KTM నుంచి త్వరలో రానున్న RC 390.. మరిన్ని వివరాలు

భారతీయ మార్కెట్లో ఎక్కువమంది బైక్ ప్రేమికులు ఇష్టపడే బైక్ బ్రాండ్స్ లో ఒకటి కెటిఎమ్ (KTM). ఈ ప్రీమియం బైక్ తయారీ సంస్థ KTM ఇండియా తన కొత్త తరం 2022 KTM RC 390 ని భారతదేశంలో విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. కెటిఎమ్ కంపెనీ RC 125 మరియు KTM RC 200 యొక్క కొత్త-తరం మోడల్‌లను ప్రారంభించిన తరువాత ఇప్పుడు తన కొత్త KTM RC 390 విడుదలచేయనుంది.

KTM నుంచి త్వరలో రానున్న RC 390.. మరిన్ని వివరాలు

KTM RC 390 ఇప్పుడు పూర్తిగా కొత్త అవతార్‌లో రానున్న మోటార్‌సైకిల్‌. ఇప్పుడు కంపెనీ దీనిని దాని వెబ్‌సైట్‌ను కూడా అప్డేట్ చేసింది. ఎంట్రీ-లెవల్ సూపర్‌బైక్ ఈ సంవత్సరం ప్రారంభంలో దాని చిన్న వెర్షన్‌తో అడుగుపెట్టింది. ఇది కూడా అనేక నవీకరణలను పొందింది. KTM RC 390 ఇప్పటికే చాలా సార్లు టెస్టింగ్ చేయబడింది. దీనికి సంబంధించిన టీజర్ కూడా కంపెనీ విడుదల చేసింది.

KTM నుంచి త్వరలో రానున్న RC 390.. మరిన్ని వివరాలు

కంపెనీ ఇప్పటికే ఈ కొత్త KTM RC 390 యొక్క డిజైన్ వంటి వాటిని గురించి వెల్లడించింది. ఈ కొత్త బైక్ దాని ఫైనల్ ప్రొడక్షన్ మోడల్‌లో ఉన్న దానికంటే చాలా మెరుగ్గా కనిపిస్తుంది. అంతే కాకూండా ఇది పూర్తిగా ఫెయిర్డ్ మోటార్‌సైకిల్ కొత్త సింగిల్-పీస్ LED హెడ్‌లైట్ సెటప్‌ను పొందుతుంది. కావున ఇది చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.

KTM నుంచి త్వరలో రానున్న RC 390.. మరిన్ని వివరాలు

ఈ కొత్త KTM RC 390 బైక్ పెద్ద విండ్‌షీల్డ్‌తో పూర్తిగా పునఃరూపకల్పన చేయబడి ఉంటుంది. కావున ఈ బైక్ ముందు భాగంలో చాలా కొత్తగా ఉండటమే కాకుండా చాలా అధునాతనంగా కూడా ఉంది. ఈ మోటార్‌సైకిల్‌కు LED DRLలు మరియు సైడ్ టర్న్ ఇండికేటర్‌లతో రీడిజైన్ చేయబడిన LED హెడ్‌లైట్ క్లస్టర్ ఉంది.

KTM నుంచి త్వరలో రానున్న RC 390.. మరిన్ని వివరాలు

అంతే కాకుండా ఈ బైక్ అద్భుతమైన ఫ్యూయెల్ ట్యాంక్, కొత్త బాడీ గ్రాఫిక్స్ మరియు కొత్త సీటింగ్ సెటప్‌తో రివైజ్ చేయబడిన టెయిల్ సెక్షన్ పొందుతుంది. అడ్జస్టబుల్ క్లిప్-ఆన్ హ్యాండిల్‌బార్ కారణంగా ఫెయిర్డ్ స్పోర్ట్స్ బైక్ యొక్క ఎర్గోనామిక్స్ కొంతవరకు సడలించబడింది. ఇది కంపెనీ యొక్క మునుపటి మోడల్స్ కంటే కూడా చాలా కొత్తదిగా ఉంటుంది.

