హోండా మోటార్‌సైకిల్ నుంచి 'యాక్టివా 7జి' రానుందా.. ఇదిగో టీజర్

'హోండా మోటార్‌సైకిల్' (Honda Motorcycle) కంపెనీ భారతీయ మార్కెట్లో కొత్త అప్డేటెడ్ 'యాక్టివా' (Activa) విడుదల చేయడానికి సన్నద్ధమవుతున్న సంగతి అందరికీ తెలిసిందే, దీనికి సంబంధించిన ఇటీవల ఒక టీజర్ కూడా విడుదల చేసింది. ఆ సమయంలో కంపెనీ దీని గురించి ఎటువంటి వివరణ ఇవ్వలేదు, అయితే ఇప్పుడు దీనికి సంబంధించి మరో టీజర్ విడుదల చేసింది. దీని గురించి మరింత సమాచారం ఈ కథనంలో చూద్దాం.. రండి.

మరో టీజర్ విడుదల చేసిన హోండా మోటార్‌సైకిల్.. ఇది బహుశా 'యాక్టివా 7జి' అవుతుందా..!!

కంపెనీ విడుదల చేసిన ఈ కొత్త టీజర్ ప్రకారం, ఇది రాబోయే యాక్టివా 7జి అవుతుందని భావిస్తున్నాము. అయితే దీని పైనా ఎటువంటి స్పష్టమైన వివరణ అందుబాటులో లేదు. అంతే కాకుండా ఇది కొత్త కలర్ ఆప్సన్ లో కూడా వచ్చే అవకాశం ఉందని ఈ టీజర్ చూస్తే అర్థమవుతోంది.

మరో టీజర్ విడుదల చేసిన హోండా మోటార్‌సైకిల్.. ఇది బహుశా 'యాక్టివా 7జి' అవుతుందా..!!

'హోండా మోటార్‌సైకిల్' (Honda Motorcycle) యొక్క ప్రముఖ స్కూటర్ మోడల్ అయిన యాక్టివా ఇప్పుడు మరిన్ని సొబగులతో మార్కెట్లో అడుగుపెట్టడానికి సిద్దమవుతోంది. ఇది యాక్టివా ప్రియులను మరింత ఆకర్షిస్తుందని ఆశిస్తున్నాము. అయితే దీనికి సంబంధించిన అధికారిక సమాచారం త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉంటుంది.

మరో టీజర్ విడుదల చేసిన హోండా మోటార్‌సైకిల్.. ఇది బహుశా 'యాక్టివా 7జి' అవుతుందా..!!

నిజానికి హోండా యాక్టివా అనేది 6G వెర్షన్ లో 2020 జనవరిలో దేశీయ మార్కెట్లో ప్రవేశపెట్టబడింది. ఆ సమయంలోనే ఈ స్కూటర్ ఆధునిక ఫీచర్స్ తో అందుబాటులోకి వచ్చింది. అయితే ఆ తరువాత దాదాపు 2 సంవత్సరాలకు ఈ వేరియంట్ ని మళ్ళీ అప్డేట్ చేయడానికి సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది.

మరో టీజర్ విడుదల చేసిన హోండా మోటార్‌సైకిల్.. ఇది బహుశా 'యాక్టివా 7జి' అవుతుందా..!!

ప్రస్తుతం భారతీయ మార్కెట్లో 'హోండా యాక్టివా' రెండు వేరియంట్స్ లో అందుబాటులో ఉంది. అవి హోండా యాక్టివా 125 స్కూటర్ మరియు హోండా యాక్టివా 6జి. ఈ రెండూ కూడా మార్కెట్లో మంచి అమ్మకాలతో ముందుకు దూసుకెళ్తున్నాయి. హోండా మోటార్ సైకిల్ కొత్త యాక్టివా స్కూటర్ ని మరిన్ని అప్డేటెడ్ ఫీచర్స్ తో విడుదల చేసే అవకాశాలు చాలానే ఉన్నాయి.

