ఫుల్ చార్జ్ పై ఏకంగా 140 కిలోమీటర్ల దూరం ప్రయాణించే నియాన్ జీరో వన్ ఎలక్ట్రిక్ స్కూటర్

భారతదేశంలో గత కొన్ని నెలలుగా ఎలక్ట్రిక్ వాహనాల పట్ల డిమాండ్ పెరగడాన్ని మనం చూస్తూనే ఉన్నాం. దేశంలో ఎలక్ట్రిక్ మొబిలిటీ విప్లవం ఆటో పరిశ్రమలో బ్యాటరీతో నడిచే వాహనాలతో అనేక కొత్త బ్రాండ్ వెంచర్ల ఆగమనాన్ని చూసింది. ఈ జాబితాలో ఇప్పుడు తాజాగా నియాన్ ఎలక్ట్రిక్ (Neon Electric) సంస్థ వచ్చి చేరనుంది. ఈ కంపెనీ తమ సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ నియోన్ జీరో వన్ (Neon Zero One Electric) ప్రోటోటైప్‌ను ఆవిష్కరించింది. త్వరలోనే ఇది అందుబాటులోకి రానుంది.

ఫుల్ చార్జ్ పై ఏకంగా 140 కిలోమీటర్ల దూరం ప్రయాణించే నియాన్ జీరో వన్ ఎలక్ట్రిక్ స్కూటర్

జర్మనీకి చెందిన ఎలక్ట్రిక్ వెహికల్ (ఈవీ) స్టార్టప్ నియాన్, తమ జీరో వన్ అనే దాని మొదటి బ్యాటరీ పవర్డ్ ద్విచక్ర వాహనాన్ని పరిచయం చేసింది. ఇది కేవలం ప్రీ-ప్రొడక్షన్ ప్రోటోటైప్ కాబట్టి, ప్రీ-బుకింగ్ కోసం ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఇంకా అందుబాటులో లేదు. నియాన్ జీరో వన్ రెండు వేరియంట్‌లలో అందించబడుతుంది. ఇందులో మొదటిది L1e మరియు రెండవది L3e.మొదటి వేరియంట్ ధర 4,920 యూరోలు అంటే దాదాపు రూ. 4.20 లక్షలు కాగా, రెండవ వేరియంట్ ధర 6,420 యూరోలు అంటే దాదాపు రూ. 5.48 లక్షలు (రెండు ధరలు పన్నుతో సహా) గా ఉన్నాయి.

ఫుల్ చార్జ్ పై ఏకంగా 140 కిలోమీటర్ల దూరం ప్రయాణించే నియాన్ జీరో వన్ ఎలక్ట్రిక్ స్కూటర్

మనదేశ కరెన్సీలో ఇవి ధర పరంగా అధికంగా ఉన్నప్పటికీ, వాటి ప్రత్యేకమైన డిజైన్ మరియు ధర ట్యాగ్‌ను పరిగణనలోకి తీసుకుంటే, నియాన్ జీరో వన్ ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్‌గా స్థానం పొందుతుందని భావిస్తున్నారు. డిజైన్ పరంగా, నియాన్ జీరో వన్ యొక్క స్టైలింగ్ ఇతర సాంప్రదాయ ఇ-స్కూటర్‌ల మధ్య అతిపెద్ద వ్యత్యాసాన్ని చూపుతుంది. ఇది చాలా తక్కువ బాడీ ప్యానెల్‌లను కలిగి ఉండి, అసాధారణమైన కానీ మినిమలిస్ట్ డిజైన్ ను కలిగి ఉంటుంది.

ఫుల్ చార్జ్ పై ఏకంగా 140 కిలోమీటర్ల దూరం ప్రయాణించే నియాన్ జీరో వన్ ఎలక్ట్రిక్ స్కూటర్

దీని ఓవరాల్ డిజైన్ చాలా క్లీన్ గా మరియు సింపుల్ గా ఉంటుంది, అయితే దాని బాడీ లైన్స్ మాత్రం ఈ స్కూటర్‌ను మరింత షార్ప్ గా కనిపించేలా చేస్తాయి. దాని స్టైలింగ్ ముఖ్యాంశాలలో ప్రధానమైనది ఫ్లాట్ సింగిల్-పీస్ సీట్. ఇది కాకుండా, ఇందులో పొడవాటి మరియు ఫ్లాట్ ఫుట్‌బోర్డ్, నేక్డ్ హ్యాండిల్ బార్, ఓపెన్ రియర్ స్వింగార్మ్ మరియు విండ్‌షీల్డ్ అప్ ఫ్రంట్‌ వంటి డిజైన్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. స్టైలింగ్ యొక్క మరొక ప్రత్యేకమైన భాగం సీటు కింది భాగంలో అమర్చిన సొగసైన టెయిల్ లైట్.

