డీలర్‌షిప్‌లకు చేరుకుంటున్న కొత్త 2022 KTM 390 Adventure మోటార్‌సైకిల్, త్వరలోనే విడుదల!
ఆస్ట్రియన్ స్పోర్ట్స్ బైక్ కంపెనీ కెటిఎమ్ (KTM) తమ సరికొత్త 2022 మోడల్ 390 అడ్వెంచర్ (2022 KTM 390 Adventure) మోటార్‌సైకిల్ ను త్వరలోనే మార్కెట్లో విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో, ఈ కొత్త బైక్ విడుదలకు ముందే కంపెనీ దీనిని డీలర్‌షిప్‌లకు పంపిణీ చేస్తోంది. పాత మోడల్ తో పోల్చుకుంటే, ఈ కొత్త 2022 మోడల్‌లో కొత్త కలర్ ఆప్షన్లు మరియు చిన్నపాటి కాస్మెటిక్ అప్‌గ్రేడ్స్ ఉండనున్నాయి. మరికొద్ది రోజుల్లోనే ఈ 2022 కెటిఎమ్ 390 అడ్వెంచర్ అమ్మకాలు ప్రారంభం కానున్నాయి.

కెటిఎమ్ ఇటీవలే అమెరికన్ మార్కెట్‌లో అప్‌గ్రేడ్ చేయబడిన 390 అడ్వెంచర్‌ను ప్రారంభించింది. మనదేశంలో కెటిఎమ్ 390సిసి వరకు అన్ని మోటార్‌సైకిళ్లను ఇక్కడే స్థానికంగా తయారు చేస్తుంది కాబట్టి, ఇండియన్ వెర్షన్ 2022 మోడల్ కెటిఎమ్ 390 అడ్వెంచర్ బైక్ లో కూడా అదే విధమైన మార్పులు ఉంటాయని భావిస్తున్నారు. కొత్త 2022 కెటిఎమ్ 390 అడ్వెంచర్ మోటార్‌సైకిల్ దాని ముందున్న మోడల్ తో పోలిస్తే చాలా భిన్నంగా కనిపిస్తుంది.

ఇందులో కొత్తగా గ్రే/బ్లాక్ మరియు బ్లూ అనే కలర్ ఆప్షన్లను ప్రవేశపెట్టారు. అంతేకాకుండా, ఈ రెండు కొత్త కలర్ ఆప్షన్లు కూడా KTM బ్రాండ్ యొక్క సిగ్నెచర్ ఆరెంజ్ యాక్సెంట్స్ మరియు బాడీ గ్రాఫిక్‌లను కలిగి ఉంటాయి. అలాగే, ఇందులో రైడర్ అవసరాలకు అనుగుణంగా బాడీ ప్యానెల్‌లకు కంపెనీ అనేక సూక్ష్మమైన మార్పులను చేసినందున డిజైన్ కొంచెం ఎక్కువ ఏరోడైనమిక్‌గా కనిపిస్తుంది. ఈ మార్పులలో కొత్త ట్యాంక్ ష్రౌడ్స్, ట్యాంక్ డిజైన్, వెనుక వైపు ప్యానెల్లు మరియు హెడ్‌లైట్ మాస్క్ ఉన్నాయి.

ఈ కొత్త డిజైన్ కారణంగా 2022 కెటిఎమ్ 390 అడ్వెంచర్ మోటార్‌సైకిల్‌ను దాని మునుపటి మోడళ్ల కంటే కొంచెం ఎక్కువ ఆకర్షణీయంగా కనిపించేలా చేస్తుంది. ఈ మార్పులు రైడర్‌ల కదలికలకు మరియు ఎదురుగాలి (ఎయిర్ బ్లాస్ట్) నుండి మెరుగైన రక్షణ కోసం ఏరోడైనమిక్స్‌కు మరింత స్వేచ్ఛను ఇస్తాయి. కొత్త 2022 కెటిఎమ్ 390 అడ్వెంచర్ మోటార్‌సైకిల్‌లో గుర్తించదగిన మరో మార్పు ఏమిటంటే, ఇందులో మునుపటి 6-స్పోక్ అల్లాయ్ వీల్స్‌కు బదులుగా కొత్త 5-స్పోక్ అల్లాయ్ వీల్స్ ఉపయోగించారు.

అల్లాయ్ వీల్స్ లో చేసిన ఈ మార్పు కారణంగా, కొత్త మోడల్ మెరుగైన రైడ్ కంట్రోల్ ను అందిస్తుందని భావిస్తున్నారు. కొత్త 2022 కెటిఎమ్ 390 అడ్వెంచర్ బైక్ లో ఫీచర్‌ల పరంగా పెద్దగా మార్పులు ఉండబోవని తెలుస్తోంది. అలాగే, ఇందులో యాంత్రికంగా కూడా ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు. మునుపటి వెర్షన్ లో ఉపయోగించిన అవే మెకానికల్స్ మరియు ఇంజన్ లను ఈ కొత్త 2022 మోడల్ లో కూడా కొనసాగించనున్నారు.

