భారతదేశంలోకి రీ-ఎంట్రీ ఇచ్చిన ఎల్ఎంఎల్ (LML).. అయితే, ఈసారి కేవలం ఎలక్ట్రిక్ టూవీలర్లు మాత్రమే..
భారతదేశపు ఆటోమొబైల్ చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోయే బ్రాండ్ ఎల్ఎంఎల్ (LML). స్కూటర్ మార్కెట్లో ఓ వెలుగు వెలిగిన ఈ టూవీలర్ బ్రాండ్ ఇప్పుడు తిరిగి భారతదేశంలో రీ-ఎంట్రీ ఇచ్చింది. చరిత్రలో కలిసిపోయిన జావా, యెజ్డి వంటి మోటార్‌సైకిల్ బ్రాండ్లు తిరిగి మార్కెట్లోకి ప్రవేశించి విజయం సాధించినట్లుగానే, ఎల్ఎంఎల్ కూడా భారతదేశంలో తన రీ-ఎంట్రీ లక్‌ను పరీక్షించుకోవాలని నిర్ణయించుకుంది. అయితే, జావా మరియు యెజ్డి బ్రాండ్ల మాదిరిగా ట్రెడిషన్ టూవీలర్లను కాకుండా, ఎల్ఎంఎల్ ఎలక్ట్రిక్ టూవీలర్లతో రీ-ఎంట్రీ ఇచ్చింది.

ప్రారంభంలో భాగంగా, ఎల్ఎంఎల్ మూడు ఎలక్ట్రిక్ వాహనాలను ఆవిష్కరించింది. వీటిలో స్టార్ (Star), మూన్‌షాట్ (Moonshot) మరియు ఓరియన్ (Orion) బ్రాండ్లు ఉన్నాయి. వీటిలో ఎల్ఎంఎల్ స్టార్ అనేది మోడ్రన్ ఎలక్ట్రిక్ స్కూటర్ కాగా, ఎల్ఎంఎల్ మూన్‌స్టార్ ఆఫ్-రోడ్ అడ్వెంచర్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ మాదిరిగా ఉంటుంది. కాగా, ఎల్ఎంఎల్ ఓరియన్ అనేది ఎలక్ట్రిక్ సైకిల్‌గా ఉంటుంది. ఈ మూడు మోడళ్లు వచ్చే ఏడాది ద్వితీయార్థం నాటికి భారత మార్కెట్లో విక్రయానికి రానున్నాయి.

ఎల్ఎంఎల్ ఉత్పత్తులు కేవలం భారతదేశంలోనే కాకుండా యూరోపియన్ మరియు అమెరికన్ మార్కెట్‌లలో కూడా విక్రయించబడనున్నాయి. ఎల్ఎంఎల్ తమ పాత స్టార్ స్కూటర్ నేమ్ ప్లేట్‌ను తిరిగి తమ అధునాతన 2023 ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం ఉపయోగించనుంది. గతంలో కంపెనీ ఎల్ఎంఎల్ స్టార్ పేరుతో పెట్రోల్ తో నడిచే ఓ క్లాసిక్ స్కూటర్‌ను విక్రయించేది. ఇప్పుడు అదే పేరుతో ఈ అధునాతన ఎలక్ట్రిక్ స్కూటర్ ను ఎల్ఎంఎల్ రీలాంచ్ చేసేందుకు సిద్ధమైంది.

ఎల్ఎంఎల్ స్టార్ ఎలక్ట్రిక్ స్కూటర్ షార్ప్ గా కనిపించే ఫ్యూచరిస్టిక్ ఎడ్జీ డిజైన్‌ను కలిగి ఉంటుంది. దీని ఫ్రంట్ ఫాసియాపై స్టార్ కస్టమ్ టెక్స్ట్ మెసేజ్‌ను ప్రదర్శించడానికి ఉపయోగించే డిస్ప్లే ప్యానెల్‌ను కూడా ఉంటుంది. ఇతర డిజైన్ ఫీచర్లలో స్టెప్డ్ సీట్, మందపాటి గ్రాబ్ రైల్స్ మరియు మందపాటి ఫ్లోర్‌బోర్డ్ ఉన్నాయి. బహుశా ఈ ఫ్లోర్ బోర్డులేనే స్కూటర్ యొక్క బ్యాటరీ ప్యాక్ ఉంచబడుతుందని తెలుస్తోంది.

