లిమిటెడ్ ఎడిషన్ Aprilia RS660 విడుదల.. కేవలం 1500 యూనిట్లు మాత్రమే..!
ఇటలీకి చెందిన ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ అప్రిలియా (Aprilia) గడచిన సెప్టెంబర్ నెలలో భారత మార్కెట్లో విడుదల చేసిన ఆప్రిలియా ఆర్ఎస్660 మిడిల్-వెయిట్ సూపర్‌స్పోర్ట్ మోటార్‌సైకిల్ లో కంపెనీ ఇప్పుడు ఓ లిమిటెడ్ ఎడిషన్ ను పరిచయం చేసింది. ఈ లిమిటెడ్ ఎడిషన్ వెర్షన్ కొత్త మరియు ప్రత్యేకమైన పెయింట్ స్కీమ్‌తో లభిస్తుంది. ఈ ప్రత్యేకమైన వేరియంట్ ఉత్పత్తిని కంపెనీ ప్రపంచవ్యాప్తంగా కేవలం 1500 యూనిట్లకు మాత్రమే పరిమితం చేసింది.

కొత్తగా ప్రవేశపెట్టిన ఆప్రిలియా ఆర్ఎస్660 మోడల్ ఏఎమ్ఏ నేషనల్ రోడ్ రేసింగ్ ఛాంపియన్‌షిప్స్‌లో బ్రాండ్ సాధించిన విజయాన్ని గుర్తుచేస్తుంది. ఈ కొత్త మోడల్ ప్రధానంగా తెలుపు, ఎరుపు మరియు నీలం రంగులలో స్టార్స్ అండ్ స్ట్రైప్స్ థీమ్ తో డిజైన్ చేయబడింది. కొత్త పెయింట్ థీమ్‌తో పాటుగా, ఈ మోటార్‌సైకిల్ ఇన్‌వర్టెడ్ షిఫ్ట్ ప్యాటర్న్ తో కూడిన గేర్‌బాక్స్ ను కలిగి ఉంటుంది. ఇందులో గేర్ షిఫ్టులను క్రిందికి నెట్టడం మరియు పుష్ అప్స్ డౌన్‌షిఫ్ట్‌లు ఉంటాయి. ఇది ప్రాథమికంగా అన్ని సరైన రేస్ బైక్‌లలో కనిపిస్తుంది.

అదనంగా, ఇందులోని ఇతర ప్రధాన అప్‌డేట్‌లలో మెరుగైన ఎయిర్‌ఫ్లో కోసం పెద్ద ఫ్రంట్ ఫెయిరింగ్ మరియు బయటి భాగాన్ని మరింత ఆకర్షణీయంగా చేయడానికి వెనుక సీటు కూపే ఉన్నాయి. ఈ మార్పులు మినహా స్టాండర్డ్ ఆర్ఎస్660 కి మరియు ఈ లిమిటెడ్ ఎడిషన్ ఆర్ఎస్660 కి పెద్ద మార్పులు ఏవీ లేవు. ఇంజన్ మరియు మెకానికల్ గా కూడా ఇందులో ఏ మార్పులు లేవు. ఆప్రిలియా ఆర్ఎస్660 మోటార్‌సైకిల్ 659 సీసీ లిక్విడ్ కూల్డ్ పారలల్ ట్విన్ ఇంజన్ ను ఉపయోగించారు.

ఈ ఇంజన్ గరిష్టంగా 10,5000 ఆర్‌పిఎమ్ వద్ద 100 బిహెచ్‌పి శక్తిని మరియు 8500 ఆర్‌పిఎమ్ వద్ద 67 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది సిక్స్ స్పీడ్ గేర్‌బాక్స్ తో జతచేయబడి ఉంటుంది. ఈ మోటార్‌సైకిల్‌లో APRC (అప్రిలియా పెర్ఫార్మెన్స్ రైడ్ కంట్రోల్), త్రీ-లెవల్ కార్నరింగ్ ABS, ట్రాక్షన్ కంట్రోల్, అడ్జస్టబుల్ వీల్ కంట్రోల్, ఇంజన్ బ్రేక్ కంట్రోల్ మరియు మల్టిపుల్ రైడింగ్ మోడ్‌లతో కూడిన సిక్స్-యాక్సిస్ IMU మొదలైనవి ఉన్నాయి.

