రేస్ ట్రాక్‌లపై మా బైక్‌లు పనిచేయవా..? అయితే ఓసారి Continental GT-R650 రేస్ బైక్‌ నడిపి చూడండి!

ఐకానిక్ మోటార్‌సైకిల్ బ్రాండ్ రాయల్ ఎన్‌ఫీల్డ్ (Royal Enfield) గురించి మోటారిస్టులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. దాదాపు 120 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన ఈ క్లాసిక్ మోటార్‌సైకిల్ బ్రాండ్, తాము తయారు చేసే ద్విచక్ర వాహనాలు కేవలం స్టేటస్ సింబల్‌కి మాత్రమే కాదు, మోటార్‌స్పోర్ట్ లలో కూడా అగ్రస్థానంలో రాణించగలవని నిరూపించాయి. నిజానికి మోటార్‌స్పోర్ట్ ప్రపంచానికి రాయల్ ఎన్‌ఫీల్డ్ బ్రాండ్ కొత్తదేమీ కాదు. ఎన్నో దశాబ్ధాల క్రితమే ఈ ఐకానిక్ టూవీలర్ బ్రాండ్ తయారు చేసిన మోటార్‌సైకిళ్లు వివిధ ఫార్మాట్లలో వందల కొద్దీ రేసులను గెలుచుకుని, పోడియంలో మొదటి స్థానంలో నిలిచాయి.

రేస్ ట్రాక్‌లపై మా బైక్‌లు పనిచేయవా..? అయితే ఓసారి Continental GT-R650 రేస్ బైక్‌ నడిపి చూడండి!

ఆన్-రోడ్ అయినా సరే లేదా ఆఫ్-రోడ్ అయినా ఎక్కడా తగ్గేదేలే అని నిరూపించాయి రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ మోటార్‌సైకిళ్లు. నేటి ఆధునిక బైక్‌ల మాదిరిగా స్పోర్టీ డిజైన్ లేదు మరియు అత్యాధునిక టెక్నాలజీ ఫీచర్లు అంతకన్నా లేవు. అయినా సరే, రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్‌సైకిళ్లు మాత్రం చాలా కాలంగా మోటార్‌స్పోర్ట్ రంగంలో రాణిస్తూ ఉన్నాయి మరియు నేటికీ ఆధునిక స్పోర్ట్స్ బైక్‌లకు గట్టి పోటీ ఇస్తున్నాయి. భారతదేశంలో కూడా, వందలాది మంది ఔత్సాహికులు ప్రైవేట్‌గా వివిధ వ్యక్తిగత ఈవెంట్‌లలో రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్‌సైకిళ్లతో రేస్ చేశారు. ఇందులో డ్రాగ్ రేసింగ్ మరియు ర్యాలీలు కూడా ఉన్నాయి.

రేస్ ట్రాక్‌లపై మా బైక్‌లు పనిచేయవా..? అయితే ఓసారి Continental GT-R650 రేస్ బైక్‌ నడిపి చూడండి!

డ్రాగ్ రేసింగ్ మరియు బైక్ ర్యాలీలలో రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్‌సైకిళ్లు తమ సత్తా ఏంటో చూపినప్పటికీ, ఈ బ్రాండ్ మోటార్‌సైకిళ్లను మాత్రం ఒరిజినల్ రేస్ ట్రాక్‌లపై తీసుకెళ్లే ప్రయత్నాలు తప్ప మరేమీ జరగలేదు. సరైన ఏరోడైనమిక్ డిజైన్ లేని కారణంగా రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్‌సైకిళ్లు ఇప్పటి వరకు సర్క్యూట్ రేసింగ్‌కు సరైన ఆప్షన్ గా పరిగణించబడలేదు. అయితే, రాయల్ ఎన్‌ఫీల్డ్ మాత్రం తమ మోటార్‌సైకిళ్లు రోడ్డుపై కానీ లేదా సర్క్యూట్ పై కానీ ఎక్కడైనా సరే భేషుగ్గా ఉంటాయని నిరూపించేందుకు, ఈ బ్రాండ్ 2021 లో జిటి కప్ (Royal Enfield GT Cup) ను పరిచయం చేసింది.

రేస్ ట్రాక్‌లపై మా బైక్‌లు పనిచేయవా..? అయితే ఓసారి Continental GT-R650 రేస్ బైక్‌ నడిపి చూడండి!

ఈ రాయల్ ఎన్‌ఫీల్డ్ జిటి కప్ ద్వారా తమ మోటార్‌సైకిళ్లు రేస్ ట్రాక్ కు ఏమాత్రం తీసిపోవని కంపెనీ నిరూపించింది. ఇప్పటివరకూ ఈ బ్రాండ్ బైక్‌లు రేస్ ట్రాక్‌లపై పనికిరావని మోటారిస్టుల మనస్సులో పాతుకుపోయిన అభిప్రాయాన్ని ఈ జిటి కప్‌ ద్వారా రాయల్ ఎన్‌ఫీల్డ్ మార్చి వేసింది. జిటి కప్‌తో రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్‌స్పోర్ట్‌కి తిరిగి రావడం మరియు భారతీయ మోటార్‌స్పోర్ట్ రంగానికి కొత్త రెట్రో రేసింగ్ ఫార్మాట్ ను పరిచయం చేయడం నిజంగా గర్వించదగిన విషయం.

