అప్‌డేటెడ్ 2023 సిరీస్ డ్యుకాటి పానిగేల్ వి4 మోడళ్లు విడుదల: వీటిలో కొత్తగా ఏం మార్చారంటే..
ఇటలీకి చెందిన ప్రముఖ మోటార్‌సైకిల్ తయారీ సంస్థ డ్యుకాటి (Ducati) భారత మార్కెట్లో విక్రయిస్తున్న పానిగేర్ వి4 సిరీస్‌లో కొత్త 2023 మోడల్ లైనప్‌ను విడుదల చేసింది. ఇటీవలే అంతర్జాతీ మార్కెట్లలో విడుదలైన కొత్త 2023 పానిగేల్ వి4 (2023 Ducati Panigale V4) సిరీస్ ఇప్పుడు భారత మార్కెట్లో కూడా అందుబాటులోకి వచ్చింది. డ్యుకాటి పానిగేల్ వి4 సిరీస్‌లో మొత్తం మూడు మోడళ్లు అందుబాటులో ఉన్నాయి.
Recommended Video
ఈ సూపర్‌స్పోర్ట్ సిరీస్ గతంలో కంటే ఇప్పుడు మరింత అగ్రెసివ్‌గా మరియు చాలా ప్రత్యేకంగా ఉంటాయని కంపెనీ తెలిపింది. అంతేకాకుండా, ఈ కొత్త మోడల్ ఇప్పుడు అనేక అధునాతన ఎలక్ట్రానిక్ రైడర్ అసిస్టెన్స్ ఫీచర్లతో మెరుగుపరచబడిందని కంపెనీ తెలిపింది. ఈ కొత్త ఫీచర్లన్నీ కూడా డ్యుకాటి పానిగేల్ వి4 సూపర్‌ఫాస్ట్ మోటార్‌సైకిల్‌ను చక్కగా హ్యాండిల్ చేయడంలో రైడర్‌కు ఎంతగానో సహాయపడుతాయి.

భారత మార్కెట్లో అప్‌డేట్ చేయబడిన కొత్త 2023 డ్యుకాటి పానిగేల్ వి4 ధరలు ఇలా ఉన్నాయి:
- Ducati Panigale V4 - రూ. 26,49,00
- Ducati Panigale V4S - రూ. 31,99,000
- Ducati Panigale V4 SP2 - రూ. 40,99,00
(పైన పేర్కొన్న అన్ని ధరలు ఎక్స్-షోరూమ్)

కొత్త 2023 డ్యుకాటి పానిగేల్ వి4 సిరీస్ మోటార్‌సైకిళ్లలో బేస్ వేరియంట్ ఇప్పుడు కొత్త ఇంజన్ బ్రేక్ కంట్రోల్ (EBC) ఇవో 2 సాఫ్ట్‌వేర్‌తో అమర్చబడింది, ఇది మూడు ఎంచుకోదగిన స్థాయిలలో గేర్-బై-గేర్ కాలిబ్రేషన్‌ను కలిగి ఉంటుంది. బ్రేకింగ్ మరియు కార్నర్ చేసేటప్పుడు బైక్ యొక్క స్థిరత్వాన్ని మరియు ఖచ్చితత్వాన్ని మెరుగుపరచడం, అలాగే ఓవరాల్ ఇంజన్ బ్రేకింగ్ తీవ్రతను మెరుగుపరచడం కోసం కంపెనీ ఈ మార్పు చేసినట్లు వెల్లడించింది.

అంతేకాకుండా, మెరుగైన గేర్‌షిఫ్ట్ లిక్విడిటీ కోసం ఇది డుకాటి క్విక్ షిఫ్ట్ (DQS) అనే కొత్త టెక్నాలజీని కూడా పొందుతుంది. అలాగే, ఇంజన్ త్వరగా వేడెక్కకుండా ఉండేందుకు మెరుగైన థర్మల్ మేనేజ్‌మెంట్‌ను అందించడంలో సహాయపడే కొత్త కూలింగ్ టెక్నాలజీ అప్‌డేట్‌లు కూడా ఇందులో చేయబడ్డాయి. దీని వలన ఈ బైక్ పై రేస్ ట్రాక్ చుట్టూ కొన్ని హాట్ ల్యాప్‌లు చేసిన తర్వాత బైక్‌ను మునుపటి కంటే వేగంగా చల్లబరచడంలో ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుంది.

