15,000 యూనిట్లకు పైగా బుకింగ్‌లను దక్కించుకున్న ఓబెన్ రోర్.. అక్టోబర్‌లో డెలివరీలు ప్రారంభం!

బెంగళూరుకు చెందిన ఎలక్ట్రిక్ మొబిలిటీ స్టార్టప్ కంపెనీ ఒబెన్ ఈవీ (Oben EV), ఈ ఏడాది మార్చి 2022 నెలలో దేశీయ మార్కెట్లో ఆవిష్కరించిన తమ మొట్టమొదటి ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ 'ఓబెన్ రోర్' (Oben Rorr), మార్కెట్లో అధికారికంగా అందుబాటులోకి రావడానికి ముందే కస్టమర్లను ఆకర్షిస్తోంది. ఈ మోడల్ కోసం ఇప్పటి వరకూ 15,000 యూనిట్లకు పైగా ప్రీ-బుకింగ్‌లు వచ్చాయని కంపెనీ పేర్కొంది. దేశీయ మార్కెట్లో ఓబెన్ రోర్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ ప్రారంభ ధర రూ. 99,999, ఎక్స్-షోరూమ్ (ముంబై) గా ఉంది.

Recommended Video

Ola Electric స్కూటర్ల కోసం విడుదల కానున్న Move OS2: వివారాలు #AutoNews

ఒబెన్ రోర్ భారతదేశంలో మార్చి 15, 2022న ప్రారంభించబడింది, అయితే దీని ప్రీ-బుకింగ్‌లు మాత్రం మార్చి 18 వ తేదీ నుండి ప్రారంభమయ్యాయి. ఈ ఎలక్ట్రిక్ బైక్ ని అధికారికంగా ప్రారంభించిన ఐదు నెలల్లోనే, కంపెనీ 15,000 ప్రీ-బుకింగ్‌లను పొందింది. మొదటి దశలో భాగంగా, కంపెనీ తొమ్మిది నగరాలలో ఓబెన్ రోర్ ఎలక్ట్రిక్ బైక్ ను విడుదల చేయనుంది. ఇప్పటికే ఈ 9 నగరాల్లో ఒబెన్ రోర్ కోసం ముందస్తు బుకింగ్‌లు ఓపెన్ చేయగా, కంపెనీ 15,000 యూనిట్ల బుకింగ్‌లను పొందింది.

15,000 యూనిట్లకు పైగా బుకింగ్‌లను దక్కించుకున్న ఓబెన్ రోర్.. అక్టోబర్‌లో డెలివరీలు ప్రారంభం!

బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, పూణె, ముంబై, ఢిల్లీ, సూరత్, అహ్మదాబాద్ మరియు జైపూర్ నగరాలలో ముందుగా ఓబెన్ రోర్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్ల డెలివరీ ప్రారంభం అవుతుంది. ఓబెన్ రోర్ ఇ-బైక్ కోసం ప్రీ-బుకింగ్ మొత్తాన్ని రూ. 999 గా నిర్ణయించారు. ఆసక్తిగల కస్టమర్‌లు కంపెనీ అధికారిక వెబ్‌సైట్ ను సందర్శించడం ద్వారా ఈ ఎలక్ట్రిక్ బైక్ ను బుక్ చేసుకోవచ్చు. అయితే, సప్లయ్ కి మించి డిమాండ్ ఉండటంతో ప్రస్తుతానికి, ఓబెన్ రోర్ బుకింగ్‌లు కంపెనీ తాత్కాలికంగా నిలిపివేసింది.

15,000 యూనిట్లకు పైగా బుకింగ్‌లను దక్కించుకున్న ఓబెన్ రోర్.. అక్టోబర్‌లో డెలివరీలు ప్రారంభం!

ముందుగా బుక్ చేసుకున్న కస్టమర్లకు ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్లను డెలివరీ చేసి తర్వాత కంపెనీ కొత్త ఆర్డర్‌లను స్వీకరించడం ప్రారంభిస్తుంది. వాస్తవానికి, ఈ ఏడాది మే 2022 నెలలోనే ఒబెన్ రోర్ డెలివరీలు ప్రారంభమవుతాయని భావించారు, అయితే సెమీకండక్టర్ చిప్స్ కొరత మరియు ఇతర సప్లయ్ చైన్ సమస్యల కారణంగా, కంపెనీ ఈ బైక్ డెలివరీలను అక్టోబర్ 2022లో ప్రారంభించనుంది.

15,000 యూనిట్లకు పైగా బుకింగ్‌లను దక్కించుకున్న ఓబెన్ రోర్.. అక్టోబర్‌లో డెలివరీలు ప్రారంభం!

ఓబెన్ రోర్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ను పూర్తిగా భారతదేశంలోనే అభివృద్ధి చేయబడిన మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తి. ఓబెన్ ఈవీ ఈ ఎలక్ట్రిక్ బైక్ ను స్థానికంగా తయారు చేస్తోంది మరియు ఇది పూర్తిగా 100 శాతం దేశీయ ఉత్పత్తి అని కంపెనీ పేర్కొంది. రాబోయే 2 సంవత్సరాలలో ప్రతి 6 నెలలకు ఒక కొత్త ఉత్పత్తిని విడుదల చేయాలని ఓబెన్ ఈవీ లక్ష్యంగా పెట్టుకుంది.