కోయంబత్తూర్‌లోని కారీ మోటార్ స్పీడ్‌వేలో నిర్వహించిన 2021 జిటి కప్ చివరి రేసును చూసేందుకు నిర్వాహకులు మా డ్రైవ్‌స్పార్క్ బృందాన్ని ఆహ్వానించారు. ఈ సందర్భంగా మేము కాంటినెంటల్ జిటి650 (Continental GT650) బైక్ ఆధారంగా తయారు చేసిన రేస్ మోటార్‌సైకిల్ రాయల్ ఎన్‌ఫీల్డ్ కాంటినెంటల్ జిటి-ఆర్650 (Royal Enfield Continental GT-R650) ని రేస్ ట్రాక్‌పై నడిపే అవకాశాన్ని పొందాము. మరి ఈ జిటి కప్ గురించి, అలాగే ఈ రేస్ బైక్ జిటి-ఆర్650 గురించిన మరిన్ని విశేషాలను ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

రేస్ ట్రాక్‌లపై మా బైక్‌లు పనిచేయవా..? అయితే ఓసారి Continental GT-R650 రేస్ బైక్‌ నడిపి చూడండి!

రాయల్ ఎన్‌ఫీల్డ్ జిటి కప్ (The Royal Enfield GT Cup)

ముందుగా, రాయల్ ఎన్‌ఫీల్డ్ జిటి కప్ అంటే ఏంటి, అదెలా ప్రారంభమైందో తెలుసుకుందాం. జిటి కప్ గురించి సింపుల్‌గా చెప్పాలంటే, ఇది భారతదేశంలో రాయల్ ఎన్‌ఫీల్డ్ బ్రాండ్ నుండి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సర్క్యూట్ రేసింగ్ అనొచ్చు. ఇది ప్రతి సీజన్‌లో అనేక రౌండ్ల రేసింగ్‌లతో కూడిన వన్-మేక్ సిరీస్ లాంటిది. జిటి కప్ అనేది దేశంలో మోటార్‌సైకిల్ రేసింగ్‌ను ప్రోత్సహించే ఓ ప్రత్యేకమైన మోటార్‌స్పోర్ట్ ఈవెంట్. రాయల్ ఎన్‌ఫీల్డ్ బ్రాండ్ ప్రకారం, ఈ ప్రత్యేకమైన జిటి కప్ సిరీస్ 1960 కాలం నాటి స్వచ్ఛమైన రేసింగ్ సంస్కృతి నుండి ప్రేరణ పొందింది. ఇందులో మోటార్‌సైకిల్‌తో రేసింగ్ చేయడం ఓ మంచి పాత కాలపు అనుభూతిని కలిగిస్తుంది మరియు రేసులో ఒక క్లాసిక్ మోటార్‌సైకిల్‌ను నడిపిన అనుభవాన్ని అందిస్తుంది.

రేస్ ట్రాక్‌లపై మా బైక్‌లు పనిచేయవా..? అయితే ఓసారి Continental GT-R650 రేస్ బైక్‌ నడిపి చూడండి!

మరి రాయల్ ఎన్‌ఫీల్డ్ జిటి కప్‌లో పాల్గొనాలంటే ఏదైనా ముందస్తు అనుభవం కావాలా అంటే, అవుననే సమాధానమిస్తున్నారు నిర్వాహకులు. ఈ రాయల్ ఎన్‌ఫీల్డ్ జిటి కప్‌లో భాగం కావడానికి అవసరమైన ఏకైక ప్రమాణం ఏమిటంటే, ఇందులో పాల్గొనబోయే రైడర్ ఏదైనా సర్క్యూట్ రేస్ ఈవెంట్‌లో ముందుగా పాల్గొన్న రికార్డులను కలిగి ఉండాలి. అలాకాని పక్షంలో, సదరు రైడర్ తప్పనిసరిగా భారతదేశంలోని ఏదైనా మోటార్‌సైకిల్ రేసింగ్ స్కూల్ నుండి శిక్షణ పొందిన సర్టిఫికేట్ అయినా కలిగి ఉండాలి. ఈ రెండిటిలో ఏదైనా ఒకదానిని కలిగి ఉన్న రైడర్లు మాత్రమే ఈ జిటి కప్‌లో పాల్గొనేందుకు అర్హత కలిగి ఉంటారు.

రేస్ ట్రాక్‌లపై మా బైక్‌లు పనిచేయవా..? అయితే ఓసారి Continental GT-R650 రేస్ బైక్‌ నడిపి చూడండి!