ఈ కొత్త 2023 సిరీస్ లైనప్‌లో చేసిన ఇతర మార్పులలో మరింత ఖచ్చితమైన లీన్ యాంగిల్ కొలత మరియు మెరుగైన టార్క్ డెలివరీ కోసం ట్రాక్షన్ కంట్రోల్ మరియు రైడ్-బై-వైర్ టెక్నాలజీని మెరుగుపరచడం జరిగింది. ఇందులోని టాప్-ఆఫ్-ది లైన్ వేరియంట్ అయిన SP2 వేరియంట్ ప్రత్యేక 'వింటర్ టెస్ట్' లైవరీతో వస్తుంది. ఇది 520 ఫైనల్ డ్రైవ్ చైన్, STM-EVO SBK డ్రై క్లచ్, బ్రెంబో MCS (మల్టిపుల్ క్లిక్ సిస్టమ్) రేడియల్ పంప్ మరియు ముందు భాగంలో రిమోట్ అడ్జస్టర్‌తో జత చేయబడిన బ్రెంబో స్టైల్మా ఆర్ కాలిపర్‌లను కలిగి ఉంటుంది.

ఇకపోతే, స్పోర్ట్స్ ప్రొడక్షన్ (SP) వేరియంట్‌లో పానిగేల్ బైక్ యొక్క రైడింగ్ అనుభవాన్ని మరింత మెరుగుపరచడానికి, డ్యుకాటి ఇందులో రిజోమా నుండి గ్రహించిన యానోడైజ్డ్ ఫుట్‌పెగ్స్ మరియు మెగ్నీషియం వీల్స్‌ను అమర్చింది. ఇంకా ఇందులో ఓహ్లిన్స్ నుండి గ్రహించిన NPX25/30 ఫ్రంట్ ఫోర్క్, వెనుక వైపు ఓహ్లిన్స్ TTX36 మోనోషాక్ రియరర్ సస్పెన్షన్ సెటప్, అలాగే ఓహ్లిన్ నుండి గ్రహించిన ఎలక్ట్రానిక్ స్టీరింగ్ డాంపర్ వంటి అత్యుత్తమైన విడిభాగాలను కూడా పొందుతుంది.

పైన తెలిపిన మార్పులు మినహా కొత్త 2023 డ్యుకాటి పానిగేల్ వి4 సిరీస్‌లో యాంత్రికంగా ఎలాంటి మార్పులు చేయలేదు. మునుపటి తరం మోడళ్లలో ఉపయోగించిన అదే 1103సీసీ డెస్మోసెడిసి స్ట్రాడేల్ వి4 ఇంజన్‌ను ఈ కొత్త మోడళ్లలో కూడా ఉపయోగించారు. ఈ ఇంజన్ 13,000 ఆర్‌పిఎమ్ వద్ద 215.5 బిహెచ్‌పి శక్తిని మరియు 123.6 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అయితే, ఈ పవర్ అవుట్‌పుట్ 2021 పానిగేల్ వి4 కంటే 1.5 బిహెచ్‌పి ఎక్కువగా ఉంటుంది.

మోటార్‌సైకిల్ ఫుల్, హై, మీడియం మరియు లో అనే నాలుగు ఇంజన్ కాన్ఫిగరేషన్‌లలో అందించబడుతుంది. వీటిని పవర్ మోడ్‌లు అని పిలుస్తారు, ఇవి పానిగేల్ వి4లో రైడర్ యొక్క రైడింగ్ అవసరాన్ని బట్టి ఉత్తమమైన ఇంజన్ పనితీరును అందించడంలో సహకరిస్తాయి. భారత ప్రీమియం మోటార్‌సైకిల్ మార్కెట్లో కొత్తగా వచ్చిన 2023 డ్యుకాటి వి4 సిరీస్ మోడళ్లు ఈ విభాగంలో BMW S 1000 RR మరియు Kawasaki Ninja ZX10R వంటి మోటార్‌సైకిళ్లతో పోటీ పడుతాయి.

భారత్‌లో డ్యుకాటి స్ట్రీట్‌ఫైటర్ వి2 (Ducati Streetfighter V2) విడుదల
ఇదిలా ఉంటే డ్యుకాటి ఇటీవలే భారత మార్కెట్లో తమ సరికొత్త స్ట్రీట్‌ఫైటర్ వి2 (Ducati Streetfighter V2) మోటార్‌సైకిల్‌ను మార్కెట్లో విడుదల చేసింది. దేశీయ విపణిలో ఈ కొత్త డ్యుకాటి స్పోర్ట్స్ బైక్ ధర రూ. 17.25 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది. - ఈ బైక్ కు సంబంధించిన మరిన్ని వివరాల కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications








