టీవీఎస్ ఎక్స్ఎల్100 మాదిరిగా కనిపించే ఎలక్ట్రిక్ మోపెడ్ విడుదల.. ధర కూడా తక్కువే!

ఈ ఫొటోలో కనిపిస్తున్న ఎలక్ట్రిక్ మోపెడ్ ను చూశారా, ఇది చూడటానికి దాదాపుగా టీవీఎస్ ఎక్స్ఎల్100 మాదిరిగా కనిపిస్తోంది కదూ! కానీ ఇదొక ఎలక్ట్రిక్ మోపెడ్. దేశంలో నిరంతరం పెరుగుతున్న పెట్రోల్ మరియు డీజిల్ ధరల నేపథ్యంలో, ప్రముఖ ఇ-మొబిలిటీ కంపెనీ నహక్ మోటార్స్ (Nahak Motors) తమ 100 శాతం మేడ్ ఇన్ ఇండియన్ ఇ-మోపెడ్ ఎగ్జిటో సోలో (Exito Solo) ను విడుదల చేసింది. మార్కెట్లో నహక్ ఎగ్జిటో సోలో ధర రూ. 85,999 (ఎక్స్-షోరూమ్) గా ఉంది.

టీవీఎస్ ఎక్స్ఎల్100 మాదిరిగా కనిపించే ఎలక్ట్రిక్ మోపెడ్ విడుదల.. ధర కూడా తక్కువే!

నహక్ ఎగ్జిటో సోలో (Nahak Exito Solo) ఇ-మోపెడ్ నిర్వహణ ఖర్చు కిలోమీటరుకు కేవలం 25 పైసలు మాత్రమే అవుతుందని నహక్ మోటార్స్ ప్రకటించింది. కంపెనీ దీనిని ఏప్రిల్ 2022 నుండి డెలివరీ చేయడం ప్రారంభిస్తుంది. నహక్ మోటార్స్ రూపొందించిన ఎగ్జిటో సోలో గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లోని అన్ని రహదారి పరిస్థితులలో ఉపయోగించేందుకు వీలుగా రూపొందించబడింది మరియు అందుకు అనుగుణంగా అభివృద్ధి చేయబడింది.

టీవీఎస్ ఎక్స్ఎల్100 మాదిరిగా కనిపించే ఎలక్ట్రిక్ మోపెడ్ విడుదల.. ధర కూడా తక్కువే!

ఎగ్జిటో సోలో ఇ-మోపెడ్ 150 కిలోల బరువును మోయగలదు. ఈ ఎలక్ట్రిక్ మోపెడ్ 48 v 30 AH బ్యాటరీ సాయంతో పనిచేస్తుంది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ బ్యాటరీని ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్, దాని సాయంతో గరిష్టంగా 80 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. ఈ బ్యాటరీ ప్యాక్ పూర్తిగా ఛార్జ్ కావడానికి కేవలం ఐదు గంటల సమయం మాత్రమే పడుతుందని మరియు దీని ఛార్జర్‌ను స్టాండర్డ్ హోమ్ పవర్ సాకెట్‌లో ప్లగ్ చేయవచ్చని కంపెనీ తెలిపింది.

టీవీఎస్ ఎక్స్ఎల్100 మాదిరిగా కనిపించే ఎలక్ట్రిక్ మోపెడ్ విడుదల.. ధర కూడా తక్కువే!

ఈ సందర్భంగా నహక్ గ్రూప్ చైర్మన్ డా. ప్రవత్ నహక్ మాట్లాడుతూ.. భవిష్యత్తులో పెట్రోల్ మరియు డీజిల్ ధరలు మరింత పెరిగే ప్రమాదం ఉందని మరియు ఇది చిన్న వ్యాపారాలను ఎక్కువగా ప్రభావితం చేసి మొబిలిటీ ఖర్చులను పెంచుతుందని అన్నారు. ఈ నేపథ్యంలో, చిరు వ్యాపారస్థులకు చవకైన మరియు పర్యావరణ సాన్నిహిత్యమైన ఇ-మొబిలిటీ సొల్యూషన్ ను అందించాలనే ఉద్దేశ్యంతో తాము ఎగ్జిటో సోలోను ప్రారంభించామని ఆయన చెప్పారు.

టీవీఎస్ ఎక్స్ఎల్100 మాదిరిగా కనిపించే ఎలక్ట్రిక్ మోపెడ్ విడుదల.. ధర కూడా తక్కువే!

నహక్ ఎగ్జిటో సోలో ఇ-మోపెడ్ పూర్తిగా నూటికి నూరు శాతం భారతదేశంలో తయారు చేయబడిన మరియు అభివృద్ధి చేయబడిన మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తి. ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన ఆత్మనిర్భర్ భారత్ దార్శనికతకు ఇది అనుగుణంగా ఉంటుంది. ఈ బ్రాండ్ త్వరలో భారతదేశంలోని తమ షోరూమ్‌లలో ఎగ్జిటో సోలో ఇ-మోపెడ్ ను విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. ఆసక్తిగల కస్టమర్లు తమ అధికారిక వెబ్‌సైట్ నుండి ఆన్‌లైన్‌లో ఈ ఇ-మోపెడ్ ను బుక్ చేసుకోవచ్చని ప్రవత్ నహక్ తెలిపారు.

