కెటిఎమ్ ఆర్‌సి390 మరియు ఆర్‌సి200 మోడళ్లలో స్పెషల్ ఎడిషన్లు విడుదల.. ధరలు మాత్రం సేమ్..

ఆస్ట్రియన్ స్ట్పోర్ట్స్ బైక్ కంపెనీ కెటిఎమ్ (KTM) భారత మార్కెట్లో విక్రయిస్తున్న తమ పాపులర్ ఆర్‌సి390 (RC390) మరియు ఆర్‌సి200 (RC200) ఫుల్లీ ఫెయిర్డ్ స్పోర్ట్స్ బైక్‌లలో కంపెనీ రెండు స్పెషల్ ఎడిషన్ మోడళ్లను విడుదల చేసింది. ఈ స్పెషల్ ఎడిషన్ మోడళ్లు ప్రస్తుతం కెటిఎమ్ ఆర్‌సి సిరీస్ మోటార్‌సైకిళ్లతోనే విక్రయించబడుతాయి. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ స్పెషల్ ఎడిషన్ ఆర్‌సి బైక్‌ల ధరల్లో ఎలాంటి మార్పులు లేవు. ఇవి స్టాండర్డ్ మోడళ్ల ధరకే విక్రయించబడుతాయి.

కెటిఎమ్ ఆర్‌సి390 మరియు ఆర్‌సి200 మోడళ్లలో స్పెషల్ ఎడిషన్లు విడుదల.. ధరలు మాత్రం సేమ్..

మార్కెట్లో కెటిఎమ్ ఆర్‌సి390 జిపి (KTM RC390 GP) ధర రూ. 3,16,070 కాగా, కెటిఎమ్ ఆర్‌సి200 జిపి (KTM RC 200 GP) ధర రూ. 2,14,688 (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్)గా ఉంది. కంపెనీ ఈ స్పెషల్ ఎడిషన్లను తమ పాపులర్ రేస్ బైక్ అయిన కెటిఎమ్ ఆర్‌సి16 మోటోజిపి (KTM RC16 MotoGP) నుండి ప్రేరణ పొంది డిజైన్ చేయబడ్డాయి. కాబట్టి, ఈ రెండు స్పెషల్ ఎడిషన్లు కూడా ఈ రేస్ బైక్ లైవరీని క్యారీ చేస్తాయి.

కొత్త స్పెషల్ ఎడిషన్ కెటిఎమ్ ఆర్‌సి బైక్‌ల యొక్క ఫెయిరింగ్ మరియు ఫ్రంట్ ఫెండర్‌లపై కనిపించే విలక్షణమైన డీకాల్స్‌తో పాటు ఆరెంజ్ బేస్ పెయింట్‌లో ఇవి ఫినిష్ చేయబడి ఉంటాయి. ఈ చిన్నపాటి కాస్మెటిక్ అప్‌గ్రేడ్స్ మినహా కంపెనీ వీటి మెకానికల్ కాన్ఫిగరేషన్‌లలో ఎలాంటి మార్పులు చేయలేదు. కొత్త RC390 మరియు RC200 స్పెషల్ ఎడిషన్ల కోసం దేశవ్యాప్తంగా బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి మరియు త్వరలోనే డెలివరీలు కూడా ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

కెటిఎమ్ ఆర్‌సి390 మరియు ఆర్‌సి200 మోడళ్లలో స్పెషల్ ఎడిషన్లు విడుదల.. ధరలు మాత్రం సేమ్..

