ఈ యాక్ససరీస్‌తో మీ స్క్రాంబ్లర్ (RE Scram 411)ని మరింత అందంగా, ఆకర్షణీయంగా మార్చుకోండి!
ప్రీమియం మోటార్‌సైకిల్ బ్రాండ్ రాయల్ ఎన్‌ఫీల్డ్ (Royal Enfield) తమ సరికొత్త స్క్రాంబ్లర్ బైక్ "రాయల్ ఎన్‌ఫీల్డ్ స్క్రామ్ 411" (Royal Enfield Scram 411) ను తాజాగా మార్కెట్లో విడుదల చేసిన సంగతి తెలిసినదే. భారత మార్కెట్లో కొత్త స్క్రామ్ 411 మోటార్‌సైకిల్ ధరలు రూ.2.03 లక్షల నుండి రూ.2.08 లక్షల (ఎక్స్-షోరూమ్) రేంజ్‌లో ఉన్నాయి. కాగా, కంపెనీ ఇప్పుడు ఈ కొత్త ఆన్-రోడ్ మరియు ఆఫ్-రోడ్ స్క్రాంబ్లర్ టైప్ మోటార్‌సైకిల్ కోసం విస్తృతమైన యాక్ససరీలను కూడా వెల్లడి చేసింది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ స్క్రామ్ 411 కోసం కంపెనీ అందిస్తున్న ఈ అదనపు యాక్ససరీలతో కస్టమర్లు తమ బైక్ ను తమకు నచ్చినట్లుగా కస్టమైజ్ చేసుకునే అవకాశం ఉంది. ఈ యాక్ససరీస్ అన్నీ కూడా స్క్రామ్ 411 యొక్క లుక్ అండ్ ఫీల్, సేఫ్టీ మరియు మెయింటెనెన్స్ వంటి అంశాలను మెరుగుపరచనుంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ వెల్లడి చేసిన ఈ స్క్రామ్ 411 యాక్సెసరీస్ ధరలు రూ. 600 నుండి రూ. 3550 వరకు ఉన్నాయి. కంపెనీ ప్రస్తుతం పరిమిత సంఖ్యలో మాత్రమే యాక్ససరీలను అందిస్తోంది, రాబోయే రోజుల్లో మరిన్ని కొత్త యాక్సెసరీలను పరిచయం చేసే అవకాశం ఉంది.

స్క్రామ్ 411 ఇంజన్ ప్రొటెక్షన్ కోసం కంపెనీ బ్లాక్ కాంపాక్ట్ ఇంజన్ గార్డ్ ను రూ. 1450 ధరతో విక్రయిస్తోంది. ఇది బైక్ క్రాష్ అయినప్పుడు లేదా ఎత్తైన స్పీడ్ బ్రేకర్లు లేదా రాళ్లు వంటివి తగిలినప్పుడు ఇంజన్ దెబ్బతినకుండా ఉండేలా చేస్తుంది. మరింత మెరుగైన రక్షణ కోసం, కంపెనీ పెద్ద బ్లాక్ ఇంజన్ గార్డ్ ను కూడా అందిస్తోంది. మార్కెట్లో దీని ధర రూ. 1,650 లుగా ఉంటుంది. ఈ రెండు ఇంజన్ గార్డులు కూడా 22 మిమీ స్టీల్ ట్యూబ్ లతో తయారు చేయబడ్డాయి.

ఈ బైక్ ను ఎక్కువగా ఆఫ్-రోడ్ కోసం ఉపయోగించే వినియోగదారుల కోసం కంపెనీ ఆయిల్ కూలర్ గార్డ్ మరియు మాస్టర్ సిలిండర్ గార్డ్ లను అందిస్తోంది. మార్కెట్లో వాటి ధరలు వరుసగా రూ. 1250 మరియు రూ. 700 గా ఉన్నాయి. ఇవి రెండూ కూడా బ్లాక్ అండ్ సిల్వర్ కలర్లలో అందుబాటులో ఉన్నాయి. మరోవైపు, దీనిని డర్ట్ ట్రాక్ లపై ఉపయోగించే వారి కోసం అడ్వెంచర్ హ్యాండ్‌గార్డ్స్ ను కూడా అందించబడుతోంది, ఇది గాలి మరియు ధూళి నుండి రైడర్ కు రక్షణ కల్పిస్తుంది.

