కొత్త 2022 మోడల్ టీవీఎస్ ఐక్యూబ్ (TVS iQube) విడుదల: ఇప్పుడు మరింత ఎక్కువ రేంజ్‌తో..

ప్రముఖ దేశీయ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ కంపెనీ (TVS Motor Company) భారతదేశంలో విక్రయిస్తున్న ఐక్యూబ్ (iQube) ఎలక్ట్రిక్ స్కూటర్ లో కొత్త 2022 మోడల్ ను మార్కెట్లో విడుదల చేసింది. ఇది మునుపటిలా ఒకే వేరియంట్‌లో కాకుండా మూడు వేరియంట్లలో ప్రారంభించబడింది. ఇందులో iQube, iQubeS మరియు iQube ST వేరియంట్లు ఉన్నాయి. భారత మార్కెట్లో కొత్త 2022 TVS iQube లైనప్ ధరలు రూ. 98,564 (ఆన్ రోడ్, ఢిల్లీ) నుండి ప్రారంభం అవుతాయి.

కొత్త 2022 మోడల్ టీవీఎస్ ఐక్యూబ్ (TVS iQube) విడుదల: ఇప్పుడు మరింత ఎక్కువ రేంజ్‌తో..

2022 TVS iQube - వేరియంట్లు, ధరలు

టీవీఎస్ మోటార్ కంపెనీ తమ పాపులర్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ను ఇప్పుడు మూడు వేరియంట్లలో విడుదల చేసింది. వీటిలో ఐక్యూబ్, ఐక్యూబ్ ఎస్ మరియు ఐక్యూబ్ ఎస్‌టి అనే వేరియంట్లు ఉన్నాయి. కస్టమర్ ఎంచుకునే వేరియంట్ ను బట్టి, వీటి రేంజ్ మరియు ఫీచర్లు మారుతూ ఉంటాయి. ఆసక్తిగల కస్టమర్లు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లను కేవలం రూ. 999 వద్ద రిజర్వ్ చేసుకోవచ్చు. ఈ మూడు వేరియంట్ల ఆన్-రోడ్ ధరల వివరాలు ఇలా ఉన్నాయి:

- 2022 TVS iQube - రూ. 98,564

- 2022 TVS iQube S - రూ. 1,08,690

- 2022 TVS iQube ST - ఇంకా వెల్లడించలేదు

(అన్ని ధరలు ఆన్ రోడ్, ఢిల్లీ)

కొత్త 2022 మోడల్ టీవీఎస్ ఐక్యూబ్ (TVS iQube) విడుదల: ఇప్పుడు మరింత ఎక్కువ రేంజ్‌తో..

2022 TVS iQube - బ్యాటరీ మరియు రేంజ్

కొత్త 2022 టీవీఎస్ ఐక్యూబ్ మరియు ఐక్యూబ్ ఎస్ రెండూ కూడా ఒకే 3.4 kwh బ్యాటరీ ప్యాక్ తో పనిచేస్తాయి. ఇవి పూర్తి ఛార్జ్‌ పై గరిష్టంగా 100 కిమీ రేంజ్ ను అందిస్తాయి. కాగా, కొత్త టీవీఎస్ ఐక్యూబ్ ఎస్‌టి వేరియంట్ పూర్తి చార్జ్ పై గరిష్టంగా 140 కిలోమీటర్ల రియల్ టైమ్ రేంజ్ ను అందించేలా కంపెనీ వీటిని అప్‌గ్రేడ్ చేసింది. ఇందుకోసం టాప్-ఎండ్ వేరియంట్ (ఐక్యూబ్ ఎస్‌టి) లో పెద్ద 5.1 kWh బ్యాటరీ ప్యాక్‌ను ఉపయోగించారు.

కొత్త 2022 మోడల్ టీవీఎస్ ఐక్యూబ్ (TVS iQube) విడుదల: ఇప్పుడు మరింత ఎక్కువ రేంజ్‌తో..

