కొత్త Hero Vida ఎలక్ట్రిక్ స్కూటర్ ఎలా బుక్ చేసుకోవాలో ఇక్కడ చూడండి

ఇటీవల భారతీయ మార్కెట్లో విడుదలైన 'హీరో మోటోకార్ప్' (Hero MotoCorp) యొక్క ఎలక్ట్రిక్ స్కూటర్ 'విడా' (Vida) కోసం కంపెనీ బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. ఇంతకీ బుకింగ్స్ ప్రైస్ ఎంత? ఎలా బుక్ చేసుకోవాలి? డెలివరీలు ఎప్పుడు అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.. రండి.

కొత్త Hero Vida ఎలక్ట్రిక్ స్కూటర్ ఎలా బుక్ చేసుకోవాలో ఇక్కడ చూడండి

కంపెనీ విడుదల చేసిన విడా ఎలక్ట్రిక్ స్కూటర్ రెండు వేరియంట్స్ లో అందుబాటులో ఉంటుంది. అవి ఒకటి విడా 'వి1 ప్రో' (V1 Pro) కాగా, మరొకటి విడా 'వి1 ప్లస్' (V1 Plus) ఎలక్ట్రిక్ స్కూటర్. ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలు వరుసగా రూ. 1.59 లక్షలు (ఎక్స్-షోరూమ్) మరియు రూ. 1.45 లక్షలు (ఎక్స్-షోరూమ్).

కొత్త Hero Vida ఎలక్ట్రిక్ స్కూటర్ ఎలా బుక్ చేసుకోవాలో ఇక్కడ చూడండి

ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ బుక్ చేసుకోవాలనుకునే కస్టమర్లు ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌ బుకింగ్ చేసుకోవాలనుకునే కస్టమర్లు కింది సూచనలను పాటించాలి.

  • మొదట బుక్ చేసుకోవాలనుకునే కస్టమర్ కంపెనీ యొక్క అధికారిక వెబ్‌సైట్ https://www.vidaworld.com/ సందర్సించాలి.
  • వెబ్‌సైట్ ఓపెన్ అయిన తరువాత హోమ్‌పేజీలో, వెహికల్ మరియు వేరియంట్‌ ఎంచుకోవాలి.
  • ఆ తరువాత కంటిన్యూపై క్లిక్ చేయగానే మీరు కొత్త పేజీలోకి వెళతారు.
  • ఇక చివరగా మీ పర్సనల్ డీటైల్స్ నమోదు చేసుకుని, బుకింగ్ చేసుకోవడానికి కంపెనీ నిర్దేశించిన మొత్తాన్ని (రూ. 2,499) చెల్లించాలి.
  • కొత్త Hero Vida ఎలక్ట్రిక్ స్కూటర్ ఎలా బుక్ చేసుకోవాలో ఇక్కడ చూడండి

    హీరో మోటోకార్ప్ మొదట్లో వెల్లడించిన సమాచారం ప్రకారం, విడా ఎలక్ట్రిక్ స్కూటర్ ని ప్రస్తుతం ఢిల్లీ, జైపూర్ మరియు బెంగళూరు నగరాల్లో మాత్రమే విక్రయించనుంది. ఆ తరువాత మిగిలిన నగరాల్లో ప్రారంభిస్తుంది. అయితే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ బుక్ చేసుకున్న కస్టమర్లలకు డెలివరీ డిసెంబర్ నెలలో ప్రారంభమవుతాయి.

    కొత్త Hero Vida ఎలక్ట్రిక్ స్కూటర్ ఎలా బుక్ చేసుకోవాలో ఇక్కడ చూడండి

    హీరో విడా స్కూటర్ ఆధునిక డిజైన్ మరియు అధునాతన పరికరాలను కలిగి ఉండటమే కాకుండా మంచి కలర్ ఆప్సన్స్ కూడా పొందుతుంది. కావున Vida V1 Plus మ్యాట్ వైట్, మ్యాట్ స్పోర్ట్స్ రెడ్ మరియు గ్లోస్ బ్లాక్ అనే మూడు కలర్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉంటుంది.