ఫుల్ చార్జ్ పై ఏకంగా 140 కిలోమీటర్ల దూరం ప్రయాణించే నియాన్ జీరో వన్ ఎలక్ట్రిక్ స్కూటర్

ముందు వైపు విండ్‌షీల్డ్‌పై అమర్చబడిన దీర్ఘచతురస్రాకార సింగిల్ బార్ ఎల్ఈడి హెడ్‌లైట్, మందపాటి ఫ్లోర్‌బోర్డ్‌లో అమర్చిన బ్యాటరీ ప్యాక్ స్కూటర్‌కు చాలా తక్కువ గురుత్వాకర్షణ కేంద్రాన్ని ఇస్తుంది. ఫలితంగా, ఇది మంచి రైడ్ స్థిరత్వాన్ని అనువదిస్తుంది. బ్యాటరీ ప్యాక్ విషయానికి వస్తే, నియాన్ జీరో వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ లో తొలగించగల 2.4 kWh లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. దీనిని ఒక్కసారి పూర్తిగా చార్జ్ చేస్తే, గరిష్టంగా 70 కిమీల రేంజ్ ను పొందవచ్చు.

ఫుల్ చార్జ్ పై ఏకంగా 140 కిలోమీటర్ల దూరం ప్రయాణించే నియాన్ జీరో వన్ ఎలక్ట్రిక్ స్కూటర్

అదే, ఇందులో అదనపు బ్యాటరీ ప్యాక్‌ని జోడించడం ద్వారా, ఈ రేంజ్ ను పూర్తి ఛార్జ్ పై గరిష్టంగా 140 కి.మీ లకు పెంచుకోవచ్చు. బ్యాటరీ ప్యాక్ లు వేరుగా ఉన్నందు వలన, ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్ వేరియంట్లు కూడా వివిధ రకాల పనితీరును అందిస్తాయి. దీని బేస్ L1e వేరియంట్ గరిష్టంగా 3 kW అవుట్‌పుట్‌ను పొందుతుంది, ఇది 45 kmph గరిష్ట వేగాన్ని అందిస్తుంది. ఇకపోతే, L3e వేరియంట్ 10 kW (13.4 bhp) మరియు 200 Nm టార్క్ గరిష్ట అవుట్‌పుట్‌తో పెద్ద 7 kW రియర్ హబ్ మోటారును కలిగి ఉంటుంది.

ఫుల్ చార్జ్ పై ఏకంగా 140 కిలోమీటర్ల దూరం ప్రయాణించే నియాన్ జీరో వన్ ఎలక్ట్రిక్ స్కూటర్

ఫలితంగా, నియాన్ జీరో వన్ యొక్క ఈ వేరియంట్ గరిష్టంగా 100 కి.మీ రేంజ్ ను ఆఫర్ చేస్తుంది. నియాన్ జీరో వన్ అల్యూమినియం ఫ్రేమ్‌తో అండర్‌పిన్ చేయబడింది, ఇందులో ముందు వైపు అప్ సైడ్ డౌన్ ఫోర్కులు, వెనుకవైపు మోనో-షాక్‌ సస్పెన్షన్ సెటప్ ఉంటాయి. ఫ్రేమ్ మరియు బాడీ ప్యానెల్లు స్థిరమైన పదార్థాలతో తయారు చేయబడ్డాయి మరియు వీటిని రీసైకిల్ కూడా చేయవచ్చు.

ఫుల్ చార్జ్ పై ఏకంగా 140 కిలోమీటర్ల దూరం ప్రయాణించే నియాన్ జీరో వన్ ఎలక్ట్రిక్ స్కూటర్

ఇక బ్రేకింగ్ విషయానికి వస్తే, ఇందులో ABS ఫీచర్‌తో ఉపయోగించబడే ఫ్రంట్ అండ్ రియర్ డిస్క్ బ్రేక్‌లు ఉంటాయి. ఫీచర్ల విషయానికొస్తే, నియాన్ జీరో వన్ ప్రత్యేక ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్‌తో వస్తుంది. ఇది రైడ్ సమాచారం కోసం హ్యాండిల్‌బార్‌పై అమర్చబడిన రైడర్ స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగిస్తుంది. నియాన్ జీరో వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రస్తుతం జర్మనీ మార్కెట్లో అందుబాటులో ఉంది. ఇది భారత మార్కెట్లో కూడా విడుదల కావచ్చని నివేదికలు చెబుతున్నాయి. లేటెస్ట్ ఆటోమొబైల్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్ ని గమనిస్తూ ఉండండి.

More from DriveSpark

Article Published On: Wednesday, February 9, 2022, 16:18 [IST]
English summary
Neon zero one electric scooter unveiled with a range of over 140 km per chanrge details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+