావున ఇది మరింత అద్భుతమైన రైడింగ్ అనుభూతిని అందిస్తుంది.

రైడింగ్‌కి సిద్దమైపొండి కొత్త KTM RC 390 వచ్చేసింది.. ధర రూ. 3.14 లక్షలు

కొత్త 2022 KTM RC 390 పెద్ద ఎయిర్‌బాక్స్ మరియు రివైజ్డ్ ఇంజన్ మ్యాపింగ్‌ను కలిగి ఉంటుంది, అయితే ఇంజన్ యొక్క పవర్ మరియు టార్క్ అవుట్‌పుట్ మాత్రం అలానే ఉంటుంది. కెటిఎమ్ ఆర్‌సి 390 బైక్ లో ఫ్యూయల్-ఇంజెక్టెడ్ సింగిల్ సిలిండర్ 373 సిసి ఇంజన్ ను ఉపయోగించారు. ఈ ఇంజన్ 9,000 ఆర్‌పిఎమ్ వద్ద 43 బిహెచ్‌పి శక్తిని మరియు 7,000 ఆర్‌పిఎమ్ వద్ద 37 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ తో జతచేయబడి ఉంటుంది.

రైడింగ్‌కి సిద్దమైపొండి కొత్త KTM RC 390 వచ్చేసింది.. ధర రూ. 3.14 లక్షలు

ఈ కొత్త బైక్ యొక్క రియర్ సెట్ ఫుట్ పెగ్‌లు మరియు సీటింగ్ పొజిషన్‌ చాలా అనుకూలంగా ఉన్నాయి. అంతే కాకుండా ఇందులో అడ్జస్టబుల్ క్లిప్-ఆన్ హ్యాండిల్‌బార్‌లు, మునుపటి మోడల్స్ కంటే కూడా 15 మిమీ ఎక్కువగా ఉండటం మీరు గమనించవచ్చు. ఇక ఇందులోని సీటు ఎత్తు 835 మిమీ వరకు ఉంటుంది.

రైడింగ్‌కి సిద్దమైపొండి కొత్త KTM RC 390 వచ్చేసింది.. ధర రూ. 3.14 లక్షలు

కొత్త కెటిఎమ్ ఆర్‌సి 390 యొక్క సస్పెన్షన్ సెటప్ మరియు బ్రేకింగ్ సెటప్ కూడా అద్భుతంగా ఉన్నాయి. ఈ బైక్ యొక్క ముందువైపు 320 మిమీ డిస్క్ బ్రేక్ మరియు వెనుకవైపు 230 మిమీ డిస్క్‌ బ్రేక్స్ ఉన్నాయి. ఇవి చాలా షార్ప్ గా పనిచేస్తాయి. ఇది డ్యూయల్-ఛానల్ ఏబీఎస్ ను కూడా పొందుతాయి.

మొత్తం మీద కొత్త ఆర్‌సి 390 డిజైన్ మరియు ఫీచర్స్ అన్నీ కూడా మునుపటికంటే కూడా చాలా అద్భుతంగా ఉన్నాయని కచ్చితంగా మాత్రం చెప్పవచ్చు.ఇక ఈ బైక్ ఎలాంటి అమ్మకాలు పొందుతోందో త్వరలో తెలుస్తుంది. అప్పటివరకు ఎప్పటికప్పుడు కొత్త బైకులు మరియు కార్లను గురించి సమాచారం తెలుసుకోవడానికి మా డ్రైవ్‌స్పార్క్ ఛానల్ ఫాలో అవ్వండి.

More from DriveSpark

Article Published On: Tuesday, May 24, 2022, 9:18 [IST]
English summary
Ktm launched new rc 390 model in india priced at 3 14 lakh details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+