మార్కెట్లో కొత్త యమహా ఎమ్‌టి-15 (2022 Yamaha MT-15) ఫేస్‌లిఫ్ట్ విడుదల: ధర మరియు ఫీచర్లు

జపాన్‌కు చెందిన ద్విచక్ర వాహన తయారీ సంస్థ యమహా, భారత మార్కెట్లో తమ కొత్త 2022 మోడల్ ఎమ్‌టి-15 బైక్‌ను విడుదల చేసింది. దేశీయ విపణిలో ఈ కొత్త 2022 యమహా ఎమ్‌టి-15 (2022 Yamaha MT-15) బైక్ ధర రూ. 1,59,500 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) గా ఉంది. ఈ కొత్త మోడల్‌లో కంపెనీ కొన్ని ముఖ్యమైన డిజైన్ అప్‌డేట్‌లు మరియు మెకానికల్ అప్‌గ్రేడ్స్ చేసింది. ఇప్పుడు ఇది ఈ బ్రాండ్ యొక్క MT సిరీస్ బైక్‌ల నుండి ప్రేరణ పొందిన కొత్త కలర్ ఆప్షన్లు మరియు బాడీ గ్రాఫిక్స్‌తో లభిస్తుంది.

మార్కెట్లో కొత్త యమహా ఎమ్‌టి-15 (2022 Yamaha MT-15) ఫేస్‌లిఫ్ట్ విడుదల: ధర మరియు ఫీచర్లు

కొత్త 2022 Yamaha MT-15 ఇప్పుడు సరికొత్త ఇన్వర్టెడ్ ఫ్రంట్ ఫోర్క్స్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు బాడీ గ్రాఫిక్స్‌తో వస్తుంది. అంతేకాకుండా, ఇందులో కొత్త మరియు తేలికపాటి అల్యూమినియం స్వింగ్ ఆర్మ్‌ను కూడా ఉపయోగించారు. ఈ సస్పెన్షన్ సెటప్ లో చేసిన మార్పుల కారణంగా, ఇది బైక్ యొక్క లీనింగ్ మరియు బ్రేకింగ్ పనితీరును కూడా మెరుగుపరుస్తుందని కంపెనీ పేర్కొంది. ఈ కొత్త మోడల్ తయారీలో యమహా యొక్క డెల్టా బాక్స్ ఫ్రేమ్‌ను ఉపయోగించారు.

మార్కెట్లో కొత్త యమహా ఎమ్‌టి-15 (2022 Yamaha MT-15) ఫేస్‌లిఫ్ట్ విడుదల: ధర మరియు ఫీచర్లు

ముందు వైపు 37 మిమీ ఇన్‌వర్టెడ్ ఫ్రంట్ ఫోర్క్‌లను కలిగి మరియు వెనుక వైపున మోనో-షాక్ సస్పెన్షన్‌ను ఉపయోగించారు. బ్రేకింగ్ విషయానికి వస్తే, ముందు వైపున 282 మిమీ డిస్క్ బ్రేక్ మరియు వెనుక వైపున 220 మిమీ డిస్క్ బ్రేక్ ఉంటాయి. ఇవి రెండూ కూడా సింగిల్-ఛానల్ ఏబిఎస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్) ను సపోర్ట్ చేస్తాయి. డెల్టా బాక్స్ ఫ్రేమ్‌పై రూపొందించబడిన కారణంగా, ఇది దాని విభాగంలోనే అత్యంత తేలికైన బైక్‌లలో ఒకటిగా ఉంటుంది. కొత్త 2022 MT-15 యొక్క మొత్తం బరువు కేవలం 139 కిలోలుగా మాత్రమే ఉంటుంది.

మార్కెట్లో కొత్త యమహా ఎమ్‌టి-15 (2022 Yamaha MT-15) ఫేస్‌లిఫ్ట్ విడుదల: ధర మరియు ఫీచర్లు

కంపెనీ ఈ నేక్డ్ స్ట్రీట్ ఫైటర్ బైక్‌కు ప్రత్యేకమైన ఎల్ఈడి హెడ్‌లైట్, ఎల్ఈడి టెయిల్ లైట్ మరియు ఎల్ఈడి పొజిషన్ లైట్ లను జోడించింది. ఇంకా ఇందులో కొత్త ఎల్‌సిడి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా అందుబాటులో ఉంటుంది మరియు ఇది బ్లూటూత్ కనెక్టివిటీ ఫీచర్ ను కూడా కలిగి ఉంటుంది. ఈ డిస్‌ప్లేలో, గేర్ ఇండికేటర్, సైడ్ స్టాండ్ ఇండికేటర్, ఆర్‌పిఎమ్ మరియు స్పీడోమీటర్‌కు గురించిన సమాచారం అందుబాటులో ఉంటుంది.

మార్కెట్లో కొత్త యమహా ఎమ్‌టి-15 (2022 Yamaha MT-15) ఫేస్‌లిఫ్ట్ విడుదల: ధర మరియు ఫీచర్లు

అంతేకాకుండా, రైడర్లు యమహా వై-కనెక్ట్ యాప్ సాయంతో తమ స్మార్ట్‌ఫోన్‌ను ఈ మోటార్‌సైకిల్‌తో అనుసంధానం చేసుకోవచ్చు మరియు వివిధ రకాల సమాచారాన్ని పొందవచ్చు. ఇది స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ స్థితితో పాటు కాల్, ఇ-మెయిల్ మరియు SMS అలెర్ట్స్ ను కూడా ప్రదర్శిస్తుంది. అంతేకాకుండా, ఈ యాప్ సాయంతో మోటార్‌సైకిల్ మెయింటెనెన్స్ సమాచారం, చివరిగా పార్కింగ్ చేసిన స్థలం, ఇంధన వినియోగం, మెకానికల్ లోపాలు మరియు ఇతర డేటా పాయింట్లకు సంబంధించిన సమాచారాన్ని కూడా పొందవచ్చు.