జిటి కప్‌లో పాల్గొనేందుకు అర్హత కలిగిన రైడర్లు రాయల్ ఎన్‌ఫీల్డ్ వెబ్‌సైట్‌ ద్వారా ఇందులో పాల్గొనేందుకు తమ వివరాలను నమోదు చేసుకోవచ్చు. ఇలా రిజిస్టర్ చేసుకున్న వారిలో అర్హులైన రైడర్లను సెలక్ట్ చేయడం కోసం కరీ మోటార్ స్పీడ్‌వే వద్ద సెలక్షన్ రౌండ్‌కు ఆహ్వానాలను పంపిస్తారు. ఒక నిర్దిష్ట సీజన్‌లో జిటి కప్‌లోని అనేక రౌండ్‌లలో జరగబోయే రేసులో పాల్గొనడానికి టాప్ 18 ఫాస్టెస్ట్ రైడర్‌లను మాత్రమే ఎంపిక చేయబడతారు. అంతేకాదు, ఇలా ఎంపిక చేయబడిన రైడర్లకు రాయల్ ఎన్‌ఫీల్డ్ ఒక రోజు శిక్షణా కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తుంది, ఇది వారికి మోటార్‌సైకిల్ యొక్క లక్షణాలు మరియు ఆన్-ట్రాక్ మ్యానరిజమ్స్ నేర్పించడంలో సహాయపడుతుంది.

రేస్ ట్రాక్‌లపై మా బైక్‌లు పనిచేయవా..? అయితే ఓసారి Continental GT-R650 రేస్ బైక్‌ నడిపి చూడండి!

ఇటీవల ముగిసిన 2021 రాయల్ ఎన్‌ఫీల్డ్ జిటి కప్‌లో నాలుగు రౌండ్‌లు ఉంటాయి మరియు ప్రతి రౌండ్‌లో కూడా రెండు రేసులు ఉంటాయి. అంటే, మొత్తంగా ఎనిమిది రేసులు ఉంటాయన్నమాట. ఇందులో పాల్గొనే ప్రతి పార్టిసిపెంట్‌కు కూడా వారు ముగించిన స్థానం (ఫినిషింగ్ పాయింట్) ఆధారంగా పాయింట్లను కేటాయించడం జరుగుతుంది. ఇలా మొత్తం 4 రౌండ్లు (8 రేసులు) ముగిసే సమయం నాటికి ఎవరైతే అత్యధిక పాయింట్లను సాధిస్తారో, వారే ఛాంపియన్‌గా నిలుస్తారు. ఈ 2021 సీజన్‌లో ప్రసిద్ధ మోటార్‌సైకిల్ రేసర్ అనీష్ దామోదరన్ శెట్టి రాయల్ ఎన్‌ఫీల్డ్ జిటి కప్ 2021 సీజన్ ఛాంపియన్‌గా నిలిచాడు.

రేస్ ట్రాక్‌లపై మా బైక్‌లు పనిచేయవా..? అయితే ఓసారి Continental GT-R650 రేస్ బైక్‌ నడిపి చూడండి!

ఈ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొన్న ఇతర 17 మంది రైడర్‌లు కూడా చాలా ప్రతిభావంతులు. ఏదేమైనప్పటికీ, రేసులో విజయం ఒక్కరినే వరిస్తుంది కాబట్టి, ఆ విజయం అనీష్ దామోదరన్ శెట్టికి దక్కింది. మోటార్‌సైకిల్ రేస్ అంటే కేవలం మగవాళ్లకు మాత్రమే అనే భావనను తొలగించారు లాని జెనా ఫెర్నాండెజ్. ఈ రాయల్ ఎన్‌ఫీల్డ్ జిటి కప్‌కు అర్హత సాధించిన ఏకైక మహిళగా భారత్‌లో లాని జెనా ఫెర్నాండెజ్ గురించి ఈ సందర్భంగా ప్రత్యేకంగా ప్రస్తావించాలి. జిటి కప్‌లో జరిగే రేసును కళ్లారా చూడటం మరియు అందులోని మోటార్‌సైకిళ్లు చేసే ఎగ్జాస్ట్ నోట్ (సైలెన్సర్ శబ్ధం)ను వినడం నిజంగా ఒక అద్భుతమైన అనుభూతి.

రేస్ ట్రాక్‌లపై మా బైక్‌లు పనిచేయవా..? అయితే ఓసారి Continental GT-R650 రేస్ బైక్‌ నడిపి చూడండి!

