Just In
- 14 hrs ago
కార్తిక్ ఆర్యన్: ఖరీదైన గిఫ్ట్ పొందాడు.. భారదేశంలోనే ఫస్ట్ ఓనర్ అయిపోయాడు
- 16 hrs ago
'హీరో ప్యాషన్ ఎక్స్‌టెక్' ఇప్పుడు అప్డేటెడ్ ఫీచర్స్‌తో: ధర రూ. 74,590 మాత్రమే
- 18 hrs ago
ఇలాంటి ప్రత్యేకమైన రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ బైక్‌లు మీకూ కావాలా? అయితే చూడండి వీటిని తయారు చేసిందెవరో..!
- 20 hrs ago
రైడింగ్‌కి మీరు సిద్దమేనా.. మార్కెట్లో కొత్త 'కవాసకి నింజా 400' విడుదలైంది: వివరాలు
Don't Miss
- News
Atmakur Bypoll Results 2022:మేకపాటి విక్రమ్ రెడ్డి గెలుపు లాంఛనమేనా..?
- Lifestyle
Today Rasi Phalalu :ఓ రాశి వారికి ఈరోజు ఆర్థిక సమస్యలన్నీ తీరిపోతాయి..!
- Sports
Eng vs Nz 3rd Test: ఆట ఇప్పుడే మొదలైంది.. డారిల్ మిచెల్ వర్సెస్ ఇంగ్లాండ్ షురూ..!
- Movies
ట్రెండింగ్: బండ్ల గణేష్ దృష్టిలో ఛార్మీ వ్యాంపా? రెండో పెళ్లికి సిద్దమైన ప్రముఖ నటి.. రష్మీపై సుధీర్ అలా..
- Finance
IT Jobs: భారత IT ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్.. కంపెనీలు చేస్తున్న ఆ పనితో ఇక కష్టమే..
- Technology
ఆండ్రాయిడ్ & ఆపిల్ ఫోన్లను హ్యాక్ చేసే కొత్త Spyware ! జాగ్రత్త...హెచ్చరించిన గూగుల్
- Travel
ట్రెక్కింగ్ ప్రియుల స్వర్గధామం.. జీవ్‌ధన్ ఫోర్ట్!
ఓలా స్కూటర్ కొన్న 24 గంటల్లోనే డెలివరీ..! నమ్మడానికి కష్టంగా ఉన్నా నిజమే అంటున్న కంపెనీ బాస్..!
ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ల విషయంలో సాధారణంగా కస్టమర్లు కంప్లైట్ మొదటి అంశం దాని వెయిటింగ్ పీరియడ్ గురించే. చాలా మంది కస్టమర్లు ఎప్పుడో డబ్బులు చెల్లించి, ఇప్పటికీ తమ స్కూటర్ డెలివరీ కోసం వేచి చూస్తున్నారు. అయితే, ఓలా ఇప్పుడు స్కూటర్ ను కొనుగోలు చేసిన 24 గంటల్లోనే డెలివరీ చేసి కస్టమర్లను సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తోంది. ఈ విషయాన్ని ఓలా ఎలక్ట్రిక్ సీఈఓ భవీష్ అగర్వాల్ తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు.

వివరాల్లోకి వెళితే, ఓలా ఎలక్ట్రిక్ తమ ఎస్1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం గడచిన శనివారం నాడు పర్చేస్ విండో ను ఓపెన్ చేసింది. ఆ సమయంలో ముందుగా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ను రిజర్వ్ చేసుకున్న కస్టమర్లు డబ్బు మొత్తాన్ని చెల్లించి, స్కూటర్ ను కొనుగోలు చేయవచ్చు. ఆ తర్వాత కంపెనీ కస్టమర్ నుండి రిజిస్ట్రేషన్ కోసం డాక్యుమెంట్స్ సేకరిస్తుంది, రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత లభ్యతను బట్టి కస్టమర్ ఇంటికి నేరుగా స్కూటర్ ను డెలివరీ చేస్తుంది.

