మార్కెట్లో కొత్త 2022 కెటిఎమ్ 390 అడ్వెంచర్ (KTM 390 Adventure) బైక్ విడుదల: ధర, ఫీచర్లు

ఆస్ట్రియన్ స్పోర్ట్స్ బైక్ బ్రాండ్ కెటిఎమ్ (KTM) నుండి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సరికొత్త 2022 మోడల్ కెటిఎమ్ 390 అడ్వెంచర్ (2022 KTM 390 Adventure) మోటార్‌సైకిల్ ఇప్పుడు మార్కెట్లో విడుదలైంది. కొత్త 2022 కెటిఎమ్ 390 అడ్వెంచర్ మోటార్‌సైకిల్ దాని ముందున్న మోడల్ తో పోలిస్తే చాలా భిన్నంగా కనిపిస్తుంది. దీని డిజైన్ మరియు ఫీచర్లలో కంపెనీ అప్‌గ్రేడ్స్ చేసింది. భారత మార్కెట్లో ఈ కొత్త అడ్వెంచర్ మోటార్‌సైకిల్ ధర రూ. 3.28 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించబడింది.

మార్కెట్లో కొత్త 2022 కెటిఎమ్ 390 అడ్వెంచర్ (KTM 390 Adventure) బైక్ విడుదల: ధర, ఫీచర్లు

ఒక్కసారిగా ఇంత మొత్తం చెల్లించి ఈ బైక్‌ను కొనలేని కస్టమర్ల కోసం కంపెనీ ఆకర్షణీయమైన ఫైనాన్స్ ఆఫర్‌లను కూడా అందిస్తోంది. సమాచారం ప్రకారం, కెటిఎమ్ 390 అడ్వెంచర్ బైక్ ను రూ. 6,999 నెలవారీ EMI వద్ద కొనుగోలు చేయవచ్చు. ఈ కొత్త మోడల్‌ను గ్రే, బ్లాక్ మరియు బ్లూ కలర్ ఆప్షన్లలలో ప్రవేశపెట్టారు. అంతేకాకుండా, ఈ కొత్త కలర్ ఆప్షన్లన్నీ కూడా ఇప్పుడు KTM బ్రాండ్ యొక్క సిగ్నెచర్ ఆరెంజ్ యాక్సెంట్స్ మరియు బాడీ గ్రాఫిక్స్ ను కలిగి ఉంటాయి

మార్కెట్లో కొత్త 2022 కెటిఎమ్ 390 అడ్వెంచర్ (KTM 390 Adventure) బైక్ విడుదల: ధర, ఫీచర్లు

డిజైన్ పరంగా చూస్తే, ఇది ప్రసిద్ధ డాకర్ ర్యాలీలో ఉపయోగించిన అడ్వెంచర్ బైక్ మోడల్‌ను పోలి ఉంటుంది మరియు సరిగ్గా అదే ఫీచర్లు మరియు గ్రాఫిక్స్ డిజైన్‌తో వస్తుంది. ఇది అడ్వెంచర్ బైక్ కాబట్టి కఠినమైన రోడ్లపై సైతం సులువుగా ప్రయాణించేలా డిజైన్ చేయబడింది. మొత్తంమీద, ఈ బైక్ ఒక దృఢమైన ఫ్రేమ్‌పై నిర్మించబడి ఉండి, మంచి స్థిరత్వం మరియు బలాన్ని కలిగి ఉంటుంది. ఇందులో రైడర్ అవసరాలకు అనుగుణంగా బాడీ ప్యానెల్‌లకు కంపెనీ అనేక సూక్ష్మమైన మార్పులను చేసినందున డిజైన్ కొంచెం ఎక్కువ ఏరోడైనమిక్‌గా కనిపిస్తుంది.

