ఉమెన్స్ డే స్పెషల్..: మహిళా పోలీసుల కోసం 50 స్కూటర్లు అందించిన హీరో మోటోకార్ప్

మార్చి 8వ తేదీన ప్రపంచ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని (International Women's Day) పురస్కరించుకొని, భారతదేశపు అగ్రగామి టూవీలర్ బ్రాండ్ హీరో మోటోకార్ప్ (Hero MotoCorp) నాగ్‌పూర్ పోలీస్ కమిషనరేట్ (NMC) మరియు అగ్నిమాపక విభాగానికి 50 హీరో స్కూటర్లు మరియు 500 హెల్మెట్‌లను అందజేసింది. ఈ హీరో స్కూటర్‌లు అత్యవసర పరిస్థితుల్లో వేగవంతమైన సేవలను అందించడానికి పోలీసు అధికారులు మరియు అగ్నిమాపక శాఖ అధికారులకు సహాయపడతాయని కంపెనీ తెలిపింది.

ఉమెన్స్ డే స్పెషల్..: మహిళా పోలీసుల కోసం 50 స్కూటర్లు అందించిన హీరో మోటోకార్ప్

ఈ స్కూటర్లను హీరో మోటోకార్ప్ ప్రత్యేకంగా కస్టమైజ్ చేసింది. ఇవి నాగ్‌పూర్ పౌరులకు మరియు ముఖ్యంగా మహిళలకు మెరుగైన భద్రతను అందించడంలో సహాయపడతాయి. ఈ కార్యక్రమంలో కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కూడా పాల్గొన్నారు. హీరో మోటోకార్ప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, విక్రమ్ కస్బేకర్ నితిన్ గడ్కరీ సమక్షంలో పోలీస్ కమిషనరేట్ మరియు అగ్నిమాపక శాఖకు స్కూటర్లను అందజేశారు.

ఉమెన్స్ డే స్పెషల్..: మహిళా పోలీసుల కోసం 50 స్కూటర్లు అందించిన హీరో మోటోకార్ప్

ఈ సందర్భంగా కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడుతూ, అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హీరో మోటోకార్ప్ చొరవ తీసుకుని నాగ్‌పూర్ పోలీస్ మరియు అగ్నిమాపక శాఖతో భాగస్వామ్యం కలిగి ఉన్నందుకు తాము అభినందిస్తున్నామని అన్నారు. వీటి సాయంతో కార్పోరేట్ మరియు స్థానిక అధికారులు కలిసి పౌరుల భద్రతకు, ముఖ్యంగా మహిళలకు భద్రత కల్పించడానికి కలిసి పనిచేయడానికి ఇది ఒక అద్భుతమైన అవకాశం అని అన్నారు.

ఉమెన్స్ డే స్పెషల్..: మహిళా పోలీసుల కోసం 50 స్కూటర్లు అందించిన హీరో మోటోకార్ప్

హీరో మోటోకార్ప్ విషయానికి వస్తే, కంపెనీ గత నెల విక్రయాల గణాంకాలను విడుదల చేసింది. హీరో మోటోకార్ప్ విడుదల చేసిన డేటా ప్రకారం, కంపెనీ గత నెలలో మొత్తం 3,58,254 యూనిట్ల వాహనాలను విక్రయించింది. గతేడాది ఇదే కాలంలో (ఫిబ్రవరి 2021లో) కంపెనీ మొత్తం 5,05,467 యూనిట్లను విక్రయించింది. పెరిగిన పెట్రోల్ ధరలు మరియు ఎలక్ట్రిక్ వాహనాల కారణంగా హీరో మోటోకార్ప్ గత నెలలో అమ్మకాలను కోల్పోయింది.

