భారత్‌లో విడుదలైన BMW F 900 XR బైక్: ధర రూ. 12.30 లక్షలు

ప్రముఖ ప్రీమియం బైక్ తయారీ సంస్థ 'బిఎండబ్ల్యు మోటొరాడ్' (BMW Motorrad) ఎట్టకేలకు భారతీయ మార్కెట్లో కొత్త 'బిఎండబ్ల్యు ఎఫ్ 900 ఎక్స్ఆర్' (BMW F 900 XR) బైక్ విడుదల చేసింది. దేశీయ మార్కెట్లో విడుదలైన ఈ కొత్త బైక్ ధర రూ. 12,30,000 (ఎక్స్-షోరూమ్). కంపెనీ ఈ 2022 బైక్ యొక్క బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. కొనుగోలుదారులు కంపెనీ డీలర్‌షిప్‌ల ద్వారా లేదా కంపెనీ యొక్క వెబ్‌సైట్‌లో బుక్ చేసుకోవచ్చు.

భారత్‌లో విడుదలైన BMW F 900 XR బైక్: ధర రూ. 12.30 లక్షలు

భారతీయ మార్కెట్లో విడుదలైన ఈ కొత్త బిఎండబ్ల్యు ఎఫ్ 900 ఎక్స్ఆర్ డెలివరీలు 2022 జూన్ నెలలో ప్రారంభమవుతాయి. BMW F 900 XR బైక్ భారత రాజధాని నగరం ఢిల్లీ (లుటియన్స్ మోటోరాడ్), ముంబై (నవ్‌నిట్ మోటార్స్), పూణే (బవేరియా మోటార్స్), చెన్నై (KUN మోటోరాడ్), బెంగళూరు వంటి ముఖ్యమైన నగరాలలోని కంపెనీ యొక్క అధికారిక డీలర్ నెట్‌వర్క్ ద్వారా విక్రయించబడుతుంది. కావున కొనుగోలుదారులు ఇప్పుడు దీనిని సులభంగా బుక్ చేసుకోవచ్చు. ఈ బైక్ ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది.

భారత్‌లో విడుదలైన BMW F 900 XR బైక్: ధర రూ. 12.30 లక్షలు

కొత్త BMW F 900 XR బైక్ వాటర్-కూల్డ్ 4-స్ట్రోక్ ఇన్-లైన్ 2-సిలిండర్ 895సిసి బిఎస్6 ఇంజన్‌ని కలిగి ఉంది. ఈ ఇంజిన్ 8500 ఆర్‌పిఎమ్ వద్ద 105 బిహెచ్‌పి పవర్ అవుట్‌పుట్ మరియు 6500 ఆర్‌పిఎమ్ వద్ద గరిష్టంగా 92 ఎన్ఎమ్ టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. ఈ బైక్ కేవలం 3.6 సెకన్లలో గంటకు 0 నుండి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. అయితే దీని గరిష్ట వేగం గంటకు 200 కిమీ కంటే ఎక్కువ.

భారత్‌లో విడుదలైన BMW F 900 XR బైక్: ధర రూ. 12.30 లక్షలు

కొత్త BMW F 900 XR బైక్ కంపెనీ యొక్క బ్రిడ్జ్ ఫ్రేమ్ 2-సిలిండర్ ఇన్-లైన్ ఇంజిన్‌ను లోడ్-బేరింగ్ ఎలిమెంట్‌గా ఇంటిగ్రేట్ చేసింది. అంతే కాకూండా ఇది వెల్డింగ్ షీట్ స్టీల్ భాగాల నుండి తయారు చేయబడింది. ఫ్రంట్ వీల్ కంట్రోల్ కోసం అప్ ఫ్రంట్‌లో అప్‌సైడ్ డౌన్ టెలిస్కోపిక్ ఫోర్క్ అమర్చబడి ఉంటుంది. కానీ రియర్ వీల్ సెంట్రల్ సస్పెన్షన్ స్ట్రట్‌తో డబుల్ సైడెడ్ స్వింగింగ్ ఆర్మ్‌తో అందించబడుతుంది. మొత్తం మీద ఇది వాహన వినియోగదారులకు మంచి పనితీరుని అందిస్తుంది.