మార్కెట్లో కొత్త యమహా ఎమ్‌టి-15 (2022 Yamaha MT-15) ఫేస్‌లిఫ్ట్ విడుదల: ధర మరియు ఫీచర్లు

కొత్త 2022 Yamaha MT-15 లో పరిచయం చేయబడిన ఫుల్ డిజిటల్ ఎల్‌సిడి ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ పూర్తిగా కొత్త ఫీచర్. ఇది ఇగ్నిషన్ ఆన్ చేసినప్పుడు కస్టమైజ్ చేయదగిన యానిమేటెడ్ టెక్స్ట్‌ను కూడా ప్రదర్శిస్తుంది. కొత్త డిస్ప్లేలో గేర్ షిఫ్ట్, గేర్ పొజిషన్ మరియు వివిఏ సూచికలు కూడా ఉంటాయి. ఈ కొత్త 2022 మోడల్ పైన తెలిపిన మార్పులు చేర్పుల మినహా డిజైన్ పరంగా పెద్దగా అప్‌గ్రేడ్స్ ఏమీ చేయలేదు.

మార్కెట్లో కొత్త యమహా ఎమ్‌టి-15 (2022 Yamaha MT-15) ఫేస్‌లిఫ్ట్ విడుదల: ధర మరియు ఫీచర్లు

అయితే, ఈ నేక్డ్ స్ట్రీట్‌ఫైటర్‌కి యొక్క అగ్రెసివ్ రూపానికి తగినట్లుగా కంపెనీ ఇందులో కొత్త గ్రాఫిక్‌లను అందించింది. కొత్త 2022 యమహా ఎమ్‌టి-15 ఇప్పుడు సరికొత్త కలర్ ఆప్షన్లలో లబిస్తుంది. ఇందులో సియాన్ స్టార్మ్, రేసింగ్ బ్లూ ఐస్ ఫ్లూ వెర్మిలియన్ మరియు మెటాలిక్ బ్లాక్ కలర్ ఆప్షన్లు ఉన్నాయి. ఇక వీల్స్ అండ్ టైర్స్ విషయానికి వస్తే, కొత్త 2022 Yamaha MT-15 బైక్ లో 17 ఇంచ్ వీల్స్ పై 100/80-17M/C (ముందు) మరియు 140/70R17 (వెనుక) ట్యూబ్‌లెస్ టైర్‌లను ఉపయోగించారు.

మార్కెట్లో కొత్త యమహా ఎమ్‌టి-15 (2022 Yamaha MT-15) ఫేస్‌లిఫ్ట్ విడుదల: ధర మరియు ఫీచర్లు

ఇంజన్ పరంగా ఈ కొత్త బైక్‌లో ఎలాంటి మార్పులు చేయలేదు. కొత్త 2022 మోడల్ ఎమ్‌‍టి-15 బైక్‌లో మునుపటి వెర్షన్ లో ఉపయోగించిన అదే 155 సిసి, లిక్విడ్-కూల్డ్, 4-స్ట్రోక్, ఎస్ఓహెచ్‌సి, 4-వాల్వ్ ఫ్యూయల్-ఇంజెక్ట్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది వేరియబుల్ వాల్వ్ యాక్చుయేషన్ (VVA) సిస్టమ్‌తో గరిష్టంగా 10,000 ఆర్‌పిఎమ్ వద్ద 18.1 బిహెచ్‌పి శక్తిని మరియు 7,500 ఆర్‌పిఎమ్ వద్ద 14.1 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ స్లిప్పర్ మరియు అసిస్ట్ క్లచ్ ఫంక్షనాలిటీతో కూడిన 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది.

మార్కెట్లో కొత్త యమహా ఎమ్‌టి-15 (2022 Yamaha MT-15) ఫేస్‌లిఫ్ట్ విడుదల: ధర మరియు ఫీచర్లు

యమహా ఎమ్‌టి-15 వి2.0 బైక్ గురించి సింపుల్ గా చెప్పాలంటే, ఇది కంపెనీ ప్రస్తుతం మార్కెట్లో విక్రయిస్తున్న ఫుల్లీ ఫెయిర్డ్ వెర్షన్ యమహా వైజెడ్ఎఫ్-ఆర్15 (Yamaha YZF-R15) స్పోర్ట్స్ బైక్ యొక్క నేక్డ్ స్ట్రీట్ ఫైటర్ వెర్షన్ గా ఉంటుంది. అయితే, యమహా ఆర్-15 తో పోల్చుకుంటే, ఎమ్‌టి-15 ఫెయిరింగ్ మరియు కొన్ని ప్రీమియం భాగాలను కోల్పోవడం వలన ఇది చాలా తేలికైన మరియు చురుకైన నేక్డ్ స్ట్రీట్‌ఫైటర్‌గా ఉంటుంది. ఎమ్‌టి-15 బైక్ లో నిటారుగా ఉన్న రైడింగ్ పొజిషన్, అద్భుతమైన పవర్-టు-వెయిట్ రేషియో మరియు అతి చురుకైన హ్యాండ్లింగ్ వంటి ఫీచర్లతో ఈ మోటార్‌సైకిల్ ఓ మంచి ఫన్ టూ రైడ్ బైక్ గా ఉంటుంది.

Article Published On: Monday, April 11, 2022, 18:19 [IST]
English summary
New 2022 yamaha mt 15 facelift launched in india price specs and features
Read more on: #యమహా #yamaha
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+