నువ్వా.. నేనా: కవాసకి డబ్ల్యు175 vs రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350: కంపారిజన్

దేశీయ మార్కెట్లో ఇటీవల కవాసకి ఇండియా 'డబ్ల్యు175' (W175) బైక్ విడుదల చేసింది. ఈ బైక్ ఆకర్షణీయమైన ధర వద్ద అందుబాటులో ఉండటమే కాకుండా మంచి డిజైన్, అప్డేటెడ్ ఫీచర్స్ మరియు అద్భుతమైన పర్ఫామెన్స్ అందిస్తుంది. అయితే కవాసకి డబ్ల్యు175 బైక్ భారతీయ మార్కెట్లో రాయల్ ఎన్‌ఫీల్డ్ యొక్క 'హంటర్ 350' (Hunter 350) కి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది.

దేశీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న 'రాయల్ ఎన్‌ఫీల్డ్' కంపెనీ యొక్క 'హంటర్ 350' కి మరియు కవాసకి W175 కి ఉన్న వ్యత్యాసాలు ఏమిటి, ఫీచర్స్ ఏంటి అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో చూద్దాం.. రండి.

నువ్వా నేనా అంటున్న 'హంటర్ 350 vs డబ్ల్యు175'.. పూర్తి వివరాలు

కవాసకి డబ్ల్యు175 vs రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350: ధరలు

భారతీయ మార్కెట్లో విడుదలైన కొత్త కవాసకి డబ్ల్యు175 అనేది రెండు వేరియంట్స్ లో అందుబాటులో ఉంటుంది. అవి ఎబోనీ మరియు క్యాండీ పెర్సిమోన్ రెడ్ కలర్స్, వీటి ధరలు వరుసగా రూ. 1.47 లక్షలు (ఎక్స్-షోరూమ్) మరియు రూ. 1.49 లక్షలు (ఎక్స్-షోరూమ్).

Kawasaki W175 Price
Ebony ₹1.47 Lakh
Candy Persimmon Red ₹1.49 Lakh
Royal Enfield Hunter 350 Price
Retro Hunter Factory Series ₹1.49 Lakh
Metro Hunter Dapper Series ₹1.63 Lakh
Metro Hunter Rebel Series ₹1.68 Lakh
నువ్వా నేనా అంటున్న 'హంటర్ 350 vs డబ్ల్యు175'.. పూర్తి వివరాలు

ఇక రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 విషయానికి వస్తే, ఇది మొత్తం మూడు వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది. అవి రెట్రో హంటర్ ఫ్యాక్టరీ సిరీస్, మెట్రో హంటర్ డాబర్ సిరీస్ మరియు మెట్రో హంటర్ రెబల్ సిరీస్. వీటి ధరలు వరుసగా రూ. 1.49 లక్షలు (ఎక్స్-షోరూమ్), రూ. 1.63 లక్షలు (ఎక్స్-షోరూమ్) మరియు రూ. 1.68 లక్షలు (ఎక్స్-షోరూమ్).

నువ్వా నేనా అంటున్న 'హంటర్ 350 vs డబ్ల్యు175'.. పూర్తి వివరాలు

కవాసకి డబ్ల్యు175 vs రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్: డిజైన్

కవాసకి డబ్ల్యు175 బైక్ అనేది దాని డబ్ల్యు800 నుండి ప్రేరణ పొందింది, కావున డిజైన్ కూడా అదే విధంగా ఉంటుంది. ఇందులో ఒక రౌండ్ హెడ్‌ల్యాంప్, టియర్ షేప్ ఫ్యూయెల్ ట్యాంక్, స్క్వారీష్ సైడ్ ప్యానెల్‌లు, స్పోక్ వీల్స్ మరియు బ్లాక్-అవుట్ ఇంజన్ కాంపోనెంట్‌ వంటివి ఉన్నాయి. మొత్తం మీద డిజైన్ చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.

నువ్వా నేనా అంటున్న 'హంటర్ 350 vs డబ్ల్యు175'.. పూర్తి వివరాలు

రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 డిజైన్ గమనించినట్లయితే, ఈ బైక్ ముందు భాగంలో స్పోర్ట్స్ సర్క్యులర్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్ మరియు టర్న్ సిగ్నల్స్‌తో పాటు రౌండ్ సెమీ-డిజిటల్ స్పీడోమీటర్ కన్సోల్ వంటివి ఉన్నాయి. అయితే ఇందులోని ట్రిప్పర్ డిస్‌ప్లే మాత్రం ఆప్సనల్ గా ఎంచుకోవచ్చు. టియర్‌డ్రాప్ ఆకారంలో ఉండే ఫ్యూయల్ ట్యాంక్‌కు ఇరువైపులా క్రీజ్‌లు ఉన్నాయి కావున చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.

నువ్వా నేనా అంటున్న 'హంటర్ 350 vs డబ్ల్యు175'.. పూర్తి వివరాలు

కవాసకి డబ్ల్యు175 vs రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్: ఫీచర్స్

కవాసకి డబ్ల్యు175 బైక్ ఆధునిక ఫీచర్స్ పొందుతుంది. ఇందులో సెమీ-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ ఉంటుంది. అయితే ఇందులో మొబైల్ కనెక్టివిటీ లేదు. అదే సమయంలో ఈ బైక్ టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్‌లు, డ్యూయల్ రియర్ షాక్‌లు, సింగిల్ ఛానల్ ఏబీఎస్ మొదలైనవన్నీ పొందుతుంది.

