భారతదేశంలో నాలుగవ 'మోటో వాల్ట్' షోరూమ్ ఇప్పుడు అనంతపురంలో.. ఇందులో ఉండే బైకులు ఏవంటే?
మహావీర్ గ్రూప్ కంపెనీ అయిన 'అదీశ్వర్ ఆటో రైడ్ ఇండియా' (Adishwar Auto Ride India) తన నాల్గవ 'మోటో వాల్ట్' ఎక్స్‌క్లూజివ్ షోరూమ్‌ను ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురంలో ప్రారంభించింది. కంపెనీ ప్రారంభించిన ఈ కొత్త ఆధునిక షోరూమ్‌లో వివిధ బ్రాండ్ బైకులు మరియు యాక్ససరీస్ వంటివి అందుబాటులో ఉన్నాయి. కంపెనీ ప్రారంభించిన ఈ షోరూమ్ ఇప్పుడు భారతదేశంలో నాలుగవ షోరూమ్ కావడం విశేషం. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

గ్లోబల్ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన బైక్ బ్రాండ్స్ ఈ మోటో వాల్ట్ షోరూమ్‌లో లభిస్తాయి. ఈ కొత్త షోరూం బెంగుళూరు మరియు హైదరాబాద్ బైపాస్ సర్వీస్ రోడ్, తపోవనం, అనంతపురం వద్ద ఉంది. అయితే ఈ షోరూమ్ శ్రీ సాయినాథ్ రెడ్డి నాయకత్వంలో నిర్వహించబడుతుంది.

అనంతపురంలో ప్రారంభించబడిన ఈ కొత్త 'మోటో వాల్ట్' షోరూమ్ కింద బ్రాండ్ యొక్క సూపర్ బైకులు మరియు ఇతర వస్తువులు అన్నీ కూడా లభ్యమవుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ కొత్త షోరూమ్ అన్ని మోటరింగ్ అవసరాలకు తగిన ఒకే షాప్ అవుతుంది.

వాల్ట్ షోరూమ్ వద్ద Moto Morini మరియు ZONTES శ్రేణి సూపర్‌బైక్‌లు అందుబాటులో ఉంటాయి. అదే సమయంలో రాబోయే రోజుల్లో ప్రపంచ-స్థాయి కొత్త బ్రాండ్ బైకులు కూడా ఇక్కడ అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. మోటో వాల్ట్ ప్రస్తుతం అనంతపురంలో ప్రారభించిన కొత్త షోరూమ్‌తో సహా దేశం మొత్తమ్ మీద 23 షోరూమ్‌లను ప్రారభించాలని యోచిస్తోంది.

ఇటీవల కంపెనీ ఓల్డ్ ముంబై రోడ్, వాకదేవాడి, పూణేలో తన మొదటి షోరూమ్ ప్రారంభించింది. ఇక్కడ కూడా Moto Morini మరియు ZONTES శ్రేణి సూపర్‌బైక్‌లు అందుబాటులో ఉంటాయి. రానున్న రోజుల్లో ఈ షోరూమ్‌ల సంఖ్య పెరుగుతుంది.

అనంతపురంలో కొత్త షోరూమ్ ప్రారంభించిన సందర్భంగా అదీశ్వర్ ఆటో రైడ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ 'వికాస్ జబఖ్' మాట్లాడుతూ.. చిదంబరేశ్వరా ఆటోమోటివ్స్‌తో ఏర్పరచుకున్న అనుభందం మాకు చాలా సంతోషాన్ని కలిగిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా అత్యంత పాపులర్ బ్రాండ్ ఇప్పుడు ఒకే చోట అందుబాటులో ఉన్నాయి. ఇది భారతీయ మోటార్‌సైకిల్ ఔత్సాహికులకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఇది కస్టమర్లకు ఉత్తమమైన సర్వీస్ కూడా అందిస్తుందన్నారు.

మోటో వాల్ట్ అనేది ఆదీశ్వర్ ఆటో రైడ్ ఇండియా నుండి వచ్చిన లేటెస్ట్ వెంచర్. ఇది ఇటాలియన్ ఐకాన్ మోటో మోరిని మరియు జోంటెస్ వంటి బైకులను ఒకే చోట విక్రయించే స్టాప్ షాప్.

ఇక ఆదిశ్వర్ ఆటో రైడ్ ఇండియా విషయానికి వస్తే, ఇది 2018 లో హైదరాబాద్ లో స్థాపించబడిన కంపెనీ. ఈ ప్లాంట్ 2.5 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఈ ప్లాంట్ ప్రతి సంవత్సరం కనీసం 30,000 యూనిట్లను ఉత్పత్తి చేస్తుంది. అంతే కాకూండా.. 50 కంటే ఎక్కువ డీలర్‌షిప్ నెట్‌వర్క్‌ను కలిగి ఉంది. రానున్న రోజుల్లో దీని నెట్‌వర్క్ మరింత విస్తరించనుంది.

ప్రస్తుతం చైనా ద్విచక్ర వాహన తయారీ సంస్థ జోంటెస్ (Zontes) భారతదేశంలో తమ సరికొత్త టూవీలర్లను హైదరాబాద్ కు చెందిన ఆదీశ్వర్ ఆటో రైడ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (Adishwar Auto Ride India Pvt Ltd) తో కలిసి విడుదల చేసింది. ఇందులో 350R, 350X, GK350, 350T, మరియు 350T ADV మోటార్‌సైకిళ్లు ఉన్నాయి. వీటి ధరలు రూ. 3.15 లక్షల నుండి రూ. 3.67 లక్షల వరకు ఉన్నాయి.

ఇక మోటో మోరిని (MOTO MORINI) విషయానికి వస్తే, ఇందులో ఎక్స్-కేప్ 650 (X-Cape 650), ఎక్స్-కేప్ 650 ఎక్స్ (X-Cape 650 X), Seiemmezzo Retro Street, Seiemmezzo Scrambler అనే నాలుగు బైకులు ఉన్నాయి. వీటి ధరలు రూ. 6.89 లక్షల నుంచి రూ. 7.40 లక్షల వరకు ఉన్నాయి. ఈ బైకులన్నీ కూడా ఈ మోటో వాల్ట్ షోరూమ్‌లో అందుబాటులో ఉంటాయి.


Click it and Unblock the Notifications








