భారత మార్కెట్లో కొత్త 2023 కవాసకి నింజా జెడ్ఎక్స్ 10ఆర్ (Kawasaki Ninja ZX 10R) విడుదల

జపనీస్ టూవీలర్ బ్రాండ్ కవాసకి (Kawasaki) భారత మార్కెట్లో విక్రయిస్తున్న నింజా సిరీస్‌లో ఓ కొత్త అప్‌డేటెడ్ మోడల్‌ను పరిచయం చేసింది. కవాసకి నింజా జెడ్ఆర్ 10ఆర్ (2023 Kawasaki Ninja ZX 10R) లో కొత్త 2023 మోడల్‌ను కంపెనీ తాజాగా విడుదల చేసింది.

Recommended Video

కవాసకి 2022 జెడ్650 బైక్ యొక్క సమాచారం

భారత మార్కెట్లో ఈ కొత్త 2023 కవాసకి నింజా జెడ్ఎక్స్ 10ఆర్ స్పోర్ట్స్ బైక్ ధర రూ. 15.99 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా ఉంది. గతేడాది కంపెనీ విడుదల చేసిన 2022 మోడల్ నింజా జెడ్ఎక్స్ 10ఆర్ ధరతో పోలిస్తే, ఈ కొత్త 2023 మోడల్ ధర దాదాపు రూ.85,000 ఎక్కువగా ఉంది. అయితే, పెరిగిన ధరకు అనుగుణంగా కంపెనీ ఇందులో కొత్త ఫీచర్లు మరియు పరికరాలను అందిస్తోంది. కొత్త 2023 కవాసకి నింజా జెడ్ఎక్స్-10ఆర్ ఒకే ఒక వేరియంట్‌లో, ఫుల్లీ లోడెడ్ ఫీచర్లతో అందుబాటులో ఉంటుంది.

భారత మార్కెట్లో కొత్త 2023 కవాసకి నింజా జెడ్ఎక్స్ 10ఆర్ (Kawasaki Ninja ZX 10R) విడుదల

కలర్ ఆప్షన్స్ విషయానికి వస్తే, కొత్త 2023 కవాసకి నింజా జెడ్ఎక్స్-10ఆర్ ఈ జపనీస్ బ్రాండ్ యొక్క సిగ్నేచర్ లైమ్ గ్రీన్ కలర్ ఆప్షన్‌తో పాటుగా పెరల్ రోబోటిక్ వైట్ అనే మరో కలర్ ఆప్షన్‌లో కూడా లభిస్తుంది. అంతేకాకుండా, ఈ కొత్త మోడల్ మోటార్‌సైకిల్‌ను మరింత 'రేస్' స్పెక్ మోడల్‌లా కనిపించేలా చేయడానికి కంపెనీ ఇందులో సరికొత్త గ్రాఫిక్స్‌ను జోడించింది. ఎక్స్టీరియర్‌లో ఈ చిన్నపాటి మార్పుల మినహా, ఇది దాదాపు మునుపటి 2022 మోడల్ మాదిరిగానే కనిపిస్తుంది.

భారత మార్కెట్లో కొత్త 2023 కవాసకి నింజా జెడ్ఎక్స్ 10ఆర్ (Kawasaki Ninja ZX 10R) విడుదల

అయితే, కవాసకి ఇంజనీర్లు ఈ కొత్త మోటార్‌సైకిల్‌ను కొంచెం పోటీగా మరియు సమకాలీనంగా మార్చడానికి ఇందులో కొన్ని సూక్ష్మమైన మార్పులు చేశారు. కొత్త 2023 కవాసకి నింజా జెడ్ఎక్స్-10ఆర్ సూపర్‌బైక్ అదే ట్విన్-స్పార్ టైప్ కాస్ట్ అల్యూమినియం ఫ్రేమ్‌ను ఉపయోగించడం కొనసాగిస్తుంది, పెద్ద 17 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ మరియు పూర్తి ఫెయిరింగ్‌తో గంభీరమైన రోడ్ ప్రజెన్స్‌ని కలిగి ఉంటుంది. ఈ ఫెయిరింగ్ పాత మోడల్‌లా కనిపించినప్పటికీ, అధిక వేగంతో ప్రయాణిస్తున్నప్పుడు ముందు భాగంలో స్థిరంగా ఉంచడానికి మరియు అదనపు డౌన్‌ఫోర్స్‌ను అందించడానికి ఇది ఇంటిగ్రేటెడ్ వింగ్‌లెట్‌లను కలిగి ఉంటుంది.

