దేశీయ మార్కెట్లో 'హీరో ఎక్స్‌ట్రీమ్ 160ఆర్ స్టీల్త్ ఎడిషన్ 2.0' విడుదల: ధర రూ. 1.30 లక్షలు

ప్రముఖ బైక్ అండ్ స్కూటర్ తయారీ సంస్థ 'హీరో మోటోకార్ప్' (Hero MotoCorp) దేశీయ మార్కెట్లో, అందులోనూ నవరాత్రుల సమయంలో 'ఎక్స్‌ట్రీమ్ 160ఆర్ స్టీల్త్ ఎడిషన్ 2.0' (Xtreme 160R Stealth Edition 2.0) బైకును విడుదల చేసింది. కంపెనీ విడుదల చేసిన ఈ కొత్త బైక్ గురించి మరింత సమాచారం ఈ కథనంలో తెలుసుకుందాం.

దేశీయ మార్కెట్లో 'హీరో ఎక్స్‌ట్రీమ్ 160ఆర్ స్టీల్త్ ఎడిషన్ 2.0' విడుదల: ధర రూ. 1.30 లక్షలు

భారతీయ మార్కెట్లో విడుదలైన కొత్త 'హీరో ఎక్స్‌ట్రీమ్ 160ఆర్ స్టీల్త్ ఎడిషన్ 2.0' బైక్ ధర రూ. 1.30 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). ఈ బైక్ ఇప్పుడు ఆధునిక ఫీచర్స్ పొందుతుంది. అంతే కాకుండా ఇది రెడ్ మరియు బ్లాక్ అనే రెండు కొత్త కలర్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉంటుంది. కావున వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

దేశీయ మార్కెట్లో 'హీరో ఎక్స్‌ట్రీమ్ 160ఆర్ స్టీల్త్ ఎడిషన్ 2.0' విడుదల: ధర రూ. 1.30 లక్షలు

కొత్త ఎక్స్‌ట్రీమ్ 160ఆర్ స్టీల్త్ ఎడిషన్ 2.0 బైక్ హీరో కనెక్ట్ టెక్‌ని పొందుతుంది. కావున ఇప్పుడు బ్లూటూత్ ద్వారా మీ మొబైల్ ఫోన్‌కి కనెక్ట్ చేసుకోవచ్చు. స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ అనేది లొకేషన్ ట్రాకింగ్‌ని ఎనేబుల్ చేస్తుంది. ఈ బైక్ ఇప్పుడు రెడ్ యాక్సెంట్‌లతో కొత్త బ్లాక్ పెయింట్ స్కీమ్‌ను కూడా పొందుతుంది, కావున ఇది మరింత ఆకర్షణీయంగా ఉంటుంది.

దేశీయ మార్కెట్లో 'హీరో ఎక్స్‌ట్రీమ్ 160ఆర్ స్టీల్త్ ఎడిషన్ 2.0' విడుదల: ధర రూ. 1.30 లక్షలు

హీరో ఎక్స్‌ట్రీమ్ 160ఆర్ స్టీల్త్ ఎడిషన్ 2.0 బ్లాక్ లివరీతో ఉంటుంది, అయితే ఇందులోని ఫోర్క్ బాటమ్స్, మోనోషాక్, ఇంజన్ హెడ్, పిలియన్ ఫుట్‌రెస్ట్ హ్యాంగర్లు మరియు రియర్ గ్రాబ్ రైల్స్‌ వంటివాటిని గమనిస్తే ఇక్కడ రెడ్ యాక్సెంట్స్ చూడవచ్చు. కావున ఇది దాని మునుపటి మోడల్ కంటే కూడా కొంత భిన్నంగా ఉంటుంది.

దేశీయ మార్కెట్లో 'హీరో ఎక్స్‌ట్రీమ్ 160ఆర్ స్టీల్త్ ఎడిషన్ 2.0' విడుదల: ధర రూ. 1.30 లక్షలు

కొత్త ఎక్స్‌ట్రీమ్ 160ఆర్ స్టీల్త్ ఎడిషన్ 2.0 అనేది ఫీచర్స్ పరంగా చాలావరకు మునుపటి స్టీల్త్ ఎడిషన్‌తో సమానంగా ఉంటుంది. అయితే ఇంజిన్ మరియు పనితీరులో మాత్రం ఎటువంటి మార్పులు జరగలేదు. ఇది కొనుగోలుదారులు గుర్తుంచుకోవాలి.

