YouTube

లిమిటెడ్ ఎడిషన్ 2023 కెటిఎమ్ ఆర్‌సి 8సి వెల్లడి.. కేవలం 200 యూనిట్లు మాత్రమే..!

ఆస్ట్రియన్ మోటార్‌సైకిల్ కంపెనీ కెటిఎమ్ (KTM) తమ సరికొత్త లిమిటెడ్ ఎడిషన్ 2023 కెటిఎమ్ ఆర్‌సి 8సి (KTM 2023 RC 8C) ట్రాక్ బైక్‌ ను ఆవిష్కరించింది. ఈ కొత్త బైక్ కేవలం 200 యూనిట్లకు మాత్రమే పరిమితం చేయబడుతుంది, ప్రతి బైక్‌ పై కూడా ట్రిపుల్ క్లాంప్ ‌పై ప్రత్యేక సీరియల్ నంబర్ స్టాంప్ చేయబడుతుంది. కాబట్టి, ఇది స్టాండర్డ్ మోడల్ కన్నా చాలా ప్రత్యేకంగా మరియు అరుదుగా ఉంటుంది.

లిమిటెడ్ ఎడిషన్ 2023 కెటిఎమ్ ఆర్‌సి 8సి వెల్లడి.. కేవలం 200 యూనిట్లు మాత్రమే..!

కొత్త 2023 కెటిఎమ్ ఆర్‌సి 8సి ట్రాక్ బైక్‌లో కంపెనీ ప్రధానంగా చేసిన మార్పు దాని ఇంజన్ రూపంలో ఉంటుంది. ఈ మోడల్ ఇప్పుడు మరింత అధునాతనమైన LC8c DOHC ఇన్‌లైన్ ట్విన్ సిలిండర్ ఇంజన్‌ ను కలిగి ఉంటుంది. ఇందులోని 889 సీసీ ఇన్‌లైన్ ట్విన్ ఇంజన్ గరిష్టంగా 11,000 ఆర్‌పిఎమ్ వద్ద 135 హెచ్‌పి శక్తిని మరియు 98 ఎన్ఎమ్ వద్ద గరిష్ట టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది రేస్-స్టైల్ రివర్స్డ్ ప్యాటర్న్‌తో సెటప్ చేయబడిన 6-స్పీడ్ గేర్‌బాక్స్ ద్వారా ఇంజన్ నుండి వచ్చే శక్తిని వెనుక చక్రానికి పంపిణీ చేస్తుంది మరియు ఇది క్విక్‌షిఫ్టర్‌ ను కూడా కలిగి ఉంటుంది.

లిమిటెడ్ ఎడిషన్ 2023 కెటిఎమ్ ఆర్‌సి 8సి వెల్లడి.. కేవలం 200 యూనిట్లు మాత్రమే..!

కెటిఎమ్ పరిచయం చేసిన ఈ కొత్త ట్రాక్ బైక్ లోని సవరించిన ఇంజన్ కొత్త ఇన్‌టేక్ మరియు ఎగ్జాస్ట్ వాల్వ్‌లు మరియు కాన్రోడ్‌ లతో సహా కొన్ని టైటానియం భాగాలను కూడా కలిగి ఉంది. ఇందులోని పెద్ద LC8c ఇంజన్ 48 మిమీ థ్రోటల్ బాడీలు, సవరించిన దహన గదులు (మోడిఫైడ్ కంబషన్ రూమ్స్) మరియు రెండు పిస్టన్ రింగ్‌లను కలిగి ఉంటుంది. ఫలితంగా ఈ కొత్త 2023 మోడల్ కెటిఎమ్ ఆర్‌సి 8సి దాని మునుపటి మోడల్ యొక్క పవర్ అవుట్‌పుట్ తో పోలిస్తే ఇప్పుడు దాదాపు 7 హెచ్‌పి వరకూ పెరిగింది.

లిమిటెడ్ ఎడిషన్ 2023 కెటిఎమ్ ఆర్‌సి 8సి వెల్లడి.. కేవలం 200 యూనిట్లు మాత్రమే..!

కొత్త 2023 ఆర్‌సి 8సి బరువును తేలికగా ఉంచడం కోసం ఇందులో తేలికపాటి టైటానియం మెటీరియల్‌ను ఉపయోగించారు. ఫలితంగా, ఈ ట్రాక్ బైక్ మొత్తం బరువు కేవలం 142 కిలోలు మాత్రమే ఉంటుంది. ఇందులో టైటానియం నుండి తయారు చేయబడిన కొత్త అక్రాపోవిక్ ఎగ్జాస్ట్ సిస్టమ్ (సైలెన్సర్) ఇంజన్ యొక్క పనితీరును చక్కగా వినిపించేలా చేస్తుంది.

లిమిటెడ్ ఎడిషన్ 2023 కెటిఎమ్ ఆర్‌సి 8సి వెల్లడి.. కేవలం 200 యూనిట్లు మాత్రమే..!

కెటిఎమ్ ఆర్‌సి 8సి 2023 మోడల్ కూడా స్టీల్ ట్రెల్లిస్ ఫ్రేమ్ ఆధారంగానే రూపొందించబడింది. అయితే, ఇప్పుడు ఇది పూర్తిగా సర్దుబాటు చేయగల WP అపెక్స్ ప్రో 43 మిమీ ఇన్‌వర్టెడ్ ఫ్రంట్ ఫోర్క్‌ లను కలిగి ఉంటుంది మరియు ఈ ఫోర్కుల ట్రావెల్ లెన్త్ 120 మిమీగా ఉంటుంది. ఇక వెనుక సస్పెన్షన్ సెటప్ విషయానికి వస్తే, ఇక్కడ కూడా పూర్తిగా సర్దుబాటు చేయగల WP అపెక్స్ ప్రో షాక్ అబ్జార్వర్లనే ఉపయోగించారు మరియు ఇది కూడా 120 మిమీ ట్రావెల్ లెన్త్ ను కలిగి ఉంటుంది.