ఎల్ఎంఎల్ స్టార్ ఇ-స్కూటర్ లో ముందు వైపు టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్కులు, వెనుక వైపున మోనో-షాక్ సస్పెన్షన్ సెటప్ మరియు ఇరువైపులా డిస్క్ బ్రేక్‌లు వంటి ఫీచర్లు ఉన్నాయి. రెండు వైపులా అల్లాయ్ వీల్స్ ఉండటాన్ని కూడా మనం గమనించవచ్చు. ప్రస్తుతానికి, కంపెనీ ఈ టూవీలర్ల డిజైన్‌ను మాత్రమే వెల్లడి చేసింది. వీటిలో ఉపయోగించిన బ్యాటరీ ప్యాక్స్ మరియు ఇతర సాంకేతిక వివరాలను ఇంకా వెల్లడించలేదు. వచ్చే ఏడాది నాటికి ఎల్ఎంఎల్ ఇ-స్కూటర్ కు సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

భారత మార్కెట్ కోసం ఎల్ఎంఎల్ ధృవీకరించబడిన రెండవ ఎలక్ట్రిక్ వాహనం మూన్‌షాట్. ఇది చూడటానికి ఓ ఫన్ టూ రైడ్ అడ్వెంచర్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ మాదిరిగా కనిపిస్తుంది. ముందు వైపు షార్ప్ నోస్ డిజైన్, ఎత్తుగా ఉండే ఫోర్కులు, హై సెట్ ఫాక్స్ ఫ్యూయల్ ట్యాంక్, పొడవాటి సాడిల్ మరియు బేర్ ఫ్రేమ్ డిజైన్‌తో ఇది ఓ ట్రెడిషనల్ డర్ట్ బైక్‌లా కనిపిస్తుంది. కాకపోతే, ఇది పూర్తిగా ఎలక్ట్రిక్ పవర్‌తో పనిచేస్తుంది.

ఎల్ఎంఎల్ మూన్‌షాట్ ఇ-డర్ట్ బైక్ లో ముందు వైపు బంగారు రంగులో ఉండే అప్ సైడ్ డౌన్ ఫోర్కులు మరియు వెనుక వైపున మోనో-షాక్‌తో సస్పెన్షన్, ఎక్స్‌పోజ్డ్ ట్రెల్లిస్ ఫ్రేమ్ సెటప్, డిస్క్ బ్రేక్‌లు, అల్లాయ్ వీల్స్, పోర్టబుల్ బ్యాటరీ ప్యాక్, మల్టిపుల్ రైడింగ్ మోడ్‌లు మరియు ఫ్లై-బై-వైర్ థ్రోటల్ వంటి ఫీచర్లు ఉన్నాయి. గమనించినట్లయితే, ఈ మోటార్‌సైకిల్‌కు ఇరువైపులా పెడల్స్ కూడా కూడా ఉన్నాయి. బహుశా, బ్యాటరీ ఖాలీ అయినప్పుడు దీనిని సైకిల్ మాదిరిగా తొక్కుకుంటూ వెళ్లే అవకాశం ఉంటుంది.

ఎల్ఎంఎల్ మూన్‌షాట్ ను చూస్తుంటే, ఇది చాలా తేలికైన నిర్మాణాన్ని కలిగి ఉంటుందని తెలుస్తోంది. కంపెనీ పేర్కొన్న సమాచారం ప్రకారం, మూన్‌షాట్ వేగవంతమైన 0-70 కెఎంపిహెచ్ స్ప్రింట్ సమయాన్ని కలిగి ఉంటుంది. అయితే, ఇందుకు సంబంధించిన వాస్తవ గణాంకాలను మాత్రం కంపెనీ వెల్లడించలేదు. మూన్‌షాట్ యొక్క రేంజ్ వివరాలను కూడా కంపెనీ తెలియజేయలేదు, ఇందులో పెడల్స్ ఉండటాన్ని బట్టి చూస్తుంటే, దీని రేంజ్ చాలా తక్కువగా ఉంటుందని తెలుస్తోంది.