కాకపోతే, ఈ కొత్త 2022 మోడల్ లో ఎల్ఈడి హెడ్‌లైట్‌లు, ఎల్ఈడి టర్న్ ఇండికేటర్‌లు, ఎల్ఈడి టెయిల్‌ల్యాంప్‌లు, సర్దుబాటు చేయగల విండ్‌స్క్రీన్, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీతో కూడిన ఫుల్ కలర్ టిఎఫ్‌టి ఇన్‌స్ట్రుమెంట్ డిస్‌ప్లే, ఆప్షనల్ టర్న్-బై-టర్న్ నావిగేషన్ వంటి ఫీచర్లు ఉండనున్నాయి. ఇంకా ఇందులో రైడర్ స్మార్ట్ ఫోన్ చార్జింగ్ కోసం 12 వోల్ట్ ఛార్జింగ్ పోర్ట్ కూడా స్టాండర్డ్ గా లభిస్తుంది. ఇవే కాకుండా, కొత్త 2022 కెటిఎమ్ 390 అడ్వెంచర్ మోటార్‌సైకిల్ లో ముందు వైపున నాన్-అడ్జస్టబుల్ ఇన్‌వర్టెడ్ ఫోర్క్స్ మరియు వెనుక వైపున WP అపెక్స్ మోనో-షాక్ సస్పెన్షన్ సెటప్ ఉంటాయి.

ఇక బ్రేకింగ్ విషయానికి వస్తే, ఇందులో ఆఫ్‌రోడ్ మోడ్‌తో కూడిన డ్యూయల్-ఛానల్ ఏబిఎస్ ఉంటుంది. ఈ బైక్ ముందు మరియు వెనుక భాగాలలో సింగిల్ డిస్క్ బ్రేక్స్ ఉంటాయి. ఇక చివరిగా ఇంజన్ విషయానికి వస్తే, కొత్త 2022 కెటిఎమ్ 390 అడ్వెంచర్ బైక్ లో కూడా అదే ప్రయత్నించిన మరియు పరీక్షించబడిన 373.2 సిసి, సింగిల్ సిలిండర్, లిక్విడ్ కూల్డ్ ఇంజన్‌ను ఉపయోగించనున్నారు. ఈ ఇంజన్ 42.3 బిహెచ్‌పి శక్తిని మరియు 37 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది బై-డైరెక్షనల్ క్విక్-షిఫ్టర్‌తో కూడిన సిక్స్-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

మార్కెట్లో కెటిఎమ్ 250 అడ్వెంచర్ (KTM 250 Adventure) బైక్ విడుదల
ఇదిలా ఉంటే, కెటిఎమ్ ఇండియా ఇటీవలే భారత మార్కెట్లో తమ ఎంట్రీ లెవల్ అడ్వెంచర్ మోటార్‌సైకిల్ 'కెటిఎమ్ 250 అడ్వెంచర్' (KTM 250 Adventure) బైక్ యొక్క కొత్త వేరియంట్ ను మార్కెట్లో విడుదల చేసింది. దేశీయ విపణిలో ఈ కొత్త అడ్వెంచర్ బైక్ ధర రూ. 2.35 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) గా ఉంది. ఇది కెటిఎమ్ ఎలక్ట్రానిక్ ఆరెంజ్ మరియు కెటిఎమ్ ఫ్యాక్టరీ రేసింగ్ బ్లూ అనే రెండు కొత్త కలర్ ఆప్సన్స్ లో అందుబటులో ఉంటుంది.

కొత్త 2022 కెటిఎమ్ 250 అడ్వెంచర్ బైక్ ఇంజన్ పరంగా ఎలాంటి మార్పులు లేవు. అయితే, చిన్నపాటి కాస్మెటిక్ మరియు ఫీచర్ అప్‌డేట్స్ ఉన్నాయి. ఇందులో మునుపటి మోడల్ లో మాదిరిగానే 248 సిసి, సింగిల్-సిలిండర్, లిక్విడ్-కూల్డ్ డిఓహెచ్‌సి, ఫోర్-వాల్వ్ ఇంజన్ ను ఉపయోగించారు. అలాగే, ఇందులో ముందు వైపు 19 ఇంచ్ వీల్ మరియు వెనుక వైపు 17 ఇంచ్ వీల్ ను ఉపయోగించారు. సస్పెన్షన్ విషయానికి వస్తే, ముందువైపు 170 మిమీ అప్‌సైడ్ టెలిస్కోపిక్ ఫోర్క్‌లను మరియు వెనుకవైపు 177 మిమీ 10 వే ప్రీలోడ్ అడ్జస్ట్‌మెంట్ మోనోషాక్ సస్పెన్షన్ సెటప్ ఉంటుంది.


Click it and Unblock the Notifications








