స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ ఫీచర్‌తో కొత్త 2022 Hero Destini 125 Xtec స్కూటర్ విడుదల; ధర ఎంతంటే..?

భారతదేశపు నెంబర్ వన్ టూవీలర్ బ్రాండ్ హీరో మోటోకార్ప్ (Hero Motocorp), దేశీయ విపణిలో విక్రయిస్తున్న డెస్టినీ 125 (Destini 125) స్కూటర్‌లో కంపెనీ తాజాగా మరో కొత్త వేరియంట్ ను విడుదల చేసింది. ఇటీవలి కాలంలో, మార్కెట్లో స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీతో కూడిన టూవీలర్లకు డిమాండ్ ఎక్కువగా ఉండటంతో, కంపెనీ ఇందులో బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన ఓ కొత్త 2022 మోడల్ "హీరో డెస్టినీ 125 ఎక్స్‌టెక్" (Hero Destini 125 Xtec) ను మార్కెట్లో ప్రవేశపెట్టింది.

స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ ఫీచర్‌తో కొత్త 2022 Hero Destini 125 Xtec స్కూటర్ విడుదల; ధర ఎంతంటే..?

దేశీయ విపణిలో కొత్త హీరో డెస్టినీ 125 ఎక్స్‌టెక్ వేరియంట్ ధర రూ. 79,990 (క్స్-షోరూమ్ ఢిల్లీ) గా ఉంది. ఈ కొత్త స్కూటర్ లేటెస్ట్ కనెక్టివిటీ ఫీచర్లతో పాటుగా కొన్ని కాస్మెటిక్ అప్‌డేట్స్ ను కూడా పొందుతుంది. ఈ గేర్‌లెస్ స్కూటర్‌ను కంపెనీ ఇప్పుడు కొత్త నెక్సస్ బ్లూ కలర్ లో విడుదల చేసింది. ఇది కాకుండా, డెస్టినీ 125 ఇప్పటికే మ్యాట్ బ్లాక్, పెరల్ సిల్వర్ వైట్, నోబెల్ రెడ్, పాంథర్ బ్లాక్, చెస్ట్‌నట్ బ్రౌన్ మరియు మ్యాట్ రే కలర్ ఆప్షన్లలో కూడా అందుబాటులో ఉంది.

స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ ఫీచర్‌తో కొత్త 2022 Hero Destini 125 Xtec స్కూటర్ విడుదల; ధర ఎంతంటే..?

గతంలో హీరో మోటోకార్ప్ విడుదల చేసిన గ్లామర్ ఎక్స్‌టెక్ మాదిరిగానే ఈ లేటెస్ట్ డెస్టినీ ఎక్స్‌టెక్ కూడా కనెక్టింగ్ టెక్నాలజీని కలిగి ఉంటుంది. ఈ టెక్నాలజీకి సంబంధించిన మరిన్ని వివరాలు మరియూ ఈ స్కూటర్‌లో చేయబడిన ప్రధానమైన డిజైన్ మార్పులు ఏవో తెలుసుకుందాం రండి.

స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ ఫీచర్‌తో కొత్త 2022 Hero Destini 125 Xtec స్కూటర్ విడుదల; ధర ఎంతంటే..?

రిఫ్రెష్డ్ డిజైన్ మరియు ఫీచర్లు

కొత్త 2022 మోడల్ హీరో డెస్టినీ 125 ఎక్స్‌టెక్ కొత్త లుక్ మరియు స్టైల్‌లో పరిచయం చేయబడింది. ఈ స్కూటర్ రెట్రోల్ ఫ్రంట్ డిజైన్‌కు మరింత అందాన్ని తెచ్చేలా ఫ్రంట్ ఆప్రాన్‌కు క్రోమ్ యాక్సెంట్‌లు మరియు క్రోమ్ రియర్ వ్యూ మిర్రర్స్ జోడించబడ్డాయి. ఇందులోని సైలెన్సర్‌పై క్రోమ్ గార్నిష్ కనిపిస్తుంది, ఇది స్కూటర్‌కు మరింత ప్రీమియం రూపాన్ని అందిస్తుంది. ఇంకా ఇందులో స్క్వేర్ ఎల్ఈడి హెడ్‌ల్ఈడి హెడ్ల్యాంప్, హెడ్‌ల్యాంప్‌ చుట్టూ క్రోమ్ యాక్సెంట్‌లు మరియు కొత్త హ్యాండిల్ బార్ వంటి మార్పులు కూడా ఉన్నాయి.

స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ ఫీచర్‌తో కొత్త 2022 Hero Destini 125 Xtec స్కూటర్ విడుదల; ధర ఎంతంటే..?