ఇకపోతే, ఎల్ఎంఎల్ ప్రదర్శించిన మూడు ఈవీలలో చివరిది ఓరియన్ ఎలక్ట్రిక్ సైకిల్. ఎల్ఎంఎల్ ఓరియన్ ఎలక్ట్రిక్ సైకిల్ IP67-రేటెడ్ బ్యాటరీ ప్యాక్‌తో పాటు హైడ్రో-ఫార్మేడ్ 606 అల్లాయ్ ఫ్రేమ్‌ను కలిగి ఉంటుంది. ఎల్ఎంఎల్ నుండి రానున్న ఓరియన్ ఎలక్ట్రిక్ సైకిల్‌లో ప్రిడిక్టివ్ రూట్ సెన్సార్‌లను కలిగి ఉండే అంతర్నిర్మిత GPS సిస్టమ్ కూడా ఉంటుంది.

ఇక ఎల్ఎంఎల్ బ్రాండ్ విషయానికి వస్తే, ఇది మన గత కాలపు ప్రసిద్ధ భారతీయ ద్విచక్ర వాహన బ్రాండ్‌లలో ఒకటి. ఇప్పుడు ఇది పూర్తిగా ఎలక్ట్రిక్ అవతార్‌లో తిరిగి రావడం భవిష్యత్తులో మంచి కాలానికి సంకేతం అని ఆశిస్తున్నాము. ఈ కొత్త ఎల్ఎంఎల్ భవిష్యత్తు కోసం పెద్ద ప్లాన్‌లను కలిగి ఉన్నట్లు కనిపిస్తోంది మరియు దాని మొదటి మూడు ఎలక్ట్రిక్ ఉత్పత్తులు వచ్చే ఏడాది నాటికి అందుబాటులోకి రానున్నాయి, ఇవి అన్ని చోట్లా కొనుగోలుదారుల దృష్టిని ఆకర్షించేంత విభిన్నంగా ఉన్నాయని మాత్రం చెప్పవచ్చు.

ఒకప్పుడు ఎల్ఎంఎల్ అందించిన స్కూటర్లు 1990 దశాబ్ధంలోని ఆటోమేటిక్ స్కూటర్ల యుగంలో విశేష ప్రజాదరణ పొందాయి. అయితే, ఆ తర్వాతి కాలంలో పెరిగిన పోటీ వలన నష్టాలు రావడంతో 1999లో కంపెనీ తన కార్యకలాపాలు మూసేసింది. ఇప్పుడు తన ప్రత్యర్థి బజాజ్ సంస్థ చేతక్ఎలక్ట్రిక్ వాహనాల రంగంలోకి ప్రవేశించి విజయం కావడంతో, ఎల్ఎంఎల్ కూడా తన లక్ ను చెక్ చేసుకునేందుకు సిద్ధమైంది.

ఎల్ఎంఎల్ చరిత్రను ఓసారి తిరగేస్తే, ఈ బ్రాండ్ 1972 నుంచి ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ కేంద్రంగా వాహనాల ఉత్పత్తి ప్రారంభించింది. ఆ సమయంలో కంపెనీ స్కూటర్లు, మోటార్‌సైకిళ్లు, మోపెడ్ వాహనాలతో పాటు వాటి విడిభాగాలు, ఉపకరణాలను తయారు చేసింది. ఆ తర్వాత 1983లో ఇటలీకి చెందిన పియాజియో వెస్పాతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. పియాజియో సహకారంతో 100 సీసీ స్కూటర్ల ఉత్పత్తిని ప్రారంభించింది. అయితే, 1999లో పియాజియోతో ఎల్ఎంఎల్ భాగస్వామ్యం వీగిపోయింది, అప్పటి నుండి ఎల్ఎంఎల్ పతనం కూడా ప్రారంభమైంది. నష్టాల బాట పట్టిన ఎల్ఎంఎల్ 2006లో కంపెనీ పూర్తిగా మూసేసింది.


Click it and Unblock the Notifications