మరో టీజర్ విడుదల చేసిన హోండా మోటార్‌సైకిల్.. ఇది బహుశా 'యాక్టివా 7జి' అవుతుందా..!!

ఇప్పటికే దేశీయ మార్కెట్లో చాలా కంపెనీలు తమ వాహనాలను అప్డేటెడ్ ఫీచర్స్ తో విడుదల చేస్తుంటే, హోండా కూడా తమ కస్టమర్ల కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కావున హోండా యాక్టివా ప్రియులు రానున్న రోజుల్లో అప్డేటెడ్ యాక్టివాను ఉపయోగించనున్నారు.

మరో టీజర్ విడుదల చేసిన హోండా మోటార్‌సైకిల్.. ఇది బహుశా 'యాక్టివా 7జి' అవుతుందా..!!

హోండా యాక్టివా 6G ఇప్పుడు 109 సిసి ఎయిర్-కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజన్‌తో పనిచేస్తుంది. అదే సమయంలో హోండా యాక్టివా 125 లో 124 సిసి ఎయిర్-కూల్డ్ ఇంజన్ కలదు. ఈ ఇంజన్ 8.18 బిహెచ్‌పి పవర్ మరియు 10.3 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. కావున మంచి పనితీరుని అందిస్తుంది.

మరో టీజర్ విడుదల చేసిన హోండా మోటార్‌సైకిల్.. ఇది బహుశా 'యాక్టివా 7జి' అవుతుందా..!!

కంపెనీ తన యాక్టివాలో మొదటిసారిగా, సాధారణ స్టార్టర్‌కు బదులుగా సైలెంట్ ACG స్టార్టర్ ఉపయోగించబడింది. హోండా యాక్టివా 6G భారతీయ మార్కెట్లో ఆరు కలర్స్ లో అందుబాటులో ఉంది. అయితే యాక్టివా 125 మాత్రం 5 కలర్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉంది. అయితే త్వరలో రానున్న అప్డేటెడ్ స్కూటర్ ఎన్ని కలర్ ఆప్సన్స్ లో అందుబాటులోకి రానుంది అనే విషయం ఇంకా ధ్రువీకరించలేదు.

మరో టీజర్ విడుదల చేసిన హోండా మోటార్‌సైకిల్.. ఇది బహుశా 'యాక్టివా 7జి' అవుతుందా..!!

ఇదిలా ఉండగా హోండా మోటార్ సైకిల్ కంపెనీ తన యాక్టివా స్కూటర్ ని ఎలక్ట్రిక్ వెర్షన్ లో విడుదల చేయడానికి కూడా ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. కంపెనీ 2023 నాటికి తన యాక్టివాను ఎలక్ట్రిక్ వెర్షన్ లో తీసుకువచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రణాళికలను కంపెనీ ప్రెసిడెంట్ మిస్టర్ అట్సుషి ఒగాటా వెల్లడించారు.

మరో టీజర్ విడుదల చేసిన హోండా మోటార్‌సైకిల్.. ఇది బహుశా 'యాక్టివా 7జి' అవుతుందా..!!

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

హోండా మోటార్‌సైకిల్ తన 7జి మొడల్ ని దేశీయ మార్కెట్లో ఈ పండుగ సీజన్లో విడుదల చేస్తుందా.. లేక వచ్చే సంవత్సరంలో విడుదల చేస్తుందా.. అనే సమాచారం కూడా ఖచ్చితంగా తెలియదు. దీనికి సంబందించిన మరింత సమాచారం కంపెనీ త్వరలోనే వెల్లడించే అవకాశం ఉంది. కావున ఎప్పటికప్పుడు హోండా కొత్త స్కూటర్ గురించి తెలుసుకోవటానికిమరియు ఎప్పటికప్పుడు మార్కెట్లో విడుదలయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి పూర్తి సమాచారం తెలుసుకోవడానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ ఫాలో అవ్వండి.

Most Read Articles

English summary
New honda activa teaser released design details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X