సాధారణ కెటిఎమ్ ఆర్‌సి మోటార్‌సైకిళ్లు వైట్ అండ్ ఆరెంజ్ కలర్‌లో ఉంటాయి. వాటి నుండి ఈ స్పెషల్ ఎడిషన్లను వేరు చేసేందుకు వీటిని ఎక్స్‌క్లూజివ్ ఆరెంజ్ షేడ్‌లో ఫినిష్ చేశారు మరియు వాటిపై కెటిఎమ్ రేసింగ్ స్టిక్కర్స్ ప్రత్యేకంగా కనిపిస్తాయి. ఈ స్పెషల్ ఎడిషన్స్ బైక్స్ లో కంపెనీ కేవలం చిన్నపాటి కాస్మెటిక్ అప్‌గ్రేడ్స్ మాత్రమే చేసింది కాబట్టి, వీటి ధరలను కూడా పెంచలేదు. ఇవి స్టాండర్డ్ కెటిఎమ్ ఆర్‌సి సిరీస్ మోటార్‌సైకిళ్ల ధరలకే అందుబాటులో ఉంటాయి.

కెటిఎమ్ ఆర్‌సి390 జిపి ఎడిషన్ 373 సీసీ లిక్విడ్-కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజన్ తో పనిచేస్తుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 42.41 బిహెచ్‌పి శక్తిని మరియు 37 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కాగా, కెటి ఆర్‌సి200 జిపి ఎడిషన్ 199 సీసీ లిక్విడ్-కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజన్‌ తో పనిచేస్తుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 25.05 బిహెచ్‌పి పవర్ ను మరియు 19.5 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ రెండు మోటార్‌సైకిళ్ల కూడా 6 స్పీడ్ ట్రాన్స్‌మిషన్‌ తో జత చేయబడి ఉంటాయి.

కెటిఎమ్ ఆర్‌సి390 మరియు ఆర్‌సి200 మోడళ్లలో స్పెషల్ ఎడిషన్లు విడుదల.. ధరలు మాత్రం సేమ్..

కెటిఎమ్ ఆర్‌సి390 బైక్‌ ముందు భాగంలో ఎల్‌ఈడి హెడ్‌లైట్, ఎల్ఈడి టర్న్ ఇండికేటర్‌లు మరియు ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్లు ఉంటాయి. ఇది గాలి నుండి (విండ్ బ్లాస్ట్ నుండి) రక్షణను అందించేందుకు విండ్‌షీల్డ్‌ ను కూడా పొందుతుంది మరియు మోటార్‌సైకిల్ యొక్క మొత్తం ఏరోడైనమిక్స్‌ ను మెరుగుపరడంలో సహకరిస్తుంది. ఈ బైక్ యొక్క విజువల్ అప్పీల్‌ను మెరుగుపరచడం కోసం స్పోర్టీ బాడీ ప్యానెల్‌లు ఉపయోగించబడ్డాయి. ఇదొక పూర్తి ఫెయిరింగ్ కలిగిన మోటార్‌సైకిల్.

కెటిఎమ్ ఆర్‌సి390 మరియు ఆర్‌సి200 మోడళ్లలో స్పెషల్ ఎడిషన్లు విడుదల.. ధరలు మాత్రం సేమ్..

కెటిఎమ్ ఇటీవలే ఈ బైక్ ఫీచర్లను కూడా అప్‌డేట్ చేసింది. ఇందులో మ్యూజిక్ కంట్రోల్, కాల్ / ఎస్ఎమ్ఎస్ అలెర్ట్స్ మరియు టర్న్ నావిగేషన్ వంటి ఫీచర్ల కోసం బ్లూటూత్ కనెక్టివిటీ కూడా ఉంటుంది. రైడర్ తన స్మార్ట్ ఫోన్ సాయంతో బైక్‌కు వైర్‌లెస్‌గా కనెక్ట్ అయి, ఈ ఫీచర్లను యాక్సెస్ చేసుకోవచ్చు. ఇందుకోసం హ్యాండిల్‌ బార్‌పై ఇన్‌స్ట్రుమెంట్ డిస్‌ప్లే యూనిట్ అమర్చబడి ఉంటుంది. రైడర్‌లు దీనిని స్విచ్ గేర్‌ని ఉపయోగించి ప్రయాణంలో మ్యూజిక్ ప్లేబ్యాక్ మరియు ఫోన్ కాల్‌లను కంట్రోల్ చేయవచ్చు.