దేశీయ మార్కెట్లో 'హీరో ఎక్స్‌ట్రీమ్ 160ఆర్ స్టీల్త్ ఎడిషన్ 2.0' విడుదల: ధర రూ. 1.30 లక్షలు

హీరో ఎక్స్‌ట్రీమ్ 160ఆర్ స్టీల్త్ ఎడిషన్ 2.0 బైకులో 163 సిసి, సింగిల్-సిలిండర్ ఎయిర్-కూల్డ్ బిఎస్6 ఇంజిన్‌ అందుబాటులో ఉంటుంది. ఇది 6,500 ఆర్‌పిఎమ్ వద్ద 15.2 పిఎస్ పవర్ మరియు 14 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. కావున మంచి పనితీరుని అందిస్తుంది. అదే సమయంలో ఈ బైక్ యొక్క బరువు 139 కేజీలు మరియు ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 12 లీటర్స్ వరకు ఉంటుంది. కావున వాహన వినియోగదారులకు మంచి రైడింగ్ అనుభూతిని అందిస్తుంది.

దేశీయ మార్కెట్లో 'హీరో ఎక్స్‌ట్రీమ్ 160ఆర్ స్టీల్త్ ఎడిషన్ 2.0' విడుదల: ధర రూ. 1.30 లక్షలు

ఎక్స్‌ట్రీమ్ 160ఆర్ స్టీల్త్ 2.0 ఎడిషన్ లో 37 మిమీ టెలిస్కోపిక్ ఫోర్క్ మరియు 7 స్టెప్ ప్రీలోడ్ అడ్జస్టబుల్ మోనోషాక్ వంటివి ఉంటాయి. బ్రేకింగ్ విషయానికి వస్తే, ఈ బైక్ యొక్క ముందుభాగంలో 276 మిమీ పెటల్ డిస్క్ మరియు వెనుక వైపు 220 మిమీ డిస్క్ ఉంటాయి. ఇది సింగిల్ ఛానల్ ఏబీఎస్ కి సపోర్ట్ చేస్తుంది.

దేశీయ మార్కెట్లో 'హీరో ఎక్స్‌ట్రీమ్ 160ఆర్ స్టీల్త్ ఎడిషన్ 2.0' విడుదల: ధర రూ. 1.30 లక్షలు

కొత్త హీరో ఎక్స్‌ట్రీమ్ 160ఆర్ స్టీల్త్ ఎడిషన్ 2.0 బైక్ దాని మునుపటి స్టెల్త్ ఎడిషన్ బైకుకంటే కూడా రూ. 7,000 ఎక్కువ ధర వద్ద మరియు ఎక్స్‌ట్రీమ్ 160ఆర్ కంటే కూడా రూ. 9,000 ఎక్కువ ధర వద్ద అందుబాటులో ఉంటుంది. అయితే ఈ కొత్త మోడల్ కొంత ఎక్కువ ధరవద్ద అందుబాటులో ఉన్నపటికీ దానికి అనుగుణంగా ఫీచర్స్ కూడా అందిస్తుంది.

దేశీయ మార్కెట్లో 'హీరో ఎక్స్‌ట్రీమ్ 160ఆర్ స్టీల్త్ ఎడిషన్ 2.0' విడుదల: ధర రూ. 1.30 లక్షలు

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

భారతదేశంలో ప్రారంభమైన దసరా సందర్భంగా కంపెనీ కొత్త ఉత్పత్తిని లాంచ్ చేయడం వల్ల తప్పకుండా మంచి అమ్మకాలు పొందే అవకాశం ఉంటుంది. ఇప్పటికే కంపెనీ స్ప్లెండర్ మరియు హెచ్‌ఎఫ్ డీలక్స్ వంటి బైకులను మంచి సంఖ్యలో విక్రయిస్తూనే ఉంది. కొత్త హీరో ఎక్స్‌ట్రీమ్ 160ఆర్ స్టెల్త్ ఎడిషన్ 2.0 దేశీయ మార్కెట్లో హోండా ఎక్స్-బ్లేడ్, యమహా ఎఫ్‌జెడ్, బజాజ్ పల్సర్ ఎన్‌ఎస్160, పల్సర్ ఎన్160 మరియు టివిఎస్ అపాచీ ఆర్‌టిఆర్ 160 వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. ఇలాంటి మరిన్ని కొత్త బైకులు మరియు కార్లను గురించి ఎప్పటికప్పుడు అప్డేటెడ్ సమాచారం తెలుసుకోవడానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ చూస్తూ ఉండండి.

Most Read Articles

English summary
New hero xtreme 160r stealth edition 2 0 launched at rs 130 lakh details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X