భారతీయ మార్కెట్లో రూ. 39.20 లక్షల బైక్ విడుదలైంది.. ఆ బైక్ ఏదో ఓ లుక్కేసుకోండి

ప్రముఖ టూవీలర్ బ్రాండ్ 'హోండా మోటార్‌సైకిల్' (Honda Motorcycle) దేశీయ మార్కెట్లో కొత్త '2022 హోండా గోల్డ్ వింగ్ టూర్' (2022 Honda Gold Wing Tour) విడుదల చేసింది. భారతీయ మార్కెట్లో విడుదలైన ఈ కొత్త బైక్ ధర రూ. 39.20 లక్షలు (ఎక్స్-షోరూమ్, గురుగ్రామ్). కంపెనీ ఈ బైక్ కోసం బుకింగ్స్ స్వీకరించడం కూడా ప్రారంభించింది. డెలివరీలు త్వరలో ప్రారంభమవుతాయి.

2022 హోండా గోల్డ్ వింగ్ టూర్ బైక్ బుక్ చేసుకోవాలనుకునే కస్టమర్లు ఇప్పుడు కంపెనీ వెబ్‌సైట్ లేదా డీలర్‌షిప్‌ను సందర్శించి బుక్ చేసుకోవచ్చు. అయితే ఈ బైక్ ఇప్పుడు కంప్లీట్ బిల్డ్ యూనిట్ గా భారతదేశానికి దిగుమతి అవుతుంది. 2022 హోండా గోల్డ్ వింగ్ టూర్ బైక్ గురించి మరింత సమాచారం ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.. రండి.

భారతీయ మార్కెట్లో రూ. 39.20 లక్షల బైక్ విడుదలైంది.. ఆ బైక్ ఏదో ఓ లుక్కేసుకోండి

2022 హోండా గోల్డ్ వింగ్ టూర్‌ అద్భుతమైన డిజైన్ మరియు ఆధునిక ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ బైక్ యొక్క ముందువైపు అల్యూమినియం డై-కాస్ట్ ఫ్రేమ్ డబుల్ విష్‌బోన్ మరియు వెనుకవైపు హోండా ప్రో-లింక్ సస్పెన్షన్ సెటప్‌తో పాటు సింగిల్-సైడెడ్ స్వింగార్మ్ వంటివి ఉన్నాయి.

భారతీయ మార్కెట్లో రూ. 39.20 లక్షల బైక్ విడుదలైంది.. ఆ బైక్ ఏదో ఓ లుక్కేసుకోండి

ఈ బైక్ యొక్క బ్రేకింగ్ సెటప్ విషయానికి వస్తే, దీని ముందు భాగంలో 6-పిస్టన్ కాలిపర్‌లతో డ్యూయల్ డిస్క్ బ్రేక్‌లు మరియు వెనుకవైపు 3-పిస్టన్ కాలిపర్‌లతో సింగిల్ డిస్క్‌ బ్రేక్ పొందుతుంది. ఈ బైక్ భారతదేశంలో గన్‌మెటల్ బ్లాక్ మెటాలిక్ అనే ఒకే కలర్ ఆప్సన్ లో లభిస్తుంది.

భారతీయ మార్కెట్లో రూ. 39.20 లక్షల బైక్ విడుదలైంది.. ఆ బైక్ ఏదో ఓ లుక్కేసుకోండి

హోండా గోల్డ్ వింగ్‌ యొక్క ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో 7-ఇంచెస్ ఫుల్ కలర్ టిఎఫ్‌టి ఎల్‌సిడి ఇన్‌స్ట్రుమెంట్ డిస్‌ప్లే ఉంటుంది. ఇది చాలా ప్రకాశవంతంగా ఉండటం వల్ల, రైడర్ కి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కావున ఇందులోని చాలా ఫీచర్స్ కంట్రోల్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది.

భారతీయ మార్కెట్లో రూ. 39.20 లక్షల బైక్ విడుదలైంది.. ఆ బైక్ ఏదో ఓ లుక్కేసుకోండి

హోండా గోల్డ్ వింగ్ టూర్ ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే వంటి వాటిని కూడా పొందుతుంది. అంతే కాకూండా బ్లూటూత్ కనెక్టివిటీ ఫీచర్ కూడా ఇందులో ఉంటుంది. వీటితో పాటుగా లైట్ వెయిట్ స్పీకర్ సిస్టమ్ మరియు రెండు USB టైప్-సి పోర్ట్‌లు కూడా ఇందులో అందుబాటులో ఉంటాయి.