KTM నుంచి త్వరలో రానున్న RC 390.. మరిన్ని వివరాలు

ఈ బైక్ లో రైడర్ మరియు హ్యాండిల్‌బార్ మధ్య రియర్-సెట్ ఫుట్‌పెగ్‌లు మరియు పెద్ద ఫ్యూయల్ ట్యాంక్ కారణంగా రైడింగ్ భంగిమ చాలా అనుకూలంగా ఉంటుంది, కావున ఇది అద్భుతమైన రైడింగ్ అనుభూతిని అందిస్తుంది. కంపెనీ ప్రస్తుతం విక్రయిస్తున్న KTM RC 390 నుండి సైడ్-ఆన్ అప్‌స్వెప్ట్ ఎగ్జాస్ట్ మరియు స్ప్లిట్ సీట్లు వంటివి రానున్న కొత్త బైక్ లో ఫార్వార్డ్ చేయబడ్డాయి.

KTM నుంచి త్వరలో రానున్న RC 390.. మరిన్ని వివరాలు

కంపెనీ విడుదల చేయనున్న కొత్త KTM RC 390 యొక్క మెయిన్ ఫ్రేమ్‌కు ఎటువంటి మార్పులు లేకుండా, మెరుగైన ఆన్-రోడ్ డైనమిక్స్ కోసం కొత్త బోల్ట్-ఆన్ రియర్ సబ్‌ఫ్రేమ్‌ను పొందింది. కావున ఇది చూడగానే ఆకర్షించే విధంగా ఉంటుంది.

KTM నుంచి త్వరలో రానున్న RC 390.. మరిన్ని వివరాలు

KTM RC 390 బైక్ యొక్క ముందు భాగంలో USD ఫోర్క్‌లు మరియు వెనుక వైపున మోనో-షాక్ సెటప్ తో కలుపబడిన అల్లాయ్ స్వింగార్మ్ ఉంటాయి. అదే విధంగా బ్రేకింగ్ విషయానికి వస్తే, దీని ముందు భాగంలో 320 మిమీ డిస్క్ మరియు వెనుక భాగంలో 230 మిమీ డిస్క్ బ్రేకులు ఉన్నాయి. అంతే కాకూండా ఇందులో డ్యూయల్ ఛానెల్ ABS కూడా అందుబటులో ఉంటుంది.

KTM నుంచి త్వరలో రానున్న RC 390.. మరిన్ని వివరాలు

KTM RC 390 బైక్ మల్టిపుల్ రైడ్ మోడ్‌లను కలిగి ఉంటుంది. అంతే కాకూండా ఇందులో బ్లూటూత్ కనెక్టివిటీతో కొత్త TFT ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్‌ను పొందుతుంది. ఇవన్నీ కూడా వాహన వినియోగదారునికి రైడింగ్ సమయంలో ఎంతగానో ఉపయోగపడతాయి. కంపెనీ స్లిప్పర్ మరియు అసిస్ట్ క్లచ్‌తో వచ్చే 6-స్పీడ్ గేర్‌బాక్స్‌కు జత చేయబడి ఉంటుంది. రానున్న కొత్త KTM RC 390 యొక్క ఇంజన్ విషయానికి వస్తే, ఇందులో 373 సిసి సింగిల్-సిలిండర్, లిక్విడ్-కూల్డ్ ఇంజిన్‌ ఉపయోగించబడుతుంది. ఇది 44 బిహెచ్‌పి పవర్ మరియు 37 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది.

KTM నుంచి త్వరలో రానున్న RC 390.. మరిన్ని వివరాలు

కెటిఎమ్ కంపెనీ త్వరలోనే ఈ కొత్త స్పోర్ట్స్ బైకును లాంచ్ చేయనుంది. అయితే ఇప్పటికి కూడా కంపెనీ ఈ బైక్ ధర వంటి వివరాలను అధికారికంగా వెల్లడించలేదు. కానీ దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. దేశీయ మార్కెట్లో ఈ బైక్ విడుదలైన తరువాత ఎలాంటి మంచి ప్రజాదరణ పొందే అవకాశం ఉందని ఆశిస్తున్నాము.

Most Read Articles

English summary
New 2022 ktm rc 390 motorcycle listed on company indian website details
Story first published: Monday, March 7, 2022, 16:59 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X