ఎలక్ట్రిక్ బైక్ మార్కెట్లో 'గర్జించేందుకు' వచ్చిన ఒబెన్ రోర్ (Oben Rorr).. ఇక పెట్రోల్ బైక్‌ల పనైపోయినట్లే..!!

బెంగళూరుకు చెందిన ఎలక్ట్రిక్ మొబిలిటీ స్టార్టప్ కంపెనీ ఒబెన్ ఈవీ (Oben EV), దేశీయ మార్కెట్లో తమ మొట్టమొదటి ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ 'ఓబెన్ రోర్' (Oben Rorr) ను నేడు మార్కెట్లో విడుదల చేసింది. దేశీయ విపణిలో ఒబెన్ రోర్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ ధర రూ.1.25 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా నిర్ణయించబడింది. కంపెనీ పేర్కొన్న సమాచారం ప్రకారం, ఇది పూర్తి చార్జ్ పై గరిష్టంగా 200 కిలోమీటర్ల రేంజ్ ను ఆఫర్ చేస్తుందని సర్టిఫై చేయబడింది. అయితే, రియల్ వరల్డ్ లో ఈ రేంజ్ మారే అవకాశం ఉంటుంది.

ఒబెన్ రోర్ (Oben Rorr) ఇ-బైక్ విడుదల; ధర, ఫీచర్లు

భారతదేశంలో ఒబెన్ రోర్ బుకింగ్‌లు 18 మార్చి, 2022 వ తేదీ నుండి ప్రారంభం కానున్నాయి. కాగా, ఈ ఎలక్ట్రిక్ బైక్ డెలివరీలు జూలై 2022లో ప్రారంభమవుతాయి, అయితే టెస్ట్ రైడ్‌లు మాత్రం మే 2022 లోనే ప్రారంభం కానున్నాయి. ఒబెన్ రోర్ (Oben Rorr) ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ ఈ విభాగంలో టోర్క్ క్రాటోస్ (Tork Kratos) మరియు రివోల్ట్ ఆర్‌వి400 (Revolt RV400) మోడళ్లకు పోటీగా నిలుస్తుంది. ఈ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

ఒబెన్ రోర్ (Oben Rorr) ఇ-బైక్ విడుదల; ధర, ఫీచర్లు

ఒబెన్ రోర్ - డిజైన్, ఫీచర్లు

ఒబెన్ రోర్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ చూడటానికి ట్రెడిషనల్ ఐసి పవర్డ్ మోటార్‌సైకిళ్ల మాదిరిగానే కనిపిస్తుంది. కాకపోతే, ఇందులో ఇంజన్ స్థానంలో ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది, కాబట్టి ఇంజన్ భాగం నేలపై నుండి ఎత్తులో ఉన్నట్లు కనిపిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ బైక్ ముందు భాగంలో ఇంటిగ్రేటెడ్ డేటైమ్ రన్నింగ్ లైట్‌తో కూడిన గుండ్రటి ఎల్ఈడి హెడ్‌ల్యాంప్, ఎల్ఈడి టర్న్ ఇండికేటర్‌లు మరియు ఎల్ఈడి టెయిల్‌ లాంప్‌ను కలిగి ఉంటుంది. దీని బాడీ ప్యానెల్స్ మూడు రంగులలో (ఆరెంజ్, సిల్వర్, బ్లాక్) ఉండి, చాలా షార్ప్ లుక్‌ను కలిగి ఉంటాయి.

ఒబెన్ రోర్ (Oben Rorr) ఇ-బైక్ విడుదల; ధర, ఫీచర్లు

ఈ ఆల్-ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌లో విశాలమైన హ్యాండిల్‌బార్, ఛార్జింగ్ పోర్ట్, స్ప్లిట్ సీట్లు, ఎల్ఈఢి వింకర్‌లతో కూడిన మస్కులర్ ప్యానెల్ (ఇంధన ట్యాంక్ మాదిరిగా కనిపిస్తుంది), స్టైలిష్ అల్లాయ్ వీల్స్, షార్ప్-లుకింగ్ సైడ్ ప్యానెల్‌లు మరియు అండర్-కౌలింగ్ మొదలైన డిజైన్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. ఒబెన్ రోర్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌లో బెన్ రోర్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో వస్తుంది, ఇది వేగం, బ్యాటరీ ఛార్జ్ స్థితి, మిగిలిన రైడింగ్ రేంజ్ మరియు మరిన్నింటితో సహా అన్ని అవసరమైన రీడౌట్‌లను అందిస్తుంది.

ఒబెన్ రోర్ (Oben Rorr) ఇ-బైక్ విడుదల; ధర, ఫీచర్లు

కస్టమర్ల సౌకర్యం కోసం ఒబెన్ యాప్ ద్వారా కంపెనీ కొన్ని రకాల కనెక్టివిటీ ఫీచర్‌లను కూడా అందిస్తోంది. ఇంకా ఇందులో డ్రైవర్ అలర్ట్ సిస్టమ్, యాంటీ థెఫ్ట్ అలారం, నావిగేషన్, టెలిఫోనీ, వెహికల్ డయాగ్నస్టిక్స్, సమీపంలోని ఛార్జింగ్ స్టేషన్‌ను గుర్తించడం వంటి మరెన్నో కనెక్టింగ్ టెక్నాలజీ ఫీచర్లు కూడా ఉన్నాయి. వీటితో పాటు, ఒబెన్ రోర్ పనితీరు (పెర్ఫార్మెన్స్ మరియు రేంజ్) ను ఆప్టిమైజ్ చేయడానికి ఇందులో మూడు రైడింగ్ మోడ్‌లు కూడా ఉన్నాయి.