మార్కెట్లో కొత్త 2022 కెటిఎమ్ 390 అడ్వెంచర్ (KTM 390 Adventure) బైక్ విడుదల: ధర, ఫీచర్లు

ఈ మార్పులలో కొత్త ట్యాంక్ ష్రౌడ్స్, ట్యాంక్ డిజైన్, వెనుక వైపు ప్యానెల్లు మరియు హెడ్‌లైట్ మాస్క్ ఉన్నాయి. అలాగే, మెరుగైన రైడర్ విజిబిలిటీ కోసం అన్ని లైట్లు LED రూపంలో ఉంటాయి. ఎల్ఈడి హెడ్‌లైట్‌లు, ఎల్ఈడి టర్న్ ఇండికేటర్‌లు, ఎల్ఈడి టెయిల్‌ల్యాంప్‌లు, సర్దుబాటు చేయగల విండ్‌స్క్రీన్, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీతో కూడిన ఫుల్ కలర్ టిఎఫ్‌టి ఇన్‌స్ట్రుమెంట్ డిస్‌ప్లే, ఆప్షనల్ టర్న్-బై-టర్న్ నావిగేషన్ వంటి ఫీచర్లు ఉండనున్నాయి. ఇంకా ఇందులో రైడర్ స్మార్ట్ ఫోన్ చార్జింగ్ కోసం 12 వోల్ట్ ఛార్జింగ్ పోర్ట్ కూడా స్టాండర్డ్ గా లభిస్తుంది. ఇందులో రెండు రైడింగ్ మోడ్‌లతో పాటుగా స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ ఫీచర్ కూడా లభిస్తుంది.

మార్కెట్లో కొత్త 2022 కెటిఎమ్ 390 అడ్వెంచర్ (KTM 390 Adventure) బైక్ విడుదల: ధర, ఫీచర్లు

ఇంజన్ విషయానికి వస్తే, కొత్త 2022 కెటిఎమ్ 390 అడ్వెంచర్ బైక్ లో అదే మునుపటి 373.2 సిసి, సింగిల్ సిలిండర్, లిక్విడ్ కూల్డ్ ఇంజన్‌ ను ఉపయోగించారు. ఈ ఇంజన్ 42.9 బిహెచ్‌పి శక్తిని మరియు 37 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది బై-డైరెక్షనల్ క్విక్-షిఫ్టర్‌ తో కూడిన 6 స్పీడ్ గేర్‌బాక్స్‌ తో జతచేయబడి ఉంటుంది. కొత్త 2022 కెటిఎమ్ 390 అడ్వెంచర్ మోటార్‌సైకిల్ లో ముందు వైపున నాన్-అడ్జస్టబుల్ ఇన్‌వర్టెడ్ ఫోర్క్స్ మరియు వెనుక వైపున WP అపెక్స్ మోనో-షాక్‌ సస్పెన్షన్ సెటప్ ఉంటాయి.

మార్కెట్లో కొత్త 2022 కెటిఎమ్ 390 అడ్వెంచర్ (KTM 390 Adventure) బైక్ విడుదల: ధర, ఫీచర్లు

కొత్త 2022 కెటిఎమ్ 390 అడ్వెంచర్ మోటార్‌సైకిల్‌లో గుర్తించదగిన మరో మార్పు ఏమిటంటే, ఇందులో మునుపటి 6-స్పోక్ అల్లాయ్ వీల్స్‌కు బదులుగా కొత్త 5-స్పోక్ అల్లాయ్ వీల్స్ ఉపయోగించారు. అల్లాయ్ వీల్స్ లో చేసిన ఈ మార్పు కారణంగా, కొత్త మోడల్ మెరుగైన రైడ్ కంట్రోల్ ను అందిస్తుందని భావిస్తున్నారు. ఇక, బ్రేకింగ్ విషయానికి వస్తే, ఇందులో ఆఫ్‌రోడ్ మోడ్‌తో కూడిన డ్యూయల్-ఛానల్ ఏబిఎస్ ఉంటుంది. ఈ బైక్ ముందు మరియు వెనుక భాగాలలో సింగిల్ డిస్క్ బ్రేక్స్ ఉంటాయి. భారతదేశంలో, ఇది ఈ విభాగంలో రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్, యెజ్డీ అడ్వెంచర్ మరియు BMW G 310GS వంటి మోడళ్లకు పోటీగా ఉంటుంది.