అయితే, ఇప్పుడు ఆ ప్రక్రియ మొత్తం పూర్తిగా 24 గంటల్లోనే జరిగిపోయిందని ఒక సంఘటనను ఉదాహరణగా చెబుతూ, ఓలా ఇప్పుడు కేవలం 24 గంటల్లోనే ఎలక్ట్రిక్ స్కూటర్లను డెలివరీ చేస్తోందని ట్వీట్ చేశారు. భవీష్ అగర్వాల్ చేసిన ట్వీట్ ప్రకారం, "కొనుగోలు చేసినప్పటి నుండి 24 గంటల్లోపు డెలివరీ! ఓలా ఎలక్ట్రిక్ బృందానికి శుభాకాంక్షలు. చాలా స్కూటర్ బ్రాండ్ల కోసం నెలల తరబడి వెయిటింగ్ పీరియడ్ ఉండగా, ఓలా కేవలం 24 గంటల్లోనే స్కూటర్లను డెలివరీ చేస్తుంది" అని ట్వీట్ చేశారు.

ఓలా ఎలక్ట్రిక్ తమిళనాడులోని తమ మెగా ఫ్యూచర్ ఫ్యాక్టరీలో భారీ సంఖ్యలో ఎలక్ట్రిక్ స్కూటర్లను ఉత్పత్తి చేస్తోంది. మరోవైపు కస్టమర్లు ఈ స్కూటర్లను కొనుగోలు చేయాలంటే, పూర్తిగా ఆన్లైన్ ద్వారానే చేయాలి. ఓలాకు భౌతికంగా ఎలాంటి డీలర్షిప్ కేంద్రాలు లేవు. అంతేకాకుండా, వీటి కొనుగోలు కోసం ఓపెన్ విండో లేదు, కంపెనీ నిర్ధేశించిన సమయంలోనే కస్టమర్లు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లను కొనుగోలు చేయగలరు. కాబట్టి, ఈ సమయాన్ని కంపెనీ తమ స్కూటర్లను రిజర్వ్ చేసుకున్న కస్టమర్లతో సంభాషించేందుకు ఉపయోగించి, వారికి వీలైనంత త్వరగా డెలివరీలను అందించేందుకు ప్రయత్నిస్తోంది.

మరొక విషయం ఏంటంటే, ఇటీవల ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ లో హఠాత్తుగా మంటలు రావడం, మరికొన్ని సందర్భాల్లో కస్టమర్లు ఓలా ఎలక్ట్రిక్ సర్వీస్ మరియు రేంజ్ పట్ల అసంతృప్తి చెంది నిరసనలు వ్యక్తం చేయడం వంటి సంఘటనల నేపథ్యంలో, కంపెనీ ఇప్పుడు కస్టమర్లకు మరింత చేరువయ్యేందుకు మరియు తమపై వస్తున్న విమర్శలను కవర్ చేసుకునేందుకు గట్టిగానే ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే, ఓలా ఎలక్ట్రిక్ సీఈఓ భవీష్ అగర్వాల్ తన సోషల్ మీడియాను వేదికగా ఎంచుకొని, నిత్యం ఏదో ఒక పోస్టు చేస్తూనే ఉన్నారు.

ఇదిలా ఉంటే, ఓలా ఎలక్ట్రిక్ తమ కస్టమర్ల కోసం గుడ్ న్యూస్ చెబుతూనే, మరో బ్యాడ్ న్యూస్ కూడా చెప్పింది. ఓలా ఎస్1 ప్రో కోసం సేల్ విండో ప్రారంభమైన వెంటనే ఈ స్కూటర్ ధరను కూడా కంపెనీ భారీగా పెంచేసింది. ఓలా ఎస్1 ప్రో ధరను కంపెనీ ఇప్పుడు రూ. 10,000 మేర పెంచింది. తాజా ధర పెంపు తర్వాత ఇప్పుడు బైక్ ప్రారంభ ధర రూ. 1.40 లక్షల (ఎక్స్-షోరూమ్) కు చేరుకుంది. అయితే, ధరల పెంపుకు గల కారణాన్ని మాత్రం కంపెనీ ఇంకా వెల్లడించలేదు.

