రూ. 99,990 లకే కొత్త TVS Raider 125.. ఇప్పుడు మరిన్ని అప్డేటెడ్ ఫీచర్లతో మరింత స్టైలిష్

దీపావళి పండుగను పురస్కరించుకుని భారతీయ మార్కెట్లో టీవీఎస్ కంపెనీ తన రైడర్ 125 బైక్ యొక్క టాప్ వేరియంట్ ని అధికారికంగా విడుదల చేసింది. అయితే ఈ బైక్ లో అప్డేటెడ్ ఫీచర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. దేశీయ విఫణిలో విడుదలైన కొత్త టీవీఎస్ రైడర్ 125 గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.. రండి.

రూ. 99,990 లకే కొత్త TVS Raider 125.. ఇప్పుడు మరిన్ని అప్డేటెడ్ ఫీచర్లతో మరింత స్టైలిష్

టీవీఎస్ కంపెనీ ఇప్పటికే తన టీవీఎస్ రైడర్ బైక్ లాంచ్ చేసింది, కాగా ఇప్పుడు టాప్ వేరియంట్ విడుదలైంది. ఈ బైక్ ధర రూ. 99,990 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). ఇది దాని మునుపటి మోడల్ కంటే కూడా ధర వద్ద అందుబాటులో ఉంది. అయితే ఇందులో 5 ఇంచెస్ TFT డిస్ప్లే పొందుతుంది.

రూ. 99,990 లకే కొత్త TVS Raider 125.. ఇప్పుడు మరిన్ని అప్డేటెడ్ ఫీచర్లతో మరింత స్టైలిష్

నిజానికి కంపెనీ ఈ బైకుని ఇప్పటికే మార్కెట్లో విడుదల చేయాల్సి ఉంది, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల సెమికండక్టర్ కొరతలు కారణంగా ఇప్పుడు లాంచ్ చేసింది. అయితే ఇందులో SmartXconnect కనెక్టివిటీ టెక్నాలజీ ఫీచర్ అందుబాటులో ఉంది. ఇది బైక్‌ను మొబైల్‌కి కనెక్ట్ చేయడానికి అనుమతిస్తుంది. కావున దీని ద్వారా టర్న్-బై-టర్న్ నావిగేషన్, వాయిస్ కమాండ్‌లు, కాల్ అలర్ట్‌లు, మెసేజ్ నోటిఫికేషన్‌లు మరియు మ్యూజిక్ కంట్రోల్ వంటి ఫీచర్లను పొందవచ్చు.

రూ. 99,990 లకే కొత్త TVS Raider 125.. ఇప్పుడు మరిన్ని అప్డేటెడ్ ఫీచర్లతో మరింత స్టైలిష్

అంతేకాకుండా.. ఇందులోని TFT స్క్రీన్ ద్వారా సర్వీస్ రిమైండర్, గేర్ పొజిషన్ ఇండికేటర్, టాప్ స్పీడ్ రికార్డర్, డిస్టెన్స్ టు ఎంప్టీ వంటి సమాచారం పొందవచ్చు. కంపెనీ ఇందులో కొత్త ఫీచర్స్ ప్రవేశపెట్టినప్పటికీ మెకానికల్స్ పరంగా ఎటువంటి అప్డేట్స్ చేయలేదు.

రూ. 99,990 లకే కొత్త TVS Raider 125.. ఇప్పుడు మరిన్ని అప్డేటెడ్ ఫీచర్లతో మరింత స్టైలిష్

కొత్త టీవీఎస్ రైడర్ 125 బైక్ లో ఇంటెల్లిగో సైలెంట్ ఇంజన్ స్టార్ట్ సిస్టమ్‌ ఉంటుంది. అంతే కాకున్నా ఇది 124.8 సిసి సింగిల్-సిలిండర్, SOHC ఇంజిన్ పొందుతుంది. ఇంజిన్ 7,500 ఆర్‌పిఎమ్ వద్ద 11.4 బిహెచ్‌పి పవర్ మరియు 6,000 ఆర్‌పిఎమ్ వద్ద 11.2 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది 5 స్పీడ్ గేర్‌బాక్స్ కి జతచేయబడి ఉంటుంది మరియు పవర్ మరియు ఎకో అనే రెండు పవర్ మోడ్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి. అదే సమయంలో ఈ బైక్ 5.9 సెకన్లలో గంటకు 60 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుంది.

రూ. 99,990 లకే కొత్త TVS Raider 125.. ఇప్పుడు మరిన్ని అప్డేటెడ్ ఫీచర్లతో మరింత స్టైలిష్

కొత్త TVS రైడర్ 125 బైక్ యొక్క ముందువైపు టెలిస్కోపిక్ సస్పెన్షన్ మరియు వెనుకవైపు 5 స్టెప్ అడ్జస్టబుల్ మోనోషాక్‌ పొందుతుంది. కాగా బ్రేకింగ్ విషయానికి వస్తే, ఇది ముందు భాగంలో పెద్ద 240 మిమీ సింగిల్ డిస్క్ బ్రేక్ మరియు వెనుక 130 మిమీ డ్రమ్ బ్రేక్‌ కలిగి ఉంది. ఈ బైక్ యొక్క ఫ్యూయెల్ కెపాసిటీ 10 లీటర్లు.

