హోండా CB300F వచ్చేస్తోంది.. ఇక డెలివరీలకోసం వెయిట్ చేయడమే..
ఇటీవల 'హోండా మోటార్‌సైకిల్ మరియు స్కూటర్ ఇండియా' దేశీయ మార్కెట్లో తన కొత్త 'సిబి300ఎఫ్' (CB300F) మోటార్‌సైకిల్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ కొత్త బైక్ చూడటానికి కొత్తగా, వినియోగదారులను ఆకర్శించే విధంగా ఉంది. అయితే కంపెనీ ఈ బైక్ యొక్క డెలివరీలను ఇంకా ప్రారంభించలేదు. కానీ ఇప్పుడిప్పుడే దేశ వ్యాప్తంగా ఉన్న డీలర్షిప్ లకు డిస్పాచ్ చేయడం ప్రారంభించింది.
Recommended Video
దీనికి సంబంధించిన ఫోటోలు కూడా వెలువడ్డాయి. దీన్ని బట్టి చూస్తే ఈ బైక్ డెలివరీలు ఇంక ఎంతో దూరంలో లేవని స్పష్టమవుతుంది.

'హోండా మోటార్‌సైకిల్ మరియు స్కూటర్ ఇండియా' గుజరాత్‌లో అహ్మదాబాద్ లోని విఠల్‌పూర్ ఉన్న తన నాల్గవ ఫ్యాక్టరీలో మోటార్‌సైకిళ్లను తయారు చేస్తోంది. కంపెనీ ఈ బైకులను దేశీయ మార్కెట్ కోసం మాత్రమే కాకుండా విదేశీ మార్కెట్ కి కూడా ఎగుమతి చేయడానికి ఒక ప్రణాళికను సిద్ధం చేసుకుంది.

మార్కెట్లో కంపెనీ తన సరికొత్త హోండా సిబి300ఎఫ్ బైక్ ను రూ. 2.25 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభం ధర వద్ద అధికారికంగా విడుదల చేసింది. ఈ బైక్ లాంచ్ రోజునే కంపెనీ బుకింగ్స్ స్వీకరించడం కూడా ప్రారంభించింది. కావున కొనుగోలుదారులు ఈ బైక్ కొనాలనుకుంటే ఆన్‌లైన్‌లో లేదా కంపెనీ యొక్క అధీకృత డీలర్‌షిప్‌లలో బుక్ చేసుకోవచ్చు.

హోండా సిబి300ఎఫ్ బైక్ ప్రస్తుతం రెండు వేరియంట్స్ లో అందుబాటులో ఉంది. అవి డీలక్స్ మరియు డీలక్స్ ప్రో. వీటి ధరలు వరుసగా రూ. 2,25,900 మరియు రూ. 2,28,900 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). ఈ బైక్ మూడు కలర్ ఆప్సన్స్ లో కూడా అందుబాటులో ఉంది. అవి స్పోర్ట్స్ రెడ్, మ్యాట్ యాక్సిస్ గ్రే మెటాలిక్ మరియు మ్యాట్ మార్వెల్ బ్లూ మెటాలిక్ కలర్స్.

హోండా సిబి300ఎఫ్ (Honda CB300F) బైక్ అద్భుతమైన పర్ఫామెన్స్ అందించడానికి కంపెనీ ఇందులో 293.52 సీసీ, ఆయిల్-కూల్డ్, ఫ్యూయల్-ఇంజెక్టెడ్ సింగిల్-సిలిండర్ ఇంజన్ ఉపయోగించింది. ఈ ఇంజన్ 7,500 ఆర్‌పిఎమ్ వద్ద 24.1 బిహెచ్‌పి పవర్ మరియు 5,500 ఆర్‌పిఎమ్ వద్ద 25.6 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది.

హోండా సిబి300ఎఫ్ బైక్ సింపుల్ గా చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ బైక్ ముందు భాగంలో గోల్డ్ కలర్ అప్‌సైడ్ డౌన్ ఫోర్కులు, మజిక్యులర్ ఫ్యూయెల్ ట్యాంక్ మరియు షార్ప్ ట్యాంక్ ఎక్స్‌టెన్షన్స్, స్ప్లిట్ సీట్, వెనుక భాగంలో ఎత్తుగా ఉండే టెయిల్ సెక్షన్, బాడీ కలర్ ఫ్రంట్ మడ్‌గార్డ్, సన్నటి టర్న్ ఇండికేటర్లు మరియు యాంగ్యులర్ హెడ్‌ల్యాంప్ మరియు స్ప్లిట్ గ్రాబ్ రెయిల్ వాటి వాటిని పొందుతుంది.

ఈ కొత్త హోండా ప్రీమియం బైక్ యొక్క కొలతల విషయానికి వస్తే, దీని పొడవు 2,084 మిమీ, వెడల్పు 765 మిమీ, ఎత్తు 1,075 మిమీ మరియు వీల్‌బేస్ 1,390 మిమీ వాఫ్రాకు ఉంటుంది. ఈ బైక్ మొత్తం బరువు 153 కిలోగ్రాములు మరియు భూమి నుండి రైడర్ సీటు ఎత్తు 789 మిమీ కాగా, దీని గ్రౌండ్ క్లియరెన్స్ 177 మిమీగా ఉంటుంది. మొత్తం మీద ఇది వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో ఫుల్ ఎల్ఈడి లైటింగ్, వి షేప్ అల్లాయ్ వీల్స్, డ్యూయల్-ఛానల్ ఏబిఎస్, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీతో కూడిన పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వాటివి ఉన్నాయి.

సస్పెన్షన్ విషయానికి వస్తే, ఈ బైక్ ముందు భాగంలో అప్-సైడ్ డౌన్ టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్కులు మరియు వెనుక వైపు మోనోషాక్ సస్పెన్షన్ సెటప్ ఉంటుంది. అదే సమయంలో బ్రేకింగ్ విషయానికి వస్తే, ముందు వైపు 276 మిమీ ఫ్రంట్ డిస్క్ బ్రేక్ మరియు వెనుక వైపున 220 మిమీ డిస్క్ బ్రేక్ ఉన్నాయి. ఇవి రెండు డ్యూయల్-ఛానల్ ఏబిఎస్ కి సపోర్ట్ చేస్తాయి.

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:
భారతీయ మార్కెట్లో ఇటీవల విడుదలను కొత్త సిబి300ఎఫ్ బైక్ కెటిఎమ్ 390 డ్యూక్ (KTM 390 Duke), బిఎండబ్ల్యు జి 310 ఆర్ (BMW G 310 R) మరియు హోండా సిబి300ఆర్ (Honda CB300R) వంటి వాటికి ప్రత్యుర్థుగా ఉంటుంది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలతో పాటు, కొత్త కార్ల్ మరియు బైకుల గురించి మరింత సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ చూస్తూ ఉండండి.


Click it and Unblock the Notifications