కెటిఎమ్ ఆర్‌సి390 మరియు ఆర్‌సి200 మోడళ్లలో స్పెషల్ ఎడిషన్లు విడుదల.. ధరలు మాత్రం సేమ్..

ఇక కెటిఎమ్ ఆర్‌సి200 బైక్ విషయానికి వస్తే, ఇది తక్కువ ధర కలిగిన ఎంట్రీ లెవల్ స్పోర్ట్స్ బైక్. అయినప్పటికీ, ఇందులో మెరుగైన ఫీచర్లు లభిస్తాయి. ఈ బైక్ లో పూర్తిగా సర్దుబాటు చేయగల హ్యాండిల్‌బార్‌, ఎల్‌సిడి డిస్‌ప్లే, ఎల్ఈడి హెడ్‌లైట్, సూపర్‌మోటో మోడ్‌తో కూడిన ఏబిఎస్, 13.7 లీటర్ల ఇంధన ట్యాంక్ వంటి ఫీటర్లు ఉన్నాయి. ఇందులోని పెద్ద ఎయిర్‌బాక్స్ దాని పరిధికి మెరుగైన ప్రతిస్పందనను, మరింత టార్క్‌ని అందించడంలో సహాయపడుతుంది.

కెటిఎమ్ ఆర్‌సి390 మరియు ఆర్‌సి200 మోడళ్లలో స్పెషల్ ఎడిషన్లు విడుదల.. ధరలు మాత్రం సేమ్..

అలాగే, ఇందులోని రేడియేటర్ ఇంజన్‌ను చల్లబరచడంలో సహాయపడుతుంది. ఈ చిన్న స్పోర్ట్స్ బైక్ కూడా విండ్‌స్క్రీన్ తో లభిస్తుంది. అల్యూమినియం కాస్ట్ అండ్ స్ప్లిట్ పిలియన్ గ్రాబ్ రెయిల్ వెనుక భాగంలో ఇవ్వబడ్డాయి. సస్పెన్షన్ కోసం ముందు భాగంలో 43 మిమీ యూఎస్‌డి (అప్ సైడ్ డౌన్) ఫోర్క్‌లు మరియు వెనుక వైపున మోనోషాక్ యూనిట్ మరియు బ్రేస్డ్ అల్లాయ్ స్వింగార్మ్‌ మొదలైన ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

కెటిఎమ్ ఆర్‌సి390 మరియు ఆర్‌సి200 మోడళ్లలో స్పెషల్ ఎడిషన్లు విడుదల.. ధరలు మాత్రం సేమ్..

కెటిఎమ్ ఆర్‌సి 200 బ్రేకింగ్ విషయానికి వస్తే, ఇందులో ముందు వైపు BYBRE కాలిపర్‌లతో కూడిన 320 మిమీ డిస్క్ మరియు వెనుకవైపు 230 మిమీ డిస్క్ బ్రేక్‌లు ఉంటాయి. అదే కెటిఎమ్ ఆర్‌సి 390 బ్రేకింగ్ విషయానికి వస్తే, కెటిఎమ్ యొక్క సూపర్‌మోటో ఏబిఎస్ మోడ్, కార్నరింగ్ ఏబిఎస్, రెండు చక్రాలపై డిస్క్ బ్రేక్స్ తో పాటుగా కార్నరింగ్ ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్‌ మరియు ఆప్షనల్ బై-డైరెక్షన్ క్విక్-షిఫ్టర్‌ వంటి ఇతర డ్రైవర్ అసిస్టెన్స్ ఫీచర్లు కూడా ఉన్నాయి.

Most Read Articles

English summary
Ktm rc 390 gp and ktm rc 200 gp special edition bikes launched price and specs features
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X