ఈ స్కూటర్ ఇప్పుడు బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను కూడా కలిగి ఉంటుంది. ఇది కాల్ అలెర్ట్ మరియు ఎస్ఎంఎస్ అలెర్ట్స్ ను అందిస్తుంది. ఇంకా ఇందులో మొబైల్ ఫోన్ చార్జింగ్ కోసం యూఎస్‌బి పోర్ట్, సైడ్ స్టాండ్ ఇండికేటర్ మరియు సైడ్ స్టాండ్ ఆన్‌లో ఉంటే ఇంజన్ ఆగిపోయేలా ఏర్పాటు చేసిన సైడ్ స్టాండ్ ఇంజన్ కటాఫ్ స్విచ్, పిలియన్ రైడర్ కోసం బ్యాక్ రెస్ట్ మరియు ఇంజన్ ఐడిల్ స్టాప్ స్టార్ట్ సిస్టమ్ (దీనిని హీరో i3s అని కూడా పిలుస్తారు) మొదలైన ఫీచర్లు కూడా ఉన్నాయి.

స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ ఫీచర్‌తో కొత్త 2022 Hero Destini 125 Xtec స్కూటర్ విడుదల; ధర ఎంతంటే..?

ఇంజన్‌లో ఎలాంటి మార్పు లేదు

కొత్త హీరో డెస్టినీ 125 ఎక్స్‌టెక్ స్కూటర్‌లో ఇంజన్ పరంగా ఎలాంటి మార్పులు చేయలోదు. ఇందులో 125 సిసి సింగిల్ సిలిండర్, స్టాండర్డ్ మోడల్ యొక్క ఫ్యూయల్-ఇంజెక్ట్ ఇంజన్‌నే ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 9 బిహెచ్‌పి పవర్ ను మరియు 10.4 న్యూటన్ మీటర్ గరిష్ట టార్ క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది సివిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ సాయంతో కనెక్ట్ చేయబడి ఉంటుంది.ఇందులోని కొత్త i3S ఐడిల్ స్టార్ట్/స్టాప్ టెక్నాలజీ కారణంగా, ఈ స్కూటర్‌ను ఇంజన్ ను ఎక్కువసేపు ఐడిలాగా ఉంచినప్పుడు, అది ఆటోమేటిక్‌గా ఇంజన్‌ను ఆపివేస్తుంది. తిరిగి స్కూటర్‌ని స్టార్ట్ చేయడానికి మీరు కేవలం ఏదైనా బ్రేక్ లివర్ నొక్కితే సరిపోతుంది. ఈ టెక్నాలజీ వలన ఇందనం ఆదా అవుతుందని కంపెనీ చెబుతోంది.

స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ ఫీచర్‌తో కొత్త 2022 Hero Destini 125 Xtec స్కూటర్ విడుదల; ధర ఎంతంటే..?

కొత్త డెస్టినీ 125 ఎక్స్‌టెక్‌ స్కూటర్ మెకానికల్ అంశాలను పరిశీలిస్తే, ఇందులో ముందువైపు టెలిస్కోపిక్ షాక్ అబ్జార్బర్‌లు మరియు వెనుకవైపు సింగిల్ కాయిల్ మోనో షాక్ సెటప్ ఉన్నాయి. బ్రేకింగ్ విషయానికి వస్తే, ఇందులో రెండు చివర్లలో డ్రమ్ బ్రేక్‌లు ఉంటాయి, ఇవి ఇంటిగ్రేటెడ్ బ్రేకింగ్ సిస్టమ్ ను సపోర్ట్ చేస్తాయి. అంటే, ఏదైనా ఒక బ్రేక్‌ను నొక్కినప్పటికీ రెండు బ్రేకులు ఎంగేజ్ అయి, స్టాపింగ్ డిస్టెన్స్‌ను తగ్గిస్తాయి. ఇకపోతే, ఈ స్కూటర్లు ముందు మరియు వెనుక వైపు 10 ఇంచ్ వీల్స్ ఉంటాయి మరియు వాటిపై 90/100 - 10 ప్రొఫైల్ టైర్‌లు అమర్చబడి ఉంటాయి.

స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ ఫీచర్‌తో కొత్త 2022 Hero Destini 125 Xtec స్కూటర్ విడుదల; ధర ఎంతంటే..?

ఏప్రిల్ 2022 నుండి పెరగనున్న ధరలు

ఇప్పటికే పెట్రోల్ ధరలు పెరుగులతో కొనుగోలుదారులు ఇబ్బంది పడుతుంటే, ఆటోమొబైల్ కంపెనీలు కూడా తమ ఉత్పత్తుల ధరలను పెంచేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో, హీరో మోటోకార్ప్ కూడా తమ ద్విచక్ర వాహనాల ధరలను ఏప్రిల్ 5 నుంచి పెంచనున్నట్లు ప్రకటించింది. ఏప్రిల్ 5, 2022 నుండి బైక్‌లు మరియు స్కూటర్ల ధరలను రూ. 2,000 వరకూ పెంచుతున్నట్లు హీరో మోటోకార్ప్ ప్రకటించింది. ఇన్‌పుట్ కాస్ట్ నిరంతరం పెరగడమే ధరల పెరుగుదలకు కారణమని కంపెనీ పేర్కొంది. కమోడిటీ ధరల పెరుగుదల ప్రభావాన్ని పాక్షికంగా భర్తీ చేసేందుకు ధరల పెంపు అవసరమని కంపెనీ తెలిపింది.

Most Read Articles

English summary
New 2022 hero destini 125 xtec launched in india price specs features
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X