అప్రిలియా తమ ఆర్ఎస్600 స్పోర్ట్స్ బైక్ ని గత ఏడాది భారత మార్కెట్లో విడుదల చేసింది. దేశీయ మార్కెట్లో దీని ధర రూ.13.39 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా నిర్ణయించబడింది. భారత మార్కెట్లో ఇది ఈ విభాగంలో హోండా సిబిఆర్650ఆర్, యమహా వైజెడ్ఎఫ్-ఆర్7 మరియు రాబోయే కవాసకి నింజా 700ఆర్ వంటి మోడళ్లకు ప్రత్యక్ష పోటీగా నిలుస్తుంది. ఇది అంతర్జాతీయ మార్కెట్ లలో లావా రెడ్, బ్లాక్ అపెక్స్ మరియు యాసిడ్ గోల్డ్ అనే మూడు రంగులలో అందుబాటులో ఉంది.

కొత్త లిమిటెడ్ ఎడిషన్ Aprilia RS 660 బైక్ లో ఎల్ఈడి హెడ్ ల్యాంప్, ఎల్ఈడి డిఆర్ఎల్, ఎల్ఈడి టెయిల్‌ల్యాంప్‌లు, విండ్‌స్క్రీన్, అండర్‌బెల్లీ ఎగ్జాస్ట్, రేస్-స్పెక్ హ్యాండిల్‌బార్ మరియు 15 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ వంటి డిజైన్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇందులో ఐదు 5 రైడ్ మోడ్‌లను కలిగి ఉంటాయి, వీటిలో మూడు రోడ్ రైడింగ్ మోడ్స్ కాగా మిగిలిన రెండు ట్రాక్ ఉపయోగం కోసం వినియోగించబడతాయి. ఇవన్నీ రైడర్ కి చాలా అనుకూలమైన రైడింగ్ అనుభవాన్ని అందించడంలో సహకరిస్తాయి.

ఫీచర్ల విషయానికి వస్తే, ఈ కొత్త బైక్ లో 5 ఇంచ్ టిఎఫ్‌టి స్ప్లిట్ స్క్రీన్ ఉంటుంది. ఇది స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీని సపోర్ట్ చేస్తుంది, కంపెనీ ఇందు కోసం Aprilia MIA మల్టీమీడియా ప్లాట్‌ఫామ్‌ను కూడా అందిస్తోంది. ఇతర ప్రధాన ఫీచర్లలో అల్యూమినియం డ్యూయల్ బీమ్ చాసిస్, ముందు భాగంలో 41 మిమీ కయబా యూఎస్‌డి ఫోర్కులు మరియు వెనుక భాగంలో మోనోషాక్ సస్పెన్షన్ సెటప్ ఉంటుంది. ఇవి రెండూ కూడా కంప్రెషన్, రీబౌండ్ మరియు ప్రీలోడ్ ఫుల్లీ అడ్జస్టబల్ సదుపాయాన్ని కలిగి ఉంటాయి.

బ్రేకింగ్ విషయానికి వస్తే, దీని ముందు భాగంలో బ్రెంబో ఫోర్-పాట్ రేడియల్ కాలిపర్‌లతో కూడిన 320 మిమీ డ్యూయల్-డిస్క్ బ్రేక్ మరియు వెనుక భాగంలో బ్రెంబో కాలిపర్‌లతో కూడిన 220 మిమీ డిస్క్ బ్రేక్‌లు ఉంటాయి. అలాగే, ఈ బైక్ ముందు భాగంలో 120/70 సెక్షన్ టైర్‌తో కూడిన 17 ఇంచ్ అల్లాయ్ వీల్ మరియు వెనుక భాగంలో 180/55 సెక్షన్ టైర్‌తో కూడిన 17ఇంచ్ అల్లాయ్ వీల్ ఉంటాయి. ఈ బైక్ మొత్తం బరువు 185 కేజీలుగా ఉంటుంది.

ఆప్రిలియా బ్రాండ్ కి సంబంధించిన ఇతర వార్తలను గమనిస్తే, కంపెనీ ఇటీవలే తమ మొదటి అడ్వెంచర్ స్కూటర్, SR GT 200 ను జపాన్‌లో విడుదల చేసింది. కంపెనీ ఈ SR GT సిరీస్ ను నవంబర్ 2021లో ఇటలీలోని మిలన్‌లో జరిగిన EICMA చివరి ఎడిషన్‌లో ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరించింది. ఇందులో SR GT శ్రేణి 125 మరియు 200 అనే రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. ఇది ప్రత్యేకించి ఆఫ్-రోడ్ ప్రయోజనం కోసం ఉద్దేశించి రూపొందిచబడిన స్కూటర్.


Click it and Unblock the Notifications








