భారతీయ మార్కెట్లో ట్రయంఫ్ నుంచి విడుదలైన రెండు కొత్త బైక్స్: ధరలు & వివరాలు

ప్రముఖ ప్రీమియం మోటార్‌సైకిల్ తయారీ సంస్థ 'ట్రయంఫ్ మోటార్‌సైకిల్స్ ఇండియా' (Triumph Motorcycle India) దేశీయ మార్కెట్లో తన కొత్త 'ట్రయంఫ్ స్పీడ్ ట్విన్ 900' (Triumph Speed Twin 900) విడుదల చేసింది. భారతీయ మార్కెట్లో విడుదలైన ఈ కొత్త బైక్ ప్రారంభ ధర రూ. 8.35 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ కొత్త బైక్ గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

ట్రయంఫ్ నుంచి విడుదలైన రెండు కొత్త బైక్స్: ధరలు & వివరాలు

ట్రయంఫ్ మోటార్‌సైకిల్స్ దీనిని రెండు మోడల్స్ లో విడుదల చేసింది. ఇందులో ఒకటి స్ట్రీట్ స్పీడ్ 900 కాగా, మరొకటి స్క్రాంబ్లర్ 900 బైక్. వీటి ధరలు వరుసగా రూ. 8.35 లక్షలు (ఎక్స్-షోరూమ్) మరియు రూ. 9.45 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ రెండు బైకులు దాదాపు దాని మునుపటి డిజైన్ మరియు ఫీచర్స్ పొందుతాయి. అయితే ఇందులో కొన్ని కాస్మొటిక్స్ అప్డేట్స్ గమనించవచ్చు.

ట్రయంఫ్ నుంచి విడుదలైన రెండు కొత్త బైక్స్: ధరలు & వివరాలు

ట్రయంఫ్ మోటార్‌సైకిల్స్ ఇప్పుడు ఈ రెట్రో-స్టైల్ బైక్ కోసం కొత్త కలర్ ఆప్సన్స్ కూడా పరిచయం చేసింది. అవి ట్రయంఫ్ జెట్ బ్లాక్, మ్యాట్ ఐరన్‌స్టోన్ మరియు మ్యాట్ సిల్వర్ ఐస్ కలర్స్. కొత్త పెయింట్ థీమ్‌లలో ఫ్యూయల్ ట్యాంక్‌ మ్యాట్ సిల్వర్ ఐస్ ఫినిషింగ్, జెట్ బ్లాక్ సైడ్ ప్యానెల్‌లు మరియు సిల్వర్ మరియు ఎల్లో గ్రాఫిక్స్‌తో కూడిన జెట్ బ్లాక్ మడ్‌గార్డ్‌లు పొందుతాయి.

ట్రయంఫ్ నుంచి విడుదలైన రెండు కొత్త బైక్స్: ధరలు & వివరాలు

ఈ బైక్ యొక్క కలర్ ఆప్సన్స్ బట్టి ధరలు మారుతూ ఉంటాయి. కావున ట్రయంఫ్ జెట్ బ్లాక్ కలర్ బైక్ ధర రూ. 8.35 లక్షలు, ట్రయంఫ్ మ్యాట్ ఐరన్‌స్టోన్ కలర్ బైక్ ధర రూ. 8.48 లక్షలు కాగా ట్రయంఫ్ మ్యాట్ సిల్వర్ ఐస్ కలర్ బైక్ ధర రూ. 8.48 లక్షల వరకు ఉంది. ఇవన్నీ కూడా లేటెస్ట్ ఫీచర్స్ పొందుతాయి.

ట్రయంఫ్ నుంచి విడుదలైన రెండు కొత్త బైక్స్: ధరలు & వివరాలు

ముందు చెప్పుకున్నట్లుగానే ఈ బైక్ డిజైన్ మరియు స్టైలింగ్ లో పెద్దగా మార్పులు లేవు. అయితే ట్రయంఫ్ స్పీడ్ ట్విన్ 900 రౌండ్ హెడ్‌లైట్, రౌండ్ రియర్-వ్యూ మిర్రర్‌, టియర్-డ్రాప్ ఆకారపు ఫ్యూయల్ ట్యాంక్, సింగిల్-పీస్ వంటి వాటిని పొందుతుంది. ఇవన్నీ బైక్ రైడర్లకు చాలా అనుకూలంగా ఉంటాయి.