రాయల్ ఎన్‌ఫీల్డ్ జిటి-ఆర్650 (Royal Enfield Continental GT-R650)

ఇది వరకు చెప్పుకున్నట్లుగా రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్‌సైకిళ్లకు సరైన రేసింగ్ ఏరోడైనమిక్స్ (ట్రాక్‌పై రేసింగ్‌కు అవసరమయ్యే బాడీ డిజైన్) లేని కారణంగా రేస్ ట్రాక్‌లపై నడిపేందుకు మోటారిస్టులు వీటిని పరిగణలోకి తీసుకోవట్లేదు. అయితే, ఈ అభిప్రాయాన్ని మార్చేందుకు మరియు రేస్ ట్రాక్ లపై తమ బ్రాండ్ సత్తా ఏంటో చూపేందుకు రాయల్ ఎన్‌ఫీల్డ్ ఓ అద్భుతమైన ట్రాక్ వెర్షన్ రేస్ మోటార్‌సైకిల్‌ను తయారు చేసింది. దాని పేరే "రాయల్ ఎన్‌ఫీల్డ్ జిటి-ఆర్650" (Royal Enfield Continental GT-R650).

రేస్ ట్రాక్‌లపై మా బైక్‌లు పనిచేయవా..? అయితే ఓసారి Continental GT-R650 రేస్ బైక్‌ నడిపి చూడండి!

ఈ ప్రత్యేకమైన రేస్ బైక్‌ను కంపెనీ ప్రస్తుతం విక్రయిస్తున్న పాపులర్ 650సిసి మోటార్‌సైకిల్ కాంటినెంటల్ జిటి650 (Continental GT650) ని ఆధారంగా చేసుకొని, అందులో కొద్దిపాటి మార్పులు చేర్పులు చేసి ఈ రేస్ బైక్‌ను తయారు చేసింది. ట్రెడిషనల్ మోటార్‌స్పోర్ట్ రేసులలో రైడర్లు వివిధ బ్రాండ్లకు చెందిన స్పోర్ట్స్ బైక్‌లను ఉపయోగిస్తుంటారు. కానీ, రాయల్ ఎన్‌ఫీల్డ్ జిటి కప్ మాత్రం ఒక వన్-మేక్ సిరీస్. అంటే, ఇందులో ఒకే బ్రాండ్ మరియు ఒకే మోడల్‌కి చెందిన వాహనాలను మాత్రమే ఉపయోగిస్తారు. కాబట్టి, ఇందుకోసం రాయల్ ఎన్‌ఫీల్డ్ ఒక ప్రత్యేకమైన రేస్ మోటార్‌సైకిల్‌ను అభివృద్ధి చేయాల్సి వచ్చింది. అందుకోసం చక్కటి ఆప్షన్‌గా రాయల్ ఎన్‌ఫీల్డ్ తమ కాంటినెంటల్ జిటి650 బైక్‌ను ఎంచుకుంది.

రేస్ ట్రాక్‌లపై మా బైక్‌లు పనిచేయవా..? అయితే ఓసారి Continental GT-R650 రేస్ బైక్‌ నడిపి చూడండి!

మరి రాయల్ ఎన్‌ఫీల్డ్ ఎందుకు ఖచ్చితంగా ఈ జిటి650 మోడల్‌నే రేస్ ట్రాక్ బైక్‌గా ఎంచుకుంది? ఈ విషయం తెలియాలంటే, కాస్తంత చరిత్ర పుటల్లోకి వెళ్లాల్సి ఉంటుంది. జిటి650 ఈ తరానికి సరికొత్త బైక్ కావచ్చు, కానీ రాయల్ ఎన్‌ఫీల్డ్ తన బ్రాండ్ చరిత్రలో ఉత్పత్తి చేసిన అత్యంత విజయవంతమైన రేసింగ్ మోటార్‌సైకిళ్లలో కాంటినెంటల్ జిటి ఒకటి. దశాబ్దాలుగా, ఈ బ్రాండ్ కాంటినెంటల్ జిటి మోడల్‌ను వివిధ రకాల ఇంజన్ సామర్థ్యాలు మరియు పనితీరు గణాంకాల (ఇంజన్ పెర్ఫార్మెన్స్ ఫిగర్స్)తో ఉత్పత్తి చేస్తూ వచ్చింది.

రేస్ ట్రాక్‌లపై మా బైక్‌లు పనిచేయవా..? అయితే ఓసారి Continental GT-R650 రేస్ బైక్‌ నడిపి చూడండి!

కాంటినెంటల్ జిటి ఒక కేఫ్ రేసర్ స్టైల్ మోటార్‌సైల్. ఈ బ్రాండ్ 1950 మరియు 1960 కాలంలో రోడ్లపై వేగంగా వెళ్లేలా రైడర్లు సవరించిన మోడిఫైడ్ మోటార్‌సైకిళ్ల నుండి ప్రేరణ పొంది తయారు చేయబడిన మోటార్‌సైకిల్. కాంటినెంటల్ జిటి కేఫ్ రేసర్ స్టైల్ బైక్ కావడంతో ఇది ఎల్లప్పుడూ రియర్ సెట్ ఫుట్‌పెగ్‌లు, లో-సెట్ క్లిప్-ఆన్ హ్యాండిల్‌బార్లు మరియు పవర్‌ఫుల్ ఇంజన్‌ను కలిగి ఉంటుంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ 2018 సంవత్సరంలో తమ గేమ్ ఛేంజర్ మోడళ్లయిన ఇంటర్‌సెప్టర్ 650 (Interceptor 650) మరియు కాంటినెంటల్ జిటి650 (Continental GT650) మోడళ్లను భారతీయ రైడర్లకు పరిచయం చేసింది.

