భారత్‌లో పూర్తిగా అమ్ముడైన యమహా ఆర్15 మోటోజిపి ఎడిషన్..! ఇక ఆ వేరియంటే దిక్కు..!!

జపనీస్ టూవీలర్ బ్రాండ్ యమహా (Yamaha) భారత మార్కెట్లో అందిస్తున్న యమహా వైజెడ్ఎఫ్-ఆర్15 వి4 (Yamaha YZF-R15 V4) మోటార్‌సైకిల్ యొక్క మాన్‌స్టర్ ఎనర్జీ మోటోజిపి (Monster Energy MotoGP) ఎడిషన్ పూర్తిగా అమ్ముడైపోయినట్లు కంపెనీ ప్రకటించింది. మోన్‌స్టర్ ఎనర్జీ మోటోజిపి బ్రాండింగ్‌తో వచ్చిన ఈ ప్రత్యేక మోటార్‌సైకిల్ ధర రూ. 1.82 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా ఉండేది. కంపెనీ విక్రయిస్తున్న స్టాండర్డ్ యమహా ఆర్15ఎమ్ (Yamaha YZF-R15M) వేరియంట్‌ను ఆధారంగా చేసుకొని ఈ స్పెషల్ ఎడిషన్ ను తయారు చేశారు.

భారత్‌లో పూర్తిగా అమ్ముడైన యమహా ఆర్15 మోటోజిపి ఎడిషన్..! ఇక ఆ వేరియంటే దిక్కు..!!

భారతదేశంలో యమహా వైజెడ్ఎఫ్-ఆర్15 వి4 మోటార్‌సైకిల్ యొక్క మాన్‌స్టర్ ఎనర్జీ మోటోజిపి వేరియంట్ పూర్తిగా విక్రయించబడినప్పటికీ, దేశంలో విక్రయించబడిన యూనిట్ల సంఖ్యకు సంబంధించి యమహా ఇంకా ఎటువంటి డేటాను విడుదల చేయలేదు. స్టాండర్డ్ YZF-R15M మోడల్‌తో ఈ స్పెషల్ ఎడిషన్ YZF-R15 V4 MotoGP ఎడిషన్ స్పెషల్ బాడీ గ్రాఫిక్స్‌తో పాటుగా కొన్ని ప్రత్యేకమైన ఫీచర్లను కూడా కలిగి ఉంటుంది. ఈ స్పెషల్ ఎడిషన్ పూర్తిగా అమ్ముడైపోయిన నేపథ్యంలో, కస్టమర్లు ఇప్పుడు దీనికి ప్రత్యామ్నాయంగా స్టాండర్డ్ Yamaha YZF-R15M V4 వేరియంట్‌ను కొనుగోలు చేయవచ్చు.

భారత్‌లో పూర్తిగా అమ్ముడైన యమహా ఆర్15 మోటోజిపి ఎడిషన్..! ఇక ఆ వేరియంటే దిక్కు..!!

ఇది స్టాండర్డ్ YZF-R15M మోటార్‌సైకిల్‌పై ఆధారపడి ఉంటుంది కాబట్టి, ఈ మోటార్‌సైకిల్‌లో సింగిల్-పాడ్ ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్‌లైట్, స్ప్లిట్ సీట్లు, ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్లు మొదలైన ఫీచర్లు ఉన్నాయి. యమహా తమ ఆర్15 యొక్క వెర్షన్ 4 (4వ తరం) మోడల్‌ను గతేడాది భారత మార్కెట్లో ప్రారంభించింది. ఈ కొత్త మోడల్ యమహా బ్రాండ్ విక్రయిస్తున్న పెద్ద Yamaha YZF-R7 బైక్ నుండి ప్రేరణ పొంది డిజైన్ చేయబడింది. కంపెనీ దీనికి కొత్త డిజైన్‌తో పాటు, సరికొత్త ఫీచర్లను జోడించింది.

భారత్‌లో పూర్తిగా అమ్ముడైన యమహా ఆర్15 మోటోజిపి ఎడిషన్..! ఇక ఆ వేరియంటే దిక్కు..!!

యమహా ఆర్15 వి4 బైక్ లో ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ (టిసిఎస్) మరియు క్విక్ షిఫ్టర్ వంటి కొన్ని ఫస్ట్-ఇన్-సెగ్మెంట్ ఫీచర్లను కూడా జోడించారు. ఇది గేర్ షిఫ్ట్ ఇండికేటర్, ట్రాక్ మరియు స్ట్రీట్ మోడ్‌తో YZF-R1 మోడల్ నుండి ప్రేరణ పొందిన కొత్త ఎల్‌సిడి ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ని కూడా కలిగి ఉంటుంది. ఈ బైక్ లో మరింత అగ్రెసివ్ గా ఉండే ఫెయిరింగ్స్, మజిక్యులర్ ఫ్యూయెల్ ట్యాంక్ మరియు పొడవైన విండ్‌స్క్రీన్ వంటి డిజైన్ ఎలిమెంట్స్ ఉన్నాయి. స్పోర్టియర్ స్టైలింగ్ డిజైన్‌ను కలిగిన ఈ మోటార్‌సైకిల్ ఇప్పుడు మరింత సౌకర్యవంతమైన సీటింగ్ పొజిషన్ తో అప్‌గ్రేడ్ చేయబడింది. కాబట్టి, ఇది రోజువారీ రైడింగ్ కోసం కూడా చాలా సౌకర్యంగా ఉంటుంది.