అంతేకాకుండా, ఈ అడ్వెంచర్ హ్యాండ్‌గార్డ్స్ బైక్ క్రాష్ సమయంలో బ్రేక్/క్లచ్ లివర్‌ను ప్రొటెక్ట్ చేయడంలో కూడా సహకరిస్తాయి. ఈ యాక్ససరీ ధర రూ. 2550 గా ఉంటుంది. దీనితో పాటు, వినియోగదారులకు హ్యాండిల్‌బార్ బ్రేస్ ప్యాడ్ కూడా అందుబాటులో ఉంటుంది, దీని ధర రూ. 600 గా ఉంది. ఆఫ్-రోడ్ బైక్ ప్రియుల కోసం అడ్వెంచర్ హ్యాండిల్‌బార్ రూ. 3550 ధరతో అందుబాటులో ఉంది. ఇంకా బ్లాక్ బార్ అండ్ ఫినిషర్‌ను రూ. 1200 లకు మరియు ఫ్రంట్ రిజర్వాయర్ క్యాప్ ను రూ. 800 లకు అందిస్తున్నారు.

ఇంకా, ఆయిల్ ఫిల్లర్ క్యాప్ ధర రూ. 1050 గా ఉంటుంది. ఒకవేళ మీకు కవర్డ్ పార్కింగ్ లేకపోయినట్లయితే, కంపెనీ వాటర్ రెసిస్టెంట్ బైక్ కవర్‌ను కూడా అందిస్తోంది, దీని ధర రూ. 1100 గా ఉంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ స్క్రామ్ 411 కోసం కంపెనీ విక్రయిస్తున్న పూర్తి యాక్ససరీల వివరాలు, వాటి ధరలు ఇలా ఉన్నాయి:
| Himalayan Scram 411 Accessories | Price |
| Black Compact Engine Guards | ₹1,450 |
| Black Large Engine Guards | ₹1,650 |
| Black Oil Cooler Guard | ₹1,250 |
| Silver Oil Cooler Guard | ₹1,250 |
| Black Master Cylinder Guard | ₹700 |
| Silver Master Cylinder Guard | ₹700 |
| Black Adventure Handguards | ₹2,550 |
| Black Handlebar Brace Pad | ₹600 |
| Black Adventure Handlebar | ₹3,550 |
| Black Bar End Finishers | ₹1,200 |
| Black Front Reservoir Cap | ₹800 |
| Silver Front Reservoir Cap | ₹800 |
| Black Oil Filler Cap | ₹1,050 |
| Silver Oil Filler Cap | ₹1,050 |
| Water Resistant Bike Cover Navy Blue | ₹1,100 |
| Water Resistant Bike Cover Black | ₹1,100 |

భారత విపణిలో రాయల్ ఎన్‌ఫీల్డ్ స్క్రామ్ 411 మొత్తం ఏడు రంగుల విడుదల చేయబడింది. కస్టమర్ ఎంచుకునే వేరియంట్ ను బట్టి వాటి ధరలు మారుతూ ఉంటాయి. స్క్రామ్ 411 బైక్‌ను కంపెనీ విక్రయిస్తున్న పాపులర్ అడ్వెంచర్ మోటార్‌సైకిల్ హిమాలయన్ ఆధారంగా చేసుకొని రూపొందించారు. హిమాలయన్ పూర్తిగా ఆఫ్-రోడ్ మార్కెట్ ను ఉద్దేశించి తయారు చేసినట్లుగా ఉంటుంది. కాబట్టి, ఇందులో ఆన్-రోడ్ వెర్షన్ కోరుకునే వారి కోసం అలాగే తేలికమైన ఆఫ్-రోడ్ వెర్షన్ కోరుకునే వారి కోసం కంపెనీ స్క్రామ్ 411 ను తీసుకొచ్చింది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ స్క్రామ్ 411 బైక్‌లో హిమాలయన్ బైక్‌లో ఉపయోగించిన అదే ఇంజన్ ను ఉపయోగించారు. ఇందులోని 411 సిసి, సింగిల్ సిలిండర్ ఇంజన్ 6500 rpm వద్ద 24.3 bhp శక్తిని మరియు 4500 rpm వద్ద 32 న్యూటన్ మీటర్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5 స్పీడ్ స్లిక్ షిఫ్టింగ్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది. ఈ బైక్ ముందు భాహంలో 19 ఇంచ్ స్పోక్డ్ వీల్ మరియు వెనుక భాగంలో 17 ఇంచ్ స్పోక్డ్ వీల్ ఉంటాయి. వీటిపై కంపెనీ ఇటు ఆన్-రోడ్ మరియు అటు ఆఫ్-రోడ్‌కు ఉపయోగపడేలా సియట్ గ్రిప్ టైర్లను అందిస్తుంది.


Click it and Unblock the Notifications