ట్రయంఫ్ నుంచి విడుదలైన రెండు కొత్త బైక్స్: ధరలు & వివరాలు

ఇక ఈ బైక్ యొక్క ఇంజిన్ విషయానికి వస్తే, ఇందులో బిఎస్ 6 వెర్షన్ 900 సిసి ప్యారలల్-ట్విన్, లిక్విడ్-కూల్డ్ ఇంజన్ ఉంటుంది. ఇది 7,500 ఆర్‌పిఎమ్ వద్ద 64.1 బిహెచ్‌పి పవర్ మరియు 3,800 ఆర్‌పిఎమ్ వద్ద గరిష్టంగా 80 ఎన్ఎమ్ టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. కావున ఇది మంచి పనితీరుని అందిస్తుంది.

ట్రయంఫ్ నుంచి విడుదలైన రెండు కొత్త బైక్స్: ధరలు & వివరాలు

ట్రయంఫ్ స్పీడ్ ట్విన్ 900 రెండు బైక్‌లు ట్యూబులర్ స్టీల్ ట్విన్ క్రెడిల్ ఫ్రేమ్‌లను కలిగి ఉంటాయి. వీటి ముందు భాగంలో 41ఎమ్ఎమ్ క్యాట్రిడ్జ్ ఫోర్క్‌లను కలిగి ఉండగా, వెనుక భాగంలో ట్విన్-సైడ్ స్వింగార్మ్‌తో కూడిన ట్విన్ షాక్‌లు ఉన్నాయి.

ట్రయంఫ్ నుంచి విడుదలైన రెండు కొత్త బైక్స్: ధరలు & వివరాలు

ఇక బ్రేకింగ్ సిస్టం విషయానికి వస్తే, ముందు భాగంలో బ్రెంబో 4 పిస్టన్ కాలిపర్‌లతో 310 మిమీ డిస్క్ బ్రేక్స్ మరియు వెనుక భాగంలో 255 మిమీ డిస్క్ బ్రేక్స్ ఉంటాయి. స్పీడ్ ట్విన్ 900 ముందు భాగంలో 18-ఇంచెస్ 100/90-18 టైర్‌ కలిగి ఉండగా, వెనుక భాగంలో 17 ఇంచెస్ 150/17-R70 సెక్షన్ టైర్‌ కలిగి ఉంటుంది.

ట్రయంఫ్ నుంచి విడుదలైన రెండు కొత్త బైక్స్: ధరలు & వివరాలు

ఇదిలా ఉండగా ఇటీవల కంపెనీ అడ్వెంచర్ టూరర్ మోటార్‌సైకిల్ 'ట్రైయంప్ టైగర్ 1200' విడుదల చేసింది. ఇది మొత్తం నాలుగు వేరియంట్లలో విడుదల చేయబడింది. అవి జిటి ప్రో, ఎక్స్‌ప్లోరర్, ర్యాలీ ప్రో మరియు ర్యాలీ ఎక్స్‌ప్లోరర్ వేరియంట్లు. మార్కెట్లో వీటి ధరలు రూ. 19.19 లక్షల నుండి రూ. 21.69 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్యలో ఉన్నాయి.

ట్రయంఫ్ నుంచి విడుదలైన రెండు కొత్త బైక్స్: ధరలు & వివరాలు

ట్రైయంప్ టైగర్ 1200 బైక్ మంచి డిజైన్ మరియు ఫీచర్స్ కలిగి ఉంటుంది. అంతే కాకుండా ఇందులో 1,160 సిసి ఇన్‌లైన్-త్రీ-సిలిండర్ ఇంజన్‌ ఉంటుంది. ఈ ఇంజన్ 9,000 ఆర్‌పిఎమ్ వద్ద 147 బిహెచ్‌పి పవర్ మరియు 7,000 ఆర్‌పిఎమ్ వద్ద 130 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త 'ట్రయంఫ్ స్పీడ్ ట్విన్ 900' బైక్స్ లో చెప్పుకోదగ్గ అప్డేట్స్ లేనప్పటికీ, ఇప్పుడు కొత్త కలర్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉన్నాయి. కావున ఇవి తప్పకుండా వాహన వినియోగదారులను ఆకర్శించే అవకాశం ఉంటుంది. అంతే కాకుండా ఇవి మునుపటి మోడల్స్ మాదిరిగానే మంచి పనితీరుని అందిస్తాయి.

Most Read Articles

English summary
New triumph speed twin 900 launched in india price features details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X