భారత్‌లో పూర్తిగా అమ్ముడైన యమహా ఆర్15 మోటోజిపి ఎడిషన్..! ఇక ఆ వేరియంటే దిక్కు..!!

కంపెనీ తమ ఆర్15 వెర్షన్ 4 మోడల్‌ను మొత్తం రెండు వేరియంట్లలో ప్రవేశపెట్టింది. ఇందులో మొదటిది స్టాండర్డ్ ఆర్15 వి4 (R15 V4.0) మరియు రెండవది మరింత స్పోర్టీయర్ వేరియంట్ అయిన ఆర్15ఎమ్ (R15M). హై -స్పెక్ మోడల్ అయిన ఆర్15ఎమ్, స్టాండర్డ్ ఆర్15 వి4 తో పోల్చుకుంటే కాస్తం విభిన్న డిజైన్‌ను మరియు పరికరాలను కలిగి ఉంటుంది. అయితే, ఇంజన్ పరంగా మాత్రం ఇవి రెండూ ఒకేలా ఉంటాయి. ఇందులో స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ కోసం యమహా వై-కనెక్ట్ బ్లూటూత్ కనెక్టివిటీ ఫీచర్ ఉంటుంది. ఇది కాల్ మరియు మెసేజ్ అలెర్ట్స్, రియల్ టైమ్ మైలేజ్, ఇంజన్ ఆర్‌పిఎమ్, మాల్‌ఫంక్షన్ నోటిఫికేషన్స్, పార్కింగ్ రికార్డ్, బైక్ లొకేషన్, రైడ్ హిస్టరీ వంటి మెరెన్నో విషయాలను తెలిజయేస్తుంది.

భారత్‌లో పూర్తిగా అమ్ముడైన యమహా ఆర్15 మోటోజిపి ఎడిషన్..! ఇక ఆ వేరియంటే దిక్కు..!!

యమహా ఆర్15 వెర్షన్ 4 మోడల్ ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ ఫీచర్ తో లభిస్తుంది. ఇది భారతదేశంలో ఈ ఫీచర్ పొందిన మొట్టమొదటి 155 సిసి బైక్. ఇంకా ఈ బైక్‌లో స్ట్రీట్ మరియు ట్రాక్ అనే రైడింగ్ మోడ్స్ కూడా ఉంటాయి. రైడర్ నడిపే రోడ్డు మరియు అవసరాన్ని బట్టి ఈ మోడ్స్ ను ఎంచుకోవచ్చు. ఈ బైక్‌ లోని ఇతర ఫీచర్లలో 17 ఇంచ్ అల్లాయ్ వీల్స్, ముందు వైపు అప్ సైడ్ డౌన్ (యూఎస్‌డి) ఫోర్కులు మరియు వెనుక వైపు మోనో షాక్ సస్పెన్షన్ యూనిట్ ఉంటాయి. అలాగే, బ్రేకింగ్ విషయానికి వస్తే, ఈ బైక్ రెండు చివర్లలో డిస్క్ బ్రేక్స్ అమర్చబడి ఉంటాయి మరియు ఇవి రెండూ డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ ఫీచర్‌ని సపోర్ట్ చేస్తాయి.

భారత్‌లో పూర్తిగా అమ్ముడైన యమహా ఆర్15 మోటోజిపి ఎడిషన్..! ఇక ఆ వేరియంటే దిక్కు..!!

స్టాండర్డ్ యమహా ఆర్15 మోడల్ లో ఉపయోగించిన అదే 155 సిసి, 4-స్ట్రోక్, లిక్విడ్-కూల్డ్, ఎస్ఓహెచ్‌సి, వేరియబుల్ వాల్వ్ యాక్చుయేషన్ (VVA)తో కూడిన 4-వాల్వ్ ఇంజన్ నే ఈ కొత్త మోటో జిపి ఎడిషన్ బైక్ లోనూ ఉపయోగించారు. ఈ ఇంజన్ 10,000 ఆర్‌పిఎమ్ వద్ద 18.4 బిహెచ్‌పి శక్తిని మరియు 7,500 ఆర్‌పిఎమ్ వద్ద 14.2 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది.

భారత్‌లో పూర్తిగా అమ్ముడైన యమహా ఆర్15 మోటోజిపి ఎడిషన్..! ఇక ఆ వేరియంటే దిక్కు..!!

ఈ వేరియబుల్ వాల్వ్ యాక్చువేటెడ్ ఇంజన్ 6-స్పీడ్ గేర్‌బాక్స్‌ తో జత చేయబడి ఉంటుంది మరియు ఇది క్లచ్‌లెస్ అప్‌షిఫ్ట్‌ల కోసం క్విక్ షిఫ్టర్‌తో స్టాండర్డ్‌గా అమర్చబడి ఉంటుంది. ఇన్ని అదనపు ఫీచర్లు కలిగి ఉన్నప్పటికీ, కొత్త Yamaha YZF-R15 V4 బరువు కేవలం 142కిలోలుగానే ఉంటుంది. తెలుగులో ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఆటోమొబైల్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్ ని గమనిస్తూ ఉండండి.

Most Read Articles

Read more on: #యమహా #yamaha
English summary
No more yamaha r15 v4 motogp editions for india completley sold out
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X