భారత మార్కెట్లో సరికొత్త 2022 Yamaha MT-15 V2.0 బైక్ లాంచ్ డేట్ ఫిక్స్.. ఈ బైక్ గురించి మాకేమి తెలుసంటే..?

యమహా అభిమానులారా ఈ గుడ్ న్యూస్ మీ కోసమే..! జపనీస్ టూవీలర్ బ్రాండ్ యమహా మోటార్ ఇండియా (Yamaha Motor India) దేశీయ విపణిలో విక్రయిస్తున్న ఎమ్‌టి-15 (MT-15) లో ఓ సరికొత్త మోడల్ ను మార్కెట్లో విడుదల చేసేందుకు సిద్ధమైంది. యమహా తమ ఎమ్‌టి-15 బైక్‌లో ఓ కొత్త వెర్షన్ 2.0 (టూ పాయింట్ ఓ)ని ఈ నెల 11న (ఏప్రిల్ 11, 2002వ తేదీన) మార్కెట్లో విడుదల చేయనుంది. మరి ఈ కొత్త 2022 యమహా ఎమ్‌టి-15 వి2.0 (2022 Yamaha MT-15 V2.0) నేక్డ్ స్ట్రీట్ ఫైటర్ మోటార్‌సైకిల్‌కు సంబంధించిన మరింత సమాచారాన్ని ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

భారత మార్కెట్లో సరికొత్త 2022 Yamaha MT-15 V2.0 బైక్ లాంచ్ డేట్ ఫిక్స్.. ఈ బైక్ గురించి మాకేమి తెలుసంటే..?

యమహా ఎమ్‌టి-15 వి2.0 బైక్ గురించి సింపుల్ గా చెప్పాలంటే, ఇది కంపెనీ ప్రస్తుతం మార్కెట్లో విక్రయిస్తున్న ఫుల్లీ ఫెయిర్డ్ వెర్షన్ యమహా వైజెడ్ఎఫ్-ఆర్15 (Yamaha YZF-R15) స్పోర్ట్స్ బైక్ యొక్క నేక్డ్ స్ట్రీట్ ఫైటర్ వెర్షన్ గా ఉంటుంది. కంపెనీ ఇప్పుడు ఇందులో కాస్మెటిక్ మరియు మెకానికల్ అప్‌డేట్‌లతో కూడిన కొత్త 2022 మోడల్ ను వచ్చే వారం మార్కెట్లో విడుదల చేయబోతోంది.

భారత మార్కెట్లో సరికొత్త 2022 Yamaha MT-15 V2.0 బైక్ లాంచ్ డేట్ ఫిక్స్.. ఈ బైక్ గురించి మాకేమి తెలుసంటే..?

యమహా ఎమ్‌టి-15 బైక్ ను కంపెనీ మొదటిసారిగా డిసెంబర్ 2018లో థాయిలాండ్‌ మార్కెట్లో విడుదల చేసింది. ఆ తర్వాత కొన్ని నెలలకు, 2019లో యమహా ఈ బైక్ ను భారతదేశంలో కూడా విడుదల చేసింది. యమహా ఆర్-15 తో పోల్చుకుంటే, ఎమ్‌టి-15 ఫెయిరింగ్ మరియు కొన్ని ప్రీమియం భాగాలను కోల్పోవడం వలన ఇది చాలా తేలికైన మరియు చురుకైన నేక్డ్ స్ట్రీట్‌ఫైటర్‌గా ఉంటుంది.

భారత మార్కెట్లో సరికొత్త 2022 Yamaha MT-15 V2.0 బైక్ లాంచ్ డేట్ ఫిక్స్.. ఈ బైక్ గురించి మాకేమి తెలుసంటే..?