ఈ బ్యాటరీ ప్యాక్‌లు అన్నీ కూడా IP67 మరియు AIS156 సర్టిఫైడ్ చేయబడి, UL2271, ISO 12405 మరియు UN38.3 నిబంధనలకు అనుగుణంగా ఉంటాయని కంపెనీ తెలిపింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లలో బ్రష్‌లెస్ హబ్-మౌంటెడ్ DC మోటారు ఉంటుంది. ఈ బ్యాటరీ ప్యాక్ సాయంతో ఇది గరిష్టంగా 5.9 బిగెచ్‌పి శక్తిని మరియు 140 ఎన్ఎమ్ టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది. దీని రేట్ చేయబడిన పవర్ మరియు టార్క్ అవుట్‌పుట్ వరుసగా 3.04bhp మరియు 33Nm గా ఉంటుంది.

కొత్త 2022 మోడల్ టీవీఎస్ ఐక్యూబ్ (TVS iQube) విడుదల: ఇప్పుడు మరింత ఎక్కువ రేంజ్‌తో..

కొత్త TVS iQube ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క మూడు వేరియంట్‌లు కూడా కేవలం 4.2 సెకన్లలో గంటకు గరిష్టంగా 0 నుండి 140 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలవు . వీటిలో iQube మరియు iQube S యొక్క టాప్ స్పీడ్ 78 km/h గా ఉంటే, iQube ST యొక్క టాప్ స్పీడ్ 84 km/h గా ఉంటుందని కంపెనీ తెలిపింది.

కొత్త 2022 మోడల్ టీవీఎస్ ఐక్యూబ్ (TVS iQube) విడుదల: ఇప్పుడు మరింత ఎక్కువ రేంజ్‌తో..

2022 TVS iQube - చార్జింగ్

టీవీఎస్ కొత్తగా విడుదల చేసిన ఐక్యూబ్ మరియు ఐక్యూబ్ ఎస్ రెండు వేరియంట్లు కూడా 650W మరియు 950W ఛార్జర్ ను సపోర్ట్ చేస్తాయి. ఇవి 650W ఛార్జర్‌తో చార్జ్ చేసినప్పుడు నాలుగున్నర గంటల వ్యవధిలో 0-100 శాతం ఛార్జ్ అవుతాయి. అదే 950W ఛార్జర్ తో అయితే ఆ సమయాన్ని కేవలం 2 గంటల 50 నిమిషాలకు తగ్గించవచ్చు. కాగా, ఐక్యూబ్ ఎస్‌టి వేరియంట్ 950W మరియు 1.5kW ఛార్జర్లను సపోర్ట్ చేస్తుంది. ఇది 950W ఛార్జర్‌ తో 4 గంటల 6 నిమిషాల్లో పూర్తిగా ఛార్జ్ అవుతుంది మరియు1.5kW (1500W) ఛార్జర్ కేవలం రెండున్నర గంటలలోనే పూర్తిగా చార్జ్ అవుతుంది.

కొత్త 2022 మోడల్ టీవీఎస్ ఐక్యూబ్ (TVS iQube) విడుదల: ఇప్పుడు మరింత ఎక్కువ రేంజ్‌తో..

2022 TVS iQube - కొలతలు

కొత్త 2022 టీవీఎస్ ఐక్యూబ్ 1,805 మిమీ పొడవు, 645 మిమీ వెడల్పు మరియు 1,140 మిమీ ఎత్తును కలిగి ఉంటుంది. దీని వీల్‌బేస్ 1,301 మిమీ మరియు గ్రౌండ్ క్లియరెన్స్ 157 మిమీగా ఉంటుంది. టీవీఎస్ ఐక్యూబ్ సీట్ ఎత్తు భూమి నుండి 770 మిమీగా ఉంటుంది. ఇందులో గరిష్టంగా 32-లీటర్ల (ST వేరియంట్) అండర్ సీట్ స్టోరేజ్ కెపాసిటీ ఉంటుంది. బేస్ వేరియంట్ అయిన ఐక్యూబ్ బరువు 117.2 కిలోగ్రాములుగా ఉంటే, ఐక్యూబ్ ఎస్ మరియు ఐక్యూబ్ ఎస్‌టి వేరియంట్ల బరవు వరుసగా 118.8 కిలోగ్రాములు మరియు 128 కిలోగ్రాములగా ఉంది.