రూ. 99,990 లకే కొత్త TVS Raider 125.. ఇప్పుడు మరిన్ని అప్డేటెడ్ ఫీచర్లతో మరింత స్టైలిష్

ప్రస్తుతం భారతీయ మార్కెట్లో అందుబాటులో ఉన్న టీవీఎస్ రైడర్ 125 ధరల విషయానికి వస్తే.. బేస్ 'డ్రమ్' వేరియంట్ ధర రూ. 85,973 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ), కాగా 'డిస్క్' వేరియంట్ ధర రూ. 93,489 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) వరకు ఉన్నాయి. ఈ ధరలను బట్టి చూస్తే కొత్తగా విడుదలైన టాప్ స్పెక్ వేరియంట్ ధర కొంత ఎక్కువగా ఉంది. కానీ ఫీచర్స్ పరంగా దాని మునుపటి మోడల్స్ కంటే ఉన్నతంగా ఉంటుంది.

రూ. 99,990 లకే కొత్త TVS Raider 125.. ఇప్పుడు మరిన్ని అప్డేటెడ్ ఫీచర్లతో మరింత స్టైలిష్

ఈ బైక్ యొక్క కొలతల విషయానికి వస్తే.. దీని పొడవు 2070 మిమీ, వెడల్పు 785 మిమీ మరియు ఎత్తు 1028 మిమీ వరకు ఉంటుంది. ఇక వీల్‌బేస్ 1326 మిమీ కాగా, గ్రౌండ్ క్లియరెన్స్ 180 మిమీ వరకు ఉంది. ప్రస్తుతం ఈ కొత్త బైక్ కేవలం రెండు కలర్ ఆప్సన్స్ లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. అవి వికెడ్ బ్లాక్ మరియు ఫైరీ ఎల్లో కలర్. అయితే బేస్ వేరియంట్ మాత్రం ఫైరీ ఎల్లో, స్ట్రైకింగ్ రెడ్, బ్లేజింగ్ బ్లూ మరియు వికెడ్ బ్లాక్ అనే కలర్స్ లో లభిస్తుంది.

రూ. 99,990 లకే కొత్త TVS Raider 125.. ఇప్పుడు మరిన్ని అప్డేటెడ్ ఫీచర్లతో మరింత స్టైలిష్

టీవీఎస్ రైడర్ 125 బైక్ అదే అద్భుతమైన డిజైన్ లో చాలా స్టైలిష్ గా ఉంటుంది. ఈ మోటార్‌సైకిల్ ముందు భాగంలో డిస్‌క్టివ్ హెడ్‌ల్యాంప్ సెటప్, అందులో ఎల్ఈడీ లైటింగ్ మరియు స్ప్లిట్ ఎల్ఈడీ డిఆర్ఎల్ లు ఉన్నాయి. వెనుక భాగంలో స్ప్లిట్ ఎల్ఈడీ టెయిల్‌ల్యాంప్ ఉంటుంది.

రూ. 99,990 లకే కొత్త TVS Raider 125.. ఇప్పుడు మరిన్ని అప్డేటెడ్ ఫీచర్లతో మరింత స్టైలిష్

అంతే కాకుండా ఈ బైక్ లో సింగిల్-పీస్ హ్యాండిల్‌బార్, డ్యూయల్ టోన్ ఫ్రంట్ మడ్‌గార్డ్, క్రాష్ ప్రొటెక్టర్లు, ఇంజిన్ సంప్ గార్డ్, స్ప్లిట్-సీట్లు, అప్-స్వీప్డ్ ఎగ్జాస్ట్, శ్యారీ గార్డ్, 17 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ మరియు హాలోజన్ టర్న్-సిగ్నల్ ఇండికేటర్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈ బైక్ ని చాల ఆకర్షణీయంగా కనిపించేలా చేస్తాయి.

రూ. 99,990 లకే కొత్త TVS Raider 125.. ఇప్పుడు మరిన్ని అప్డేటెడ్ ఫీచర్లతో మరింత స్టైలిష్

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

టీవీఎస్ కంపెనీ దేశీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన ద్విచక్ర వాహన తయారీ సంస్థ. ఈ కంపెనీ యొక్క టీవీఎస్ రైడర్ 125 ఇప్పటికే మంచి ఆదరణ పొందింది. కాగా ఇప్పుడు అప్డేటెడ్ ఫీచర్స్ లో అందుబాటులోకి రావడం నిజంగానే శుభవార్త. ఈ పండుగ సీజన్లో అప్డేటెడ్ టీవీఎస్ రైడర్ 125 కొనాలనుకునేవారి కోసం కంపెనీ బుకింగ్స్ కూడా స్టార్ట్ చేసింది. అయితే ఈ బైక్ దేశీయ మార్కెట్లో హీరో గ్లామర్ XTEC కి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది.

More from DriveSpark

Article Published On: Thursday, October 20, 2022, 8:04 [IST]
English summary
New tvs raider 125 launched in india update price features engine details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+