యమహా ఎమ్‌టి-15 బైక్ లో నిటారుగా ఉన్న రైడింగ్ పొజిషన్, అద్భుతమైన పవర్-టు-వెయిట్ రేషియో మరియు అతి చురుకైన హ్యాండ్లింగ్ వంటి ఫీచర్లతో ఈ మోటార్‌సైకిల్ ఓ మంచి ఫన్ టూ రైడ్ బైక్ గా ఉంటుంది. అయితే, అమ్మకాల పరంగా, మునుపటి ఎమ్‌టి-15 కంపెనీ ఆశించిన పనితీరును ప్రదర్శించలేదు. దీంతో యమహా, ఈ మోటార్‌సైకిల్‌ కు కొత్త ప్రారంభాన్ని అందించేందుకు ఇప్పుడు దీనిని వెర్షన్ 2.0 పేరుతో కొన్ని మేజర్ అప్‌డేట్స్ చేసి మార్కెట్లోకి విడుదల చేస్తోంది.

భారత మార్కెట్లో సరికొత్త 2022 Yamaha MT-15 V2.0 బైక్ లాంచ్ డేట్ ఫిక్స్.. ఈ బైక్ గురించి మాకేమి తెలుసంటే..?

కొత్త 2022 మోడల్ యమహా ఎమ్‌టి-15 వెర్షన్ 2.0 (2022 Yamaha MT-15 V2.0) బైక్ ను కంపెనీ తమ లేటెస్ట్ యమహా ఆర్15 వెర్షన్ 4.0 (Yamaha R15 V4.0) ను ఆధారంగా చేసుకొని తయారు చేయనుంది. అంటే, దీని అర్థం ఈ కొత్త మోటార్‌సైకిల్ లోని అనేక భాగాలు కూడా అప్‌గ్రేడ్ అవుతాయని స్పష్టంగా తెలుస్తోంది. ఇందులో ట్రెడిషన్ టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్కుల స్థానంలో తలక్రిందులుగా ఉండే అప్‌సైడ్ డౌన్ ఫోర్కులు ఉంటాయి. వీటినని నేరుగా ఆర్15 మోడల్ నుండి గ్రహించనున్నారు. ఇవి గోల్డ్ షేడ్‌లో ఫినిష్ చేయబడి ఉండి, బైక్ మంచి ప్రీమియం లుక్ ని అందిస్తాయి.

భారత మార్కెట్లో సరికొత్త 2022 Yamaha MT-15 V2.0 బైక్ లాంచ్ డేట్ ఫిక్స్.. ఈ బైక్ గురించి మాకేమి తెలుసంటే..?

అయితే, ఈ బైక్ వెనుక భాగంలో మాత్రం అదే మోనోషాక్ సస్పెన్షన్ సెటప్ ఉంటుంది మరియు ఆర్15 మాదిరిగానే అదే స్వింగ్‌ఆర్మ్ ను కూడా కలిగి ఉంటుంది. పాత మోడల్ యమహా ఎమ్‌టి-15లో చౌకైన బాక్స్-టైప్ స్వింగార్మ్ ఉపయోగించిన సంగతి తెలిసినదే. ఇప్పుడది ఆర్15 మోడల్ లోని స్వింగ్ఆర్మ్ తో రీప్లేస్ చేయబడుతుంది. అలాగే, ముందువైపు 282 మిమీ డిస్క్ మరియు వెనుక వైపు 220 మిమీ డిస్క్ బ్రేక్స్ కూడా ఇందులో ఉంటాయి. అయితే, కంపెనీ ఈసారి ఇందులో సింగిల్-ఛానల్ ఏబిఎస్ కు బదులుగా డ్యూయల్-ఛానల్ ఏబిఎస్ ను అందిస్తుందని ఆశిస్తున్నాము.

భారత మార్కెట్లో సరికొత్త 2022 Yamaha MT-15 V2.0 బైక్ లాంచ్ డేట్ ఫిక్స్.. ఈ బైక్ గురించి మాకేమి తెలుసంటే..?