ఉమెన్స్ డే స్పెషల్..: మహిళా పోలీసుల కోసం 50 స్కూటర్లు అందించిన హీరో మోటోకార్ప్

సమాచారం ప్రకారం, హీరో మోటోకార్ప్ ఫిబ్రవరి 2022లో మొత్తం 3,38,454 మోటార్‌సైకిళ్లను విక్రయించింది. గత ఏడాది ఫిబ్రవరిలో కంపెనీ 4,63,723 మోటార్‌సైకిళ్లను విక్రయించగా, ఈ ఏడాది ఫిబ్రవరిలో మోటార్‌సైకిళ్ల విక్రయాలు క్షీణించాయి. ఇక స్కూటర్ల విషయానికి వస్తే, ఫిబ్రవరి 2022లో స్కూటర్ల అమ్మకాలు కూడా ప్రతికూలంగా ప్రభావితం అయ్యాయి. గతేడాది ఫిబ్రవరిలో కంపెనీ 41,744 స్కూటర్లను విక్రయించగా, ఈ ఏడాది ఫిబ్రవరిలో హీరో 19,800 యూనిట్లను విక్రయించింది.

ఉమెన్స్ డే స్పెషల్..: మహిళా పోలీసుల కోసం 50 స్కూటర్లు అందించిన హీరో మోటోకార్ప్

మార్కెట్లో సరికొత్త గ్లామర్ (Hero Glamour) విడుదల

ఇదిలా ఉంటే, హీరో మోటోకార్ప్ తమ సరికొత్త హీరో గ్లామర్‌ (Hero Glamour) బైక్ ను ఇటీవలే మార్కెట్లో విడుదల చేసింది. ఇది మునుపటి కన్నా మరింత రిఫ్రెష్డ్ డిజైన్ ను మరియు లేటెస్ట్ ఫీచర్లను కలిగి ఉంటుంది. ఈ బైక్ ముందు భాగంలో ఎల్ఈడీ హెడ్‌లైట్ మరియు స్ప్లిట్ అల్లాయ్ వీల్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అంతే కాకుండా ఈ బైక్ పై చాలా చోట్ల ఉన్న యాక్సెంట్‌లు దీనికి మరింత ఆధునిక రూపాన్ని జోడిస్తాయి.

ఉమెన్స్ డే స్పెషల్..: మహిళా పోలీసుల కోసం 50 స్కూటర్లు అందించిన హీరో మోటోకార్ప్

కొత్త హీరో గ్లామర్‌ (Hero Glamour) బైక్ లో లభించే ప్రధాన ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్, ఎలక్ట్రిక్ స్టార్ట్ వంటివి ఉన్నాయి. ఈ బైక్ మంచి సస్పెన్షన్ సెటప్ మరియు బ్రేకింగ్ సెటప్ పొందుతుంది. ఈ బైక్ యొక్క ముందు భాగంలో డిస్క్ బ్రేక్‌లు మరియు వెనుక భాగంలో డ్రమ్ బ్రేక్‌లు ఉన్నాయి. ఇక ఇంజిన్ విషయానికి వస్తే, ఈ బైక్ 125 సిసి ఇంజన్‌ పొందుతుంది. ఇది 7,500 ఆర్‌పిఎమ్ వద్ద 10.7 బిహెచ్‌పి పవర్ మరియు 6,000 ఆర్‌పిఎమ్ వద్ద 10.6 ఎన్ఎమ్ టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది.

ఉమెన్స్ డే స్పెషల్..: మహిళా పోలీసుల కోసం 50 స్కూటర్లు అందించిన హీరో మోటోకార్ప్

ఈ ఇంజన్ 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. ఇది మంచి పనితీరుని అందిస్తుంది. ఈ బైక్ యొక్క ముందు మరియు వెనుక భాగంలో ట్యూబ్‌లెస్‌ టైర్లు ఉంటాయి. ఈ బైక్ యొక్క కొలతల విషయానికి వస్తే, దీని పొడవు 2051 మిమీ, వెడల్పు 720 మిమీ, ఎత్తు 1074 మిమీ, వీల్‌బేస్ 1273 మిమీ మరియు గ్రౌండ్ క్లియరెన్స్ 180 మిమీ వరకు ఉంటుంది. ఇక ఈ బైక్ యొక్క సీటు ఎత్తు 798 మిమీ వరకు ఉంటుంది. ఇందులో 10 లీటర్స్ ఫ్యూయెల్ ట్యాంక్ పొందుతుంది. ఇది డిస్క్ మరియు డ్రమ్ అనే రెండు వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది.

Article Published On: Tuesday, March 8, 2022, 17:01 [IST]
English summary
Nagpur police gets 50 hero motocorp scooters on womans day details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+