భారతదేశంలో ఓలా ఎలక్ట్రిక్ సంస్థకు నేరుగా ఎలాంటి డీలర్‌షిప్‌లు కానీ లేదా అనుభవం కేంద్రాలు (ఎక్స్‌పీరియెన్స్ సెంటర్లు) కానీ లేవు. ఆసక్తిగల కస్టమర్లు నేరుగా వీటిని ఓలా ఎలక్ట్రిక్ వెబ్సైట్ నుండి కానీ లేదా ఓలా యాప్ నుండి కానీ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ల బుకింగ్ నుండి రిజిస్ట్రేషన్ వరకూ పూర్తిగా ఆన్లైన్లోనే జరుగుతుంది. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లు కస్టమర్లు పేర్కొన్న చిరునామాకి డెలివరీ చేయబడుతాయి. ఓలా ఎలక్ట్రిక్ వాహనాల సర్వీస్ కోసం కంపెనీ సర్వీస్ ఆన్ ది వీల్స్ మాదిరిగా కస్టమర్ల వద్దకే సర్వీస్ సేవలు అందిస్తోంది.

ముందుగా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లను బుక్ చేసుకున్న కస్టమర్లకు మాత్రమే కంపెనీ ముందుగా వీటిని కొనుగోలు చేసే అవకాశాన్ని కల్పిస్తోంది. స్కూటర్‌ను ఇప్పటికే బుక్ చేసుకున్న కస్టమర్లకు ఈ-మెయిల్ ద్వారా స్కూటర్ యొక్క మిగిలిన ధరను చెల్లించి కొనుగోలు ప్రక్రియను పూర్తి చేయడానికి సంబంధించిన సూచనలు సలహాలు తెలియజేయడం జరుగుతుంది. ఓలా ఇటీవలే 5 నగరాల్లో తమ స్కూటర్ల టెస్ట్ రైడ్ సేవలను కూడా ప్రారంభించింది. కస్టమర్లు స్కూటర్ని కొనుగోలు చేయడానికి ముందు వీటిని టెస్ట్ డ్రైవ్ చేసి, పూర్తిగా సంతృప్తి చెందిన తర్వాతనే వీటిని కొనుగోలు చేయవచ్చు. ఈ టెస్ట్ డ్రైవ్ అపాయింట్మెంట్లను కూడా ఓలా యాప్ ద్వారానే చేసుకోవాల్సి ఉంటుంది.

విడుదలకు సిద్ధమవుతున్న మూవ్ ఓఎస్ 2.0
ఇదిలా ఉంటే, ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ వినియోగదారుల కోసం కంపెనీ తమ ఓఎస్ (ఆపరేటింగ్ సిస్టమ్) ను కూడా అప్‌గ్రేడ్ చేసింది. ప్రస్తుతం, ఇది బీటా దశలో, ఎంపిక చేసిన కస్టమర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలోనే ఇది ఓలా ఎలక్ట్రిక్ కస్టమర్లందరికీ అందుబాటులోకి రానుంది. ఈ కొత్త అప్డేట్స్ లో భాగంగా ఓలా ఎస్1 (Ola S1) మరియు ఎస్1 ప్రో (Ola S1 Pro) ఎలక్ట్రిక్ స్కూటర్ల కోసం కొత్త ఎకో మోడ్ (Eco Mode) పాటుగా మరిన్ని ప్రత్యేకమైన అప్‌గ్రేడ్స్ ను కంపెనీ పరిచయం చేయనుంది. ఇవన్నీ రైడర్లకు మరింత అత్యుత్తమైన సౌలభ్యాన్ని మరియు ఎక్కువ రేంజ్ ను అందించేలా చేస్తాయని కంపెనీ చెబుతోంది.