హీరో ఎక్స్‌ట్రీమ్ 160ఆర్ ఇప్పుడు అప్డేటెడ్ ఫీచర్స్‌తో: ధర రూ. 1.17 లక్షలు మాత్రమే

చాలా కంపెనీలు దేశీయ విఫణిలో ఎప్పటికప్పుడు కొత్త అప్డేట్స్ తో తమ వాహనాలను విడుదల చేస్తూనే ఉన్నాయి. ఇందులో భాగంగానే ప్రముగా ద్విచక్ర వాహన తయారీ సంస్థ 'హీరో మోటోకార్ప్' (Hero MotoCorp) భారతీయ మార్కెట్లో తన అప్డేటెడ్ 'హీరో ఎక్స్‌ట్రీమ్ 160ఆర్' (Hero Xtreme 160R) విడుదల చేసింది. ఈ అప్డేటెడ్ బైక్ ధర ఇప్పుడు రూ. 1.17 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ కొత్త బైక్ లో ఉన్న అప్డేట్స్ ఏంటి? ఇంజిన్ లో ఏమైనా మార్పులు జరిగాయా? అనే మరిన్ని వివరాలు ఇక్కడ చూద్దాం.. రండి.

హీరో ఎక్స్‌ట్రీమ్ 160ఆర్ ఇప్పుడు అప్డేటెడ్ ఫీచర్స్‌తో: ధర రూ. 1.17 లక్షలు మాత్రమే

హీరో మోటోకార్ప్ విడుదల చేసిన ఈ అప్డేటెడ్ బైక్ లో గేర్ పొజిషన్ ఇండికేటర్, కొత్త సీట్ మరియు పిలియన్ గ్రాబ్ రైల్‌ వంటివి ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. ఇవి కాకుండా ఈ బైక్ లో చెప్పుకోదగ్గ పెద్ద మార్పులు లేవు. ఇందులో సింగిల్-పాడ్ హెడ్‌లైట్, మస్కులర్ డిజైన్, సైడ్-స్లంగ్ ఎగ్జాస్ట్ మరియు బ్లాక్ అల్లాయ్ వీల్స్ వంటివి దాని మునుపటి మోడల్ లో ఉన్న మాదిరిగానే ఉన్నాయి.

హీరో ఎక్స్‌ట్రీమ్ 160ఆర్ ఇప్పుడు అప్డేటెడ్ ఫీచర్స్‌తో: ధర రూ. 1.17 లక్షలు మాత్రమే

హీరో ఎక్స్‌ట్రీమ్ 160ఆర్ యొక్క ఇంజిన్ లో ఎటువంటి మార్పులు జరుగలేదు. కావున ఇందులో 163 సిసి, సింగిల్ సిలిండర్, ఎయిర్-కూల్డ్ ఇంజిన్ అందుబటులో ఉంటుంది. ఇది 8,500 ఆర్‌పిఎమ్ వద్ద 15 బిహెచ్‌పి పవర్ మరియు 6,500 ఆర్‌పిఎమ్ వద్ద 14ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజన్ 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది.

హీరో ఎక్స్‌ట్రీమ్ 160ఆర్ ఇప్పుడు అప్డేటెడ్ ఫీచర్స్‌తో: ధర రూ. 1.17 లక్షలు మాత్రమే

హీరో మోటోకార్ప్ ఈ బైక్‌ను మూడు వేరియంట్స్ లో అందుబాటులోకి తీసుకువచ్చింది. అవి సింగిల్ డిస్క్, డ్యూయల్ డిస్క్ మరియు స్టెల్త్ ఎడిషన్ వేరియంట్స్. ఈ మూడు వేరియంట్లు ఒకేవిధమైన డిజైన్, మెకానికల్ స్పెసిఫికేషన్‌లు, సస్పెన్షన్ మరియు బ్రేకింగ్స్ సిస్టం వంటి వాటిని కలిగి ఉంటాయి.

హీరో ఎక్స్‌ట్రీమ్ 160ఆర్ ఇప్పుడు అప్డేటెడ్ ఫీచర్స్‌తో: ధర రూ. 1.17 లక్షలు మాత్రమే

అప్డేటెడ్ హీరో ఎక్స్‌ట్రీమ్ 160ఆర్ ధరలు:

  • ఎక్స్‌ట్రీమ్ 160ఆర్ సింగిల్ డిస్క్: రూ. 1,17,148 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)
  • ఎక్స్‌ట్రీమ్ 160ఆర్ డ్యూయల్ డిస్క్: రూ. 1,20,498 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)
  • ఎక్స్‌ట్రీమ్ 160ఆర్ స్టెల్త్: రూ. 1,22,338 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)
  • హీరో ఎక్స్‌ట్రీమ్ 160ఆర్ ఇప్పుడు అప్డేటెడ్ ఫీచర్స్‌తో: ధర రూ. 1.17 లక్షలు మాత్రమే

    సింగిల్ డిస్క్ వేరియంట్ యొక్క ముందు మరియు వెనుక భాగంలో డ్రమ్ బ్రేక్ సెటప్ ఉపయోగించబడింది. అయితే డ్యూయల్ డిస్క్ బ్రేక్ వేరియంట్ మరియు స్టీల్త్ ఎడిషన్ యొక్క రెండు చక్రాలపైనా (ముందు మరియి వెనుక) డిస్క్ బ్రేక్‌లు ఉపయోగించబడ్డాయి. మరింత సేఫ్టీ కోసం సింగిల్ ఛానల్ ఏబీఎస్ కూడా అందుబటులో ఉంటుంది.