రేస్ ట్రాక్‌లపై మా బైక్‌లు పనిచేయవా..? అయితే ఓసారి Continental GT-R650 రేస్ బైక్‌ నడిపి చూడండి!

కొత్త తరం కోసం కొత్తగా వచ్చిన ఈ మోటార్‌సైకిళ్లు ప్రతి అంశంలోనూ సరికొత్తగా ఉన్నాయి మరియు అద్భుతమైన ఇంజన్‌ను కలిగి ఉన్నాయి. ఈ రెండింటిలో రాయల్ ఎన్‌ఫీల్డ్ కాంటినెంటల్ జిటి650 పైన పేర్కొన్న కేఫే రేసర్ లక్షణాలను సంపూర్ణంగా కలిగి ఉంటుంది. ఇదొక ఫన్ టూ రైడ్ క్లాసిక్ మోటార్‌సైకిల్. ఈ బైక్‌ను మేము 2018లో నడిపినప్పుడు, అది మమ్మల్ని ఎంతగానో ఆకట్టుకుంది, ప్రత్యేకించి దాని బరువు 198 కిలోగ్రాములు ఉన్నప్పటికీ, కార్నరింగ్స్‌లో అది మంచి పనితీరును కనబరించింది. ఈ ప్రధాన లక్షణమే ఇప్పుడు రాయల్ ఎన్‌ఫీల్డ్ బ్రాండ్ కాంటినెంటల్ జిటి650 మోడల్‌ని తమ జిటి కప్ కోసం పరిగణించేలా చేసింది.

రేస్ ట్రాక్‌లపై మా బైక్‌లు పనిచేయవా..? అయితే ఓసారి Continental GT-R650 రేస్ బైక్‌ నడిపి చూడండి!

ఎటువంటి ఎలక్ట్రానిక్స్ లేని మోటార్‌సైకిల్‌ను కలిగి ఉండటమే ఈ జిటి కప్ యొక్క ప్రధాన లక్ష్యం మరియు దీని ద్వారా కంపెనీ స్వచ్ఛమైన రెట్రో రేసింగ్ అనుభవాన్ని అందించాలని భావించింది. అందుకే, జిటి కప్ కోసం రాయల్ ఎన్‌ఫీల్డ్ తమ స్టాక్ వెర్షన్ కాంటినెంటల్ జిటి650 మోటార్‌సైకిల్‌లో కొన్ని ముఖ్యమైన మార్పులను చేసింది. ఆ మార్పులు చేర్పులు ఏంటో చూద్దాం రండి.

రేస్ ట్రాక్‌లపై మా బైక్‌లు పనిచేయవా..? అయితే ఓసారి Continental GT-R650 రేస్ బైక్‌ నడిపి చూడండి!

రాయల్ ఎన్‌ఫీల్డ్ జిటి-ఆర్650 డిజైన్ మరియు స్టైల్ (GT-R650 Design & Style)

రాయల్ ఎన్‌ఫీల్డ్ జిటి-ఆర్650 మోటార్‌సైకిల్‌ను మొదటిసారిగా చూసిన వారికి ఇదేదో పూర్తిగా స్క్రాచ్ నుంచి అభివృద్ధి చేసిన రెట్రో క్లాసిక్ రేసింగ్ మోటార్‌‌సైకిల్‌గా అనిపిస్తుంది. కానీ, నిజానికి ఈ మోటార్‌సైకిల్‌కు కొన్ని డిజైన్ ఎలిమెంట్స్ మాత్రమే జోడించబడ్డాయి. ఇందులో మొదటిది మరియు ప్రధానమైది మోటార్‌సైకిల్ ముందు భాగంలో అమర్చిన రేస్ ఫెయిరింగ్ (హెడ్‌లైట్ డోమ్). ఇది 1950 మరియు 1960 కాలం నాటి అనేక యూరోపియన్ రేస్ మోటార్‌సైకిళ్లను తలపించేలా ఉంటుంది. ఇది చాలా సింపుల్ ఫీచరే అయినప్పటికీ ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఇందులో పాత కాలపు రేసింగ్ అనుభూతులను గుర్తుకు తెచ్చే అంశం ఏదైనా ఉందంటే, అది ఈ ఫ్రంట్ ఫెయిరింగ్ మరియు దాని పైన ఉంచిన బబుల్ వైజర్ అని చెప్పొచ్చు.

రేస్ ట్రాక్‌లపై మా బైక్‌లు పనిచేయవా..? అయితే ఓసారి Continental GT-R650 రేస్ బైక్‌ నడిపి చూడండి!

