డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేని కొత్త Motovolt బైక్.. ధర రూ. 49,999 మాత్రమే

భారతీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ భారీగా ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని చాలా కంపెనీలు మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేస్తున్నాయి. ఇందులో ఎలక్ట్రిక్ కార్లు, బైకులు మరియు సైకిల్స్ కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు కలకత్తాకు చెందిన 'మోటోవోల్ట్ మొబిలిటీ' (Motovolt Mobility) ఒక కొత్త ఎలక్ట్రిక్ బైక్ లాంచ్ చేసింది. ఈ బైక్ గురించి మరింత సమాచారం ఈ కథనంలో తెలుసుకుందాం.. రండి.

డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేని కొత్త Motovolt బైక్.. ధర రూ. 49,999 మాత్రమే

మోటోవోల్ట్ మొబిలిటీ విడుదల చేసిన కొత్త ఎలక్ట్రిక్ బైక్ పేరు 'యుఆర్‌బిఎన్' (URBN). ఈ మోటోవోల్ట్ URBN బైక్ ధర రూ. 49,999 (ఎక్స్-షోరూమ్). ఈ ఎలక్ట్రిక్ బైక్ కొనాలనుకునే కస్టమర్లు కంపెనీ యొక్క వెబ్‌సైట్లో రూ. 999 చెల్లించి బుక్ చేసుకోవచ్చు. మోటోవోల్ట్ మొబిలిటీకి 100 కు పైగా డీలర్షిప్స్ ఉన్నాయి, కావున కస్టమర్లు అక్కడ కూడా బుక్ చేసుకోవచ్చు.

డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేని కొత్త Motovolt బైక్.. ధర రూ. 49,999 మాత్రమే

ఈ బైక్ కొనుగులు చేసే వారికి మరో శుభవార్త ఏమిటంటే.. దీనిని రైడింగ్ చేయడానికి ఎలాంటి డ్రైవింగ్ లైసెన్స్ మరియు రిజిస్ట్రేషన్ అవసరం లేదు. కావున లైసెన్స్ లేదనే చింత వదిలేయొచ్చు, ఈ ఎలక్ట్రిక్ బైకుతో నిశ్చింతగా రోడ్డుపైన తిరిగేయొచ్చు. ఈ బైక్ లో రిమూవబుల్ బ్యాటరీ ఉంది. ఇది ఒక ఫుల్ ఛార్జ్ తో గరిష్టంగా 120 కిమీ పరిధిని అందిస్తుంది. కావున రోజువారీ ప్రయాణానికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేని కొత్త Motovolt బైక్.. ధర రూ. 49,999 మాత్రమే

ఈ ఎలక్ట్రిక్ బైక్ చూడటానికి చాలా సింపుల్ గా ఉంటుంది. కానీ మంచి ఫీచర్స్ అందుబాటులో ఉంటాయి. ఈ బైక్ రైడింగ్ చేయటానికి అనుకూలంగా మల్టిపుల్ రైడింగ్ మోడ్స్ ఉన్నాయి. అంతే కాకండా.. పెడల్ అసిస్ట్ సెన్సార్, ఇగ్నీషన్ కీ స్విచ్ మరియు హ్యాండిల్ లాక్ వంటివి కూడా ఉన్నాయి.

డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేని కొత్త Motovolt బైక్.. ధర రూ. 49,999 మాత్రమే

ఈ ఎలక్ట్రిక్ బైక్ తక్కువ ధర వద్ద మంచి రేంజ్ అందిస్తుంది, కావున ఇది కేవలం రోజువారీ ఉపయోగానికి మాత్రమే కాకుండా జొమాటో, స్విగ్గి, జిప్ ఎలక్ట్రిక్ మొదలైన డెలివరీ సంస్థలకు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. రద్దీగా ఉన్న నగరాల్లో కూడా ఈ బైక్ ఉపయోగించడానికి అనుకూలంగా ఉంటుంది. అంతే కాకుండా కాలేజ్ స్టూడెంట్స్ కి కూడా తప్పకుండా ఉపయోగపడుతుంది.

డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేని కొత్త Motovolt బైక్.. ధర రూ. 49,999 మాత్రమే

ఈ ఎలక్ట్రిక్ బైక్ లాంచ్ సందర్భంగా కంపెనీ సీఈఓ మరియు వ్యవస్థాపకుడు తుషార్ చౌదరి మాట్లాడుతూ.. ప్రపంచం ఎలక్ట్రిక్ వాహన రంగంలో పరుగులుపెడుతోంది, ఈ సమయంలో మోటోవోల్ట్ URBN వంటి బైక్స్ తప్పకుండా వినియోగదారులకు చాలా అవసరం, ఈ కొత్త బైక్ దేశీయ మార్కెట్లో మంచి ఆదరణ పొందుతుందని ఆశిస్తున్నామన్నారు.

డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేని కొత్త Motovolt బైక్.. ధర రూ. 49,999 మాత్రమే

భారతదేశంలో రానున్న రోజుల్లో పెట్రోల్ వాహనాలు కూడా కనుమరుగయ్యే అవకాశాలు ఉన్నాయి, ఇప్పటికే చాలా కంపెనీలు డీజిల్ వాహనాలు ఉత్పత్తిని పూర్తిగా నిలిపివేస్తున్నాయి. కావున ఎలక్ట్రిక్ వాహనాలను తప్పకుండా డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉంటుంది.

డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేని కొత్త Motovolt బైక్.. ధర రూ. 49,999 మాత్రమే

ప్రస్తుతం కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎలక్ట్రిక్ వాహన వినియోగాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తోంది. దీనికోసం సబ్సిడీ వంటి వాటిని కూడా కల్పిస్తోంది. ఎలక్ట్రిక్ వాహనాలను ఎటువంటి ఛార్జింగ్ సమస్యలు ఉండకూడదని ఛార్జింగ్ సదుపాయాలను కూడా ఏర్పాటు చేయడానికి కొన్ని ప్రైవేట్ సంస్థలతో ఒప్పందాలను కుదుర్చుకుంటోంది, కావున రాబోయే రోజుల్లో ఎలక్ట్రిక్ వాహనాలు విరివిగా రోడ్డుపైన తిరగనున్నాయి.

డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేని కొత్త Motovolt బైక్.. ధర రూ. 49,999 మాత్రమే

ప్రస్తుతం మనం రైడ్ చేసే చాలా వాహనాలు తప్పకుండా డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి, లేకుంటే భారీ జరిమానాలు చెల్లించాల్సి ఉంటుంది. కానీ మోటోవోల్ట్ URBN వంటి బైక్స్ కి ఎలాంటి డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేదు. ఇది ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం.

డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేని కొత్త Motovolt బైక్.. ధర రూ. 49,999 మాత్రమే

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

ప్రస్తుతం మార్కెట్లో ఎక్కువ రేంజ్ అందించే ఎలక్ట్రిక్ బైకులు అందుబాటులో ఉన్నాయి, అయితే రోజువారీ వినియోగానికి మరియు రద్దీగా ఉండే నగరప్రయాణాలకు మోటోవోల్ట్ URBN బైకులు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. అదే సమయంలో దీని ధర కూడా తక్కువగానే ఉంటుంది, కావున ఇది మార్కెట్లో మంచి అమ్మకాలు పొందుతుందని ఆశిస్తున్నాము.దేశీయ మార్కెట్లో విడుదలయ్యే కొత్త బైకులు మరియు కార్లను గురించి ఎప్పటికప్పుడు అప్డేటెడ్ సమాచారం తెలుసుకోవడానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ చూస్తూ ఉండండి.

Most Read Articles

English summary
Motovolt mobility launched urbn electric bike at rs 49999 details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X