ఇక డిజైన్ మరియు స్టైలింగ్ విషయానికి వస్తే, యమహా ఎమ్‌టి-15 నేక్డ్ స్ట్రీట్ ఫైటర్ బైక్ ఇప్పటికే అందమైన లుక్ ని కలిగి ఉండి, బైక్ ప్రియులను ఎంతగానో ఆక్టటుకుంటోంది. కాబట్టి, కంపెనీ దీని ఓవరాల్ డిజైన్ సిల్హౌట్ ను అలానే ఉంచుతూ, కొద్దిపాటి కాస్మెటిక్ అప్‌గ్రేడ్స్ మాత్రమే చేసే అవకాశం ఉంది. సింపుల్ గా చెప్పాలంటే, దీని ఓవరాల్ డిజైన్ పెద్దగా మారకపోవచ్చు. ఈ కొత్త మోటార్‌సైకిల్‌ను మునుపటి మోడల్ కంటే సన్నగా కనిపించేలా చేసేందుకు కంపెనీ ప్రయత్నించవచ్చు. కొత్త కలర్ ఆప్షన్లు మరియు గ్రాఫిక్ డిజైన్‌లను కూడా ఆశించవచ్చు.

భారత మార్కెట్లో సరికొత్త 2022 Yamaha MT-15 V2.0 బైక్ లాంచ్ డేట్ ఫిక్స్.. ఈ బైక్ గురించి మాకేమి తెలుసంటే..?

కొత్త యమహా ఎమ్‌టి-15 వెర్షన్ 2.0 బైక్ లో ప్రస్తుత ఆర్15 వెర్షన్ 4.0 బైక్ లో ఉపయోగిస్తున్న అదే 155 సిసి ఇంజన్ ను ఉపయోగించనున్నారు. ఈ ఇంజన్. 10,000 ఆర్‌పిఎమ్ వద్ద 18.1 బిహెచ్‌పి శక్తిని మరియు 7,500 ఆర్‌పిఎమ్ వద్ద 14.2 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ అధునాతన VVA (వేరియబుల్ వాల్వ్ యాక్చుయేషన్)తో కూడిన లిక్విడ్-కూల్డ్, సింగిల్-సిలిండర్ ఇంజన్ 6 స్పీడ్ గేర్‌బాక్స్ తో జతచేయబడి ఉంటుంది. ఈ మోటార్‌సైకిల్‌లో స్లిప్ మరియు అసిస్ట్ క్లచ్ ఆప్షన్ కూడా ఉంటుంది.

భారత మార్కెట్లో సరికొత్త 2022 Yamaha MT-15 V2.0 బైక్ లాంచ్ డేట్ ఫిక్స్.. ఈ బైక్ గురించి మాకేమి తెలుసంటే..?

అయితే, యమహా ఆర్15 వెర్షన్ 4.0 యొక్క టాప్-స్పెక్ వేరియంట్‌లలో అందించబడుతున్న ట్రాక్షన్ కంట్రోల్ మరియు క్విక్‌షిఫ్టర్‌ వంటి ఫీచర్లు కొత్త 2022 యమహా ఎమ్‌టి-15 వెర్షన్ 2.0 లో కూడా అందించబడతాయా లేదా అనేది ఇంకా తెలియదు. ఇదివరకు చెప్పుకున్నట్లుగా Yamaha MT-15 ఓ స్టైలిష్ మరియు ఫన్ టూ రైడ్ మోటార్‌సైకిల్ గా ఉంటుంది. ఈ కొత్త బైక్ లో చేయబోయే అప్‌డేట్స్ కారణంగా దీని ధర కూడా అధికంగా ఉంటుందని తెలుసితోంది. పాత మోడల్ తో పోలిస్తే, దీని ధర దాదాపు రూ.10,000 నుంచి 15,000 వరకు అధికంగా ఉండవచ్చని అంచనా.

More from DriveSpark

Article Published On: Wednesday, April 6, 2022, 11:34 [IST]
English summary
New 2022 yamaha mt 15 v20 india launch on 11th april all we know about this street fighter
Read more on: #యమహా #yamaha
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+