15,000 యూనిట్లకు పైగా బుకింగ్‌లను దక్కించుకున్న ఓబెన్ రోర్.. అక్టోబర్‌లో డెలివరీలు ప్రారంభం!

ఓబెన్ రోర్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ విషయానికి వస్తే, ఇందులో ఫైనల్ బెల్ట్ డ్రైవ్‌తో కూడిన మిడ్-మౌంటెడ్ మోటార్‌ ఉంటుంది. అంటే, ఇది ఇతర ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్ల మాదిరిగా వెనుక చక్రంలో అమర్చబడి ఉండే హబ్ మౌంటెడ్ మోటార్‌ కు బదులుగా సెంటర్ లో అమర్చబడిన ఎలక్ట్రిక్ మోటార్ ను కలిగి ఉంటుంది. ఇది బెల్ట్ డ్రైవ్ సాయంతో వెనుక చక్రాన్ని ముందుకు కదుపుతుంది. ఇందులో ఫిక్స్డ్ 4.4 kWh లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఈ బ్యాటరీ ప్యాక్ ను బైక్ నుండి వేరు చేయడం సాధ్యం కాదు.

15,000 యూనిట్లకు పైగా బుకింగ్‌లను దక్కించుకున్న ఓబెన్ రోర్.. అక్టోబర్‌లో డెలివరీలు ప్రారంభం!

ఇందులో అమర్చిన ఎలక్ట్రిక్ మోటార్ గరిష్టంగా 13.4 bhp శక్తిని మరియు 62 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, ఒబెన్ రోర్ ఇ-బైక్ కేవలం 3 సెకన్లలో గంటకు 0 నుండి 40 కిలోమీటర్ల వేగాన్ని చేరుకుంటుంది మరియు గరిష్టంగా గంటకు 100 కిలోమీటర్ల టాప్ స్పీడ్ తో పరుగులు తీస్తుంది. రేంజ్ విషయానికి వస్తే, ఇది పూర్తి చార్జ్ పై 200 కిమీ రేంజ్ అందిస్తుందని కంపెనీ చెబుతోంది. రైడర్ కంఫర్ట్ మరియు బ్యాటరీ సేవింగ్ కోసం ఇందులో మూడు రకాల రైడింగ్ మోడ్స్ కూడా ఉంటాయి. అయితే, రైడర్ ఎంచుకునే రైడ్ మోడ్ ను బట్టి ఎలక్ట్రిక్ బైక్ రేంజ్ మారుతూ ఉంటుంది.

15,000 యూనిట్లకు పైగా బుకింగ్‌లను దక్కించుకున్న ఓబెన్ రోర్.. అక్టోబర్‌లో డెలివరీలు ప్రారంభం!

ఓబెన్ రోర్ ఇ-బైక్ లో ఉండే పెద్ద 4.4 kWh లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌ను 15A సాకెట్ ఉపయోగించి పూర్తిగా చార్జ్ చేయడానికి కేవలం 2 గంటలు మాత్రమే సమయం పడుతుంది. ఇది స్టాండర్డ్ చార్జర్ ను కూడా సపోర్ట్ చేస్తుంది. ఇక మెకానికల్స్ విషయానికి వస్తే, చూడటానికి పెట్రోల్ బైక్ లా స్పోర్టీగా కనిపించే రోర్ ఇ-బైక్ ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్కులు మరియు వెనుక భాగంలో మోనోషాక్ యూనిట్ సస్పెన్షన్ సెటప్ ఉంటాయి. మంచి బ్రేకింగ్ పవర్ కోసం ఇరువైపులా డిస్క్ బ్రేకులు కూడా ఉంటాయి, ఇవి సిబిఎస్ (కాంబి బ్రేకింగ్ సిస్టమ్)ను సపోర్ట్ చేస్తాయి.

15,000 యూనిట్లకు పైగా బుకింగ్‌లను దక్కించుకున్న ఓబెన్ రోర్.. అక్టోబర్‌లో డెలివరీలు ప్రారంభం!

ఓబెన్ రోర్ ఎలక్ట్రిక్ బైక్ లోని కంపెనీ అందిస్తున్న ఇతర ఫీచర్లను గమనిస్తే, ఇందులో డ్రైవర్ అలర్ట్ సిస్టమ్, యాంటీ థెఫ్ట్ అలారం, నావిగేషన్, టెలిఫోనీ, వెహికల్ డయాగ్నస్టిక్స్, సమీపంలోని ఛార్జింగ్ స్టేషన్‌ను గుర్తించడం వంటి మరెన్నో కనెక్టింగ్ టెక్నాలజీ ఫీచర్లు కూడా ఉన్నాయి. ఇది ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ విభాగంలో టోర్క్ క్రాటోస్ (Tork Kratos) మరియు రివోల్ట్ ఆర్‌వి400 (Revolt RV400) వంటి మోడళ్లకు గట్టి పోటీ ఇస్తుంది.

More from DriveSpark

Article Published On: Tuesday, August 23, 2022, 12:00 [IST]
English summary
Oben rorr electric bike gets 15000 units bookings deliveries to start in october
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+