మార్కెట్లో కొత్త 2022 కెటిఎమ్ 390 అడ్వెంచర్ (KTM 390 Adventure) బైక్ విడుదల: ధర, ఫీచర్లు

త్వరలో విడుదల కానున్న KTM RC 390 బైక్

ఇదిలా ఉంటే, కెటిఎమ్ 390 సిరీస్‌లో ఆర్‌సి (ఫుల్లీ ఫెయిర్డ్ వెర్షన్) బైక్ ను కూడా కంపెనీ విడుదల చేయబోతోంది. కంపెనీ ఇప్పటికే ఈ మోడల్ ను తమ భారతీయ వెబ్‌సైట్‌లో లిస్ట్ చేసింది. కొత్త KTM RC 390 బైక్ లో ఎల్ఈడి హెడ్‌లైట్, టర్న్ ఇండికేటర్‌లు మరియు డేటైమ్ రన్నింగ్ లైట్లతో కూడిన సరికొత్త ఆల్-ఎల్ఈడి ఫ్రంట్ హెడ్‌ల్యాంప్‌ యూనిట్ వంటి హైలైట్స్ ఉన్నాయి. ఇది కొత్త కొత్త విండ్‌షీల్డ్‌ను కూడా పొందుతుంది మరియు ఈ విండ్‌షీల్డ్ ఎదురుగాలి నుండి రైడర్ కు మంచి రక్షణను అందిస్తుంది మరియు మోటార్‌సైకిల్ యొక్క ఏరోడైనమిక్స్‌ను మరింత మెరుగుపరుస్తుంది.

మార్కెట్లో కొత్త 2022 కెటిఎమ్ 390 అడ్వెంచర్ (KTM 390 Adventure) బైక్ విడుదల: ధర, ఫీచర్లు

కొత్త KTM RC 390 యొక్క మెయిన్ ఫ్రేమ్‌లో ఎటువంటి మార్పులు లేకుండా, మెరుగైన ఆన్-రోడ్ డైనమిక్స్ కోసం కొత్త బోల్ట్-ఆన్ రియర్ సబ్‌ఫ్రేమ్‌ను ఉపయోగించనున్నారు. మెకానికల్స్ విషయానికి వస్తే, ఇందులో ముందు వైపు USD ఫోర్క్‌లు మరియు వెనుక వైపున మోనో-షాక్ సస్పెన్షన్ సెటప్ ఉంటాయి. ఇక, బ్రేకింగ్ విషయానికి వస్తే, ముందు భాగంలో 320 మిమీ డిస్క్ మరియు వెనుక భాగంలో 230 మిమీ డిస్క్ బ్రేకులు ఉంటాయి మరియు ఇది డ్యూయల్ ఛానెల్ ABS ను సపోర్ట్ చేస్తుంది.

మార్కెట్లో కొత్త 2022 కెటిఎమ్ 390 అడ్వెంచర్ (KTM 390 Adventure) బైక్ విడుదల: ధర, ఫీచర్లు

కొత్త KTM RC 390 బైక్ ఇంజన్ విషయానికి వస్తే, దీని అడ్వెంచర్ వెర్షన్‌లో ఉపయోగిస్తున్న అదే 373 సిసి సింగిల్-సిలిండర్, లిక్విడ్-కూల్డ్ ఇంజన్‌ ను కంపెనీ ఈ కొత్త ఆర్‌సి390 మోడల్ లో కూడా ఉపయోగించే అవకాశం ఉంది. ఈ ఇంజన్ గరిష్టంగా 44 బిహెచ్‌పి పవర్ ను మరియు 37 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది స్లిప్పర్ మరియు అసిస్ట్ క్లచ్‌తో కూడిన 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. ఇందులో మల్టిపుల్ రైడ్ మోడ్‌లు, బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన కొత్త TFT ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్‌ వంటి మరెన్నో లేటెస్ట్ ఫీచర్లు కూడా ఉండనున్నాయి.

Most Read Articles

English summary
New 2022 ktm 390 adventure motorcycle launched in india price features
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X