మరింత శక్తివంతమైన ఇంజన్‌తో అప్‌గ్రేడ్ అవుతున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 450

భారతదేశపు ప్రముఖ క్లాసిక్ మోటార్‌సైకిల్ కంపెనీ రాయల్ ఎన్‌ఫీల్డ్ (Royal Enfield) దేశీయ మార్కెట్లో విక్రయిస్తున్న పాపులర్ అడ్వెంచర్ మోటార్‌సైకిల్ హిమాలయన్ (Himalayan) ని త్వరలోనే అప్‌గ్రేడ్ చేయనుంది. ఈ అప్‌గ్రేడ్ లో భాగంగా కొత్త హిమాలయన్ ఇంజన్ ఇప్పుడు మునుపటి కన్నా మరింత ఎక్కువ పవర్ ను విడుదల చేసే అవకాశం ఉంది.

మరింత శక్తివంతమైన ఇంజన్‌తో అప్‌గ్రేడ్ అవుతున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 450

రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ ఈ బ్రాండ్ నుండి లభిస్తున్న చాలా ప్రత్యేకమైన మోటార్‌సైకిల్. ఇది చాలా సరళమైన మరియు అంతే కఠినమైన అడ్వెంచర్ మోటార్‌సైకిల్. కేవలం నగర వీధుల్లో షికారు చేయడానికి మాత్రమే కాకుండా, ఎలాంటి రోడ్లు లేని కఠినమైన దారుల్లో సైతం మీ గమ్యాలను చేరుకునేందుకు వీలుగా డిజైన్ చేయబడింది హిమాలయన్ మోటార్‌సైకిల్. అయితే, ఈ మోటార్‌సైకిల్‌లోని ఇంజన్‌లో పూర్తి పంచ్ లేదు. చాలా మంది రైడర్లు కూడా ఇదే విషయాన్ని ఫిర్యాదు చేశారు. దీంతో ఇప్పుడు రాయల్ ఎన్‌ఫీల్డ్ కూడా ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుని, హిమాలయన్ మోటార్‌సైకిల్ యొక్క మరింత శక్తివంతమైన వెర్షన్‌ను అభివృద్ధి చేస్తోంది.

మరింత శక్తివంతమైన ఇంజన్‌తో అప్‌గ్రేడ్ అవుతున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 450

రాయల్ ఎన్‌ఫీల్డ్ తమ అప్‌డేటెడ్ అండ్ పవర్‌ఫుల్ హిమాలయన్‌తో కంపెనీ ఈ అడ్వెంచర్ మోటార్‌సైకిల్ విభాగంలో ఇతర పాపులర్ మోడళ్లయిన కెటిఎమ్ 390 అడ్వెంచర్ (KTM 390 Adventure) మరియు బిఎమ్‌డబ్ల్యూ జి310 జిఎస్ (BMW G310 GS) వంటి శక్తివంతమైన మోటార్‌సైకిళ్లతో సులభంగా పోటీపడుతుంది. ఓ నివేదిక ప్రకారం, కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ మోటార్‌సైకిల్ లో కంపెనీ అధునాతన లిక్విడ్-కూల్డ్, 450సీసీ, సింగిల్-సిలిండర్ ఇంజన్‌ను ఉపయోగించే అవకాశం ఉంది. ఈ ఇంజన్ సుమారుగా 45 బిహెచ్‌పి గరిష్ట శక్తిని మరియు 50 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు.

మరింత శక్తివంతమైన ఇంజన్‌తో అప్‌గ్రేడ్ అవుతున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 450

మీ సమాచారం కోసం, ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాయలన్ బైక్‌లో ఉపయోగిస్తున్న 411సీసీ ఇంజన్ గరిష్టంగా 6500 ఆర్‌పిఎమ్ వద్ద 24 బిహెచ్‌పి శక్తిని మరియు 4000 ఆర్‌పిఎమ్ నుండి 4500 ఆర్‌పిఎమ్ మధ్యలో 32 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. అయితే, కొత్త హిమాలయన్ లో ఇంజన్ సామర్థ్యాన్ని 411సీసీ నుండి 450సీసీకి పెంచడం ద్వారా కంపెనీ దీని పవర్, టార్క్ గణాంకాలను పెంచి, మోటార్‌సైకిల్ పనితీరును మరింత వేగవంతం చేయాలని చూస్తోంది.

మరింత శక్తివంతమైన ఇంజన్‌తో అప్‌గ్రేడ్ అవుతున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 450

అయితే, ఈ కొత్త ఇంజన్ లో టార్క్ అవుట్‌పుట్‌ను పెంచడం ద్వారా మెరుగైన లో-రేంజ్ ప్రతిస్పందన కోసం రాయల్ ఎన్‌ఫీల్డ్ దాని గరిష్ట పవర్ అవుట్‌పుట్‌ను త్యాగం చేసే అవకాశం ఉంది. కొత్తగా రాబోయే రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 450, ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న హిమాలయన్ మోటార్‌సైకిల్ తో పాటు విక్రయించబడుతుందా లేక కస్టమర్లను కన్ఫ్యూజ్ చేయడం ఎందుకని కంపెనీ తమ పాత మోడల్ హిమాలయన్ ని డిస్‌కంటిన్యూ చేసి, కేవలం కొత్త మరియు శక్తివంతమైన హిమాలయన్ 450 ని మాత్రమే విక్రయిస్తుందా అనేదానిపై స్పష్టత లేదు.