లిమిటెడ్ ఎడిషన్ 2023 కెటిఎమ్ ఆర్‌సి 8సి వెల్లడి.. కేవలం 200 యూనిట్లు మాత్రమే..!

అప్‌డేట్ చేయబడిన సస్పెన్షన్ సెటప్ కారణంగా, కొత్త 2023 KTM RC 8C యొక్క సస్పెన్షన్ సెటప్ ఒరిజినల్ RC 8Cతో పోలిస్తే చాలా మృదువుగా ఉంటుందని కంపెనీ పేర్కొంది. ఫలితంగా ఇది రైడర్ విశ్వాసాన్ని పెంచడంలో సహాయపడుతుంది మరియు మొత్తం రైడ్ సౌకర్యాన్ని మెరుగుపరుస్తుందని కంపెనీ తెలిపింది. ఇందు లో సర్దుబాటు చేయగల సస్పెన్షన్ సెటప్‌తో పాటు, రైడర్‌లు ట్రిపుల్-క్లాంప్ ఆఫ్‌సెట్‌ను కూడా సర్దుబాటు చేసుకునే సౌకర్యం ఉంది. ఫుట్‌పెగ్‌లు మరియు హ్యాండిల్‌బార్లు రెండూ కూడా వేర్వేరు రైడర్‌లకు మరియు వారు ప్రయాణించే విధానానికి అనుగుణంగా ఉండేలా సర్దుబాటు చేసుకోవచ్చు.

లిమిటెడ్ ఎడిషన్ 2023 కెటిఎమ్ ఆర్‌సి 8సి వెల్లడి.. కేవలం 200 యూనిట్లు మాత్రమే..!

కొత్త 2023 కెటిఎమ్ ఆర్‌సు 8సి బైక్‌ను ట్రాక్‌పై వీలైనంత త్వరగా ఆపివేయడంలో సహాయపడటానికి వీలుగా, కంపెనీ ఈ బైక్ ముందు చక్రంలో రేడియల్ ‌గా మౌంట్ చేయబడిన బ్రెంబో స్టైల్మా ఫోర్-పిస్టన్ కాలిపర్‌ల ద్వారా బిగించబడిన రెండు 290 మిమీ డిస్క్ ‌లతో కూడిన ట్రాక్‌ను ప్రత్యేకంగా అమర్చింది. ఇక వెనుక బ్రేక్ విషయానికి వస్తే, వెనుక చక్రంపై రెండు-పిస్టన్ కాలిపర్‌ల ద్వారా బిగించబడిన ఒకే 230 మిమీ డిస్క్ తో బ్రేక్ అమర్చబడి ఉంటుంది. ఇవి రెండూ కూడా అధునాతన ఏబిఎస్ బ్రేకింగ్ సిస్టమ్ ను కలిగి ఉంటాయి.

లిమిటెడ్ ఎడిషన్ 2023 కెటిఎమ్ ఆర్‌సి 8సి వెల్లడి.. కేవలం 200 యూనిట్లు మాత్రమే..!

ఇక వీల్స్ విషయానికి వస్తే, 2023 KTM RC 8C ట్రాక్ బైక్ పై ప్రత్యేకమైన 17 ఇంచ్ ఫోర్జ్డ్ అల్యూమినియం డైమ్యాగ్ UP7X అల్లాయ్ వీల్స్ ని ఉపయోగించారు. వీటిలో ముందు వైపు 120/70 R 17 ప్రొఫైల్ టైర్ మరియు వెనుక వైపు 180/60 R 17 ప్రొఫైల్ టైరు అమర్చబడి ఉంటాయి. ఇవి రెండూ కూడా పిరెల్లి డయాబ్లో ఎస్‌సి1 సూపర్ బైక్ స్లిక్ టైర్‌లు మరియు ట్రాక్ పై మంచి పనితీరును, ట్రాక్ గ్రిప్ ను అందిస్తాయి.

లిమిటెడ్ ఎడిషన్ 2023 కెటిఎమ్ ఆర్‌సి 8సి వెల్లడి.. కేవలం 200 యూనిట్లు మాత్రమే..!

ఓవరాల్‌ గా చెప్పాలంటే, కొత్త 2023 కెటిఎమ్ ఆర్‌సి 8సి వింగ్‌లెట్‌లతో కూడిన మంచి ఏరోడైనమిక్ ఆకారాన్ని కలిగి ఉంటుంది, ఇది బైక్‌ను అధిక వేగం వద్ద కూడా స్థిరీకరించడంలో సహాయపడుతుంది. అలాగే, మెరుగైన డౌన్‌ఫోర్స్‌ను అందించడం మరియు బ్రేకింగ్‌ లో మరింత నియంత్రణను అందించడంలో సహాయపడుతుంది. ఫ్రంట్ ఫెయిరింగ్‌ లో ఉండే కటౌట్‌లు మరియు ఆకారాలు రైడర్ చుట్టూ గాలి ప్రవాహాన్ని ఆప్టిమైజ్ చేయడంలో సహాయపడతాయి. ఈ బైక్ లోని అన్ని బాడీ భాగాలు కూడా తేలికైన మరియు ధృడమైన GRP మెటీరియల్ నుండి తయారు చేయబడ్డాయి. వీటిని రీప్లేస్ చేసుకోవడం కూడా చాలా సులభంగా ఉంటుంది.

Most Read Articles

English summary
Limited edition 2023 ktm rc 8c revealed design specs and features
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X