టీవీఎస్ ఎక్స్ఎల్100 మాదిరిగా కనిపించే ఎలక్ట్రిక్ మోపెడ్ విడుదల.. ధర కూడా తక్కువే!

నహక్ మోటార్స్ (Nahak Motors) గురించి తెలుసుకుందాం రండి..

నహక్ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ (Nahak Motors Private Limited) హర్యానాలోని ఫరీదాబాద్‌లో ఉన్న ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ. నహక్ మోటార్స్ భారతదేశంలో ఇ-బైక్‌లు, ఇ-స్కూటర్లు, ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్లు మరియు ఎలక్ట్రిక్ త్రీ-వీలర్‌లతో సహా అతిపెద్ద శ్రేణి ఎలక్ట్రిక్ మొబిలిటీ సొల్యూషన్‌లను కలిగి ఉంది. ఇది పూర్తిగా 100 శాతం భారతీయ ఇ-రిక్షాలు మరియు ఇ-కార్ట్‌ల ఎఫ్‌ఆర్‌పి శ్రేణిని తయారు చేసిన ఏకైక భారతీయ కంపెనీ మరియు ఇది ప్రామాణిక ఇ-రిక్షాలు మరియు ఇ-కార్ట్‌లను కూడా తయారు చేస్తుంది.

టీవీఎస్ ఎక్స్ఎల్100 మాదిరిగా కనిపించే ఎలక్ట్రిక్ మోపెడ్ విడుదల.. ధర కూడా తక్కువే!

ప్రభుత్వ నిబంధనలు మరియు ఆదేశాల ప్రకారం, క్లయింట్ అవసరాలకు అనుగుణంగా ఈ కంపెనీ ఇ-రిక్షాలు మరియు ఇ-కార్ట్‌లను కూడా కస్టమైజ్ చేసి అందిస్తుంది. దేశంలో నహక్ మోటార్స్ డీలర్స్ మరియు డిస్ట్రిబ్యూటర్స్ యొక్క బలమైన నెట్‌వర్క్‌ను కలిగి ఉంది. దేశంలోని అన్ని ప్రాంతాలకు కంపెనీ తన నెట్‌వర్క్‌ను క్రమంగా విస్తరిస్తోంది. యునైటెడ్ కింగ్‌డమ్, నేపాల్, యుఎఇ, మారిషస్, బంగ్లాదేశ్, కెనడా మరియు జర్మనీ వంటి అంతర్జాతీయ మార్కెట్‌లకు కూడా కంపెనీ తమ ఎలక్ట్రిక్ వాహనాలను ఎగుమతి చేస్తుంది.

టీవీఎస్ ఎక్స్ఎల్100 మాదిరిగా కనిపించే ఎలక్ట్రిక్ మోపెడ్ విడుదల.. ధర కూడా తక్కువే!

నాహక్ మోటార్స్ ఫరీదాబాద్, హర్యానా మరియు ఉత్తర ప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో తయారీ, పరిశోధన మరియు అభివృద్ధి సౌకర్యాలను కూడా కలిగి ఉంది. ఈ ప్లాంట్ లోనే కంపెనీ తమ ఎలక్ట్రిక్ వాహనాల తయారు చేస్తుంది మరియు అసెంబుల్ చేస్తుంది. కంపెనీ నాణ్యమైన ఉత్పత్తులను తీసుకురావడానికి పరిశోధన మరియు అభివృద్ధి (రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్)లో కూడా భారీగా పెట్టుబడులను పెడుతుంది, ఇది వినూత్న మరియు విశ్వసనీయ ఉత్పత్తి శ్రేణి అభివృద్ధికి దారితీస్తుంది.

టీవీఎస్ ఎక్స్ఎల్100 మాదిరిగా కనిపించే ఎలక్ట్రిక్ మోపెడ్ విడుదల.. ధర కూడా తక్కువే!

నహక్ మోటార్స్ భారత ప్రభుత్వం యొక్క సామాజిక మరియు పరిపాలనా సంస్కరణల కోసం అడ్వాన్స్ సర్వీసెస్ (ASSAR) మరియు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ద్వారా నిర్వహించబడిన ఎలక్ట్రిక్ వాహనాల కోసం జాతీయ రహదారులు (#NHforEV) అనే ప్రణాళికలో భాగంగా, ద్విచక్ర వాహనాలు మరియు మూడు చక్రాల వాహనాల అధికారిక భాగస్వామి మరియు పంపిణీదారుగా కూడా ఉంది. కంపెనీ గడచిన 2020 ఆటో ఎక్స్‌పోలో భారతదేశపు మొట్టమొదటి హైస్పీడ్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ను కూడా ఆవిష్కరించింది. భారత ఈవీ పరిశ్రమలో కొత్త ప్రమాణాలను నెలకొల్పడానికి రాబోయే సంవత్సరాల్లో మరిన్ని కొత్త ఉత్పత్తులను ప్రారంభించాలని కంపెనీ యోచిస్తోంది.

More from DriveSpark

Article Published On: Friday, March 11, 2022, 10:35 [IST]
English summary
Nahak exito solo electric moped unveiled in india resembles tvs xl 100
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+