2022 లో విడుదలైన టాప్-5 స్కూటర్లు: ఇక్కడ చూడండి

2022 వ సంవత్సరంలో ఎలక్ట్రిక్ వాహనాలకు ఆదరణ విపరీతంగా పెరిగింది. ఇందులో భాగంగానే వాహన తయారీ సంస్థలు కూడా దేశీయ ఎలక్ట్రిక్ వాహన విభాగంలో కొత్త కొత్త వాహనాలను విడుదల చేశాయి. ఈ సంవత్సరం భారతీయ విఫణిలో విడుదలైన టాప్-5 స్కూటర్లలో 4 ఎలక్ట్రిక్ స్కూటర్లే ఉన్నాయి.

ఓలా ఎస్ 1 ఎయిర్:

ఇండియన్ మార్కెట్లో మొదటి నుంచి మంచి అమాంకాలతో అద్భుతమైన ప్రజాదరణ పొందుతున్న ఓలా ఎలక్ట్రిక్ గత దీపావళి సందర్భంగా 'ఎస్1 ఎయిర్' అనే ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల చేసింది. ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ. 84,999 (ఎక్స్-షోరూమ్). ఇది 2.5 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ మరియు 4.5 కిలోవాట్ హబ్-మౌంటెడ్ మోటారును పొందుతుంది. కావున ఇది ఒక ఫుల్ ఛార్జ్‌తో గరిష్టంగా 101 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది.

2022 లో విడుదలైన టాప్-5 స్కూటర్లు

ఓలా ఎస్ 1 ఎయిర్ ఎలక్ట్రిక్ స్కూటర్ గరిష్ట వేగం గంటకు 90 కిలోమీటర్లవరకు ఉంటుంది. ఇది 500W పోర్టబుల్ హోమ్ ఛార్జర్‌ని ఉపయోగించి 0 నుంచి 100 శాతం ఛార్జ్ చేసుకోవడానికి 4:30 గంటల సమయం పడుతుంది. 'ఓలా ఎస్1 ఎయిర్' ఎలక్ట్రిక్ స్కూటర్ లో పెద్ద 7-ఇంచెస్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ ఉంటుంది. దీని ద్వారా రైడర్ డ్రైవ్ మోడ్‌లు, కాలింగ్ ఫంక్షన్ ఫీచర్లను యాక్సెస్ చేయవచ్చు.

హీరో విడా వి1 ఎలక్ట్రిక్ స్కూటర్:

2022 లో దేశీయ మార్కెట్లో విడుదలైన ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఒకటి 'హీరో విడా వి1'. ఈ స్కూటర్ 'విడా వి1 ప్రో' మరియు 'విడా వి1 ప్లస్' అనే రెండు వేరియంట్స్ లో అందుబాటులో ఉంటుంది. వీటి ధరలు రూ. 1.59 లక్షలు (ఎక్స్ షోరూమ్) మరియు రూ. 1.45 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇవి రెండూ కూడ మంచి డిజైన్, ఆధునిక ఫీచర్స్ పొందుతాయి.

హీరో విడా V1 Plus ఎలక్ట్రిక్ స్కూటర్ ఒక ఫుల్ ఛార్జ్ తో గరిష్టంగా 143 కిలోమీటర్ల పరిధిని, Vida V1 Pro గరిష్టంగా 165 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుంది. ఈ స్కూటర్ టాప్-స్పీడ్ గంటకు 80 కిమీ. ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లు రిమూవబుల్ బ్యాటరీ కలిగి ఉంటాయి. విడా ఎలక్ట్రిక్ స్కూటర్ పెద్ద అండర్ సీట్ స్టోరేజ్ కూడా పొందుతుంది. దీని కెపాసిటీ 26లీటర్ల వరకు ఉంటుంది.

టీవీఎస్ ఐక్యూబ్:

భారతీయ మార్కెట్లో ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్లలో అత్యంత ప్రజాదరణ పొందిన 'టీవీఎస్ ఐక్యూబ్' కూడా ఒకటి. ఇది బేస్, ఎస్ మరియు ఎస్టీ అనే మూడు వేరియంట్లలో అందించబడుతోంది. ఈ స్కూటర్ యొక్క న్యూ జనరేషన్ మోడల్ దాని మునుపటి మోడల్స్ కంటే కూడా అద్భుతమైన పనితీరుని అందిస్తుంది. టీవీఎస్ ఐక్యూబ్ ఎస్టి వేరియంట్ ఒక ఛార్జ్ తో 145 కిమీ రేంజ్ అందిస్తుంది.

ఏథర్ 450 జెన్ 3:

దేశీయ మార్కెట్లో అత్యంత నమ్మికయిన ఏతర్ 450 ఎలక్ట్రిక్ స్కూటర్ ఇప్పుడు ఆధునిక అప్డేట్స్ తో విడుదలైంది. ఈ ఏథర్ 450 జెన్ 3 ఎలక్ట్రిక్ స్కూటర్ పెద్ద 3.7kWh బ్యాటరీ ప్యాక్‌ ను కలిగి ఉంటాయి. ఈ కొత్త బ్యాటరీ ప్యాక్ 19 కిలోల బరువును కలిగి ఉంటుంది. కావున ఇది ఒక ఫుల్ ఛార్జ్ పై గరిష్టంగా 146 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుందని కంపెనీ తెలిపింది.

టీవీఎస్ ఎన్‌టార్క్ ఎక్స్‌టీ:

భారతీయ మార్కెట్లో విడుదలైన టాప్ 5 స్కూటర్లలో టీవీఎస్ ఎన్‌టార్క్ ఒకటి. ఇది దేశీయ మార్కెట్లో అత్యధికంగా అమ్ముడైన 125 సిసి విభాగంలో ఒకటి. ఇది మంచి పనితీరుని అందించడంతో పాటు మంచి డిజైన్ మరియు ఫీచర్స్ పొందుతుంది. ఈ స్కూటర్ ధర రూ. 1.03 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). ఇందులో బ్లూటూత్ కనెక్టివిటీ, డిజిటల్ ఇన్ స్ట్రుమెంట్ కన్సోల్ వంటి లేటెస్ట్ ఫీచర్స్ అందుబాటులో ఉంటాయి.

More from DriveSpark

Article Published On: Monday, December 12, 2022, 13:42 [IST]
English summary
List of top 5 scooters launched in 2022 details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+