    హీరో ఎక్స్‌ట్రీమ్ 160ఆర్ ఇప్పుడు అప్డేటెడ్ ఫీచర్స్‌తో: ధర రూ. 1.17 లక్షలు మాత్రమే

    ఇక సస్పెన్షన్ విషయానికి వస్తే ఈ బైక్ ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్క్‌లు మరియు వెనుక భాగంలో ప్రీలోడ్-అడ్జస్టబుల్ రియర్ మోనో-షాక్ సస్పెన్షన్ యూనిట్ ఉన్నాయి. ఈ బైక్ లో ఉన్న వీల్స్ 17 ఇంచెస్ వీల్స్. అయితే ఈ బైక్ ముందు వైపు 100/80 సెక్షన్ టైర్ మరియు వెనుక 130/70 సెక్షన్ టైర్ అమర్చబడి ఉంటాయి.

    హీరో ఎక్స్‌ట్రీమ్ 160ఆర్ ఇప్పుడు అప్డేటెడ్ ఫీచర్స్‌తో: ధర రూ. 1.17 లక్షలు మాత్రమే

    సింగిల్ డిస్క్ వేరియంట్ యొక్క కర్బ్ వెయిట్ 138.5 కేజీలు కాగా, డ్యూయల్ డిస్క్ మోడల్ బరువు 139.5 కేజీల వరకు ఉంటుంది. అయితే ఇందులోని ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 12 లీటర్లు. ఈ అప్డేటెడ్ మోటార్‌సైకిల్ మొత్తం 5 కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంటుంది. ఇవన్నీ కూడా చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి.

    హీరో ఎక్స్‌ట్రీమ్ 160ఆర్ ఇప్పుడు అప్డేటెడ్ ఫీచర్స్‌తో: ధర రూ. 1.17 లక్షలు మాత్రమే

    ఇదిలా ఉండగా ఇటీవల 'హీరో మోటోకార్ప్' దేశీయ మార్కెట్లో 'హీరో సూపర్ స్ప్లెండర్ కాన్వాస్ బ్లాక్ ఎడిషన్' విడుదల చేసింది. ఈ కొత్త బైక్ ప్రారంభ ధర రూ. 77,430 (ఎక్స్-షోరూమ్). ఇది రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. అవి డ్రమ్ వేరియంట్, మరొకటి డిస్క్ వేరియంట్. వీటి ధరలు వరుసగా రూ. 77,430 మరియు రూ. 81,330. కంపెనీ ఈ కొత్త బైక్ కోసం బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. కావున కొనుగోలుదారులు ఆన్‌లైన్‌లో లేదా హీరో మోటోకార్ప్ డీలర్‌షిప్‌ల ద్వారా బుక్ చేసుకోవచ్చు.

    హీరో ఎక్స్‌ట్రీమ్ 160ఆర్ ఇప్పుడు అప్డేటెడ్ ఫీచర్స్‌తో: ధర రూ. 1.17 లక్షలు మాత్రమే

    ఈ కొత్త 'హీరో సూపర్ స్ప్లెండర్ కాన్వాస్ బ్లాక్ ఎడిషన్' లో 124.7 సిసి సింగిల్-సిలిండర్, ఎయిర్-కూల్డ్ బిఎస్ 6 ఇంజన్‌ ఉంటుంది. ఇది 7,500 ఆర్‌పిఎమ్ వద్ద 10.7 బిహెచ్‌పి పవర్ మరియు 6,000 ఆర్‌పిఎమ్ వద్ద 10.6 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

    హీరో ఎక్స్‌ట్రీమ్ 160ఆర్ ఇప్పుడు అప్డేటెడ్ ఫీచర్స్‌తో: ధర రూ. 1.17 లక్షలు మాత్రమే

    డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

    భారతీయ మార్కెట్లో విడుదలైన అప్డేటెడ్ 'హీరో ఎక్స్‌ట్రీమ్ 160ఆర్' బైక్ ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ పొందుతుంది. కావున ఇది ముందుపటికంటే కంటే చాలా ఆధునికంగా ఉంటుంది. ఈ కొత్త బైక్ టీవీఎస్ అపాచీ ఆర్‌టిఆర్ 160 4వి, యమహా ఎఫ్జెడ్-ఎఫ్ఐ, బజాజ్ పల్సర్ ఎన్160 మరియు సుజుకి జిక్సర్ వాటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.

Most Read Articles

English summary
New hero xtreme 160r launched price features update details
Story first published: Wednesday, July 27, 2022, 16:31 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X