జిటి-ఆర్650 రేస్ బైక్‌లో మరొక ప్రధానమైన డిజైన్ మార్పు దాని ఇంజన్ క్రింది భాగంలో అమర్చిన బాడీ ప్యానెల్ (దీనినే బెల్లీ పాన్ అని కూడా అంటారు). రేస్ వినియోగానికి ఈ బెల్లీ పాన్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే, రేసు మధ్యలో ఇంజన్ ఫెయిల్ అయినప్పుడు ఇంజన్ ఆయిల్‌లో ఎక్కువ భాగం ట్రాక్ పై పడకుండా ఉండేందుకు ఇది సహకరిస్తుంది. అంతేకాకుండా, ఈ బెల్లీ పాన్ డిజైన్ పరంగా కూడా దీనికి మరింత రెట్రో లుక్‌ని తెచ్చిపెడుతుంది.

రేస్ ట్రాక్‌లపై మా బైక్‌లు పనిచేయవా..? అయితే ఓసారి Continental GT-R650 రేస్ బైక్‌ నడిపి చూడండి!

ఇకపోతే, GT-R650లో ఉపయోగించిన సీటు మరియు దాని వెనుక కౌలింగ్ (రియర్ ప్యానెల్) రెండు కూడా కొత్తవేమీ కాదు. వాస్తవానికి, వీటిని సాధారణ రాయల్ ఎన్‌ఫీల్డ్ రైడర్లు కూడా ఈ బ్రాండ్ యొక్క మేక్ ఇట్ యువర్స్ ప్రోగ్రామ్ ద్వారా యాక్ససరీస్ రూపంలో కొనుగోలు చేయవచ్చు. దీని ధర సుమారు రూ.3,300 ఉంటుంది.

రేస్ ట్రాక్‌లపై మా బైక్‌లు పనిచేయవా..? అయితే ఓసారి Continental GT-R650 రేస్ బైక్‌ నడిపి చూడండి!

కాంటినెంటల్ జిటి-ఆర్650 కేవలం రేస్ ట్రాక్ ప్రయోజనం మరియు పగటిపూట రేస్‌ల కోసం మాత్రమే తయారు చేసిన మోడిఫైడ్ మోటార్‌సైకిల్ కాబట్టి, కంపెనీ ఇందులో హెడ్‌ల్యాంప్, టెయిల్ ల్యాంప్, టర్న్ ఇండికేటర్స్ మరియు సైడ్ మిర్రర్లను తొలగించింది. ఈ బైక్‍‌లో ఉపయోగించిన పారలల్-ట్విన్ ఇంజన్ కూడా బైక్ స్టైలింగ్‌ను పెంచడంలో దోహదపడుతుంది. ఎయిర్-కూలింగ్ రెక్కలతో కూడిన పెద్ద సిలిండర్లు, అందమైన ఇంజన్ కేసింగ్‌తో కలిపి రెట్రో డిజైన్‌కు మరింత అదనపు ఆకర్షణను జోడిస్తుంది.

రేస్ ట్రాక్‌లపై మా బైక్‌లు పనిచేయవా..? అయితే ఓసారి Continental GT-R650 రేస్ బైక్‌ నడిపి చూడండి!

రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇంజన్లు ఈ రేస్ బైక్‌లో కాంటినెంటల్ జిటి650 యొక్క స్టాక్ ఎగ్జాస్ట్‌ను తొలగించి స్టెయిన్‌లెస్ స్టీల్‌తో తయారు చేసిన ఫుల్ ఎగ్జాస్ట్ సిస్టమ్‌ను భర్తీ చేశారు. ట్విన్ ఎగ్జాస్ట్ (రెండు సైలెన్సర్లతో) ఇది చాలా అద్భుతంగా కనిపిస్తుంది మరియు స్టాక్ వెర్షన్ సౌండ్ కన్నా మెరుగ్గా వినిపిస్తుంది.

రేస్ ట్రాక్‌లపై మా బైక్‌లు పనిచేయవా..? అయితే ఓసారి Continental GT-R650 రేస్ బైక్‌ నడిపి చూడండి!

జిటి-ఆర్650 ఇంజన్ పెర్ఫార్మెన్స్ మరియు రైడింగ్ ఇంప్రెషన్స్ (GT-R650 Engine Performance & Riding Impressions)

ఇక అసలైన ఘట్టం, రాయల్ ఎన్‌ఫీల్డ్ కాంటినెంటల్ జిటి-ఆర్650 రైడింగ్ అనుభవం విషయానికి వస్తే, ఈ రెట్రో క్లాసిక్ రేస్ మోటార్‌సైకిల్ ట్రాక్‌పై ఎన్నటికీ మర్చిపోలేని అనుభూతిని అందిస్తుంది. ఈ బైక్‌ని చూడగానికి ప్రధానంగా ఆకర్షించే అంశాలు దాని రెట్రో డిజైన్, క్లాసిక్ లుక్, అనలాగ్ మీటర్స్, మినిమలిస్టిక్ ఫీచర్స్ మరియు అధ్భుతమైన హ్యాండ్లింగ్.

