Keeway SR125 కొనాలనుకునే వారి కోసం ప్రత్యేక కథనం.. ఇప్పుడే చూడండి

భారతీయ మార్కెట్లో ఇటీవల ఆకర్షణీయమైన ధర వద్ద విడుదలైన 'కీవే ఇండియా' యొక్క కొత్త బైక్ 'కీవే ఎస్ఆర్125' (Keeway SR125) బైక్ మంచి డిజైన్ మరియు లేటెస్ట్ ఫీచర్స్ తో చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ బైక్ కొనాలనుకునే కస్టమర్ల కోసం కంపెనీ బుకింగ్స్ కూడా ప్రారంభించింది. అయితే ఈ బైక్ కొనాలనుకునే కస్టమర్లు తప్పకుండా ఇందులో కొన్ని విషయాలు తెలుసుకోవాల్సి ఉంటుంది. వాటిని గురించి మరింత సమాచారం ఇక్కడ క్షుణ్ణంగా తెలుసుకుందాం.. రండి.

Keeway SR125 కొనాలనుకునే వారి కోసం ప్రత్యేక కథనం.. ఇప్పుడే చూడండి

1. డిజైన్

కొనుగోలుదారులు ఒక వెహికల్ కొనేముందు తప్పకుండా అది ఎలాంటి డిజైన్ కలిగి ఉందని తప్పకుండా చూస్తారు. కావున మనం ఈ కొత్త 'కీవే ఎస్ఆర్125' (Keeway SR125) డిజైన్ గమనిస్తే ఇది రెట్రో డిజైన్‌ పొందుతుంది. ఇందులో హాలోజన్ హెడ్‌లైట్‌ మరియు ఎల్ఈడీ డిఆర్ఎల్ వంటివి ఉన్నాయి. అంతే కాకూండా ఇందులో సింగిల్-పీస్ సీట్, షార్ట్ ఫెండర్‌లు మొత్తం మరింత ఆకర్షణీయంగా ఉంటాయి.

Keeway SR125 కొనాలనుకునే వారి కోసం ప్రత్యేక కథనం.. ఇప్పుడే చూడండి

2. ఫీచర్స్

కీవే ఎస్ఆర్125 బైక్ సింగిల్ పాడ్ ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్‌ పొందుతుంది. ఇది స్పీడోమీటర్, ఓడోమీటర్, ట్రిప్ మీటర్, ఫ్యూయెల్ లెవెల్ రీడౌట్ మొదలైనవాటిని కలిగి ఉంటుంది. ఇందులో 14 లీటర్ల కెపాసిటీ కలిగిన ఫ్యూయెల్ ట్యాంక్ ఉంటుంది. ఈ బైక్ బరువు 200 కేజీల వరకు ఉంటుంది. మొత్తం మీద ఇందులోని ఫీచర్స్ వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి.

Keeway SR125 కొనాలనుకునే వారి కోసం ప్రత్యేక కథనం.. ఇప్పుడే చూడండి

3. ఇంజిన్ & పర్ఫామెన్స్

కొత్త కీవే ఎస్ఆర్125 బైక్ సింగిల్ సిలిండర్, 4-స్ట్రోక్, 125సీసీ ఇంజన్ కలిగి ఉంటుంది. ఇది 9.7 హెచ్‌పిపవర్ మరియు 8.2 ఎన్ఎమ్ టార్క్‌ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 5 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. కావున మంచి పర్ఫామెన్స్ అందించడానికి అనుకూలంగా ఉంటుంది.

Keeway SR125 కొనాలనుకునే వారి కోసం ప్రత్యేక కథనం.. ఇప్పుడే చూడండి

4. బ్రేకింగ్ సిస్టం మరియు సస్పెన్షన్ సెటప్

కీవే కంపెనీ విడుదల చేసిన ఈ కొత్త బైక్ యొక్క ముందు భాగంలో 300 మిమీ డిస్క్‌ బ్రేకులు మరియు వెనుక భాగంలో 210 మిమీ డిస్క్‌ బ్రేకులు ఉంటాయి. అదే సమయంలో 110/70 ఫ్రంట్ మరియు 130/70 రియర్ డ్యూయల్-పర్పస్ టైర్‌లు కలిగిం 17 ఇంచెస్ స్పోక్డ్ వీల్స్‌ ఉన్నాయి. ఈ బైక్ గ్రౌండ్ క్లియరెన్స్ 160 మిమీ వరకు ఉంటుంది.

Keeway SR125 కొనాలనుకునే వారి కోసం ప్రత్యేక కథనం.. ఇప్పుడే చూడండి

5. ధరలు & కలర్ ఆప్సన్స్

భారతీయ విఫణిలో విడుదలైన కొత్త 'కీవే ఎస్ఆర్125' (Keeway SR125) ధర రూ. 1,19,000 (ఎక్స్ షోరూమ్ - ఇండియా). అయితే ఈ బైక్ మొత్తం మూడు కలర్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉంటుంది. అవి గ్లోసీ రెడ్, గ్లోసీ బ్లాక్ మరియు గ్లోసీ వైట్ కలర్స్. ఇవన్నీ కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. అయితే ధరలు మాత్రం అన్నీ ఒకే విధంగా ఉంటాయి, కలర్ ఆప్సన్ బట్టి ధరలు మారే అవకాశం లేదు.

Keeway SR125 కొనాలనుకునే వారి కోసం ప్రత్యేక కథనం.. ఇప్పుడే చూడండి

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

మార్కెట్లో అతి తక్కువ ధరకే అందుబాటులో ఉన్న ఈ 'కీవే ఎస్ఆర్125' (Keeway SR125) బైక్ కొనాలనే వారు ఇప్పుడు కంపెనీ యొక్క అధికారిక వెబ్సైట్ లో లేదా సమీపంలోని డీలర్‌షిప్‌ను సందర్శించడం ద్వారా బుక్ చేసుకోవచ్చు. ఈ బైక్ అన్ని అధీకృత బెనెల్లీ డీలర్‌షిప్‌ల వద్ద టెస్ట్ రైడ్‌ కోసం అందుబాటులో ఉంటుంది. కాగా ఈ నెల చివరి నాటికి డెలివరీలు ప్రారంభమవుతాయని భావిస్తున్నాము.

More from DriveSpark

Article Published On: Sunday, October 16, 2022, 9:00 [IST]
English summary
New keeway sr 125 bike top five highlights
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+