మరింత శక్తివంతమైన ఇంజన్‌తో అప్‌గ్రేడ్ అవుతున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 450

నిజానికి ఈ రెండు మోటార్‌సైకిళ్లు కూడా కొద్దిగా భిన్నమైన కస్టమర్లను లక్ష్యంగా చేసుకుని ఉన్నాయి. పవర్‌తో సంబంధం లేకుండా లాంగ్ రైడ్స్ లో ఎక్కువ మైలేజ్ కోరుకునే వారి కోసం ప్రస్తుత హిమాలయన్ బెస్ట్ ఆప్షన్ గా నిలుస్తుంది. అలాగే, దూర ప్రయాణాలలో ఫాస్ట్ గా పరుగులు తీసే అడ్వెంచర్ బైక్ కోరుకునే వారికి హిమాలయన్ 450 చక్కటి ఆప్షన్ గా నిలుస్తుంది, కాకపోతే ఇది ఇంధనాన్ని మంచినీరులా తాగేసే అవకాశం ఉంది. కొత్త అప్‌డేటెడ్ రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 450 కి సంబంధించి అనేక స్పై షాట్‌లు ఇప్పటికే ఆన్‌లైన్ ‌లో లీక్ అయ్యాయి.

మరింత శక్తివంతమైన ఇంజన్‌తో అప్‌గ్రేడ్ అవుతున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 450

ఆన్‌లైన్ లో లీకైన సమాచారం ప్రకారం, కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 450 మోటార్‌సైకిల్ దాని అవుట్‌గోయింగ్ మోడల్ కంటే కొంచెం పెద్దదిగా ఉంటుందని తెలుస్తోంది. అలాగే, ఇది ముందు వైపు మరింత షార్ప్ గా ఉండే నోస్ డిజైన్, గుండ్రని హెడ్‌లైట్లు, పెద్ద ఇంధన ట్యాంక్, స్పోక్డ్ వీల్స్ మరియు తేలికపాటి స్టీల్ ట్రేల్లిస్ ఫ్రేమ్ వంటి లక్షణాలను కలిగి ఉందని ఈ చిత్రాలు వెల్లడిస్తున్నాయి.

మరింత శక్తివంతమైన ఇంజన్‌తో అప్‌గ్రేడ్ అవుతున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 450

ఇవే కాకుండా, రాబోయే కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 450 లో ఎల్ఈడి హెడ్‌లైట్‌లు, బ్లూటూత్ ఆధారిత ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, స్విచ్ చేయగల డ్యూయల్-ఛానల్ ఏబిఎస్ వంటి మరికొన్ని అప్‌డేటెడ్ ఫీచర్లను కూడా కలిగి ఉండే అవకాశం ఉంది. పెద్ద ఇంజన్ తో రాబోయే హిమాలయన్ మోటార్‌సైకిల్ వివిధ రకాల రైడ్ మోడ్‌లను కూడా కలిగి ఉండొచ్చని సమాచారం.

మరింత శక్తివంతమైన ఇంజన్‌తో అప్‌గ్రేడ్ అవుతున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 450

మెకానికల్స్ విషయానికొస్తే, రాబోయే రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 450 మోటార్‌సైకిల్ ముందు వైపున పెద్ద 21 ఇంచ్ వీల్ మరియు వెనుకవైపు స్టాండర్డ్ 17 ఇంచ్ వీల్ ఉంటాయి. బెటర్ ఆఫ్-రోడింగ్ గ్రిప్ కోసం ఈ రెండు చక్రాలపై పెద్ద నాబీ టైర్లు అమర్చబడి ఉంటాయి. హిమాలయన్ 450 ముందు భాగంలో అప్-సైడ్ డౌన్ ఫోర్కులు మరియు వెనుక వైపున మోనో-షాక్‌ సస్పెన్షన్ సెటప్ ను అలాగనే కలిగి ఉంటుంది తెలుస్తోంది.

మరింత శక్తివంతమైన ఇంజన్‌తో అప్‌గ్రేడ్ అవుతున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 450

ప్రస్తుతం, భారత టూవీలర్ మార్కెట్లో కెటిఎమ్ 390 అడ్వెంచర్ ధర రూ. 3.37 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా) కాగా బిఎమ్‌డబ్ల్యూ జి310 జిఎస్ ధర రూ. 3.10 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా) గా ఉంది. ఈ నేపథ్యంలో, కొత్తగా రాబోయే రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 450 ఈ రేసులో ముందు ఉండేందుకు కంపెనీ దీని ధరను సుమారు రూ. 3 లక్షల (ఎక్స్-షోరూమ్) రేంజ్ లో అందించవచ్చని అంచనా. మీ సమాచారం కోసం, ప్రస్తుత రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ 411 ధరలు రూ. 2.41 లక్షల నుండి ప్రారంభమవుతాయి (ఎక్స్-షోరూమ్, ఇండియా).

Most Read Articles

English summary
New royal enfield himalayan 450 engine to get more power
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X