భారత్‌లో విడుదలైన BMW F 900 XR బైక్: ధర రూ. 12.30 లక్షలు

కొత్త BMW F 900 XR బైక్ 6.5-ఇంచెస్ కలర్ టిఎఫ్టి డిస్‌ప్లే, బిఎండబ్ల్యు మోటోరాడ్ కనెక్టివిటీ యాప్, చుట్టూ ఎల్ఈడీ లైట్లు, రైడింగ్ మోడ్‌లు, అడ్జస్టబుల్ లివర్స్, అడ్జస్టబుల్ రియర్ సస్పెన్షన్, స్లిప్పర్ క్లచ్, కాస్ట్ అడ్జస్ట్ చేయగల అల్యూమినియం వీల్స్‌ వంటి వాటిని కలిగి ఉంటుంది.

భారత్‌లో విడుదలైన BMW F 900 XR బైక్: ధర రూ. 12.30 లక్షలు

ఈ బైక్ లో యాప్‌ను ఇన్‌స్టాల్ చేయకుండానే మొబైల్ ఫోన్ మరియు మీడియా ఫంక్షన్‌ను సులభంగా ఉపయోగించుకోవచ్చు. అంతే కాకుండా ఈ బైక్‌లో రైడర్‌ బ్లూటూత్ కనెక్షన్‌తో టెలిఫోన్ కాల్‌లు మరియు మ్యూజిక్ ప్లేబ్యాక్‌ వంటి వాటిని కూడా కంట్రోల్ చేయవచ్చు. ఇది వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

భారత్‌లో విడుదలైన BMW F 900 XR బైక్: ధర రూ. 12.30 లక్షలు

2022 బీఎండబ్ల్యూ F 900 XR బైక్ యొక్క ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో డైనమిక్ ఈఎస్ఏ, కీలెస్ రైడ్ మరియు సెంటర్ స్టాండ్‌లను కలిగి ఉన్నాయి. అంతే కాకుండా డైనమిక్ ప్యాకేజీగా ఇందులో హెడ్‌లైట్ ప్రో, డేటైమ్ రైడింగ్ లైట్లు, గేర్ షిఫ్ట్ అసిస్ట్ వంటివి ఉన్నాయి. వీటితో పాటు డైనమిక్ ఇంజిన్ బ్రేక్ కంట్రోల్ (MSR), హీటెడ్ గ్రిప్స్, డైనమిక్ ట్రాక్షన్ కంట్రోల్, ABS ప్రో మరియు కేస్ హోల్డర్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

భారత్‌లో విడుదలైన BMW F 900 XR బైక్: ధర రూ. 12.30 లక్షలు

కొత్త BMW F 900 XR బైక్ లోని అడాప్టివ్ కార్నరింగ్ లైట్ రాత్రిపూట కార్నర్ చేస్తున్నప్పుడు రోడ్డు మరింత ప్రకాశవంతంగా కనిపిస్తుంది. ఈ కొత్త బైక్ యొక్క వారంటీ విషయానికి వస్తే, ఇది 3 సంవత్సరాల/అపరిమిత కిలోమీటర్ల వారంటీతో వస్తుంది. అంతే కాకుండా ఇది కేవలం ఒకే కలర్ ఆప్సన్ లో అందుబాటులో ఉంటుంది. అది రేసింగ్ రెడ్ కలర్ స్కీమ్‌.

ఇదిలా ఉండగా కంపెనీ అడ్వెంచర్ టూరర్ మోటార్‌సైకిల్ విభాగంలో బిఎమ్‌డబ్ల్యూ ఎఫ్850 జిఎస్ (BMW F850 GS) ఎఫ్850 జిఎస్ అడ్వెంచర్ (F850 GS Adventure) అనే రెండు కొత్త మోడళ్లను కంపెనీ విడుదల చేసింది. దేశీయ విపణిలో వీటి ధరలు వరుసగా రూ. 12.5 లక్షలు మరియు రూ. 13.25 లక్షలు (అన్ని ధరలు, ఎక్స్-షోరూమ్) గా ఉన్నాయి.

More from DriveSpark

Article Published On: Thursday, April 14, 2022, 16:30 [IST]
English summary
New 2022 bmw f 900 xr motorcycle launched in india at rs 12 30 lakh details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+