Mob-ion AM1 ఎలక్ట్రిక్ స్కూటర్: ఒక్క ఛార్జ్.. 140 కిమీ రేంజ్

నేడు కేవలం ఒక్క భారతదేశంలో మాత్రమే కాకుండా యావత్ ప్రపంచం మొత్తం ఎలక్ట్రిక్ వాహన వినియోగాన్ని ఎక్కువగా ఇష్టపడుతోంది. ఈ కారణంగా ప్రపంచ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. కావున కంపెనీలు కూడా కస్టమర్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని తమ ఉత్పత్తులను కూడా ఎలక్ట్రిక్ వాహనాలను మారుస్తూ తమ ఉనికిని మరియు పరిధిని చాటుకుంటున్నాయి. ఇందులో కొత్త కంపెనీలు కూడా ఉన్నాయి.

Mob-ion AM1 ఎలక్ట్రిక్ స్కూటర్: ఒక్క ఛార్జ్.. 140 కిమీ రేంజ్

ఇప్పుడు ఫ్రెంచ్ మొబిలిటీ స్టార్టప్ Mob-ion ఇటీవల తన కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ AM1 అధికారికంగా ప్రపంచ మార్కెట్లో విడుదల చేసింది. Mob-ion AM1 ఎలక్ట్రిక్ స్కూటర్ ధర 3,582 యూరోలుగా నిర్ణయించబడింది, అంతే ఈ స్కూటర్ ధర భారతీయ కరెన్సీ ప్రకారం సుమారు రూ. 3.04 లక్షలు. ఇది దేశీయ మార్కెట్లో అందుబటులో ఉన్న చాలా ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలకంటే కూడా చాలా ఎక్కువ.

Mob-ion AM1 ఎలక్ట్రిక్ స్కూటర్: ఒక్క ఛార్జ్.. 140 కిమీ రేంజ్

Mob-ion AM1 ఎలక్ట్రిక్ స్కూటర్ అనేది హై స్పీడ్ సిటీ స్కూటర్, దీనిని సాధారణ రోడ్ల మీద మాత్రమే కాకుండా హైవేలపై కూడా చాలా సులభంగా రైడ్ చేయవచ్చు. ప్రస్తుతం, ఈ అధునాతన మరియు ఆకర్షణీయమైన స్కూటర్ ఫ్రాన్స్‌లో మాత్రమే అమ్మకానికి అందుబాటులో ఉంది.

Mob-ion AM1 ఎలక్ట్రిక్ స్కూటర్: ఒక్క ఛార్జ్.. 140 కిమీ రేంజ్

Mob-ion AM1 ఎలక్ట్రిక్ స్కూటర్ అద్భుతమైన డిజైన్ పొందుతుంది. అంతే కాకుండా ఇది 3 కిలోవాట్ పవర్ ఉత్పత్తి చేసే ఎలక్ట్రిక్ మోటార్ ద్వారా శక్తిని పొందుతుంది. దీని కోసం కంపెనీ ఈ స్కూటర్ యొక్క సీటు లోపల కంపార్ట్‌మెంట్‌లో బ్యాటరీని అమర్చింది. వాహన వినియోగదారులు దీనిని బయటకు తీసి కూడా ఛార్జ్ చేసుకోవచ్చు. కావున ఇది చాలా అనుకూలంగా ఉంటుంది.

Mob-ion AM1 ఎలక్ట్రిక్ స్కూటర్: ఒక్క ఛార్జ్.. 140 కిమీ రేంజ్

Mob-ion AM1 ఎలక్ట్రిక్ స్కూటర్ పూర్తిగా ఛార్జ్ చేయడానికి కేవలం 2 గంటల సమయం మాత్రమే పడుతుంది. అయితే ఫాస్ట్ ఛార్జర్ సహాయంతో కేవలం ఒక గంటలో పూర్తిగా ఛార్జ్ చేసుకోవచ్చు. ఇది పూర్తి ఛార్జ్‌తో 140 కిమీ పరిధిని అందిస్తుంది. అదే సమయంలో దీని యొక్క గరిష్ట వేగం గంటకు 45 కి.మీ వరకు ఉంటుంది.

Mob-ion AM1 ఎలక్ట్రిక్ స్కూటర్: ఒక్క ఛార్జ్.. 140 కిమీ రేంజ్

ఈ స్కూటర్ చూడటానికి సింపుల్ గా ఉన్నప్పటికీ చాలా అధునాతనమైనది మరియు అవసరమైన అన్ని ఫీచర్లను కలిగి ఉంటుంది. ఇందులో ఎల్ఈడి హెడ్‌లైట్లు, జిపిఎస్ ఆధారిత లొకేషన్ సిస్టమ్, రివర్స్ గేర్ మరియు యాంటీ థెఫ్ట్ సిస్టమ్ వంటివి ఉన్నాయి. స్కూటర్ కంప్యూటర్ లేదా స్మార్ట్‌ఫోన్ ద్వారా రిమోట్ షట్‌డౌన్ సదుపాయంతో కూడా వస్తుంది. మొత్తానికి వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

Mob-ion AM1 ఎలక్ట్రిక్ స్కూటర్: ఒక్క ఛార్జ్.. 140 కిమీ రేంజ్

Mob-ion AM1 ఎలక్ట్రిక్ స్కూటర్ ఆధునిక ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఇందులో డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్‌ ఉంటుంది. ఇది బ్యాటరీ లెవెల్ మరియు పరిధి వంటి వాటికి సంబంధించిన మరింత సమాచారం రైడర్ కి తెలియజేస్తుంది. ఈ స్కూటర్ బరువు కూడా చాలా తక్కువగా (92 కేజీలు) ఉంటుంది.

Mob-ion AM1 ఎలక్ట్రిక్ స్కూటర్: ఒక్క ఛార్జ్.. 140 కిమీ రేంజ్

ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ 260 కేజీల వరకు లోడ్ మోసే సామర్థ్యం కలిగి ఉంటుంది. మార్కెట్లో AM1 ఎలక్ట్రిక్ స్కూటర్ రెండు వేరియంట్లలో అందుబటులో ఉంటుంది. ఇందులో ఒకటి సింగిల్-సీటర్ ఎలక్ట్రిక్ స్కూటర్ కాగా, మరొకటి డబుల్-సీటర్ ఎలక్ట్రిక్ స్కూటర్. ఈ స్కూటర్ ఏదైనా డెలివరీ చేయడానికి చాలా అనుకూలంగా ఉంటుంది.

Mob-ion AM1 ఎలక్ట్రిక్ స్కూటర్: ఒక్క ఛార్జ్.. 140 కిమీ రేంజ్

ప్రపంచ మార్కెట్లో విడుదలైన ఈ కొత్త Mob-ion AM1 ఎలక్ట్రిక్ స్కూటర్ భారతీయ మార్కెట్లో అడుగుపెడుతుందా.. లేదా అనే విషయం ఖచ్చితంగా తెలియదు. అయితే దీని అధిక ధర కారణంగా భారత మార్కెట్లో విడుదలయ్యే అవకాశం లేదని భావిస్తున్నాము.

Most Read Articles

English summary
Mob ion launches am1 electric scooter range features details
Story first published: Monday, January 24, 2022, 19:13 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X