భారత మార్కెట్లో కొత్త 2023 కవాసకి నింజా జెడ్ఎక్స్ 10ఆర్ (Kawasaki Ninja ZX 10R) విడుదల

అలాగే, కొత్త 2023 కవాసకి నింజా జెడ్ఎక్స్-10ఆర్ సూపర్‌బైక్ ఇప్పుడు కొత్త 'ర్యామ్ ఇంటేక్'తో కూడా వస్తుంది. ఇందులోని ట్విన్-పాడ్ ఎల్ఈడి హెడ్‌లైట్లు, సొగసైన టెయిల్ ల్యాంప్, తక్కువ ఎయిర్ డ్రాగ్ కోసం పెద్ద విండ్‌స్క్రీన్ మరియు వంటి ఇతర ఫీచర్లు ఉన్నాయి. ఈ కొత్త మోడల్‌లో కొత్తగా చేర్చిన ఫీచర్ ఏంటంటే, బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన 4.3 ఇంచ్ టిఎఫ్‌టి ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌. రైడర్ తన స్మార్ట్‌ఫోన్ సాయంతో మోటార్‌సైకిల్‌కు రిమోట్‌గా కనెక్ట్ అయిన అనేక రకాల సమాచారాన్ని తెలుసుకోవడానికి ఈ ఫీచర్ ఎంతగానో ఉపయోగపడుతుంది.

భారత మార్కెట్లో కొత్త 2023 కవాసకి నింజా జెడ్ఎక్స్ 10ఆర్ (Kawasaki Ninja ZX 10R) విడుదల

ఇక ఇందులోని ఇతర ఫీచర్లలో డ్యూయల్-ఛానల్ ఏబిఎస్, ట్రాక్షన్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్, రైడ్-బై-వైర్ థ్రోటల్ మరియు మల్టిపుల్ రైడ్ మోడ్‌లు ఉన్నాయి. మెకానికల్స్ విషయానికి వస్తే, కొత్త 2023 కవాసకి నింజా జెడ్ఎక్స్-10ఆర్ సూపర్‌బైక్ ముందు వైపున 43 మిమీ ఇన్వర్టెడ్ బ్యాలెన్స్ ఫ్రీ ఫోర్క్స్ (BFF) మరియు వెనుకవైపు హారిజాంటల్ బ్యాక్-లింక్, గ్యాస్-ఛార్జ్డ్ మోనో-షాక్ సస్పెన్షన్ సెటప్ ఉంటాయి. ఇక బ్రేకింగ్ విషయానికి వస్తే, ముందు వైపున డ్యూయల్ సెమీ-ఫ్లోటింగ్ 330 మిమీ బ్రెంబో డిస్క్ బ్రేక్‌లు మరియు వెనుక వైపున 220 మిమీ సింగిల్ డిస్క్ బ్రేకులు ఉంటాయి. ఇవి రెండూ కూడా ఏబిఎస్‌ను సపోర్ట్ చేస్తాయి.

భారత మార్కెట్లో కొత్త 2023 కవాసకి నింజా జెడ్ఎక్స్ 10ఆర్ (Kawasaki Ninja ZX 10R) విడుదల

పవర్‌ట్రెయిన్ విషయానికి వస్తే, కొత్త 2023 కవాసకి నింజా జెడ్ఎక్స్-10ఆర్‌లో యాంత్రికంగా ఎలాంటి మార్పులు చేయలేదు. ఇది మునుపటి 998 సీసీ, 4-సిలిండర్, డిఓహెచ్‌సి ఇంజన్‌ను ఉపయోగించడాన్ని కొనసాగిస్తోంది. ఈ ఇంజన్ ఇప్పుడు 13,200 ఆర్‌పిఎమ్ వద్ద 200.2 బిహెచ్‌పి గరిష్ట శక్తిని (ర్యామ్ ఇంటేక్‌తో 210.3 బిహెచ్‌పి గరిష్ట శక్తిని) మరియు 11,400 ఆర్‌పిఎమ్ వద్ద 114.9 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 6-స్పీడ్ గేర్‌బాక్స్ తో జతేయబడి ఉంటుంది.

భారత మార్కెట్లో కొత్త 2023 కవాసకి నింజా జెడ్ఎక్స్ 10ఆర్ (Kawasaki Ninja ZX 10R) విడుదల

ఇందులో క్విక్ యాక్సిలరేషన్ కోసం 1వ, 2వ మరియు 3వ గేర్లు పెద్ద రియర్ స్ప్రాకెట్ (39T vs 41T)ను కలిగి ఉంటాయి. కొత్త 2023 కవాసకి నింజా జెడ్ఎక్స్ 10ఆర్ యొక్క సీట్ భూమి నుండి 835 మిమీ ఎత్తులో ఉంటుంది మరియు దీని గ్రౌండ్ క్లియరెన్స్ 135 మిమీ. ఈ బైక్ మొత్తం బరువు 207 కిలోలుగా ఉంటుంది. భారత మార్కెట్లో కవాసకి జెడ్ఎక్స్ 10ఆర్ సూపర్‌బైక్‌ సింగిల్ సీట్ ఆప్షన్‌లో స్టాండర్డ్‌గా అందించబడుతుంది. మరిన్ని లేటెస్ట్ ఆటోమొబైల్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్ ని గమనిస్తూ ఉండండి.

More from DriveSpark

Article Published On: Thursday, September 8, 2022, 15:27 [IST]
English summary
New 2023 kawasaki ninja zx 10r launched in india price specs and features
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+