    కొత్త Hero Vida ఎలక్ట్రిక్ స్కూటర్ ఎలా బుక్ చేసుకోవాలో ఇక్కడ చూడండి

    ఇక విడా V1 ప్రో విషయానికి వస్తే, ఇది మొత్తం నాలుగు కలర్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉంటుంది. అవి మ్యాట్ వైట్, మ్యాట్ స్పోర్ట్స్ రెడ్, గ్లోస్ బ్లాక్ మరియు అడిషనల్ మ్యాట్ అబ్రాక్స్ ఆరెంజ్ కలర్స్. ఇవన్నీ కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. కావున కొనుగోలుదారులు తమకి నచ్చిన కలర్ ఇందులో ఎంచుకోవచ్చు.

    కొత్త Hero Vida ఎలక్ట్రిక్ స్కూటర్ ఎలా బుక్ చేసుకోవాలో ఇక్కడ చూడండి

    హీరో విడా ఎలక్ట్రిక్ స్కూటర్లు లిథియం అయాన్ రిమూవబుల్ బ్యాటరీని పొందుతాయి. అయితే పరిధి అందించడంలో కొంత వ్యత్యాసం ఉంటుంది. Vida V1 Plus ఎలక్ట్రిక్ స్కూటర్ ఒక ఫుల్ ఛార్జ్ తో గరిష్టంగా 143 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. ఈ స్కూటర్ టాప్ స్పీడ్ గంటకు 80 కిమీ. అదే సమయంలో ఇది కేవలం 3.4 సెకన్లలో గంటకు 0 నుంచి 40 కిమీ వరకు వేగవంతం అవుతుంది.

    కొత్త Hero Vida ఎలక్ట్రిక్ స్కూటర్ ఎలా బుక్ చేసుకోవాలో ఇక్కడ చూడండి

    Vida V1 Pro ఎలక్ట్రిక్ స్కూటర్ విషయానికి వస్తే, ఇది ఒక సింగిల్ ఛార్జ్ తో గరిష్టంగా 165 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుంది. ఈ స్కూటర్ టాప్ స్పీడ్ గంటకు 80 కిమీ వరకు ఉంటుంది. కాగా ఇది కేవలం 3.2 సెకన్లలో గంటకు 0 నుంచి 40 కిమీ వరకు వేగవతం అవుతుంది.

    కొత్త Hero Vida ఎలక్ట్రిక్ స్కూటర్ ఎలా బుక్ చేసుకోవాలో ఇక్కడ చూడండి

    హీరో విడా ఎలక్ట్రిక్ స్కూటర్ చూడటానికి చాలా సింపుల్ గా చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇందులో ఎల్ఈడీ లైటింగ్, ఫాలో-మీ హోమ్ హెడ్లాంప్, కీలెస్ ఎంట్రీ, ఎస్ఓఎస్ అలర్ట్ వంటివి వాటితో పాటు 7 ఇంచెస్ TFT స్క్రీన్ వంటివి ఉన్నాయి.

    కొత్త Hero Vida ఎలక్ట్రిక్ స్కూటర్ ఎలా బుక్ చేసుకోవాలో ఇక్కడ చూడండి

    అదే సమయంలో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ 26 లీటర్ల కెపాసిటీ కలిగిం పెద్ద అండర్ సీట్ స్టోరేజ్ కూడా పొందుతుంది. ఇది వినియోగదారులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇందులో స్ప్లిట్ సీట్ కూడా అందుబాటులో ఉంటుంది. మొత్తం మీద ఇది అన్ని విధాలుగా ఆధునిక కాలంలో వినియోగించడానికి అనుకూలంగా ఉంటుంది.

    కొత్త Hero Vida ఎలక్ట్రిక్ స్కూటర్ ఎలా బుక్ చేసుకోవాలో ఇక్కడ చూడండి

    డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

    హీరో మోటోకార్ప్ తన ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. అయితే దేశీయ మార్కెట్లో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎలాంటి బుకింగ్స్ పొందుతుంది అనేది త్వరలోనే తెలుస్తుంది. అయితే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ భారతదేశంలో 'ఓలా ఎలక్ట్రిక్' (Ola Electric) స్కూటర్ మరియు 'ఏథర్ 450ఎక్స్' (Ather 450X) వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.

More from DriveSpark

Article Published On: Tuesday, October 11, 2022, 15:12 [IST]
English summary
New hero vida electric scooter bookings open for rs 2500 details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+