రేస్ ట్రాక్‌లపై మా బైక్‌లు పనిచేయవా..? అయితే ఓసారి Continental GT-R650 రేస్ బైక్‌ నడిపి చూడండి!

ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న ఆధునిక రేసింగ్ మోటార్‌సైకిళ్లతో పోల్చుకుంటే, ఈ బైక్ ధర చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి, ఇందులో కూడా ధరకు తగినట్లుగానే ఫీచర్లు అందుబాటులో ఉంటాయి. అయినప్పటికీ, పెర్ఫార్మెన్స్ విషయంలో మాత్రం జిటి-ఆర్650 ఎక్కడా రాజీపడదు. దాని రైడింగ్ పొజిషన్, బ్రేకింగ్ మరియు తక్కువ-రెవ్‌లతో కూడిన ఇంజన్ అన్నీ కూడా ఆధునికమైన అనుభూతిని కలిగిస్తాయి.

రేస్ ట్రాక్‌లపై మా బైక్‌లు పనిచేయవా..? అయితే ఓసారి Continental GT-R650 రేస్ బైక్‌ నడిపి చూడండి!

జస్ట్ ఒక్క బటన్ స్టార్ట్‌తో ఇంజన్ గర్జించడం మొదలుపెడుతుంది. చాలా వరకూ ఆటోమోటివ్ సమీక్షలు 'రోర్ టు లైఫ్' అనే పదాన్ని చాలా తరచుగా గుర్తుకు తెస్తుంటాయి. జిటి-ఆర్650 విషయంలో కూడా ఇదే జరిగింది. ఇందులో మోడిఫై చేసిన ఆ స్టైలిష్ స్టెయిన్‌లెస్ స్టీల్ ఎగ్జాస్ట్ పైప్ దాని 648 సిసి పారలల్-ట్విన్ ఇంజన్ నుండి వచ్చే శబ్ధాన్ని మరింత అద్భుతంగా చేస్తుంది. ఇలాంటివి 18 రాయల్ ఎన్‌ఫీల్డ్ జిటి-ఆర్650 మోటార్‌సైకిళ్లు పూర్తి థ్రోటిల్‌లో ఒకేసారి సౌండ్ చేస్తే, ఆ అనుభూతిని మాటల్లో వర్ణించలేము. మంచి రైడింగ్ పొజిషన్ మరియు ట్రాక్‌పై మూలల వద్ద కంట్రోల్ కోసం ఇందలోని ఫుట్‌పెగ్‌లను కొద్దిగా పైకి సవరించారు.

రేస్ ట్రాక్‌లపై మా బైక్‌లు పనిచేయవా..? అయితే ఓసారి Continental GT-R650 రేస్ బైక్‌ నడిపి చూడండి!

అలాగే, మరింత మెరుగైన ఏరోడైనమిక్ రైడింగ్ పొజిషన్‌ను అనుమతించడానికి క్లిప్-ఆన్ హ్యాండిల్‌బార్లు క్రిందికి ఉంచారు. ఈ రైడింగ్ పొజిషన్‌తో ట్రాక్‌పై వేగంగా దూసుకుపోవడం చాలా సులభంగా అనిపిస్తుంది. ఇక, బైక్‌పై కూర్చొని క్లచ్ నొక్కి మొదటి గేర్ వేయగానే దాని కదలిక స్టాక్ వెర్షన్ కాంటినెంటల్ జిటి650 మాదిరిగానే అనిపిస్తుంది. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, కంపెనీ రేస్ వెర్షన్ వెర్షన్ జిటి-ఆర్650 ఇంజన్‌లో ఎలాంటి మార్పులు చేయలేదు. ఇది స్టాక్ ఇంజన్, ఇందులోని 648 సిసి పారలల్-ట్విన్ యూనిట్ గరిష్టంగా 7150 ఆర్‌పిఎమ్ వద్ద 47 బిహెచ్‌పి శక్తిని, 5250 ఆర్‌పిఎమ్ వద్ద 52 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

రేస్ ట్రాక్‌లపై మా బైక్‌లు పనిచేయవా..? అయితే ఓసారి Continental GT-R650 రేస్ బైక్‌ నడిపి చూడండి!

