ఎఫ్77 బైక్ కోసం బుకింగ్స్ ప్రారభించిన అల్ట్రావయోలెట్.. ఇక లాంచ్ ఎప్పుడంటే?

బెంగళూరుకు చెందిన ప్రముఖ EV స్టార్టప్ కంపెనీ 'అల్ట్రావయోలెట్' (Ultraviolette) గత కొన్ని రోజులుగా తన ఎఫ్77 ఎలక్ట్రిక్ బైకుని టెస్ట్ చేస్తూనే ఉంది. అయితే ఇటీవల కంపెనీ ఈ ఎలక్ట్రిక్ బైక్ యొక్క బ్యాటరీని గురించి వెల్లడించింది, కాగా ఇప్పుడు బుకింగ్స్ కూడా మొదలయ్యాయి. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.. రండి.

ఎఫ్77 బైక్ కోసం బుకింగ్స్ ప్రారభించిన అల్ట్రావయోలెట్.. ఇక లాంచ్ ఎప్పుడంటే?

దేశీయ మార్కెట్లో త్వరలో విడుదలకానున్న లేటెస్ట్ బైక్ 'అల్ట్రావయోలెట్ ఎఫ్77' కోసం కొనుగోలుదారు ముందస్తుగా రూ. 10,000 చెల్లించి కంపెనీ యొక్క అధికారిక వెబ్‌సైట్ లో (https://www.ultraviolette.com/) బుక్ చేసుకోవచ్చు. ఈ బైక్ నవంబర్ 24 న దేశీయ మార్కెట్లో విడుదలవుతుంది, తరువాత డెలివరీలు ప్రారంభమవుతాయి.

ఎఫ్77 బైక్ కోసం బుకింగ్స్ ప్రారభించిన అల్ట్రావయోలెట్.. ఇక లాంచ్ ఎప్పుడంటే?

కంపెనీ ఈ ఎలక్ట్రిక్ బైక్ యొక్క ధరలను ఇంకా అధికారికంగా వెల్లడించలేదు, కానీ ఇది రూ. 3.5 లక్షల (ఎక్స్-షోరూమ్) ధర వద్ద విడుదలయ్యే అవకాశం ఉంటుంది. అయితే ఈ బైకుని కంపెనీ కేవలం భారతీయ మార్కెట్లో మాత్రమే కాకుండా.. గ్లోబల్ మార్కెట్లో విడుదలచేయడానికి సన్నాహాలు సిద్ధం చేస్తోంది. దీని కోసం కంపెనీ విదేశాలనుంచి కూడా బుకింగ్స్ స్వీకరిస్తుంది.

ఎఫ్77 బైక్ కోసం బుకింగ్స్ ప్రారభించిన అల్ట్రావయోలెట్.. ఇక లాంచ్ ఎప్పుడంటే?

కంపెనీ తన కొత్త ఎలక్ట్రిక్ బైక్ కోసం దాదాపు 190 దేశాల నుంచి 70,000 ప్రీ బుకింగ్స్ పొందే అవకాశం ఉందని భావిస్తోంది. కావున ఇది ప్రపంచ మార్కెట్లో తప్పకుండా మంచి ఆదరణ పొందే అవకాశం ఉంటుందని భావిస్తున్నాము. ఇది కంపెనీ యొక్క అధిక పనితీరుని అందించే ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ మోటార్‌సైకిల్.

ఎఫ్77 బైక్ కోసం బుకింగ్స్ ప్రారభించిన అల్ట్రావయోలెట్.. ఇక లాంచ్ ఎప్పుడంటే?

కంపెనీ గతంలో వెల్లడించిన విధంగానే ఈ ఎలక్ట్రిక్ బైక్ మూడు వేరియంట్స్ లో విడుదలయ్యే అవకాశం ఉంటుంది. అవి ఎయిర్‌స్ట్రైక్, లేజర్ మరియు షాడో వేరియంట్స్. కంపెనీ విడుదల చేయనున్న ఈ ఎలక్ట్రిక్ బైకుని బెంగళూరులోని ఎక్స్పీరియన్స్ సెంటర్లలో చూడవచ్చు. అయితే ఇప్పుడు ఇది కేవలం బెంగళూరుకు మాత్రమే పరిమితం చేయబడింది. కాగా, రానున్న రోజుల్లో మరిన్ని నగరాలలో విస్తరించబడే అవకాశం ఉంటుంది.

ఎఫ్77 బైక్ కోసం బుకింగ్స్ ప్రారభించిన అల్ట్రావయోలెట్.. ఇక లాంచ్ ఎప్పుడంటే?

అల్ట్రావయోలెట్ F77 బైకులో 10.5 కిలోవాట్ పెద్ద బ్యాటరీ ప్యాక్ అందుబాటులో ఉంటుంది. కావున ఇది ఒక ఫుల్ చార్జ్ తో గరిష్టంగా 307 కిలోమీటర్ల రేంజ్ అందించే అవకాశం ఉంటుంది. ఈ బైకులోని బ్యాటరీ చాలా సురక్షితంగా ఉంచడానికి కంపెనీ తగిన మార్పులను కూడా చేసింది. కావున ఇప్పుడు దీని చుట్టూ అల్యూమినియం కేసింగ్‌ ఉంటుంది.