భారతీయ మార్కెట్లో రూ. 39.20 లక్షల బైక్ విడుదలైంది.. ఆ బైక్ ఏదో ఓ లుక్కేసుకోండి

కొత్త 2022 హోండా గోల్డ్ వింగ్ టూర్ బైక్ 1833సిసి, లిక్విడ్-కూల్డ్, 24-వాల్వ్ SOHC హారిజాంటల్ ఫ్లాట్-6 ఇంజిన్ పొందుతుంది. ఇది 5,500 ఆర్‌పిఎమ్ వద్ద 124.7 బిహెచ్‌పి పవర్ మరియు 4,500 ఆర్‌పిఎమ్ వద్ద 170 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది 7-స్పీడ్ డ్యూయల్-కచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ తో జతచేయబడి ఉంటుంది. ఇంజన్ ఇంటిగ్రేటెడ్ స్టార్టర్ జెనరేటర్‌ను కలిగి ఉంది. కావున ఇది మంచి పర్ఫామెన్స్ అందిస్తుంది.

భారతీయ మార్కెట్లో రూ. 39.20 లక్షల బైక్ విడుదలైంది.. ఆ బైక్ ఏదో ఓ లుక్కేసుకోండి

భారతీయ మార్కెట్లో విడుదలైన కొత్త హోండా గోల్డ్ వింగ్ టూర్ బైక్ మొత్తం 4 రైడింగ్ మోడ్‌లను కలిగి ఉంటుంది. అవి టూర్, స్పోర్ట్, ఎకానమీ మరియు రెయిన్. ఇవన్నీ కూడా రైడింగ్ సమయంలో రైడర్ కి చాలా అనుకూలంగా ఉపయోగపడతాయి.

భారతీయ మార్కెట్లో రూ. 39.20 లక్షల బైక్ విడుదలైంది.. ఆ బైక్ ఏదో ఓ లుక్కేసుకోండి

ఇక ఇందులో సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే, రైడర్ కోసం ఎయిర్‌బ్యాగ్, హోండా సెలెక్టబుల్ టార్క్ కంట్రోల్ (HSTC) మరియు హిల్ స్టార్ట్ అసిస్ట్ వంటివి ఉన్నాయి. అంతే కాకూండా ఎయిర్‌బ్యాగ్‌తో పాటు డ్యూయల్ క్లచ్ ట్రాన్స్‌మిషన్‌ను కూడా పొందుతుంది. మొత్తం మీద ఈ సురక్షితంగా మరియు సౌకర్యవంతంగా ఉండేలా అనేక ఆధునిక ఫీచర్స్ కలిగి ఉంది.

భారతీయ మార్కెట్లో రూ. 39.20 లక్షల బైక్ విడుదలైంది.. ఆ బైక్ ఏదో ఓ లుక్కేసుకోండి

హోండా గోల్డ్ వింగ్ టూర్‌ భారతీయ మార్కెట్లో విడుదలైన సందర్భంగా హోండా మోటార్‌సైకిల్ & స్కూటర్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, ప్రెసిడెంట్ & సీఈఓ 'అట్సుషి ఒగాటా' మాట్లాడుతూ.. భారతీయ మార్కెట్లో కంపెనీ తన ఉనికిని నిరంతరం విస్తరిస్తూనే ఉంది. అయితే ఇప్పుడు కొత్త 2022 గోల్డ్ వింగ్ టూర్ లగ్జరీ బైక్ ఎయిర్‌బ్యాగ్‌తో తీసుకురావడంతో కొత్త అధ్యాయానికి నాందీభూతమైందని అన్నారు.

భారతీయ మార్కెట్లో రూ. 39.20 లక్షల బైక్ విడుదలైంది.. ఆ బైక్ ఏదో ఓ లుక్కేసుకోండి

అదే విధంగా హోండా మోటార్‌సైకిల్ & స్కూటర్ ఇండియా డైరెక్టర్, సేల్స్ & మార్కెటింగ్ 'యద్వీందర్ సింగ్ గులేరియా' మాట్లాడుతూ.. ఆధునిక ఫీచర్స్ మరియు అద్భుతమైన డిజైన్ మాత్రమే కాకూండా ఇప్పుడు భద్రతను కూడా ద్రుస్తిలో ఉంచుకుని ఈ లగ్జరీ బైక్ మార్కెట్లో విడుదల చేయడం జరిగింది. ఇది తప్పకుండా విఐయోగదారులకు చాలా అనుకూలంగా ఉటుంది. ఇప్పుడు భారతీయ మార్కెట్లో బుకింగ్స్ స్వీకరించడం చాలా సంతోషంగా ఉందన్నారు.

Article Published On: Tuesday, April 19, 2022, 18:07 [IST]
English summary
New honda goldwing tour launched in india price features specs details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+