అయితే, ఇందులో రేస్ ఎగ్జాస్ట్‌ను ఇన్‌స్టాల్ చేయడం ద్వారా దాని పవర్ దాదాపు 5 శాతం పెరుగుతుందని , రాయల్ ఎన్‌ఫీల్డ్ చెబుతోంది. నెంబర్స్ ప్రకారం చూస్తే,ఇది కేవలం 2 బిహెచ్‌పికి సమానంగా ఉంటుంది (కాబట్టి, ఇది పెద్ద పవర్ ఇప్రూమెంట్ అని చెప్పలేం). ఈ బైక్ ట్రాన్స్‌మిషన్ (గేర్‌బాక్స్)లో కూడా ఎలాంటి మార్పులు చేయలేదు, ఇది స్టాక్ వెర్షన్ లోని అదే స్లిక్-షిఫ్టింగ్ 6-స్పీడ్ గేర్‌బాక్స్‌ను కలిగి ఉంటుంది. యాక్సిలేషన్ క్విక్‌గా ఉంటుంది మరియు బైక్ చాలా వేగంగా వెళ్తున్నట్లు అనిపిస్తుంది. ఇది రేస్ బైక్ కావడంతో, కంపెనీ ఇందులో స్పీడోమీటర్‌ను డిస్‌కనెక్ట్ చేసింది, కాబట్టి మనం ఎంత వేగంతో రైడ్ చేస్తున్నామనేది ఖచ్చితంగా తెలియదు.

రేస్ ట్రాక్‌లపై మా బైక్‌లు పనిచేయవా..? అయితే ఓసారి Continental GT-R650 రేస్ బైక్‌ నడిపి చూడండి!

అయితే, ఈ రాయల్ ఎన్‌ఫీల్డ్ బైకులు కరీ మోటార్ స్పీడ్‌వే యొక్క మెయిన్ స్ట్రెయిట్‌ (నేరుగా ఉండే ట్రాక్‌పై)పై గరిష్టంగా గంటకు 170 కిమీ కంటే ఎక్కువ వేగంతో పరుగులు తీస్తాయని కంపెనీ పేర్కొంది. ఇది నిజంగా అద్భుతమైన పనితీరుగా చెప్పుకోవచ్చు. ఈ మోటార్‌సైకిల్‌కు చేసిన మరో మార్పు తక్కువ గేర్ నిష్పత్తుల రూపంలో వస్తుంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ 650 ట్విన్స్ యొక్క స్టాక్ మోడల్‌లో ఫ్రంట్ స్ప్రాకెట్ 15-టీత్ గేర్‌ను ఉపయోగించారు.

రేస్ ట్రాక్‌లపై మా బైక్‌లు పనిచేయవా..? అయితే ఓసారి Continental GT-R650 రేస్ బైక్‌ నడిపి చూడండి!

అయితే, జిటి-ఆర్650లో మాత్రం 14-టీత్ స్ప్రాకెట్‌ను ఉపయోగించారు. తగ్గిన ఒక టీత్ కారణంగా ఇది క్విక్ యాక్సిలేషన్ ను అందించినట్లు అనిపిస్తుంది. కాబట్టి, కరీ వంటి రేస్ సర్క్యూట్‌పై ఇందులో ఆరుకి ఆరు గేర్లను ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉపయోగించవచ్చు.

రేస్ ట్రాక్‌లపై మా బైక్‌లు పనిచేయవా..? అయితే ఓసారి Continental GT-R650 రేస్ బైక్‌ నడిపి చూడండి!

ఇక మెకానికల్స్ విషయానికి వస్తే, దీని సస్పెన్షన్ స్టాక్ మోడల్ మాదిరిగానే ఉన్నప్పటికీ, దాని అమరిక మాత్రం కాస్తం భిన్నంగా అనిపిస్తుంది. బ్రేకింగ్ విషయంలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. ముందు వైపు అదే 320 మిమీ డిస్క్ మరియు వెనుకవైపు 240 మిమీ డిస్క్ బ్రేకులు అమర్చబడి ఉంటాయి. అయితే, ఇందులో సాధారణ బ్రేక్ ఫ్లూయిడ్ స్థానంలో రేస్-రెడీ బ్రేక్ ఫ్లూయిడ్‌ను ఉపయోగించారు.

ఈ ఫ్లూయిడ్ ఎక్కువ ఉష్ణనిరోధకతను కలిగి ఉంటుంది కాబట్టి బ్రేక్ ఫేడ్‌ను తొలగించడంలో సహకరిస్తుంది. ఓవరాల్‌గా చూస్తే, రాయల్ ఎన్‌ఫీల్డ్ జిటి-ఆర్650 రేస్ బైక్‌కి మరియు స్టాక్ వెర్షన్ కాంటినెంటల్ జిటి650 చేసిన మార్పులు స్వల్పమే అయినప్పటికీ, అవి అందించే రైడింగ్ అనుభూతి మాత్రం చాలా భిన్నంగా అనిపిస్తుంది. ప్రత్యేకించి ఈ రేస్ వెర్షన్ బైక్ ఎగ్జాస్ట్ నోట్ (సైలెన్స్ సౌండ్) చాలా ఆకట్టుకుంటుంది.

More from DriveSpark

Article Published On: Thursday, March 24, 2022, 19:13 [IST]
English summary
Meet the track version royal enfield continental gt r650 and all you need to know about re gt cup
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+