ఎఫ్77 బైక్ కోసం బుకింగ్స్ ప్రారభించిన అల్ట్రావయోలెట్.. ఇక లాంచ్ ఎప్పుడంటే?

ఈ కొత్త బైకులోని బ్యాటరీ ప్యాక్ కోసం టాప్-ఆఫ్-ది-లైన్ థర్మల్ మేనేజ్‌మెంట్ సెటప్‌ను అభివృద్ధి చేసినట్లు కూడా కంపెనీ తెలిపింది. కావున వేడి వంటి పరిస్థితులను కూడా ఇది సులభంగా తట్టుకోగలదు, మంచి పనితీరుని అందించగలదు. మొత్తం మీద ఇది మంచి రేంజ్ అందించడానికి కావలసిన మార్పులన్నీ కంపెనీ ఇందులో చేసింది.

ఎఫ్77 బైక్ కోసం బుకింగ్స్ ప్రారభించిన అల్ట్రావయోలెట్.. ఇక లాంచ్ ఎప్పుడంటే?

అల్ట్రావయోలెట్ F77 బైక్‌లో స్టీల్ ట్రెల్లిస్ ఫ్రేమ్ ఉపయోగించబడింది. హబ్ మౌంటెడ్ మోటారుకు బదులుగా, ఎలక్ట్రిక్ మోటారును అమర్చారు, ఇది చైన్ ద్వారా వెనుక చక్రానికి పవర్ డెలివరీ చేస్తుంది. ముందు భాగంలో ఇన్‌వర్టెడ్ కార్ట్రిడ్జ్ సస్పెన్షన్ ఇన్‌స్టాల్ చేయబడింది, వెనుక అడ్జస్టబుల్ మోనో షాక్ సస్పెన్షన్ ఇవ్వబడింది.

ఎఫ్77 బైక్ కోసం బుకింగ్స్ ప్రారభించిన అల్ట్రావయోలెట్.. ఇక లాంచ్ ఎప్పుడంటే?

ఈ ఎలక్ట్రిక్ బైకు కేవలం 7.5 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిలోమీటర్ల వరకు వేగవతం అవుతుంది. ఇందులోని ఎలక్ట్రిక్ మోటార్ 33.5 బిహెచ్‌పి పవర్ మరియు 90 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. కంపెనీ ఈ బైక్ యొక్క బ్యాటరీలో 21,700 లిథియం అయాన్ సెల్స్‌ ఉపయోగిస్తుంది.

ఎఫ్77 బైక్ కోసం బుకింగ్స్ ప్రారభించిన అల్ట్రావయోలెట్.. ఇక లాంచ్ ఎప్పుడంటే?

కంపెనీ తన ప్రొడక్షన్-స్పెక్ F77 ఎలక్ట్రిక్ బైకుని ఇప్పటికే ప్రదర్శించింది. ఇది అద్భుతమైన మరియు దృఢమైన బాడీవర్క్‌ కలిగి ఉంటుంది. ఈ బైక్ లో మల్టిపుల్ రైడింగ్ మోడ్‌లు ఉన్నట్లు సమాచారం, దీని వల్ల రైడర్ తమ రైడింగ్ స్టైల్‌కు అనుగుణంగా వివిధ స్థాయిల రీజెన్‌లను ఎంచుకోవచ్చు.

ఎఫ్77 బైక్ కోసం బుకింగ్స్ ప్రారభించిన అల్ట్రావయోలెట్.. ఇక లాంచ్ ఎప్పుడంటే?

ఈ కొత్త బైక్ యొక్క బ్రేకింగ్‌ సిస్టం విషయానికి వస్తే, దీని ముందువైపు 320 మిమీ డిస్క్ బ్రేక్ మరియు వెనుకవైపు 230 మిమీ డిస్క్ బ్రేక్‌ అందుబాటులో ఉన్నాయి. అదే సమయంలో ముందు మరియు వెనుకవైపు 110/70 మరియు 150/60 టైర్లను పొందుతుంది. ఇందులో రీజెనరేటివ్ బ్రేకింగ్ ఫీచర్ కూడా అందుబాటులో ఉంటుంది.

ఎఫ్77 బైక్ కోసం బుకింగ్స్ ప్రారభించిన అల్ట్రావయోలెట్.. ఇక లాంచ్ ఎప్పుడంటే?

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

అల్ట్రావయోలెట్ F77 ఎలక్ట్రిక్ బైక్ కోసం ఇప్పటికే చాలామంది ఎదురు చూస్తున్నారు, ఎందుకంటే ఈ బైక్ యొక్క డిజైన్ మరియు ఫీచర్స్ అన్నీ కూడా చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి. ఇక ఈ బైక్ మార్కెట్లో వచ్చే నెలలో విడుదలకానుంది. కావున అప్పటివరకు ఈ బైక్ గురించి అప్డేటెడ్ సమాచారం తెలుసుకోవడానికి ఎప్పటికప్పుడు తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ చూస్తూ ఉండండి.

More from DriveSpark

Article Published On: Tuesday, October 25, 2022, 10:53 [IST]
English summary
New ultraviolette f77 electric bike booking starts at rs 10000 details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+