ఒబెన్ రోర్ (Oben Rorr) ఇ-బైక్ విడుదల; ధర, ఫీచర్లు

ఒబెన్ రోర్ - పవర్‌ట్రైన్ మరియు బ్యాటరీ

ఒబెన్ రోర్ ఎలక్ట్రిక్ బైక్ ఫైనల్ బెల్ట్ డ్రైవ్‌తో కూడిన మిడ్-మౌంటెడ్ మోటార్‌ను కలిగి ఉంటుంది. అంటే, ఇది ఇతర ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్ల మాదిరిగా వెనుక చక్రంలో అమర్చబడి ఉండే హబ్ మౌంటెడ్ మోటార్‌ కు బదులుగా సెంటర్ లో అమర్చబడిన ఎలక్ట్రిక్ మోటార్ ను కలిగి ఉంటుంది. ఈ మోటార్ బెల్టు సాయంతో వెనుక చక్రాన్ని ముందుకు కదుపుతుంది. ఒబెన్ రోర్ ఫిక్స్డ్ 4.4 kWh లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్, 13.4 bhp శక్తి మరియు 62 Nm గరిష్ట టార్క్‌ను జనరేట్ చేసే ఎలక్ట్రిక్ మోటార్ ఉంటాయి.

ఒబెన్ రోర్ (Oben Rorr) ఇ-బైక్ విడుదల; ధర, ఫీచర్లు

ఒబెన్ రోర్ - పెర్ఫార్మెన్స్ మరియు రేంజ్

పెర్ఫార్మెన్స్ మరియు రేంజ్ విషయానికి వస్తే ఒబెన్ రోర్ ఈవీ గంటకు గరిష్టంగా 100 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీయగలదు. ఈ హై-స్పీడ్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ కేవలం 3 సెకన్లలో గంటకు 0 నుండి 40 కిలోమీటర్ల వేగాన్ని చేరుకోగలదని కంపెనీ పేర్కొంది. కొత్త Oben Rorr EV అనువైన పరిస్థితుల్లో ఒకే ఛార్జ్‌పై గరిష్టంగా 200 కిలోమీటర్ల వరకు నడుస్తుందని మరియు దాని బ్యాటరీ ప్యాక్‌ను పూర్తిగా చార్జ్ చేయడానికి కేవలం 2 గంటలు మాత్రమే సమయం పడుతుందని కంపెనీ తెలిపింది.

ఒబెన్ రోర్ (Oben Rorr) ఇ-బైక్ విడుదల; ధర, ఫీచర్లు

ఒబెన్ రోర్ - మెకానికల్స్

ఈ బైక్ లోని మెకానికల్స్ ను గమనిస్తే, ముందు వైపు సస్పెన్షన్ విధులను నిర్వహించడానికి టెలిస్కోపిక్ ఫోర్కులు మరియు వెనుక వైపు మోనోషాక్ యూనిట్ లు ఉంటాయి. ఇక బ్రేకింగ్ విషయానికి వస్తే, సమర్థవంతమైన స్టాపింగ్ పవర్ కోసం ఒబెన్ రోర్ ఇ-బైక్ లో ఇరువైపులా డిస్క్ బ్రేకులు ఉంటాయి. రోర్ ఒకే ఛార్జ్‌తో 150 కిమీ (రియల్ టైమ్ రేంజ్) కవర్ చేయగలదని, ఇది దేశంలోని సుధీర్ఘమైన రేంజ్ కలిగిన ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్లలో ఒకటిగా మారుతుందని కంపెనీ తెలిపింది. ఈ ఎలక్ట్రిక్ బైక్ ను 15A సాకెట్‌ని ఉపయోగించి రెండు గంటల్లో పూర్తిగా చార్జ్ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది.

ఒబెన్ రోర్ (Oben Rorr) ఇ-బైక్ విడుదల; ధర, ఫీచర్లు

పూర్తిగా "మేడ్ ఇన్ ఇండియా" ప్రోడక్ట్

రోర్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ను పూర్తిగా భారతదేశంలోనే అభివృద్ధి చేశామని మరియు దీనిని స్థానికంగానే తయారు చేస్తామని ఒబెన్ ఈవీ తెలిపింది. ఇది పూర్తిగా 100 శాతం దేశీయ ఉత్పత్తి అని కంపెనీ పేర్కొంది. ఒబెన్ రోర్ ఈవీ డెలివరీలు ఈ సంవత్సరం రెండవ త్రైమాసికం నుండి ప్రారంభమవుతాయని కంపెనీ తెలిపింది. రాబోయే 2 సంవత్సరాలలో ప్రతి 6 నెలలకు ఒక కొత్త ఉత్పత్తిని ప్రారంభించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు కంపెనీ తెలిపింది.

ఒబెన్ రోర్ (Oben Rorr) ఇ-బైక్ విడుదల; ధర, ఫీచర్లు

ఒబెన్ తమ వినియోగదారులకు విస్తృతమైన చార్జింగ్ సదుపాయాలను అందించేందుకు, దేశంలోని 12,000 పైగా EV ఛార్జర్‌లకు వినియోగదారులకు యాక్సెస్‌ను అందించేలా వివిధ భాగస్వాములతో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు కంపెనీ పేర్కొంది. వీటితో పాటు యాజమాన్య సాంకేతికతను ఉపయోగించే 1,000కు పైగా ఓబెన్ ఛార్జింగ్ స్టేషన్లను కూడా కంపెనీ ఏర్పాటు చేయనుంది.

More from DriveSpark

Article Published On: Tuesday, March 15, 2022, 15:46 [IST]
English summary
Oben rorr electric motorcycle launched in india battery range price and features
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+