కొత్త 2022 మోడల్ టీవీఎస్ ఐక్యూబ్ (TVS iQube) విడుదల: ఇప్పుడు మరింత ఎక్కువ రేంజ్‌తో..

2022 TVS iQube ఫీచర్‌లు

ఇక ఫీచర్ల విషయానికి వస్తే, ఈ 2022 మోడల్ టీవీఎస్ ఐక్యూబ్ ఇప్పుడు ఈ బ్రాండ్ యొక్క లేటెస్ట్ కనెక్టింగ్ టెక్నాలజీ టీవీఎస్ స్మార్ట్ ఎక్స్ కనెక్ట్ (TVS SmartXonnet) కనెక్టివిటీ ఫీచర్లను సపోర్ట్ చేస్తుంది. దీనికోసం ఇందులో 5 ఇంచ్ ఫుల్ కలర్ TFT డిస్‌ప్లే ఉంటుంది. ఈ డిస్‌ప్లేను 5-వే జాయ్‌స్టిక్ ద్వారా నావిగేట్ చేయవచ్చు. కాగా, iQube S మరియు iQube ST వేరియంట్లు అప్‌గ్రేడ్ చేయబడిన 7 ఇంచ్ ఫుల్ కలర్ TFT యూనిట్‌ను పొందుతాయి. అయితే ఇందులో ST వేరియంట్ మాత్రమే టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే ఆప్షన్ ను పొందుతుంది.

కొత్త 2022 మోడల్ టీవీఎస్ ఐక్యూబ్ (TVS iQube) విడుదల: ఇప్పుడు మరింత ఎక్కువ రేంజ్‌తో..

లేటెస్ట్ TVS SmartXonnect సిస్టమ్ సాయంతో రైడర్లు మ్యూజిక్ ప్లేయర్ కంట్రోల్, OTA అప్‌డేట్‌లు, వాహన ఆరోగ్య స్థితి, భద్రతా నోటిఫికేషన్‌లు మరియు బహుళ బ్లూటూత్ మరియు క్లౌడ్ కనెక్టివిటీ ఎంపికలతో సహా అనేక కనెక్టివిటీ ఫీచర్‌లను పొందుతారు. ఇందులోని టాప్-ఎండ్ iQube ST వేరియంట్ అమెజాన్ అలెక్సా వాయిస్ అసిస్టెంట్ ను కూడా సపోర్ట్ చేస్తుంది. ఇది మొత్తం 11 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. వీటిలో ఐక్యూబ్ కోసం 3, ఐక్యూబ్ ఎస్ కోసం 4 మరియు ఐక్యూబ్ ఎస్‌టి కోసం 4 కలర్ ఆప్షన్లు ఉన్నాయి.

కొత్త 2022 మోడల్ టీవీఎస్ ఐక్యూబ్ (TVS iQube) విడుదల: ఇప్పుడు మరింత ఎక్కువ రేంజ్‌తో..

ఇక మెకానికల్ భాగాలను గమనిస్తే, ఈ మూడు వేరియంట్లు కూడా ముందు వైపు టెలీస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్ మరియు వెనుక అడ్జస్టబుల్ ట్విన్ షాక్‌లను కలిగి ఉంటాయి. అలాగే, ఫ్రంట్ బ్రేక్ 220ఎమ్ఎమ్ డిస్క్ రూపంలో ఉంటుంది మరియు వెనుక బ్రేక్ 130 డ్రమ్ బ్రేక్ గా ఉంటుంది. ఈ స్కూటర్ లో ఇరువైపులా 12 ఇంచ్ అల్లాయ్ వీల్స్ ఉంటాయి మరియు వాటిపై 90/90-12 సెక్షన్ టైర్‌లు అమర్చబడి ఉంటాయి.

Most Read Articles

English summary
New 2022 tvs iqube electric scooter launched price starts from rs 98564 specs range features
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X