దేశీయ మార్కెట్లో Ducati DesertX లాంచ్.. అదిరిపోయే లుక్, అంతకు మించిన పర్ఫామెన్స్
డుకాటి ఇండియా భారతీయ మార్కెట్లో కొత్త 'డెసర్ట్‌ఎక్స్' (DesertX) బైక్ విడుదల చేసింది. ఈ బైక్ ధర రూ. 17.91 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ బైక్ ఆకర్శించే డిజైన్, ఆధునిక ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ కొత్త అడ్వెంచర్ బైక్ గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త 'డుకాటి డెసర్ట్‌ఎక్స్' అడ్వెంచర్ బైక్ కఠినమైన రహాదారుల్లో కూడా రైడింగ్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది. ఈ బైక్ యొక్క హెడ్ ల్యాంప్ విండ్ షీల్డ్‌కు కలిసిపోయినట్లు కనిపిస్తుంది. ఇది డబుల్ ఎల్‍ఈడీ డీఆర్ఎల్ కూడా కలిగి చాలా స్టైలిష్ గా ఉంటుంది. ఈ బైక్ లో పిలియన్ సీటు తొలగించే అవకాశం కూడా ఉంది. ఎక్కువ లగేజ్ తీసుకెళ్లాలనుకున్నప్పుడు ఇది ఉపయోగపడుతుంది.

కొత్త డుకాటి డెసర్ట్‌ఎక్స్ 21 ఇంచెస్ ఫ్రంట్ వీల్స్, 18 ఇంచెస్ రియర్ వీల్ కలిగి ట్యూబ్ లెస్ టైర్స్ పొందుతుంది. ఇందులో 21 లీటర్ల కెపాసిటీ కలిగిన ఫ్యూయెల్ ట్యాంక్ కూడా ఉంటుంది. ఇది అడ్వెంచర్ బైక్ కావున ఆఫ్ రోడ్ చేయడానికి అనుకూలంగా ఉండే అన్ని ఫీచర్స్ ఇందులో అందించబడ్డాయి. కావున ఆఫ్ రోడింగ్ ప్రేమికులకు తప్పకుండా ఇది మంచి రైడింగ్ అనుభోతిని ఇస్తుంది.
ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో 5 ఇంచెస్ కలర్ టీఎఫ్‍టీ వెర్టికల్ డిస్‍ప్లే ఉంటుంది. రైడింగ్ సమయంలో కూడా ఈ డిస్‍ప్లే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ బైక్‍లో స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ కూడా ఉంది, కావున బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేసుకోవచ్చు. ఇందులో డుకాటీ మల్టీమీడియా సిస్టమ్ ఉండటం వల్ల కాల్స్ స్వీకరించవచ్చు, మ్యూజిక్ వంటి వాటిని కూడా కంట్రోల్ చేయవచ్చు. నావిగేషన్ సిస్టం కూడా ఇందులో అందుబాటులో ఉంది.
డుకాటి డెసర్ట్‌ఎక్స్ బైక్ 937సిసి ట్విన్ సిలిండర్ ఇంజిన్‍ను పొందుతుంది. ఇది 9,250 ఆర్‌పిఎమ్ వద్ద 108.5 బిహెచ్‌పి పవర్ మరియు 6,500 ఆర్‌పిఎమ్ వద్ద 92 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 6-స్పీడ్ గేర్‌బాక్స్‌కి జతచేయబడి ఉంటుంది. ఇందులో ఆరు రైడింగ్ మోడ్స్ అందుబాటులో ఉంటాయి. అవి స్పోర్ట్, టూరింగ్, అర్బన్, వెట్, ర్యాలీ మరియు ఎండురో మోడ్స్. ఆంతే కాకూండా ఇందులో ఫుల్, హై, మీడియమ్, లో అనే నాలుగు పవర్ మోడ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.
కొత్త డుకాటి డెసర్ట్‌ఎక్స్ బైక్ సరికొత్త స్టీల్ ట్రెల్లిస్ ఫ్రేమ్ పొందుతుంది. అంతే కాకూండా ఇది ఫుల్లీ అడ్జస్టబుల్ ఫ్రంట్ మరియు రియర్ సస్పెన్షన్ సెటప్ కలిగి ముందు వైపు 46 మిమీ USD ఫోర్క్, వెనుక వైపు అల్యూమినియం స్వింగార్మ్‌తో మోనో-షాక్ సెటప్ పొందుతుంది. బ్రేకింగ్ విషయానికొస్తే, ఈ మోటార్‌సైకిల్‌లో ముందువైపు 320 మిమీ డిస్క్ బ్రేక్, వెనుకవైపు 265 మిమీ డిస్క్ బ్రేక్స్ ఉన్నాయి.
డుకాటి ఇండియా దేశీయ మార్కెట్లో విడుడల చేసిన తన కొత్త 'డెసర్ట్‌ఎక్స్' అడ్వెంచర్ బైక్ కోసం బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. కావున ఈ బైక్ కొనాలనుకునే కస్టమర్లు ఢిల్లీ, ముంబై, పుణె, హైదరాబాద్, బెంగళూరు, కొచ్చి, కోల్‍కతా మరియు చెన్నై వంటి ప్రధాన నగరాల్లోని కంపెనీ యొక్క అధికారిక డీలర్‌షిప్ లో బుక్ చేసుకోవచ్చు. డెలివరీలు 2023 జనవరి మొదటి వారంలో ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది.
డుకాటి డెసర్ట్‌ఎక్స్ విడుదలపై మా అభిప్రాయం:
భారతీయ మార్కెట్లో డుకాటి కంపెనీ ఇప్పటికే చాలా వరకు స్టైలిష్ బైకులను విడుదల చేసింది. ఇందులో భాగంగానే ఇప్పుడు మరో ఆకర్షణీయమైన డెసర్ట్‌ఎక్స్ అడ్వెంచర్ బైక్ లాంచ్ చేసింది. ఈ బైక్ అద్భుతమైన పర్ఫామెన్స్ అందించేలా రూపొందించబడి ఉంటుంది. దేశీయ మార్కెట్లో కొత్త డుకాటి డెసర్ట్‌ఎక్స్ బైక్ హోండా ఆఫ్రికన్ ట్విన్ మరియు ట్రయంఫ్ టైగర్ 900 ర్యాలీ వంటి బైకులకు ప్రత్యర్థిగా ఉంటుంది.


Click it and Unblock the Notifications