నువ్వా నేనా అంటున్న 'హంటర్ 350 vs డబ్ల్యు175'.. పూర్తి వివరాలు

రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 బైక్ కూడా ఫీచర్స్ పరంగా కవాసకి డబ్ల్యు175 కి ఏ మాత్రం తీసిపోయే అవకాశం లేదు. ఇందులో సెమీ-డిజిటల్ స్పీడోమీటర్ కన్సోల్ ఉంటుంది. అయితే ఇందులోని ట్రిప్పర్ డిస్‌ప్లే మాత్రం ఆప్సనల్ గా ఎంచుకోవచ్చు. ఏ సమయంలో ఈ బైక్ వేరియంట్‌ను బట్టి సింగిల్ లేదా డబుల్ ఛానల్ ఏబీఎస్ ఆప్సన్ పొందుతుంది.

నువ్వా నేనా అంటున్న 'హంటర్ 350 vs డబ్ల్యు175'.. పూర్తి వివరాలు

కవాసకి డబ్ల్యు175 vs రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్: కొలతలు

కవాసకి డబ్ల్యు175 బైక్ రైడర్లకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ బైక్ యొక్క పొడవు 2,005 మిమీ, వెడల్పు 805 మిమీ, ఎత్తు 1050 మిమీ, గ్రౌండ్ క్లియరెన్స్ 165 మిమీ వరకు ఉంటుంది. అదే సమయంలో ఈ బైక్ యొక్క ఫ్యూయెల్ కెపాసిటీ 12 లీటర్ల వరకు ఉంది.

నువ్వా నేనా అంటున్న 'హంటర్ 350 vs డబ్ల్యు175'.. పూర్తి వివరాలు

హంటర్ 350 యొక్క కొలతల విషయానికి వస్తే.. ఇది 2,055 మిమీ పొడవు, 800 మిమీ వెడల్పు, 1,055 మిమీ ఎత్తు కలిగి ఉంటుంది. వీల్‌బేస్ 1,370 మిమీ వరకు ఉంటుంది. ఇక సీట్ ఎత్తు భూమి నుండి 800 మిమీ వరకు ఉంటుంది. ఈ బైక్ యొక్క ఫ్యూయెల్ కెపాసిటీ 13 లీటర్ల వరకు ఉంటుంది.

Dimensions Kawasaki W175 Royal Enfield Hunter
Length 2005 mm 2055 mm
Width 805 mm 800 mm
Height 1050 mm 1055 mm
Wheelbase 1320 mm 1370 mm
Ground Clearance 165 mm 150 mm
Weight 135 kg 177 kg
Seat Height 790 mm 800 mm
Fuel Capacity 12-litres 13-litres
నువ్వా నేనా అంటున్న 'హంటర్ 350 vs డబ్ల్యు175'.. పూర్తి వివరాలు

కవాసకి డబ్ల్యు175 vs రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్: ఇంజిన్ స్పెసిఫికేషన్స్

కవాసకి డబ్ల్యు175 బైక్ 177 సిసి ఎయిర్-కూల్డ్ సింగిల్-సిలిండర్ ఇంజన్ పొందుతుంది. ఇది 7,500 ఆర్‌పిఎమ్ వద్ద 13 హెచ్‌పి పవర్ మరియు 6,000 ఆర్‌పిఎమ్ వద్ద 13.2 ఎన్ఎమ్ టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ గేర్‌బాక్స్‌కి జతచేయబడి ఉంటుంది. కాగా ఇంజిన్ బిఎస్6 ఉద్గార ప్రమాణాలకు అనుకూలంగా అప్డేట్ చేయబడి ఉంటుంది.

నువ్వా నేనా అంటున్న 'హంటర్ 350 vs డబ్ల్యు175'.. పూర్తి వివరాలు
Engine Kawasaki W175 Royal Enfield Hunter
Displacement 177 cc 349 cc
Power 12.8 bhp 20.2 bhp
Torque 13.2 Nm 27 Nm
Gearbox 5-speed 5-speed

రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 బైక్ 349 సిసి సింగిల్-సిలిండర్, టూ-వాల్వ్, SOHC, ఎయిర్/ఆయిల్-కూల్డ్ ఇంజన్ పొందుతుంది. ఈ ఇంజిన్ 6100 ఆర్‌పిఎమ్ వద్ద 20.2 బిహెచ్‌పి పవర్ మరియు 4000 ఆర్‌పిఎమ్ వద్ద 27 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 5-స్పీడ్ గేర్‌బాక్స్ తో జతచేయబడి ఉంటుంది. ఈ బైక్ యొక్క పరిధి (రేంజ్) 36.2 కిమీ/లీ వరకు ఉంటుంది. అదే సమయంలో దీని టాప్ స్పీడ్ 114కిమీ/గంట.

నువ్వా నేనా అంటున్న 'హంటర్ 350 vs డబ్ల్యు175'.. పూర్తి వివరాలు

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 మరియు కవాసకి డబ్ల్యు175 రెండూ కూడా ధరల దగ్గర నుంచి డిజైన్, ఫీచర్స్ మరియు కొలతల వరకు చాలా వరకు దగ్గర సంబంధం కలిగి ఉన్నాయి. కావున వినియోగదారులు తమ అభిరుచిని బట్టి తమకు నచ్చిన బైక్ కొనుగోలు చేయవచ్చు. ఇలాంటి ఆసక్తికరమైన విషయాలతోపాటు, కొత్త బైకులు మరియు కార్లను గురించి ఎప్పటికప్పుడు అప్డేటెడ్ సమాచారం తెలుసుకోవడానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ చూస్తూ ఉండండి.

Most Read Articles

English summary
New kawasaki w175 vs royal enfield hunter price design features engine comparisons
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X